వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చికాకు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణం రాజు మరో సంచలనానికి తెర లేపారు. జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలను వదలిపెట్టే సమస్యే లేదు అంటున్న రఘురామరాజు, తాజాగా తెలంగాణా హైకోర్టులో, జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలి అంటూ, తెలంగాణా హైకోర్టులో ఈ రోజు పిటీషన్ దాఖలు చేసారు. అయితే ఇంతకు ముందు రఘురామకృష్ణం రాజు సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తూ, జగన్ మోహన్ రెడ్డితో పాటుగా, విజయసాయి రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలి అంటూ, ఆయన నాంపల్లి సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అయితే దాని పై అనేక నాటకీయ పరిణామాల మధ్య సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు, ఆ పిటీషన్ ని కొట్టి వేసింది. బెయిల్ రద్దు చేయటానికి సరైన కారణాలు లేవు అంటూ అభిప్రాయపడిన సిబిఐ కోర్టు, రఘురామరాజు వేసిన పిటీషన్ ను కొట్టేసింది. అయితే ఈ తీర్పు కుడా, కోర్టు చెప్పక ముందే సాక్షిలో రావటం, దీని పైన రఘురామరాజు మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, ఇలా అనేక అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. సాక్షిలో తీర్పు ముందే వచ్చిన సమయంలోనే, రఘురామకృష్ణం రాజు పలు అనుమానాలు వ్యక్తం చేసినా, కోర్ట్ నిర్ణయానికి గౌరవించాల్సిన పరిస్థతితో ఆయన తీర్పును శిరసావహిస్తూనే, సిబిఐ కోర్టు తీర్పు పై హైకోర్టుకు వెళ్లారు.
జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కండీషనల్ బెయిల్ పై ఉన్నారని, వాళ్ళు బెయిల్ కండీషనల్ లు అతిక్రమించారని, సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, అందుకే వీరి ఇద్దరి బెయిల్ రద్దు చేసి, కేసు విచారణను వేగంగా దర్యాప్తు చేయాలి అంటూ, రఘురామరాజు తెలంగాణా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అయితే సిబిఐ కోర్టులో, తటస్థ వైఖరి చూపించిన సిబిఐ అధికారులు, ఇప్పుడు తెలంగాణా హైకోర్టులో ఎటువంటి వైఖరి చూపిస్తారు, లేదా కోర్ట్ సిబిఐని కూడా అభిప్రాయం చెప్పాల్సిందే అని చెప్తుందా, ఇలా అనేక విషయాల పై ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. అయితే ఇది ఇలా ఉంటే, జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ కొన్ని సాంకేతిక కారణాలతో రఘురామ పిటిషన్లను వెనక్కి పంపించారు. ఈ సాంకేతిక అంశాలు సరి చేసి, రేపు మళ్ళీ రఘురామరాజు పిటీషన్ వేయనున్నారు. ఈ పిటీషన్, దసరా సెలవులు అనంతరం, విచారణకు వచ్చే అవకాసం ఉంది.