జగన్మోహన్ రెడ్డి ఆయనప్రభుత్వం, ఆయన భజనబృందం డ్వాక్రా మహిళలను ఉద్ధరించినట్లు ప్రగల్భాలు పలుకుతోందని, ప్రభుత్వం తీసుకొచ్చిన పథకానికి జగనన్నఆసరాకు బదులుగా జగనన్న టోకరా అనిపెట్టుకుంటే బాగుండేదని, మహిళలను తాము అంత ఉద్ధరించామని, ఇంతఉద్ధరించామని చెప్పుకుంటున్నవారు, వారిని ఏవిధంగా మోసగించారో చెప్పడానికి తమవద్ద అనేక ఆధారాలున్నాయని తెలుగుమహిళ రాష్ట్రఅధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు శ్రీమతి వంగలపూడి అనిత స్పష్టంచేశారు. ఆదివారంఆమె తననివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే క్లుప్తంగా మీకోసం..."డ్వాక్రా సంఘాలనే విత్తనాన్ని నాటి, దాన్ని పెంచి పెద్దచేసింది చంద్రబాబునాయుడు గారు, ఆ వృక్షం యొక్క మహాఫలాలను ఇప్పుడు పీక్కుతింటూ, ఆ డ్వా క్రామహిళలకే వైసీపీ ప్రభుత్వం పెద్ద టోకరా వేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు డ్వాక్రా మహిళలను పీక్కుతినేలానే ఉన్నాయితప్ప, వారిని ఉద్దరించేలా లేవు. రూ.25 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే, దాన్ని చంద్రబాబుకి ఎలా ఆపాదిస్తారు? చంద్రబాబుగారి హయాంలో డ్వాక్రా మహిళలకు రుణాలే ఇవ్వకపోతే, ఇప్పుడు ఈ ప్రభుత్వం తీరుస్తోందని చెప్పుకుంటున్న రుణం ఎవరిది? ఎప్పుడు ఇచ్చింది? చంద్రబాబునాయుడి గారి హాయాంలో రాష్ట్ర విభజన జరిగి, ఆర్థిక సమస్యలున్నా కూడా లెక్కచేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న రూ.18,600 కోట్ల డ్వాక్రా రుణాలను టీడీపీ ప్రభుత్వం మాఫీ చేసింది. చంద్రబాబునాయుడు గారు డ్వాక్రా మహిళలకు రూ.18,600 కోట్ల రుణాలు మాఫీ చేశారో లేదో ఈ ప్రభుత్వం వద్దే ఇప్పుడు లెక్కలున్నాయికదా. ఆ లెక్కలు ఇప్పుడున్న మంత్రులకు కనిపించడంలేదా? మాట్లాడితే ఈ మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సున్నా వడ్డీ రుణాలంటున్నారు. పాదయాత్ర సమయంలో ముద్దులుపెట్టి, తలలు నిమిరిన వ్యక్తి, ఏం చెప్పాడో వారికి తెలియకపోయినా, ప్రజలకు బాగా తెలుసు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీలేని రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచుతానని ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న వ్యక్తే ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చాడు. టీడీపీ ప్రభుత్వంలో రూ.5లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తే, దాన్ని జగన్ రెడ్డి ఇప్పుడు రూ.3 లక్షలకు కుదించాడు. అదీ ఆయన సాధించిన ఘనత. ఒక్కో గ్రూప్ రూ..10లక్షలు తీసుకంటే, ఒక్కొక్కరికీ రూ.లక్షవరకు వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఒక్కో గ్రూపుకు రూ.3లక్షలే రుణమిస్తే, గ్రూపులోని ఒక్కో సభ్యురాలికి సంవత్సరానికి కేవలం రూ.1000 మాత్రమే వస్తాయి. దానికే పెద్దపెద్ద సమావేశాలు... సంబరాలు... ఉపన్యాసాలతో ఆర్భాటం.డ్వాక్రా మహిళలకు గోరంత సాయం చేస్తూ, సాక్షి మీడియాలో కొండంత ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చేస్తున్న మోసం డ్వాక్రా మహిళలకు తెలియదనుకోకండి... అన్నీ తెలుసు. కాకపోతే వారుసమయం కోసం ఎదురుచూస్తున్నారంతే. డ్వాక్రామహిళలు తమ కాళ్ల పై తామునిలబడుతున్నారని, గొర్రెలు మేకలు, కోళ్లువంటివిపెంచుకుంటున్నారని,వ్యాపారులుగా ఎదుగుతున్నారని ఓ తెగ డబ్బాలు కొట్టుకుంటున్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతంచేసి, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దిందే చంద్రబాబునాయుడుగారు. రెండున్నరేళ్లలో కాపు కార్పొరేషన్ నుంచి గానీ, ఎస్సీ,ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నుంచి గానీ ఈప్రభుత్వం ఏ ఒక్కమహిళకైనా చిన్న కుట్టుమిషన్ అయినా ఇచ్చిందా? డ్వాక్రా సంఘాలపై చర్చకు రమ్మంటే వైసీపీ నుంచి ఎవరూ రారు. ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి మాత్రం ముందుంటారు. 2018లో 90 లక్షలమంది డ్వాక్రామహిళలకు టీడీపీప్రభుత్వం పసుపు-కుంకుమ కింద ఆర్థిక సాయం అందిస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలను 70 లక్షలకు ఎలా కుదించింది? మిగిలిన 20 లక్షలమంది పరిస్థితేమిటి? వారు వైసీపీ వారు కాదని పక్కనపెట్టారా? 45 ఏళ్లు దాటిన ప్రతి అక్క చెల్లెమ్మ కు రూ.3వేల పింఛన్ ఇస్తానని చెప్పిన పెద్దమనిషి, దాన్నివిస్మరించాడు. ఆఖరికి వృధ్యాప్య పింఛన్లు కూడా పెంచలేక కిందామీద పడుతున్నాడు. అలాంటి వ్యక్తి ఆసరా పేరుతో మహిళలను ఉద్ధరిస్తున్నానని సిగ్గులేకుండా చెప్పుకోవడం..దానికి మంత్రులు, ఎమ్మెల్యేలు వంతపాడటం. ఇదివరకు మహిళా సంఘాల్లోనే కళ్యాణమిత్ర, బీమామిత్ర, ఆరోగ్యమిత్రలుఉండేవారు. వారందరినీ లేకుండాచేసి, ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆ వాలంటీర్ వెధవలుచేసేపనులకు ఆడబిడ్డలు, చిన్నారులు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితిని ఈ ముఖ్యమంత్రి కల్పించాడు. ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలుపెంచేసి, అన్నింటికీ మించి ఆడబిడ్డలకు రక్షణే లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వారికి ఎలాంటి ఆసరా కల్పిస్తుందో పాలకులేచెప్పాలి. మంత్రులు మైక్ పట్టుకుంటే చాలు చంద్రబాబునాయుడిని తిట్టడం తప్ప, మరోటి చేయడంలేదు.