కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై మాజీమంత్రివర్యులు, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు గత కొద్ది కాలంగా ఉద్యమం చేస్తున్నారని, మైలవరం వీరప్పన్ గా పేరుగాంచిన వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మైనింగ్ మాఫియాను కూడా దేవినేని ఆధారాలతో సహా బయట పెట్టారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం...! మైలవరం వీరప్పన్ వసంత కృష్ణప్రసాద్ మైనింగ్ దోపిడీపై మాజీమంత్రి దేవినేని ఆధారాలతో సహా గతంలోనే ప్రభుత్వా నికి ఫిర్యాదుచేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందునే ఆయన తిరిగి కొద్ది రోజులక్రితం మీడియాతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లారు. మైలవరం వీరప్పన్ మీడియా ముందు అలవోకగా పచ్చి అబద్ధాలు చెప్పాడు. సర్వే నెంబర్ 143, సర్వేనెంబర్ 26/2 లో జరిగిన మైనింగ్ వ్యవహారం గురించి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి. సర్వే నంబర్ 143లో 216 ఎకరాలు, సర్వేనెంబర్ 26/2 లో అదనంగా ఉన్న మరో 200ఎకరాలకు పైబడిన భూమిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. సర్వే నెంబర్ 143 అనేది అసలు గతంలో రికార్డుల్లో లేనేలేదు, దాని సృష్టి జరిగింది రాజశేఖర్ రెడ్డి హాయాంలోనే. రాజశేఖర్ రెడ్డి హాయాంలో సర్వేనెంబర్ -143 ను రెవెన్యూ రికార్డుల్లో కేవలం పెన్నుతో రాసి సృష్టించారు. లేని సర్వేనెంబర్ ను రికార్డుల్లో సృష్టించి, దాని కింద 216.25 ఎకరాలను రికార్డుల్లో చేర్చారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి హాయాంలోనే కొండపల్లి ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ కు బీజాలు పడ్డాయి. జీ. సుదర్శన్ రావు అనేవ్యక్తి వై.ఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. సదరు వ్యక్తి రాజశేఖర్ రెడ్డి హయాంలో కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ కు 2006లో దరఖాస్తు కూడా చేసుకున్నాడు. అటువంటి వారికి సహకరించడం కోసం రెవెన్యూ రికార్డులు టాంపర్ చేసి, గతంలోలేని సర్వేనెంబర్ 143పెన్ను రాతలతో సృష్టించి, అక్రమ మైనింగ్ కు రాజశేఖర్ రెడ్డి తెరలేపాడు. ఇదేవిషయాన్ని గౌరవ హైకోర్టు చాలా స్పష్టంగా 27-12-2016న తనతీర్పులో పేర్కొంది. రిట్ పిటిషన్ నంబర్లు – 21806, 40939, 40997, 40998 లకు సంబంధించి, హైకోర్ట్ న్యాయమూర్తి పీ.నవీన్ రావుగారు 2016లో చాలా స్పష్టంగా తన తీర్పులోని జడ్జిమెంట్ లో పేజీనెం-6లో చెప్పారు. లేని సర్వే నెంబర్ -143ను ఇంక్ పెన్నుతో రాసి సృష్టించారని, దానిలో 216.25 ఎకరాలు చేర్చారని గౌరవ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. తండ్రి హయాంలో లేని సర్వేనెంబర్ సృష్టిస్తే, నేడు కొడుకు జగన్మోహన్ రెడ్డి అదే సర్వే నంబర్లోని 216 ఎకరాల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ సాగిస్తున్నాడు.
ఈ వాస్తవాన్ని కాదనగల దమ్ము మైలవరం వీరప్పన్ కుఉందా? పట్టాభి మీడియాముందుకొస్తే వైసీపీ బ్యాచ్ ప్యాంట్లు తడుస్తాయి. దీనిపై మైలవరం వీరప్పన్ ఏం సమాధానం చెబుతాడో చెప్పాలి. హైకోర్టు తీర్పుకి సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా పరిశీలిద్దాం. అదే తీర్పులోని పేజీనెం-19, పేరా 32లో డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ వారిని, వాస్తవాలు పరిశీలించి తగుచర్యలు తీసుకోవాలని, తక్షణమే సర్వేనెంబ ర్ 143లోని అక్రమమైనింగ్ పై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. హైకోర్టు తీర్పు ప్రకారం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫిబ్రవరి-3, 2017లో మైనింగ్ లైసెన్సులన్నీ మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రద్దు చేయడం జరిగింది. సర్వే నెంబర్ 26/2 విషయాన్నికూడా పరిశీలిస్తే, గతంలో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. సర్వే నంబర్ 26/2 కి సంబంధించిన లీజులన్నీ రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీ హాయాంలోనే జరిగింది. దానికి ఆధారం 12-12-1996లో సుప్రీంకోర్టు ఇచ్చినతీర్పే. అటవీ ప్రాంతంలో మైనింగ్ కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుప్రకారం మైనింగ్ నిబంధనలు పాటించలేదని, సర్వేనెంబర్ 26/2లోని మైనింగ్ లీజులను టీడీపీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. కొండపల్లి అటవీ ప్రాంతంలోని అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. జగన్ , వసంత కృష్ణప్రసాద్ ల ఆదేశాలతోనే అధికారులు భూములను మార్చేశారు. అటవీ భూములను రెవెన్యూభూములుగా మార్చింది 17-10-2019 న స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా ఉన్న మన్మోహన్ సింగ్ (ఐఏఎస్) అనే అధికారి.
ఆయన పేరుతో దానికి సంబంధించిన ఆదేశాలు వెలువడ్డాయి. ముమ్మాటికీ అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్పించింది జగన్మోహన్ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్ లే. సర్వే నెంబర్ 143, సర్వేనెంబర్ 26/2 లోని భూములను రెవెన్యూ భూములుగా మార్చింది వైసీపీ ప్రభుత్వంకాదా? జూన్ లో అధికారంలోకి వచ్చాక, అక్టోబర్ లోనే ఆర్డర్లు ఇచ్చారు. 17-10-2019న ఆర్డర్స్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైతే, తవ్వకాలు మొదలెట్టింది మైలవరం వీరప్పన్ వసంత కృష్ణప్రసాద్. ఆగస్ట్ 2020లో నాడున్న కృష్ణా జిల్లాకలెక్టర్ ఆ భూములు అటవీ భూములేనని తిరిగి తేల్చడం జరిగింది. దాన్ని కూడా కాదని పంచాయతీ ఎన్నికలకు ముందు, అక్కడ మైనింగ్ నిర్వహిస్తున్న వ్యక్తుల నుంచి దాదాపు రూ.5కోట్లు వసూలుచేసి, వసంత కృష్ణప్రసాద్ ఆనాడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణిపేరుతో, 28-12-2020న కలెక్టర్ ఆదేశాలపై స్టే తెచ్చింది నిజం కాదా? తిరిగి యథేచ్ఛగా అక్రమమైనింగ్ కొనసాగించింది నిజంకాదా? ఈవ్యవహారమంతా నడిపింది మైలవరం వీరప్పన్ కృష్ణప్రసాదే. లేని సర్వే నెంబర్లు సృష్టించి అక్రమ మైనింగ్ కు శ్రీకారం చుట్టింది దివంగత రాజశేఖర్ రెడ్డి. ఆవిధంగా చట్టవిరుద్దంగా ఇచ్చిన మైనింగ్ లీజులను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం రద్దుచేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో దేవినేని ఉమాని అన్యాయంగా అరెస్ట్ చేశారని ప్రజలంతా గ్రహించాలని కోరుతున్నాం. తనపై పెట్టిన తప్పుడు కేసులు, నిందారోపణలనుంచి ఉమా పులుకడిగిన ముత్యంలా బయటకువస్తాడు. ఆయన బయ టకు వచ్చాక, మైలవరం వీరప్పన్ మైనింగ్ దోపిడీ, అవినీతి, నేరచరిత్ర రాష్ట్రమంతా తెలిసేలా చేస్తాం.