ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి వచ్చి కేవలం రెండున్నర ఏళ్ళు మాత్రమే అయ్యింది. అయితే మొన్న క్యాబినెట్ సమావేశంలో, ఎన్నికలకు రెడీ అవ్వాలి అంటూ చెప్పటం అందరినీ ఆశ్చర్యానికి కలిగించింది. ఇక జనల్లోనే ఉండాలి, నేను జనంలోనే ఉంటాను అంటూ జగన్ చెప్పటం, కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన అంశం. అయితే జగన్ ముందస్తుకు వెళ్తారని, కొంత ప్రాచారం ఇప్పటికే జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే, అప్పుడే ఎన్నికల సర్వేలు కూడా మొదలు పెట్టారు. ఈ సర్వే చేసింది కూడా, వైసీపీకి అనుకూలంగా ఉండే సంస్థే. అయితే ఇందులో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా 46 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది మంత్రుల పైన తీవ్ర వ్యతిరేకత ఉందట. అంటే వీళ్ళు కచ్చితంగా పోతారని ఆ సర్వే చెప్తుంది. అంటే ఇక ఊగిసలాడే వారు కూడా ఉంటారు. వారి సంగతి చెప్పలేదు. ఇక దాదాపుగా 12 మంది మంత్రుల పైన తీవ్ర వ్యతిరేకత ఉందట. అయితే ఇందులో రెడ్డి సామాజిక వర్గ మంత్రులు అయితే ఎవరూ లేకపోవటం, కొంత ఆశ్చర్యాన్ని కలిగించే అంశం అనే చెప్పాలి. అయితే ఇక్కడ చాలా ఆసక్తికర అంశాలు ఉన్నాయి. మాకు 80 శాతం పంచాయతీల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వచ్చాయని, వైసీపీ నేతలు బాగా డబ్బా కొడుతున్న విషయం తెలిసిందే.
ఆ ఎన్నికలు ఎలా జరిగాయో అందరూ చూసారు. అయితే ఈ సర్వే ప్రకారం, వైసిపి ఓటింగ్ బాగా తగ్గిపోయింది. అదే విధంగా టిడిపి ఓటింగ్ పెరిగింది. 2019 తో పోలిస్తే వైసీపీకి 3.5% , జనసేన 1.53% ఓటింగ్ తగ్గిపోతే, తెలుగుదేశం పార్టీకి మాత్రం 3.5% ఓటింగ్ పెరిగింది. అలాగే తెలుగుదేశం , వైసీపీకి ఉన్న గ్యాప్ 3% మాత్రమే. కానీ జనసేనకి 4% ఓటింగ్ వుందని సర్వే చెప్పింది. అయితే ఇంకా డిసైడ్ చేసుకోని న్యూట్రల్ ఓటర్ 4.75% ఉన్నారని చెప్పింది. ఇంకో ఇంట్రస్టింగ్ పాయింట్ .. జులై ఎండింగ్ వచ్చిన వీరి సర్వేతో పోలిస్తే .. ఈ రోజొచ్చిన సర్వేలో వైసీపీ ఇంకా బాగా పడిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సింది, జులై ఎండ్ లోపు 20 వేలు + శాంపిల్ తీసుకుంటే, ఆగస్ట్ & సెప్టెంబర్ లో 40 వేలు + శాంపిల్ తీసుకున్నారు. అంటే వైసీపీ రోజు రోజుకీ పడిపోతుందనుకొవాలి. ఈ సర్వే శాంపిల్ సైజ్ 68,200 అంటే మంచి సైజే అన్నట్టు. అలాగే వీరు సర్వే చేసిన పాయింట్స్ .. ఇసుక ,మధ్యం, డెవలప్ మెంట్ , ఇండస్ట్రీస్ , మహిళా రక్షణ , నిరుద్యోగ , రైతుకూలి , భవన నిర్మాణ కార్మికులు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్, ప్రభుత్వం పై రోజు రోజుకీ వ్యతిరేక పెరుగుతుంది కానీ తగ్గదు. తమకు అనుకూలమైన సంస్థే ఈ విధంగా సర్వే ఇచ్చింది అంటే, వైసీపీ పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.