జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పైన ఈ రోజు హైదరాబాద్ లోని సిబిఐ కోర్టులో ఈ రోజు విచారణ కొనసాగింది. ఈ పిటీషన్ ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు జరిగే విచారణలో జగన్ బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశం పై, సిబిఐ అధికారులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. జగన్ మోహన్ రెడ్డి సియంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, పదే పదే తనకు ఇచ్చిన బెయిల్ కండీషన్లను ఉల్లంఘిస్తున్నారని పలు సందర్భాల్లో సిబిఐ అధికారులు కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు సిబిఐ వేసే అఫిడవిట్ పై అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ రోజు సిబిఐ ఏమి కౌంటర్ వేస్తుందా అని అందరూ ఎదురు చూస్తుంటే, సిబిఐ తరుపున పబ్లిక్ ప్రాసిక్యుటర్ కు జ్వరం రావటంతో, ఆయన ఈ రోజు వాదనలకు హాజరు కాలేక పోయారు అంటూ, సిబిఐ కోర్టుకు తెలిపింది. జ్వరం రావటంతో, న్యాయవాది రాలేదు కాబట్టి, ఈ రోజు విచారణ జరగకుండానే వాయిదా పడింది. సిబిఐ కోర్టు తదుపరి విచారణను, ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసారు. 30వ తేదీన సిబిఐ అధికారులు కౌంటర్ దాఖలు చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. మరి అప్పటికైనా లాయర్ గారికి జ్వరం తగ్గుతుందో లేదా, మరో వాయిదా కోరతారో చూడాలి.
30వ తేది సిబిఐ కౌంటర్ వేస్తే, దాని పై మళ్ళీ జగన్ తరుపు లయార్లు కౌంటర్ వేసే అవకాసం ఉంది. దీంతో మళ్ళీ వాయిదా కోరతారు. అయితే ముగ్గురు వాదనలు తీసుకుని, సిబిఐ కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. మొత్తానికి మరో ఒకటి, రెండు వాయిదాల్లో సిబిఐ కోర్ట్ ఈ పిటీషన్ పై తీర్పు ఇచ్చే అవకాసం ఉంది. అయితే సిబిఐ కౌంటర్ విషయానికి వస్తే, ఈ కేసులో జగన్ ముద్దాయి కాబట్టి, ఆయనకు అనుకూలంగా సిబిఐ అఫిడవిట్ వేసే అవకాసం సహజంగా ఉండదు. మరి సిబిఐ కూడా బెయిల్ రద్దుకు ఒకే అంటుందా, లేదా కర్ర విరగకుండా, పాము చావకుండా, కౌంటర్ దాఖలు చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ రోజు సిబిఐ వైఖరి తేలిపోతుంది అనుకున్న సమయంలో, సిబిఐ లాయర్ కు జ్వరం రావటంతో, మళ్ళీ వాయిదా పడింది. అయితే ఈ అంశం పై రఘురామకృష్ణం రాజు స్పందిస్తూ, సిబిఐ లాయర్లు ఇద్దరికీ ఒకేసారి జ్వరం రావటం ఆలోచించాల్సిన అంశమే అంటూ ఆయన స్టైల్ లో పంచ్ వేసారు. మొత్తానికి సిబిఐ ఏమి కౌంటర్ వేస్తందో అనే టెన్షన్ ప్రజలకే కాదు, అటు జగన్ మోహన్ రెడ్డికి ఉంది. ఈ విషయం పై సిబిఐ ఇంకా వైటింగ్ లో పెట్టటంతో, సస్పెన్స్ కొనసాగుతుంది.