రాజధాని అమరావతిలో ఉన్న అసైన్డ్ రైతులకు ఈ రోజు హైకోర్టులో భారీ ఊరట లభించింది. అంతకు ముందు, రాజధానిలో అసైన్డ్ రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 316ను తీసుకొచ్చింది. గత నెలలో ఈ జీవో జారీ చేసారు. ఈ జీవో ప్రకారం, ఎవరు అయితే అసైన్డ్ రైతులు, రాజధానికి ఇచ్చి, దానికి ప్లాట్లు తీసుకుని అమ్ముకున్నారో, ఆ భూములు తిరిగి తమకు స్వాధీనం చేయాలని, మీకు అమ్ముకునే హక్కు లేదని, అనుభవించే హక్కు మాత్రమే ఉందని చెప్పి, ప్రభుత్వం ఈ జీవోలో పేర్కొంది. అయితే ఈ జీవో విడుదలైన తరువాత అసైన్డ్ రైతులు షాక్ కు గురయ్యారు. ముఖ్యంగా ఎక్కువ మంది దళిత రైతులు ఉండటంతో, ఈ పరిస్థితి ఏమిటి అంటూ తల బాదుకున్నారు. అయితే ఈ జీవో పై హైకోర్ట్ కు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. రైతుల తరుపున న్యాయవాది ఇంద్రనీల్ బాబు పిటీషన్ దాఖలు చేసారు. రాజధాని అనేది వీసాల ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్మిస్తుందని, అందు వల్ల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అసైన్డ్ రైతులకు కూడా క్యాటగిరీ ఫోర్ కింద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, ప్యాకేజీలు ప్రకటించిందని, ఈ ప్యాకేజ్ ప్రకారం ఎవరు అయితే రిటర్నబుల్ ఫ్లాట్ తీసుకున్నారో, వాళ్ళ జీవనాధారం కోసం అమ్ముకున్నారని కోర్టుకు తెలిపారు.

hc 13092021 2

ఈ వాదనలు అన్నీ హైకోర్టు పరిశీలించింది. ఈ నేపధ్యంలోనే, జీవో 316 పై హైకోర్టు స్టేటస్ కో విధించింది. దీని పైన తదనంతర ప్రక్రియ ఏమి చేపట్టవద్దని, యధాతధ స్థితి కొనసాగాలని, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు రైతులు ఎవరు అయితే భూములు అమ్ముకున్నారో, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎవరు అయితే తీసుకున్నారో, ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్ తిరిగి తమకు ఇవ్వాలని చెప్పి, ఏఏంఆర్డీఏ కొంత మంది రైతులకు నోటీసులు జారీ సెహ్సింది. దీంతో రాజధానిలో ఈ విషయం పై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలోనే జీవో 316ను సవాల్ చేస్తూ రైతులు హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టు ఈ పిటీషన్ ను విచారణ చేసి, ఇరు వైపుల నుంచి వాదనలు విన్న హైకోర్టు, జీవో 316 పై స్టేటస్ కో జారీ చేసింది. అలాగే కేసు విచారణను పది రోజుల పాటు వాయిదా వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు అమరావతి విషయంలో, ప్రభుత్వం పన్నిన ఏ ప్లాన్ కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. రాజధాని రైతుల పోరాటం ఫలిస్తు వస్తుంది.

అదానీ గ్రూప్ చైర్మెన్ సోదరులు ఇద్దరూ నిన్న తాడేపల్లి వచ్చి జగన్ మోహన్ రెడ్డిని కలిసి వెళ్ళారు. అయిత ఈ వార్త రెండో కంటికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం ఈ రోజు మీడియా చానల్స్ లో వచ్చింది. నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ప్రత్యేక విమానంలో వచ్చిన అదనీ సోదరులు, సాయంత్రం 3.40 నిమిషాలకు తిరిగి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుని ప్రత్యేక విమానం ద్వారా, వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో, ఉత్తరాంధ్రలోని గంగవరం పోర్ట్ ని, అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకుంది. అయితే ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ వాటాని కూడా అదానీకి అప్పచెప్పటం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీని పైన హైకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. ఈ లిటిగేషన్ కోర్టుకు వెళ్ళటం, అదే విధంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం పైన హైకోర్టులో డివిజనల్ బెంచ్ విచారణ చేపట్టిన తరుణంలో, ఇప్పుడు అదానీ వచ్చి, జగన్ ని కలవటం పై, ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా ఇటీవల కాలంలో, అదానీ గ్రూప్, కృష్ణపట్నం పోర్ట్ తో పాటుగా, ఇప్పుడు గంగవరం పోర్ట్ ని కూడా స్వాధీనం చేసుకుంది. అయితే గంగవరం పోర్ట్ స్వాధీనం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.

meeting 13092021 2

గంగవరం పోర్ట్ లో ఉన్న 17 శాతం ప్రభుత్వ వాటాని కూడా, అదానీ గ్రూప్ కు ఇవ్వటం పై విమర్శలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం పారదర్శకంగా జరగలేదని, రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. దీని పైనే నిన్న అదనీ, జగన్ మధ్య ప్రధానంగా చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల కలంలో ఈ వ్యవహారం మొత్తం వివాదాస్పదం కావటంతోనే, ఈ భేటీ ఇప్పుడు జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇలా ఉంటే, ఇంత పెద్ద మీటింగ్ జరిగినా, ఈ భేటీని సీక్రెట్ గా ఉంచారు. ఎక్కడా బయటకు తెలియనివ్వలేదు. అధికార వర్గాలు కూడా ధృవీకరించ లేదు. దీంతో ఈ అంశం పై మరింత అనుమానాలు బలపడుతున్నాయి. దాదాపుగా 9 వేల కోట్ల విలువగల వాటాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటే, వందల కోట్లలోనే విక్రయం జరిగింది అనేది ఆరోపణ. రాష్ట్రంలో ఆస్తులు అన్నీ అదానీ పరం చేస్తున్నారని, ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి ఈ సీక్రెట్ భేటీ ఎందుకు జరిగింది ? ఏమి నిర్ణయాలు తీసుకున్నారో తెలియాలి అంటే, కొన్ని రోజులు ఆగాల్సిందే.

రైతు గెలవాలి – వ్యవసాయం కలకాలం నిలవాలనే కాన్సెప్ట్ తో టీడీపీ రైతుకోసం – తెలుగుదేశం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, రైతన్నలు విత్తనం నాటే దగ్గర్నుంచి, పంట ఉత్పత్తుల విక్రయం వరకు అడుగడుగునా జగన్ ప్రభుత్వం నిలువునా దగాచేస్తూ, అన్నదాతలకు ఉరిబిగించే చర్యలకే పాల్పడుతోందని టీడీపీనేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయమంటేనే రైతులు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ రెండున్నరేళ్లలో ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వ ఎక్కడా ఒక్క రైతుకికూడా కనీసం నాగలిబోల్టు కూడా ఇవ్వలేదని మర్రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు పొలాల్లో మోటార్లు వేసుకొని పంటలకు నీరందించాలంటే, కనీసం రూ.2లక్షలవరకు ఖర్చువుతోందని, పొలాలకు నీరు పెట్టినాకూడా ఎక్కడికక్కడ ఆ నీరంతా మొక్కలకు సరిగా అందకుండానే ఇంకిపోతోందన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి టీడీపీ ప్రభుత్వంలో ఎక్కువ భూమిని సాగులోకి తేవడానికి, 2017-18లో రూ.1200కోట్లు, 2018-19లో రూ.1000కోట్లను మైక్రోఇరిగేషన్ కోసం ఖర్చు చేయడం జరిగిందన్నారు. మైక్రో ఇరిగేషన్ పద్ధతిని వ్యవసాయంలో ప్రవేశపెట్టడంద్వారా గతంలో మోటార్ల ద్వారా ఎకరాకు అందేనీటిని, డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతిలో 5ఎకరాలకు అందేలాచేసి, రైతులకు ఖర్చులు కూడా తగ్గించడం జరిగిందన్నారు. కరెంట్ కోసం రైతులు ఎదురుచూడటం, అదివచ్చి, పోయినప్పుడల్లా రైతులు పొలానికి పరిగెత్తే పని లేకుండా చేసిన ఘనత టీడీపీప్రభుత్వానిదేనన్నారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద, రైతులకు ఉచితంగా బోర్లు వేయించి, మోటార్లను కూడా టీడీపీప్రభుత్వం బిగించ డం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అదే పథకానికి వై.ఎస్.ఆర్ జలకళ అనిపేరుమార్చాడు తప్ప, ఎక్కడా ఒక్క బోరు కూడా వేయించిందిలేదన్నారు. బాధ్యతలేని ప్రభుత్వం, బాధ్యతలేని మంత్రుల ఏలుబడిలో అధికారులుకూడా బాధ్యతలేకుండా ప్రవర్తిస్తున్నారని మర్రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టుల గేట్లు తెరుచుకోవని, తెరుచుకకుంటే, మూతపడటం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే వానలే వానలని వైసీపీవారు ఊదరగొట్టారని, కానీ ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి పాలనలో గత సంవత్సరం రబీలో ఎక్కడా కాలువల్లో నీళ్లు పారిందిలేదన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమవ్వబట్టే, రైతులకు సకాలంలో నీరందించలేక పోయిందన్నారు.

రైతులకు ప్రభుత్వమే సమాధానంచెప్పలేకపోతే, రైతుభరోసా కేంద్రాల్లోని సిబ్బందేం చెబుతారన్నారు? రైతుల తరుపున బీమా కంపెనీలకు ప్రభుత్వం సకాలంలో పంటలబీమా సొమ్మ కట్టకపోవడంతో, పంటలు నష్టపోయిన రైతులు ఈ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమంత్రి రైతులకు న్యాయంచేస్తున్నాడో, అన్యాయం చేస్తున్నాడో ప్రతిఒక్కరూ ఆలోచించాలన్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులకు కొబ్బరిచెట్టుకు రూ.1500లు, జీడితోటలకు హెక్టారుకి రూ.30వేలు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అందిస్తే, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో రైతుల వద్దకు వెళ్లిన జగన్ రెడ్డి, జీడితోటలకు అదనంగా రూ.30వేలు ఇస్తానని, కొబ్బరిచెట్లకు అదనంగా రూ.1500లు ఇస్తానని చెప్పాడని, కానీ ఇంతవరకు ఆసాయం మాత్రం అందలేదన్నారు. జామాయిల్, సుబాబుల్ క్వింటాను రూ.5వేలకు తగ్గకుండా అమ్మేలా చూస్తానని జగన్ గతంలో హామీ ఇచ్చాడని, కానీ నేడు క్వింటా రూ.1000కి కూడా కొనేవారు లేకుండా పోయారని శ్రీనివాసరెడ్డి చెప్పారు. కొన్నిప్రాంతాల్లో రైతులు ఉచితంగానే జామాయిల్ , సుబాబుల్ ను తీసుకెళ్లమని వ్యాపా రులకు చెబుతున్నారన్నారు. ఆఖరికి ఇన్ పుట్ సబ్సీడీ లో కూడా జగన్ ప్రభుత్వం రైతులను మోసగించిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వరిపైరుకి హెక్టారుకి రూ.20వేల పరిహారం ఇస్తే, జగన్ దాన్ని రూ.15వేలకు తగ్గించాడన్నారు. రూ.15వేలు ఇవ్వడానికి కూడా వ్యవసాయమంత్రి ఒకటే గగ్గోలుపెట్టాడన్నారు. ఈ విధంగా అడుగడుగునా రైతులకు ఉరివేసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి నిరసనగానే తాము 14వతేదీ నుంచి 18వతేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘రైతుకోసం-తెలుగుదేశం’ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని శ్రీనివాసరెడ్డి తెలిపారు . వ్యవసాయరంగ పరిరక్షణకోసం, అన్నదాతలకు అండగా ఉండి, వారికి ప్రభుత్వంనుంచి తగిన తోడ్పాటు లభించేవరకు తమపోరాటం సాగుతుం దన్నారు. రైతుకోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని జోన్లవారీగా నిర్వహిస్తున్నామన్న శ్రీనివాసరెడ్డి, 14 వతేదీన నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపూర్, కడప పార్లమెంట్ నియోజకవర్గాల జోన్లలో, 15వ తేదీన కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 16వతేదీన ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 17వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు నియోజకవర్గాల్లో, 18వ తేదీన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు సహా, మండల,గ్రామస్థాయి నేతలు విధిగా పాల్గొనాలని, రైతులనుకూడా పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని మర్రెడ్డి పిలుపు నిచ్చారు

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గత నెల రోజులుగా అన్ని వర్గాల నుంచి, అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరిని కదిలించినా ఏదో ఒక సమస్యతో సతమతం అవుతున్నారు. అధ్వానమైన రోడ్డులు ఒక పక్క, పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక పక్క, కరెంటు చార్జీలు పెంపు ఒక పక్క, పెన్షన్లు పీకి వేయటం ఒక పక్క, శాంతి భద్రతల సమస్యలు, మటన్ మార్ట్ లు, సినీమా టికెట్లు, ఇలా ఒకటి కాదు, రెండు ఏది పట్టుకున్నా, ఏకు మేకై కూర్చుంది. తీవ్ర అసంతృప్తిలో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా రోడ్డుల విషయానికి వస్తే, ప్రజలకు పిచ్చేక్కటం ఒక్కటే తక్కువ. ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితి. నేషనల్ హైవేలు తప్ప, అన్ని రోడ్డులు నాశనం అయిపోయాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రోడ్డుల మరమత్తులు చేయకపోవటంతో, ఏ రోడ్డు పట్టుకున్నా నాశనమైన రోడ్డులే కనిపిస్తున్నాయి. ఇది ఒక పక్కన పెడితే, కొన్ని రోడ్డులకు టెండర్లు పిలిచినా, వచ్చే వారు లేకుండా పోయారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవటంతో, కొత్త రోడ్డులు వేయటానికి కాంట్రాక్టర్లు రాని పరిస్థితి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక స్థితి కూడా ఇందుకు కారణం అనే చెప్పాలి. గత ఏడాది 600 కోట్లు కేటాయించి రోడ్డుల మరమ్మత్తులు చేస్తున్నాం అని చెప్పినా, ఒక్క రోడ్డు కూడా వేసింది లేదు.

kannababu 12092021 2

ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటి అంటే, ఒక ఆర్టిఐలో , ఈ రెండేళ్ళలో కేవలం రూ.15 కోట్ల వరుకే రోడ్డుల మరమ్మత్తులకు ఖర్చు పెట్టినట్టు చెప్పారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రోడ్డుల పై ప్రజలే కాదు, సొంత పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా, దండం పెడుతున్నారు. వారం క్రితం గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే ఈ రోడ్డుల పై తిరగలేక పోతున్నాం అంటూ బహిరంగ వెదిక పైనే చెప్పారు. ఇప్పుడు తాజాగా, యలమంచలి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి, రోడ్డులు దారుణంగా ఉన్నాయని, రోడ్డులు వేయాల్సిందిగా కోరారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ, రోడ్డులు వేయటానికి డబ్బులు ఏవి అంటూ ఎదురు ప్రశ్నించారు. అన్ని రోడ్డులు వేయటానికి నేనేమైనా దేవుడినా అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రం మొత్తం రోడ్డులు అలాగే ఉన్నాయని, ఏమి చేయలేం అని, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటూ చెప్పిన ఆడియో వైరల్ అయ్యింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, రాష్ట్ర రోడ్డులు ఎలా ఉన్నాయో ఎమ్మెల్యే మాటల్లోనే అర్ధం అవుతుంది.

Advertisements

Latest Articles

Most Read