ముస్లిం మైనార్టీలపై ఇక మీదట దా-డు-లు జరిగితే సహించేది లేదని, తాట తీస్తామని టీడీపీ అధికార ప్రతినిధి మహమ్మద్ నసీర్ అహ్మద్ హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన మాటలు మీకోసం క్లుప్తంగా ఆయన మాటల్లోనే..జగన్ పాలనలో మైనారిటీలపై దా-డు-లు, దౌ-ర్జ-న్యా-లు నిత్యకృత్యమయ్యాయి. మైనారిటీలకు భద్రత కరవైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైనార్టీలకు అన్నలాగా ఉంటానని చెప్పి.. ప్రస్తుతం అక్కసు వెళ్లగక్కడం భావ్యమా? నంద్యాలకు చెందిన అక్బర్‌బాష తన కుటుంబానికి సంబంధించిన ఆస్తిని స్థానిక వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే ప్రోధ్బలంతో దౌర్జన్యంగా ఆక్రమించుకుంటుంటే.. నాకు నా ఆస్తి ఇవ్వండి, నాకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టండి, పోలీసులు నాకు రక్షణ కల్పించండి, నాపట్ల న్యాయం చేయండంటే దా-డి చేశారు. వైసీపీ నాయకుడు అక్బర్ బాష పొలాన్ని ఆక్రమించుకోవడానికి సహకరించడం దుర్మార్గం. పోలీసులు వైసీపీ నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ జగన్ కు బంధువు అని చెప్పి శాసనసభ్యుడిగా ఉన్న ఇంకో రెడ్డికి అనుచరుడు అని చెప్పి ఒక మైనార్టీకి చెందిన వ్యక్తిపై దా-డు-లు చేయడం హేయం. న్యాయం చేయాల్సిన పోలీసులు బాధితులను ఆ-త్మ-హ-త్య-లు చేసుకోవడానికి ప్రేరేపిస్తు్న్నారు. రాజమండ్రి బొమ్మూరుకు చెందిన సత్తార్ కుటుంబ సభ్యుల పై అ-ఘా-యి-త్యం జరిగితే వైసీపీ వారిపై ఇంతవరకు చర్యలు లేవు. తనకు న్యాయం చేయమని అడిగినందుకు పోలీసులు దా-డి చేయడం దుర్మార్గం. వైసీపీలో కొందరు అధికారాలు అనుభవిస్తూ మైనార్టీలను పట్టించుకోవడంలేదు. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష దిష్టిబొమ్మలా ఉండకుండా చర్యలు తీసుకోవాలి. మైనార్టీ సోదరులను ఆదుకుంటారని నమ్మి ఎక్కువ శాతం మైనార్టీలు వైసీపీకి ఓట్లు వేశారు. ఫలితం వికటించినట్లైంది. రాష్ట్రంలో ప్రతి మైనార్టీని సెకండ్ ఛాప్టర్ సిటిజన్‌లా చూస్తున్నారు. దాచేపల్లిలో పది మంది మైనార్టీ సోదరుల కుటుంబాలను ఊరు నుండి వెలివేశారు.
అలీషాను కొండారెడ్డి అనే ఎక్సైజ్ సీఐ చం-పే-స్తే ఆ కేసును ఏం చేశారో జగన్ చెప్పాలి. అక్కడి శాసనసభ్యుడు ఆ కుటుంబాన్ని ఒక్కసారి కూడా పరామర్శించిన పాపానపోలేదు. నంద్యాల విషయమేకాక రాష్ట్రంలో మైనార్టీలపై అనేక దా-డు-లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించి, ఒక్కటీ అమలు చేయలేదు. పొన్నూరు వైసీపీ నాయకుడు ఐటి శాఖ అధ్యక్షుడు ఎమ్మెల్యేపై పోస్టు పెట్టాడని కాకాణి సీఐ సురేష్ బాబు చి-త్ర-హిం-స-లు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెడతాం, నీ జీవితం నాశనమవుతుందని బెదిరించారు. వైసీపీ ప్రభుత్వం మంచి కార్యక్రమాలవైపు ఏనాడు అడుగులు వేయలేదు. నిన్న ఒక ముస్లిం సంఘానికి చెందిన నాయకుడిగా అక్బర్ బాషాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి, పరామర్శకు వెళ్తున్న షిబ్లీని అడ్డుకొని ఆయనపై మ-ర్డ-ర్ కేసు నమోదు చేయడం ఎంత నీచమాలిన చర్య. అన్యాయం చేసిన వాళ్లకు న్యాయం చేసే విధంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారో జగన్ తెలపాలి. జగన్ తాడేపల్లికే పరిమితమై మైనార్టీ సంక్షేమం మరిచారు. ఆయన కళ్లకు ఏదీ కానరావడంలేదు. ఇకపై మైనార్టీలపై దా-డు-లు, దుర్మార్గాలు చెల్లవని హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ముస్లిం మైనార్టీపై దా-డు-లు జరిగితే వైసీపీకి చరమగీతం పాడతామని టీడీపీ అధికార ప్రతినిధి మహమ్మద్ నసీర్ అహ్మద్ హెచ్చరించారు.