ప్రజల కోసం మాట్లాడితే, దా-డు-లు చేస్తాం, అంటుంది వైసీపీ. ఇది మొదటి సారి కాదు. నెల రోజుల క్రిందట చంద్రబాబు ఇంటి పై దా-డి చేస్తే టిడిపి నేతల పైనే ఎదురు కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా టిడిపి కార్యాలయాల పై రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో దాడులు చేసారు. ఒకే సమయంలో, ఒకే సారి రాష్ట్ర వ్యాప్తంగా దా-డు-లు చేయటంతో, ఇది ఎంత ప్లాన్ ప్రకారం చేసారో అర్ధం అవుతుంది. ముందుగా పట్టాభి ఇంటి లోపలకు వెళ్లి రచ్చ రచ్చ చేసారు. లోపలకు వెళ్లి విలువైన వస్తువులు అన్నీ పగలగొట్టారు. తరువాత మంగళగిరి లో టిడిపి కేంద్ర కార్యాలయం, తరువాత తిరుపతిలో టిడిపి నేతల పై, తరువాత విశాఖ టిడిపి ఆఫీస్ పై, తరువాత హిందూపురంలో బాలయ్య ఇంటి పై, అలాగే తాజాగా కర్నూల్ టిడిపి ఆఫీస్ పై దా-డి చేయటం, యత్నం చేయటం సంచలనం సృష్టించింది. మధ్యానం పట్టాబి మాట్లాడుతూ, గంజాయి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కోణం పై ప్రెస్ మీట్ పెట్టి, అలాగే నక్కా ఆనంద బాబుకి పోలీసులు నోటీసులు ఇవ్వటం పై, సజ్జలను టార్గెట్ చేయటంతో, ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అటాక్ చేసారు. ప్లాన్ ప్రకారం ఇలా చేస్తున్నారు అంటే, పక్కనే డీజీపీ ఆఫీస్ ఉన్నా చేసారు అంటే, అరాచకం ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది.
news
శభాష్ లోకేష్... అంజిరెడ్డి తాతను పిలిచి ఏమి చేసారో చూడండి...
అంజిరెడ్డి తాత తెలియని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలుండరు. దౌర్జన్యకర వైసీపీ ఫ్యాక్షన్ సెలక్షన్‌ని ఎదిరించి ఎలక్షన్ జరపాలని తొడకొట్టిన చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు మండలం, మార్లపల్లె గ్రామ తెలుగుదేశం సైనికుడు అయ్యమ్మగారి అంజిరెడ్డికి తెలుగుదేశం జెండాకున్నంత పొగరుంది. టిడిపి కార్యకర్తకున్నంత ధైర్యముంది. అందుకే ఏడుపదుల వయస్సు దాటినా...అధికారమదమే ఆయుధంగా వైసీపీ మూర్ఖపు ముష్కరులు దా-డి-కి తలపడితే, మీసం మెలేసి..తొడగొట్టి మరీ ఎదురు నిలిచాడు అంజిరెడ్డి తాత. తన మనవడు పవన్‌రెడ్డిని తోడు తీసుకెళ్లి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని మంగళవారం హైదరాబాద్‌లో కలిశారు అంజిరెడ్డి తాత. ఈ సందర్భంగా అంజిరెడ్డి తాతని కుశలప్రశ్నలు అడిగిన నారా లోకేష్...ఆరోగ్యం ఎలా వుంది? అంటూ ఆరా తీశారు. అంతా బాగానే ఉందన్న అంజిరెడ్డి తాత బీటెక్ చేసిన తన మనవరాలికి త్వరలో వివాహం చేయాలనుకుంటున్నానని చెప్పారు. అప్పటికప్పుడు నారా లోకేష్ 3 లక్షల రూపాయలను అంజిరెడ్డి తాత మనవరాలి పెళ్లికి తనవంతు సాయంగా అందజేశారు. 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో వున్నా..ఏనాడూ ఏ పదవీ తీసుకోలేదని, పార్టీని నమ్ముకున్న తనను సొంత తాతయ్యలా నారా లోకేష్ ఆదరించారని అంజిరెడ్డి తాత ఆనందం వ్యక్తం చేశారు. తన మనవడు బీటెక్ చేశాడని, తెలుగుదేశం పార్టీ యువసైన్యంలో అవకాశమిస్తే పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కృషి చేస్తాడని అంజిరెడ్డి తాత లోకేష్‌ని కోరారు. తప్పనిసరిగా మనవడికి పార్టీలో ఏదో ఒక విభాగంలో అవకాశం ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చిన నారా లోకేష్...మనవరాలి పెళ్లి ఘనంగా చేయాలని అంజిరెడ్డి తాతకి సూచించారు.
నక్కా ఆనంద్‍బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు...
గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్‍బాబు ఇంటి వద్ద నేడు మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఆనంద్‍బాబు ఇంటికి భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. నిన్న రాత్రి నర్సీపట్నం పోలీసులు, ఆనంద్‍బాబుకు నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వచ్చారు. గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. స్టేట్‍మెంట్ ఇవ్వకుంటే 91 సీఆర్పీఎఫ్ కింద నోటీసులు ఇస్తామని, చింతపల్లి వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుందని నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు అన్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో నోటీసులు తీసుకునేందుకు ఆనంద్‍బాబు నిరాకరించారు. దీంతో ఇవాళ మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు వెళ్ళిపోయారు. ఈ రోజు మళ్ళీ పోలీసులు వస్తామనడంతో ఆనంద్‍బాబు ఇంటి వద్దకు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అనుకున్నట్టే పోలీసులు మళ్ళీ వచ్చారు. ఉద్రిక్త పరిస్థితి నేపధ్యంలో, నక్కా ఆనందబాబు నివాసం దగ్గర పోలీసుల మోహరించారు. టిడిపి శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆనందబాబు స్టేట్‍మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసుకుంటున్నారు.
మోదీకి చంద్రబాబు లేఖ... జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ?
ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసారు. చాలా రోజుల తరువాత, ప్రధానికి చంద్రబాబు లేఖ రాసారు. ముఖ్యంగా బీసిల సమస్యల పై చంద్రబాబు ఈ లేఖ రాసారు. బీసీ జనగణన చేపట్టాలని ప్రధానికి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు. సరైన సమాచారం లేక బీసీలకు అన్యాయం జరుగుతోందని చంద్రబాబు లేఖలో తెలిపారు. బీసీలు ఇంకా వెనుకబడే ఉంటున్నారని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా బీసిలు ఇంకా ఇంకా వెనుకబడే ఉన్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు. బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయి అని, బీసిలకు మరింత మేలు జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడున్న కులాల వివరాలు అన్నీ 90 ఏళ్ల నాటివి అని అందుకే కొత్తగా బీసిల జనగణన చేపట్టాలని చంద్రబాబు లేఖలో తెలిపారు. బీసీ జనగణన కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో తీర్మానం చేశాం అని, టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తీర్మానం కేంద్రానికి పంపాం అని చంద్రబాబు గుర్తు చేసారు. అయితే చంద్రబాబు రాసిన లేఖ, ప్రభుత్వంలో ఉన్న జగన్ ప్రభుత్వం చేయాలి. కేంద్రం పై ఒత్తిడి తేవాలి. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.