టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పై మరో కేసు నమోదు అయ్యింది. ఆయనను టార్గెట్ చేస్తూ వస్తున్న వైసీపీ ప్రభుత్వం, ముఖ్యంగా విజయసాయి రెడ్డి, గత నెల రోజులుగా హడావిడి చేస్తున్నారు. అయితే, మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతూ ఉండటంతో, ఉద్యోగులు అందరూ కలిసి ఈవో వెంకటేశ్వరరావు ముందు నిరసన తెలిపారు. దీంతో, మాన్సాస్ చైర్మన్ అంటే అశోక్ గజపతి రాజుతో పాటుగా, కరస్పాండెంట్‌తో సహా 10 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసారు. దీని పై పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు. మాన్సాస్ ఉద్యోగులు వేతనాలు అడిగితే అక్రమ కేసులా? అంటూ మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. సిబ్బందికి తక్షణమే జీతాలు చెల్లించాలి- ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేయాలని, ఉత్తరాంధ్రలో భూకబ్జాలకు పాల్పడుతున్న విజయసాయిరెడ్డి &కో పై కేసు నమోదు చేయాలి కళా వెంకట్రావ్ డిమాండ్ చేసారు. ఈ రోజు విలేఖరులతో మాట్లాడిన ఆయన, మాటల వివరాలు... "మాన్సాస్, సింహాచలం ట్రస్ట్ ల ఛైర్మన్ గా సంచయత నియామకాన్ని హైకోర్టు కొట్టివేయడంతో జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. క్రమం తప్పకుండా పనిచేస్తున్న మాన్సాస్ ఉద్యోగులు జీతాలు అడిగితే అక్రమ కేసులు బనాయిస్తూ జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కరోనా సమయంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జీతాలు తీసుకున్నారు. అలాంటిది పనిచేసే ఉద్యోగులు జీతాలు అందక సతమతమవుతున్నారు. 16 నెలలుగా సగం జీతాలు చెల్లిస్తున్నారు. జూన్ నెల వేతనం రూపాయి కూడా చెల్లించలేదు. సగటు ఉద్యోగి జీతం అడిగితే అక్రమ కేసులు నమోదు చేస్తారా? విధుల్లో నుంచి తప్పిస్తారా? జగన్ రెడ్డి పాలనలో మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు అందక భిక్షాటన చేయడం చూశాం. ఒకప్పుడు ఆర్థికంగా లోటులేని మాన్సాస్ సంస్థ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి జగన్ రెడ్డి దిగజార్చారు. సిబ్బంది జీతాల సమస్య ఇంతవరకు మాన్సాస్ లో ఎప్పుడూ లేదు. జగన్ రెడ్డి విధానాలతో నిత్యం సమస్యలు వెంటాడుతున్నాయి. "

"ఉద్యోగులను అక్రమంగా తొలగించారు. మాన్సాస్ ట్రస్ట్ సిబ్బందికి తక్షణమే జీతాలు చెల్లించాలి. ఉద్యోగులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. ఉత్తరాంధ్రలో భూకబ్జాలకు పాల్పడుతున్న విజయసాయిరెడ్డి &కో పై కేసు నమోదు చేయాలి. జగన్ రెడ్డి పాలన అంతా ముప్పై మూడు కబ్జాలు, అరవై ఆరు లూటీలుగా సాగుతోంది. రాష్ట్రాన్ని భూ మాఫియా కొండ చిలువలా చుట్టేసింది. మాన్సాస్ భూములు కొట్టేసేందుకు అర్ధరాత్రి హడావుడి జీవోలతో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా సంచయితను నియమించిన జగన్ రెడ్డికి.. హైకోర్టు తీర్పుతో కూడా కనువిప్పు కలగలేదు. సేవాభావంతో పనిచేస్తున్న ట్రస్ట్ పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలను, హిందువుల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సింహాచలం దేవస్థానానికి చెందిన సుమారు 13 వేల ఎకరాల భూములను ఏ-2 ఆధ్వర్యంలో కబ్జా చేసేందుకు కుట్ర పన్నారు. వారి కుట్రలకు న్యాయస్థానాల ద్వారా అడ్డుకట్టపడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా మాన్సాస్ ట్రస్ట్ పట్ల కక్షసాధింపు ధోరణిని విడనాడాలి.
"

వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ సూత్రాలకు, ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ అప్పుల కోసం రహస్య ఒప్పందాలు చేసుకుంటోందని టీడీపీ సీనియర్ నాయకులు, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రభుత్వ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....పరిపాలనలో భాగంగా ప్రభుత్వాలు అప్పులు చేయటం సహజమే కానీ, అవి రాజ్యాంగ మౌళిక సూత్యాలకు ఆర్బీఐ నిభందనలకు అనుగుణంగా ఉండాలి. కానీ వైసీపీ ప్రభుత్వం నిభంధనలకు విరుద్దంగా అప్పుల కోసం ఇస్టానుసారంగా ఒప్పందాలు చేసుకుంటోంది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని బ్యాంకులకు పూచీకత్తుగా చూపి ఎస్ర్కూ షరతులతో ఏపీ అభివృద్ది సంస్ధ ద్వారా రూ. 25 వేల కోట్లు అప్పు చేసింది. ఇందుకు సంబందించి ఒప్పందాలు చేసుకుని జీవోలు 81,90,91,92 కూడా ఇచ్చారు, ప్రభుత్వం ఏ అప్పు చేసినా ఏ గ్యారీంటీలు ఇచ్చినా అసెంబ్లీ బడ్జెట్ పుస్తకం పోందుపరచి అసెంబ్లీకి తెలపాలి. కానీ ఈ అప్పును అసెంబ్లీ పుస్తకంలో చూపకుండా అసెంబ్లీకి తెలపకుండా దాచారు. దీనిపై వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి నేను లేఖ రాసి 10 రోజులు గడిచినా సమాధానం ఇవ్వలేదు. కానీ గత 2 రోజులు క్రితం ఆర్దిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ ఓ టీవీ చానల్ ఇంటర్యూలో మాట్లాడుతూ 25 వేల కోట్ల అప్పుకు సంబందించి బ్యాంకులకు ఎలాంటి గ్యారెంటీలు ఇవ్వలేదని చెప్పారు. అందుకే దాని గురించి అసెంబ్లీ పుస్తకంలో రాయలేదని చెప్పారు, మరి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులతో ఏపీ డెవలప్ మెంట్ కార్పోరేషన్, ఎస్ర్యూ ఒప్పందాలు చేసుకుంది, దానిపై రాష్ర్ట ప్రభుత్వ అధికారులు, బ్యాంకు ప్రతినిధుల సంతకాలు కూడా చేశారు. మరి ఇదేంటి? ఆ ఒప్పందాల్లో ఈ వివరాలు బయటకు చెప్పొద్దని పొందుపరిచారు, అధికారిక ఒప్పందాల్లో రహస్యం ఎందుకు?

payyavula 22072021 2

ఇదేమైనా ఇద్దరు వ్యక్తుల మద్య జరిగే ఒప్పందం కాదు కదా? వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా అప్పు ఇచ్చిన వారికే జమచేస్తాం అని ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ కోర్టుకి ఏమో ఈ విషయం చెప్పకుండా దాచారు. రాజ్యాంగ మౌళిక సూత్య్రాలకు విరుద్దంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. భవిష్యత్లో వచ్చే ఆదాయం కూడా చూపి సెక్యూరిటి పెట్టి అప్పులు తెచ్చింది, దీనికి కేంద్రం అనుమతి ఉందా? ఆర్బీఐ కి తెలిపారా? సహజంగా ఒప్పందంపై ప్రభుత్వం వైపు నుంచి గవర్నర్ తరపున అధికారులు సంతకాలు చేస్తారు, ఈ ఒప్పం ఉల్లంఘలను జరిగితే కేసులు అయినా వేసుకోవచ్చని ఒప్పందం చేసుకున్నారు. సార్వభౌమాదికార రక్షణను కూడా వదులుకునేలా ఒప్పుకున్నారు. అప్పులు ఇస్తే చాలు ఏ ఒప్పందం అయినా చేసుకుంటాం, ఎక్కడైనా సంతకాలు పెడతాం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మ్యదం డిపోలను నుంచి వచ్చే ఆదాయం ఆదాయాన్ని పూచీకత్తుగా పెట్టారంటే మరి మీర ఎన్నికల్లో ఇచ్చిన మద్యపాన నిషేదం హామీ సంగతేంటి? మద్యంపై వచ్చే 25 ఏళ్లపాలు మద్యంపై వచ్చే ఆదాయాన్ని పూచీకత్తుగా చూపారంటే మద్యపాన నిషేదం చేసే ఉద్దేశం లేనట్టే కదా. ఈ ఒప్పందం అసెంబ్లీ బుక్కులో లేదు కాబట్టి ప్రభుత్వం మారితే ఇది చెల్లుతుందా? ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించటం సరికాదు. ఇప్పటికైనా ఈ ఒప్పందాల్లో రహస్యాలు ప్రజలకు బహిర్గతం చేయాలని పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జగన్ మోహన్ రెడ్డి పై, ఆర్ఎస్ఎస్ పత్రిక ‘ది ఆర్గనైజర్‌’ రాసిన కధనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా జగన్ విధానాలతో, ఈ దేశ విచ్చన్నం జరిగే ప్రమాదం ఉందీ అంటూ, ‘ది ఆర్గనైజర్‌’ రాసిన తీరు చుస్తే, జగన్ విషయంలో ఆర్ఎస్ఎస్ ఎంత ఆగ్రహంగా ఉందో అర్ధం అవుతుంది. బహుసా అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా, వైసీపీని ఈ మధ్య దూరం పెడుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఈ నెల 17న ఆర్ఎస్ఎస్ నడిపే ‘ది ఆర్గనైజర్‌’ లో, "జగన్ ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేస్తున్న తీరు, మత మార్పిడులు చేస్తున్న తీరుతో, భారతదేశం విచ్చిన్నం అయ్యే ప్రమాదం" అనే టైటిల్ తో ఒక ఆర్టికల్ రాసింది. అందులో జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం పాశ్చాత్య దేశాల్లో ఉన్న క్రిస్టియన్‌ మిషనరీ అజెండాని మన దేశంలో, అంటే ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నారని, ఈ అజెండాతో మన దేశం కూడా విచ్ఛిన్నమయ్యే అవకాసం లేకపోలేదు అంటూ హెచ్చరిస్తూ, రాసింది. కేవలం అధికారం కోసం, ప్రమాదకరమైన హిందూ వ్యతిరేక అజెండాని అమలు చేస్తున్నారని ఆరోపణలు చేసింది. ఇదే కధనంలో జగన్ తో పాటు, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బావ బ్రదర్ అనిల్ పేర్లు కూడా ప్రస్తావించింది. రాష్ట్రాన్ని క్రీస్టియన్ పరం చేయటానికి మత మార్పిడులు చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేసింది.

rss 22072021 2

అంతే కాకుండా, ఈ అజెండా బయట పెడుతూ, దేవాలయాల పై జరిగిన ఘటనలు ప్రస్తావించిన సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజునే అంతం చేసే కుట్ర జరిగిందని, ఆ కధనంలో వెల్లడించింది. చరిత్రలో వలస పాలకులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినట్టు, ఇప్పుడు కూడా అక్కడ విధ్వంస రచన సాగుతుంది అంటూ ఆరోపణలు చేసింది. ఎమర్జెన్సీ కాలంలో కూడా నాయకులను రఘురామకృష్ణంను కొట్టినట్టు కొట్టలేదని ఆరోపించింది. ఇప్పుడు జగన్ అజెండాను వ్యతిరేకిస్తే రేపు పదనిని, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను, హోంమంత్రిని కూడా ఇలాగే టార్గెట్ చేస్తారేమో అంటూ తన కధనంలో రాసింది. అలాగే జగన్ మోహన్ రెడ్డి అక్రమఆస్తుల కేసులు కూడా ప్రస్తవాన చేసింది. జగన్ అసలు ఏమి ఉద్యోగం చేసారని, ఏమి వ్యాపారం చేసారని, ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయని ఆరోపించింది. సిబిఐ రైడ్స్ జరిగిన సమయంలో, ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోయారని తన కధనంలో తెలిపింది. అయితే బీజేపీకి చెందిన ఆర్ఎస్ఎస్ లో ఇంత ఘాటుగా కధనం రావటం పై, రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది.

జగన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు అంటూ, అప్పట్లో విద్యార్ధి నాయకుల పై రేప్ కేసు పెట్టి, ఆ రిపోర్ట్ ని కోర్టులో చూపించి, న్యాయమూర్తి చీవాట్లతో దాన్ని సరిచేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ అయ్యింది. అదే విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి కూడా గురయ్యేలా చేసిన సంఘట ఇది. అయితే ఇప్పుడు కూడా విద్యార్ధి నాయకుల పెట్టిన కేసు చూస్తే ఇంచుమించు ఇలాగే చర్చించుకుంటున్నారు. సోమవారం నాడు, జాబ్ క్యాలండర్ కు వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలు సియం ఇంటి ముట్టడికి పిలుపు ఇచ్చాయి. అయితే ఈ నిరసనలో పాల్గున్న వారి పై, మారణాయుధాలు ఉపయోగించారు అంటూ కేసు పెట్టారు. అయితే అవేమీ లేవు కదా, అసలు ఎందుకు పెట్టారు అనుకుంటే, జెండాకి కర్ర ఉంది కాబట్టి, మారణాయుధాలు ఉపయోగించారు అని కేసు పెట్టారు అని తేలింది. అయితే దీని పై తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు స్పందించారు . ఆయన స్పందిస్తూ, "ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడిగిన నిరుద్యోగులపై కేసులు పెట్టారు.. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేసిన జగన్ రెడ్డిపై ఏం కేసులు పెట్టాలి.? నిరుద్యోగులు ప్రశ్నించడమే నేరమైతే మోసగించిన జగన్ రెడ్డిని ఏమనాలి.? 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10,143 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను అవమానించారు. నిరుద్యోగుల చేతిలో ఉన్న జెండాలు మారణాయుధాలుగా కనబడుతున్నాయా జగన్ రెడ్డి.? 10,143 పోస్టులతో ఉద్యోగాల విప్లవం ఎలా వస్తుందో సమాధానం చెప్పాలి. "

youth 22072021 2

"వైసీపీలోని రాజకీయ నిరుద్యోగులకు నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజకీయ ఉద్యోగాలను జగన్ రెడ్డి కల్పించారు. 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఇచ్చేంతవరకు ఉద్యమం ఆగదు. మీరు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులు చేసి, కేసులు పెడతారా..? మీరు పెట్టే అక్రమ కేసులకు వెనుకాడేది లేదు. రెట్టింపు ఉత్సాహంతో మరోమారు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి తీరుతాం. నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చూశాను అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో గగ్గోలు పెట్టి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారు. ఇచ్చిన వాగ్ధానాన్ని గుర్తు చేసిన నిరుద్యోగులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి హింసిస్తోంది. విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులపై ఈనెల 19న నమోదైన ఎఫ్ఐఆర్ లో ఉన్న ప్రతి మాట, ప్రతి సెక్షన్ ముమ్మాటికీ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి వచ్చినవే. తప్పుడు కేసులతో నిరుద్యోగ, విద్యార్థి శక్తిని అడ్డుకోలేరు. 2 లక్షల30 వేల పోస్టులతో నూతన జాబ్ క్యాలెండర్ వచ్చేవరకు ఉద్యమించి తీరుతాం. జగన్ రెడ్డి ఫాసిస్టు నిర్బంధ చర్యలతో నిరుద్యోగ, విద్యార్థి, యువజన నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు."

Advertisements

Latest Articles

Most Read