ఉద్యోగాలు చేసుకునే వారు ఫస్ట్ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. పిల్లలు సెలవులు కోసం ఎదురు చూస్తూ ఉంటారు... అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మంగళవారం కోసం ఎదురు చూస్తుంది. ఏమిటీ మంగళవారం సెంటిమెంట్ అనుకుంటున్నారా ? సెంటిమెంట్ లేదు ఆయింటుమెంటు లేదు. మంగళవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, అన్ని రాష్ట్రాలు అప్పులు తీసుకునే వీలు ఉంటుంది. సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు అంటే పండుగే కదా. ఎలాగూ ఆదాయం లేదు. పెరుగుతుందనే ఆశ లేదు. ఎలాగైనా నెల గడవాలి అంటే అప్పు తీసుకోవాలి. అందుకే మంగళవారం వచ్చింది అంటే అప్పు కోసం రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా వద్దకు పరిగెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. గత నెల రోజులుగా ఏకంగా రూ.10,500 కోట్లు చేసి సరి కొత్త రికార్డును సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక కార్పోరేషన్ల సంగతి సరే సరి. ఆస్తులు అమ్మకాలు, తనఖాలు మరో పక్క. మద్యం నుంచి వచ్చే ఆదాయం కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి రికార్డు సృష్టించారు. ఇక్కడ మరో విషయం మనం గమనించాలి. ఏడాది పాటు కొంత మేరకు అప్పు తీసుకోవటానికి మాత్రమే, వివిధ రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇస్తుంది. మనం ఆ లిమిట్ లోపే అప్పులు తెచ్చుగోలం. అయితే ఇందులో కూడా మనం రికార్డు కొట్టాం.

jagan 05102021 2

కేవలం నాలుగు నెలల్లోనే ఏడాది అప్పు లాగేసాం. ఇక అప్పటి నుంచి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు. కేంద్రాన్ని బ్రతిమిలాడుకోగా, చివరకు వారు అనూహ్యంగా రూ.10,500 కోట్ల అదనపు అప్పు కోసం అవకాసం ఇచ్చారు. కేంద్రం ఇలా ఎందుకు అప్పు చేయటానికి అవకాసం ఇస్తుందో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఈ డబ్బులు కేవలం రెండు నెలల్లో లాగేసారు. ఇప్పుడు అక్టోబర్ నెల గడిచిపోయినా, మళ్ళీ నవంబర్ నెల నుంచి అప్పు కోసం ఢిల్లీ వెళ్ళాల్సిందే. వాళ్ళు ఇస్తేనే, జీతాలు, వడ్డీలు, పెన్షన్లు చెల్లించేది. లేకపోతే, ఈ సారి అది కూడా కుదరదు. కేంద్రం కూడా జగన్ ప్రభుత్వానికి అప్పుల విషయంలో సంపూర్ణ మద్దతు ఇస్తుంది కాబట్టి, ఎవరికీ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. కాకపొతే, రాష్ట్ర భవిష్యత్తు తరాల పై ఈ అప్పులు భారం పడుతుంది. పరిమితికి మించి అప్పులు చేస్తుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం, ఇంకా ఇంకా అప్పులు తెచ్చుకోవటానికి అనుమతి ఇస్తూ ఉండటంతో, మంగళవారం వచ్చింది అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి పండుగ వాతావరణం అనే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017-2018వ ఆర్ధిక సంవత్సరం నుంచి కూడా, చేపట్టిన ఉపాధి హామీ పధకం పనులకు సంబంధించిన నరేగా పనులకు సంబందించిన, బిల్లులు ఈ రోజు వరకు కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు. అవి చంద్రబాబు హయాంలో జరిగిన పనులు అని, చంద్రబాబు మనుషులకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అనే విధంగా, జగన్ మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదు. గత రెండేళ్ళ నుంచి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ విషయం పై అడిగీ అడిగీ విసిగి పోయారు. అయినా ఎక్కడా డబ్బులు రాకపోవటంతో, అప్పుడు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లు అందరూ కూడా, హైకోర్టుని ఆశ్రయించారు. మొత్తం 1013 పిటిషన్లు, ఈ విషయం పై హైకోర్టులో పిటీషన్లు పడ్డాయి. అయితే గత కొన్ని నెలలుగా హైకోర్టులో ఈ కేసు నలుగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ రోజు హైకోర్టు తీర్పుని ప్రకటించింది. ఈ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు చేతిలో గట్టిగా మొట్టికాయలు పడ్డాయి. ఎప్పటి నుంచి అయితే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో, ఆ బిల్లులు మొత్తానికి కూడా 12 శాతం వడ్డీతో కలిపి, వెంటనే చెల్లించాలి అంటూ, హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

hc 05102021 2

ఈ కేసులో ఒక విశేషం ఏమిటి అంటే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు అయితే రీసెంట్ గా పదవీ విరమణ చేసారో, ఆయన కోర్టుకు వచ్చి, ఏపిలో జరుగుతున్న ఉపాధి హామీ పధకం పనులకు, ఎటువంటి విజిలెన్స్ ఎంక్వయిరీ విచారణ జరగటం లేదని, స్వయంగా చెప్పటంతో, హైకోర్టు రికార్డు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయం చెప్పింది. దీంతో, 1013 పిటిషన్ల పై హైకోర్టు ఒకేసారి తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా బిల్లులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వం, 20 శాతం బిల్లులు తగ్గించి ఇవ్వాలి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోని కూడా హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికే కొంత చెల్లిస్తే, దానికి 12 శాతం వడ్డీతో చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి ఇది వైసిపీ ప్రభుత్వానికి భారీ దెబ్బ అనే చెప్పాలి. అయితే 1013 పిటిషన్ల విషయంలో ఇలా ఒకేసారి కామన్ గా తీర్పు రావటం, ప్రభుత్వం యొక్క కక్ష పూరిత విధానం, ఈ సందర్భంగా ప్రజలకు మరోసారి తెలిసింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, 2019 ముందు వరకు జగన్ నెంబర్ వన్ అయితే, విజయసాయి రెడ్డి నెంబర్ టు గా ఉండే వారు. పార్టీలోనే కాదు, కేసుల్లో కూడా జగన్ ఏ1 అయితే, విజయసాయి రెడ్డి ఏ2. ఇప్పటికే విజయసాయి రెడ్డికి రెండు సార్లు రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వం త్వరలోనే ముగుస్తుంది కూడా. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత, విజయసాయి రెడ్డికి తిరుగు ఉండదని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే, విజయసాయి రెడికి ఢిల్లీలో కీలక పదవి కూడా ఇచ్చారు. ఒక పక్క రాజ్యసభ సభ్యడుగా ఉంటూ, లాభదాయక పదవులు పై అభ్యంతరం రావటంతో, రూల్స్ మార్చి మరీ విజయసాయి రెడ్డికి పదవి ఇచ్చారు. ఇంత రిస్క్ తీసుకుని మరీ విజయసాయి రెడ్డి పదవి ఇచ్చారు. సరే, ఇది ఇక్కడితో అయిపొయింది. ఏమైందో ఏమో కానీ విజయసాయి రెడ్డి అధికారాలకు నెమ్మదిగా కత్తెర పడుతూ వచ్చింది. సజ్జల రామకృష్ణా రెడ్డి రాకతో, విజయసాయి రెడ్డి నామమాత్రం అయిపోయారు. విజయసాయి రెడ్డిని కేలవం మూడు జిల్లాలకు పరిమితం చేసారు. ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి హవా కొనసాగే విధంగా, విజయసాయి రెడ్డి వ్యవహరించారు. అయితే ఎందుకో కానీ, గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డిని, జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా దూరం పెడుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది.

vsreddy 04102021 2

అందుకే గత నెల రోజులుగా విజయసాయి రెడ్డి, ప్రతిపక్షాల పై కూడా ఎలాంటి ట్వీట్లు పెట్టటం లేదు. ప్రతి రోజు ప్రతిపక్షాలను కవ్విస్తూ ట్వీట్లు పెట్టే విజయసాయి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డిని మరో బాధ్యత నుంచి తప్పించారు. ఢిల్లీలో వైసిపి అంటే విజయసాయి రెడ్డి అనే పేరు ఉండేది. ఇప్పుడు ఢిల్లీలో విజయసాయి రెడ్డి బాధ్యతలు అన్నీ, మాజీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్ కు ఇచ్చారు. ఆయన రిటైర్డ్ అయిన మరుసటి రోజే, ఆయనను సలహాదారుగా నియమిస్తూ, కేంద్రంతో అనేక అంశాల పై పనులు చక్కబట్టే బాధ్యతులు అప్పగించారు. ఇందుకోసం ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ హోదాతో పాటుగా, రూ.2.50 లక్షల జీతం కూడా ఇచ్చారు. అయితే విజయసాయి రెడ్డి బాధ్యతలు ఆయనకు ఇవ్వటం, అలాగే త్వరలో విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వం కూడా మళ్ళీ పొడిగించరు అనే వార్తలు రావటంతో, విజయసాయి రెడ్డి బాధ్యతులు ఒక్కోటిగా కత్తిరించి, ఆయన పదవిని నామమాత్రం చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది.

దేశ రాజకీయాల్లో కన్సల్టెంట్ ల ప్రభావం ఎక్కువ అయిపొయింది. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అతను గెలిపిస్తున్నా, అతని పై ఉన్న ప్రధాన ఆరోపణ, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, ఓట్లు దండుకుంటాడని. ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుని, తన క్లేంట్ వైపు మళ్ళిస్తాడని. మన రాష్ట్రంలో కూడా ప్రశాంత్ కిషోర్ గురించి అందరికీ తెలుసు. జగన్ మోహన్ రెడ్డిని తీసుకురావటంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పటంలో, ప్రశాంత్ కిషోర్ ని మించిన వారు లేరు. అయితే గత రెండున్నరేళ్ళుగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై పూర్తి వ్యతిరేకత వస్తుంది. ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహల్లో ప్రజలు ఉన్నారు. అరకొర సంక్షేమం తప్ప, చెప్పుకోవటానికి ఏమి లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ హాయాంలో ఎలా ఉన్నారో, ఇప్పుడు ప్రజలు, రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రజల్లో తన ఇమేజ్ అయిపోయిందని గ్రహించిన జగన్ మోహన్ రెడ్డి, మళ్ళీ ప్రశాంత్ కిషోర్ వైపు పరుగులు పెట్టారు. ప్రశాంత్ కిషోర్ వస్తున్నాడు అంటూ, గత క్యాబినెట్ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి, మంత్రులకు చెప్పారని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ వస్తున్నాడని, ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోవాలి అంటూ జగన్ చెప్పినట్టు అంటున్నారు.

pk 05102021 2

అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం, ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్ అయ్యింది. ప్రశాంత్ కిషోర్ టీం విశాఖపట్నంలో సర్వే చేసినట్టు ప్రముఖ పత్రికలో వార్తలు వచ్చాయి. ముందుగా విశాఖలో ప్రశాంత్ కిషోర్ టీం సర్వే చేయటం పై రాజకీయం ఆసక్తి కలుగుతుంది. రాష్ట్రం మొత్తంలో, వైసీపీ వీక్ గా ఉంది విశాఖపట్నంలోనే. అలంటి చోట నుంచి పీకే టీం పని మొదలు పెట్టింది. గత రెండు రోజులుగా ప్రశాంత్ కిషోర్ టీం అనేక విషయాల పై సర్వే చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్త్రంద్రావ్ వేదికగా వైసీపీ చేస్తున్న అరాచకం పై, ప్రతి ఒక్కరూ పెదవి విప్పుతున్నారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో అనధికారిక ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. చాలా వరకు ప్రజలు, వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వీటి అన్నిటి నేపధ్యంలో, ఈ సర్వే ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. అలాగే వైసీపీ సెకండ్ గ్రేడ్ నాయకత్వం కూడా నిరాశలో ఉన్నట్టు ఈ బృందం గుర్తించినట్టు తెలిసింది. ఇక అధికారులు, వైసీపీ నాయకులు మధ్య కూడా సయోధ్య లేదని గుర్తించారు. ఈ వివరాలు చూస్తుంటే, పోయిన సారి లాగే, ఈ సారి కూడా విశాఖలో వైసీపీకి ప్రతికూల పరిస్థితే కనిపిస్తుంది.

Advertisements

Latest Articles

Most Read