విశాఖ ఏజెన్సీలో గంజాయి ముఠా రెచ్చిపోయింది. ఒక కేసు విషయంలో, నల్గొండ పోలీసుల ఏజెన్సీ ప్రాంతానికి తనిఖీలకు వెళ్ళగా, నల్గొండ పోలీసులపైనే గంజాయి బ్యాచ్ దా-డి చేసింది. గంజాయి ముఠా రాళ్లతో దా-డి చేసారు. దీంతో గంజాయి ముఠాపై పోలీసుల కాల్పులు జరిపారు. వారి పై పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే పోలీసులు తిరగబడటంతో గంజాయి స్మగ్లర్లు పరారు అయ్యారు. గంజాయి ముఠాను పట్టుకునేందుకు నల్గొంఘ నుంచి ప్రత్యేక బృందాలు విశాఖ వచ్చాయి. అయితే బరితెగించిన గంజాయి బ్యాచ్, ఒక్కసారిగా రాళ్ల దా-డి చేయడంతో, నల్గొండ పోలీసులు ఫైర్ ఓపెన్ చేసారు. గంజాయి బ్యాచ్ పై ఓపెన్ ఫైర్‌ను నల్గొండ ఎస్పీ ధృవీకరించారు. గాయపడ్డ వారిని, నర్సీపట్నంలోని హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే నల్గొండ పోలీసులు, ఏపి పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడకు వెళ్ళారా ? లేదా అనేది తెలియాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా ఏపి గంజాయి, డ్ర-గ్స్ స్థావరం అయ్యిందని విమర్శలు వస్తున్న తరుణంలో, ఇప్పుడు ఏకంగా పోలీసుల పైన అటాక్ చేయటం సంచలనంగా మారింది.
news
వైసీపీలో ఏమి జరుగుతుంది ? ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్పి, సామాన్యుల పై కేసులు పెడతాం అని బెదిరించటం ఏమిటి ?
గత వారం పది రోజులుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్, కరెంటు కోతలు గురించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన బొగ్గు కొరత ఉండటం, బహిరంగ మార్కెట్ లో యూనిట్ 25 రూపాయల వరకు ఉండటం, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందటం, సామర్ధ్యం మేర విద్యుత్ ఉత్పత్తి జరగకపోవటం, వీటి అన్ని కారణాలతో ఏపిలో విద్యుత్ సంక్షోభం అనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఇంత బలంగా రావటానికి కారణం, ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య సలహాదారు, జగన్ మోహన్ రెడ్డి వాయిస్ వినిపించే సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పటమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చాలా తక్కువ అందుబాటులో ఉందని, ప్రజలు విద్యుత్ తగ్గించుకోవాలని సాయంత్రం ఏసిలు వాడకం తగ్గించాలని, లేకపోతే వచ్చే వేసవి భయంకరంగా విద్యుత్ సమస్య ఉంటుందని అన్నారు. ఇక పవర్ కట్స్ గురించి అడగగా, ఇప్పటికి అయితే ఏమి లేదు అని, కానీ ప్రజలు సిద్ధంగా ఉండాలని అని అన్నారు. దీంతో విద్యుత్ సంక్షోభం నిజమే అని అందరూ నమ్మారు. ప్రభుత్వ అధికారులు కూడా దీనికి తగ్గట్టే కరెంటు ఎక్కువ రేటుకి కొంటున్నాం అని, బొగ్గు కావాలని చెప్తూ వచ్చారు. జగన్ కూడా ప్రధానికి లేఖ రాసారు. ఇదే సామయంలో రాష్ట్రంలో అనేక చోట్ల అప్రకటిత విద్యుత్ కోతలు చోటు చేసుకున్నాయి.
దీంతో ఇంకేముంది పండుగ తరువాత, విద్యుత్ కోతలు ఉంటాయి అంటూ ప్రచారం జరిగింది. అధికారులు మాటలు, సలహాదారులు మాటలు నమ్మిన మీడియా చానల్స్, ఇతరులు, కరెంటు కోతలు వచ్చేస్తున్నాయి అంటూ ప్రచారం చేసారు. అయితే ఈ ప్రచారం పై విద్యుత్ శాఖా మంత్రి బాలినేని తీవ్రంగా స్పందించారు. అసలు విద్యుత్ కోతలు ఉంటాయని ఎవరు చెప్పారని, రాష్ట్రంలో సరిపడా విద్యుత్ ఉందని, కొంటున్నాం అని, కొరత రాకుండా చూస్తున్నాం అని, ప్రజలు ఆ ప్రచారం నమ్మవద్దు అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాదు విద్యుత్ కోతలు అని ప్రచారం చేస్తే, చర్యలు తీసుకుంటాం అని కూడా హెచ్చరించారు. అయితే మంత్రి బాలినేని మాటలు, సజ్జల రామకృష్ణా రెడ్డిని టార్గెట్ గా చేసి చేసారా అనే అనుమానం కలుగుతుంది. ఏమి లేనప్పుడు మీడియా ముందుకు వచ్చి, సజ్జలే కరెంటు కష్టాలు గురించి చెప్తూ, వాడకం తగ్గించుకోవాలని, లేదని కోతలకు రెడీ అవ్వాలని చెప్పారు. మరి మంత్రిగారు, ముందుగా సజ్జల గారి పై చర్యలు తీసుకుంటారా ? వైసిపీలో ఏమి జరుగుతుందో మరి, ఒక్కొక్కరూ ఒక్కో మాట మాట్లాడుతున్నారు.
రేపటి జగన్ విజయవాడ పర్యటన, ప్రశాంత్ కిషోర్ ఐడియానా ?
జగన్ మోహన్ రెడ్డి తన పై ఉన్న యాంటీ హిందూ ముద్ర చేరుపుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సహజంగా తిరుపతి వెంకన్నకు పట్టు వస్త్రాలు ఇవ్వటం, సర్వ సాధారణం. ఏ ముఖ్యమంత్రి అయినా ఇస్తారు. కానీ ఈ సారి, ఈ కార్యక్రమానికి అధిక ప్రాచుర్యం ఇచ్చింది వైసిపి. ఏకంగా ఫుల్ పేజి యాడ్ లు, బ్యానర్లు, తమ అనుకూల బ్లూ మీడియాలో హైప్ ఇస్తూ కార్యక్రమాలు, ఇలా ఊదరగొట్టారు. అలాగే వెంటనే కనకదుర్గ అమ్మవారి కూడా పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఇక్కడ కూడా హైప్. జగన్ ఇంద్రకీలాద్రి మీద అడుగు పెట్టగానే, కొండ మీద తప్ప ఎక్కడా వర్షం పడలేదు అంటూ ప్రచారం చేసారు. ఇవన్నీ హిందూ ఓట్లను ఆకట్టుకోవటానికి అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. సహజంగా జగన్ మోహన్ రెడ్డి క్రీస్టియన్. పట్టు వస్త్రాలు భార్య భర్త కలిసి ఇవ్వాల్సి వచ్చినా, జగన్ ఒక్కరే వెళ్తూ ఉంటారు. అలాగే రాష్ట్రంలో మత మార్పిడులు అధికంగా జరుగుతున్నాయి అనే ప్రచారం ఉంది. సాక్షాత్తు ఆ పార్టీ ఎంపీనే ఈ వ్యాఖ్యలు చేసారు. ఇక అలాగే దేవాలయాల పై దా-డు-లు విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై అనేక విమర్శలు వచ్చాయి. ఇక తిరుమలలో వరుస వివాదాలకు అడ్డు లేకుండా పోయింది. వీటి అన్నిటి నేపధ్యంలో, జగన్ మోహన్ రెడ్డి పై ఒత్తిడి పెరిగిపోయింది.
తాను క్రీస్టియన్ అయినా, హిందూ వ్యతిరేకిని కాదు అని నిరూపించుకోవటానికి అనేక మార్గాలు వెతుకుతున్నారు. అయితే ఈ మొత్తం స్కెచ్ వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ లో మమత, అలాగే తమిళనాడులో స్టాలిన్, ఢిల్లీలో కేజ్రివాల్ ని కూడా కూడా సాఫ్ట్ హిందూ వైపు మళ్ళించే కార్యక్రమాలు చేసారు. ఇప్పుడు అదే ఫార్ములాని వాడుతున్నారు. విశాఖలో ఉన్న సాములోరు దగ్గరకు జగన్ తరుచూ వెళ్తూ ఉంటారు. అయితే ఆ స్వామి పై కూడా అనేక విమర్శలు రావటంతో, ఇప్పుడు రూట్ మార్చారు. రేపు జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్టు ఉండి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమానికి వెళ్తున్నారు. అక్కడ ప్రత్యేకించి కార్యక్రమాలు ఏమి లేకపోయినా, జగన్ వెళ్ళటం పై చర్చ మొదలైంది. ఆ ఆశ్రమంలో దాదాపుగా గంట పైగా జగన్ ఉంటారు. ఆశ్రమంలో మరకత రాజరాజేశ్వరి దేవిని దర్శించుకుంటారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే జగన్ అకస్మాత్తుగా ఈ పర్యటన పెట్టుకోవటం వెనుక, ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతుంది.
టిడిపికి మంచి జోష్ ఇచ్చే వార్త...
ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళు ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తే, ప్రత్యర్ధులను వేతాడుతున్నారు. తమ మాట వినకపోతే, జేసిబినో, పీసిబినో, లేక పోలీసులో వచ్చి వాలిపోతారు. అయితే ఈ పరిస్థితిలో కూడా కొంత మంది రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పుడే గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసిపి పరిస్థితి దారుణంగా ఉంటుంది అనేది అర్ధం అవుతుంది. దీంతో ఇప్పటి నుంచి ప్రతిపక్ష టిడిపిలోకి వలసలు ప్రారంభం అయ్యాయి. ఇది టిడిపికి మాంచి జోష్ ఇచ్చే వార్త అనే చెప్పాలి. జమ్మలమడుగుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఈ నెల 20వ తేదీన చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి వస్తున్నట్టు తెలిపారు. ఆయనతో పాటుగా ఆయన కుమారుడు కూడా టిడిపి తీర్ధం పుచ్చుకోనున్నారు. జమ్మలమడుగులు టిడిపికి పూర్వ వైభవం తెస్తామని చెప్తున్నారు. ఇక కడపలోని రాయచోటికి చెందిన బలమైన వైసిపీ నేత కూడా ఒకరు టిడిపిలోకి రాబోతున్నారు. అదే జిల్లాకు చెందిన డీఎల్ రవీంద్రారెడ్డి కూడా, తాను అభివృద్ధిని కాంక్షించే పార్టీలోకి వస్తున్నా అని చెప్పకనే చెప్పారు. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మీడియాలో బలమైన గొంతుగా ఉన్న జి.వెంకట రెడ్డి కూడా ఇటీవల చంద్రబాబుని కలిసారని, ఆయన కూడా టిడిపిలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద, టిడిపి ఇంకా రాజకీయంగా ఆక్టివ్ అవ్వక ముందే, టిడిపిలోకి వలసలు రావటం గమనించాల్సిన అంశం.