ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. గతంలో చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చినా, ఐఆర్ ఇచ్చినా, ఉద్యోగులకు అనేక విధాలుగా తోడ్పాటు ఇచ్చినా, ఆర్ధిక పరిస్థితి బాగోక పోయినా, సమయానికి జీతాలు ఇచ్చినా, ఇలా ఎన్ని చేసినా, చంద్రబాబుని ఓడించి, జగన్ ను గెలిపించుకున్నారు. మొదటి సారి జగన్ సచివాలయానికి వచ్చినప్పుడు, జై జగన్ అంటూ, నినాదాలు కూడా చేసారు. ఇంకేముంది మా జీవితాలు మారిపోతాయని అనుకున్నారు. వద్దంటే బెనిఫిట్స్ వస్తాయి, ఇక మాకు పండుగే అని అనుకున్నారు. కాని సీన్ రివర్స్ అయ్యింది. బెనిఫిట్స్ సంగతి తరువాత, ముందు జీతాలు ఫస్ట్ తారిఖు కాదు, మొదటి వారంలో పడితే చాలు అని దండం పెట్టుకునే స్థాయికి వచ్చారు. అన్ని రాష్ట్రాలు పీఆర్సి ఇస్తున్నా, మనకు లేకపోయినా, ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారు. డీఏలు బాకీ ఉన్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బాకీ ఉన్నాయి, జీతాలు పడటం లేదు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, అనేక సమస్యలతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఉద్యోగుల పై ఒత్తిడి పెరుగుతూ రావటంతో, వారు కూడా ఇక ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టటం, సజ్జల ఫోన్ చేయటంతో, కంట్రోల్ లోనే ఉంటాం అని చెప్పటం, అందరూ చూసారు.

employees 19102021 2

తరువాత పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో, కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు అంటూ, సజ్జల వద్దకు వెళ్లారు. ప్రభుత్వంతో చర్చలు అని సజ్జల వద్దకు వెళ్ళటం పై విమర్శలు వచ్చినా, వెనక్కు తగ్గలేదు. ఇక అక్కడ సజ్జల, ఈ నెలాఖరు నాటికి పీఆర్సి అని ప్రకటించారు. దీని పై ప్రభుత్వం వైపు నుంచి తదుపరి చర్యలు కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో, చీఫ్ సెక్రటరీ నుంచి పిలుపు వచ్చింది. పిలుపు వచ్చిందని సంతోషించే లోపే, ఈ భేటీలో ఆర్ధిక పరమైన విషయాలు తప్ప, మీ సమస్యలు అన్నీ చెప్పండి అంటూ నోట్ వచ్చింది. అయితే ఉద్యోగులు ప్రధాన సమస్యలు అన్నీ ఆర్ధిక పరమైన అంశాలే కావటంతో, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ చూసి అవక్కయారు ఉద్యోగులు. మరి ఈ సమావేశంలో ఆర్ధిక పరమైన అంశాలు మాట్లాడక పొతే, సజ్జల హామీ ఇచ్చినట్టు ఈ నెలాఖరు లోపు పీఆర్సి ఎలా ఇస్తారు అంటూ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. పెద్ద మనసుతో చీఫ్ సెక్రటరీ అన్నీ ఆలకించాలని కోరుకుంటున్నారు.

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద, నిన్న ఆర్దరాత్రి హైడ్రామా నెలకొంది. ఈ ప్రభుత్వంతో పాటుగా, పోలీసులు ఎలా పని చేస్తున్నారు అనేందుకు ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. రెండు రోజుల క్రిందట, నర్సీపట్నంలోని ఏజెన్సీ ప్రాంతంలో, గంజాయి సాగు చేస్తున్న స్థావరాల పై నల్గొండ పోలీసులు వచ్చి రైడ్ చేసారు. ఈ ఘటనలో గంజాయి బ్యాచ్ ఎదురు తిరగటంతో, పోలీసులు పది రౌండ్లు కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో కొంత మంది గిరిజనులకు కూడా గాయాలు అయ్యాయి. అయితే ఈ ఘటన పై నిన్న మధ్యానం 12 గంటల సమయంలో టిడిపి నేత నక్కా ఆనంద బాబు, మీడియా సమావేశం పెట్టి, రాష్ట్రంలో విచ్చలవిడిగా రవాణా అవుతున్న గంజాయి పై ప్రెస్ మీట్ పెట్టి, కొన్ని ఆరోపణలు చేసారు. ఎక్కడ చూసినా గంజాయి సాగుతో పాటుగా, ఇతర రాష్ట్రాలకు కూడా రవాణా అవుతుందని, పక్క జిల్లా పోలీసులు వచ్చి సోదాలు చేసే దాకా, మన పోలీసులు ఏమి చేస్తున్నారని ? వైసిపి నాయకుల అండతోనే, గంజాయి బ్యాచ్ రాష్ట్రంలో రెచ్చిపోతుంది అంటూ ఆరోపణలు చేసారు. అంతే, ఈ ప్రెస్ మీట్ పై, నర్సీపట్నం పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నిన్న మధ్యానం 12 గంటలకు ప్రెస్ మీట్ పెడితే, నిన్న రాత్రి 11 గంటల కల్లా గుంటూరు చేరుకున్నారు.

anandababu 19102021 2

నర్సీపట్నం నుంచి కనీసం ఏడు గంటలకు పైగా సమయం పడుతుంది. ప్రెస్ మీట్ అయిన గంటకు బయలుదేరితే కానీ రాత్రికి గుంటూరు చేరుకోరు. అలాంటిది పోలీసులు హుటాహుటిన బయలుదేరి, నర్సీపట్నం నుంచి గుంటూరు వచ్చారు. అర్ధరాత్రి సమయంలో నక్కాఆనందబాబు ఇంటికి చేరుకుని, ఆయనను పిలిచి, తమకు గంజాయి పై స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. మీరు ఏ ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టారు, వైసిపి నాయకులు ఎవరు, ఆ పేర్లు చెప్తే, తాము స్టేట్మెంట్ రాసుకుంటాం అంటూ పోలీసులు వచ్చి కూర్చుకున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో, ఏదో పెద్ద కేసు అయినట్టు, ఇలా చేయటం పై, నక్కా ఆనందబాబు తీవ్ర అభ్యంతరం చెప్పారు. తమ ఆరోపణలకు కట్టుబడి ఉన్నాం అని, తాము స్టేట్మెంట్ ఇచ్చేది లేదని చెప్పటంతో, పోలీసులు రేపు ఉదయం వస్తామని, స్టేట్మెంట్ ఇవ్వకపోతే నోటీసులు ఇస్తామని చెప్పారు. అయితే పోలీసులు గతంలో కూడా చంద్రబాబు సహా, ఇతర నేతలకు కూడా ఇలాగే ఆధారాలు ఇవ్వాలంటూ చెప్పటం పై, పలువురు ఆశ్చర్య పోతున్నారు. నిజమో కాదో, పోలీసులు చెప్పాలి కానీ, ఆధారాలు ఇవ్వమని టిడిపి నాయకులను అడగటం ఏమిటి అనే విమర్శలు వస్తున్నాయి.

నిన్నటి నుంచి ఈ ఫోటో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. మరీ ముఖ్యంగా టిడిపి శ్రేణులు ఈ ఫోటోని విపరీతంగా షేర్ చేస్తున్నాయి. ఈయన పేరు జి.వెంకట్ రెడ్డి. ప్రముఖంగా టీవీ చర్చల్లో కనిపిస్తూ ఉంటారు. మంచి నాలెడ్జ్ తో పాటుగా, మంచిగా మాట్లాడతారు కుడా. జీవీ రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తులసి రెడ్డి లాంటి నాయకుల ప్రోత్సాహంతో, ఇంత దూరం వచ్చారు. అయితే గత వారం జీవీరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని కలిసారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి, టిడిపిలో చేరుతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నెల 21న ఆయన టిడిపిలో చేరనున్నారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా, నిన్నటి నుంచి టిడిపి శ్రేణులు, జీవీ రెడ్డి, చంద్రబాబుతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ, వివిధ కామెంట్స్ చేసారు. అందులో ముఖ్యమైనది, టిడిపి పై ఎంత కుల ముద్ర వేయాలని వైసీపీ చూసినా, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జీవీ రెడ్డి, టిడిపిలో చేరుతున్నారు అంటే, రాష్ట్ర ప్రగతి పట్ల చంద్రబాబు గారికి ఉన్న నిబద్ధత కారణం అని, కులం అనేది కేవలం ప్రచారం అని కొట్టి పారేస్తున్నాయి. అలాగే సిఏ చదివిన జీవీ రెడ్డి లాంటి చదువుకున్న వారి, వైసీపీ లాంటి పార్టీలోకి ఎప్పుడూ వెళ్లరు అని కూడా కామెంట్లు పెట్టారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగం, మన ఏపిలోని జగన్ మోహన్ రెడ్డి సహా, అనేక రాష్ట్రాల రాజకీయ పార్టీలకు కూడా తగిలింది. నిన్న హైదరాబాద్ లోని దసపల్లా హోటల్‌లో ఎమెస్కో బుక్స్ సంస్థ ప్రచురించిన నర్సరీ రాజ్యానికి రారాజు, అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో ప్రజలను సోమరిపోతులను చేస్తూ, ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఉచిత పధకాలు, దాని వల్ల ప్రభుత్వానికి ఆర్ధికంగానే కాకుండా, సమాజానికి జరిగే అన్యాయాన్ని కూడా ఆయన వివారించారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు అన్నీ ఫ్రీ ఫ్రీ అంటూ, ఊదరగోడుతున్నాయని అన్నారు. ఇప్పుడు ఫ్రీ అంటే, రేపు నిజంగానే ఏమి లేకుండా ఫ్రీ అయిపోతాం అనే విషయం ప్రజలు గ్రహించాలి అని అన్నారు. చేపలు పట్టటం నేర్పించాలి కానీ, చేపలు పంచిపెట్టటం కాదని అన్నారు. అయితే వెంకయ్య ప్రసంగం పై, జగన్ వైపు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా పడకేసి, సంక్షేమం చేస్తున్నా అంటూ అరకొర సంక్షేమంతో డబ్బా కొడుతున్న జగన్ వైపు, వేళ్ళు వెళ్తున్నాయి. మరి జగన్ గారు ఈ మాటలు వింటారో లేదో. అసలు వెంకయ్య గారు ఏమన్నారో, ఆయన మాటల్లోనే, "పని చేయటం తరువాత, ఇప్పుడు సోంబేరితనం అలవాటు అవుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, సోంబేరి తనాన్ని ప్రోత్సహిస్తున్నారు కొంత మంది. అది ఫ్రీగా ఇస్తాను, ఇది ఫ్రీ గా ఇస్తాను, అది ఇచ్చేస్తా, ఇది ఇచ్చేస్తా అని. ఇలాగే కొంత కాలం కొనసాగితే, నిజంగానే మొత్తం ఫ్రీ అయిపోతుంది. "

venkaiah 18102021 2

"ఉచిత కరెంటు అంటున్నారని, అప్పట్లో నేను మాట్లాడితే, సర్ పార్టీకి నష్టం, మీరు మాట్లాడకండి అన్నారు. ఏమి కాదులే అని దాని వల్ల జరిగే నష్టాలు వివరించాను. ఫ్రీ పవర్ అంటే, ముందు లో పవర్, తరువాత నో పవర్. నో పవర్ అంటేనే ఫ్రీ పవర్. పవరే లేకపోతే ఇక బిల్లు ఎక్కడ నుంచి వస్తుంది. ప్రజలను చైతన్యవంతులను చేసి, పని చేసి, పని నేర్పించి, స్కిల్ డెవలప్ చేసి, ప్రోత్సాహకాలు కలిగించి, అన్ని సౌకర్యాలు కల్పించి, మరెక్ట్ సౌకర్యాలు కల్పించి, పని కల్పించి, వాడిని పైకి తీసుకుని రావాలి. కింద ఉన్న వాడిని పైకి తేవాలి అంటే, వాడికి చేయి ఇచ్చి పైకి లేపాలి. అంతే కాని కింద ఉన్నవాడిని ఎత్తుకుని పైకి లేపితే, రాత్రి వరకు అక్కడే ఉంటాడు. ఈ ధోరణి ఏ మాత్రం మంచిది కాదు. చేపలు పట్టటం నేర్పించు, చేపను ఇవ్వటం కాదు. అలా ఇస్తే, మధ్యానం మట్టగుడిసలు ఇస్తే, సాయంత్రం కోరమేను కావాలి అంటాడు. అది గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ, కష్టపడితే, నష్టపోకుండా ఉంటాం అనేది గుర్తుంచుకోవాలి." అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read