ఆంధ్రప్రదేశ్ లో మరో అంశం గత రెండు రోజులుగా హైలైట్ అవుతుంది. సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ లో పెట్టిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వాటిల్లో ఏమి లాజిక్ లేకపోయినా అందులో పెట్టిన అంశాలు చర్చానీయంసం అయితే అయ్యాయి. రఘురామకృష్ణం రాజు అరెస్ట్ కేసులో, సిఐడి అధికారులు, ఏబీఎన్, టీవీ5 ఛానల్స్ పైన కూడా రాజద్రోహం కేసులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు బడుతూ ఏబీఎన్, టీవీ5 ఛానల్స్ సుప్రీం కోర్టుకు వెళ్ళాయి. ఒక ఎంపీగా ప్రెస్ మీట్లు పెడితే అవి ప్రసారం చేయటం తప్పు ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించారు. తమ పై పెట్టిన కేసు కొట్టేయాలని సుప్రీం కోర్టు వరకు వెళ్ళాయి. దీని పై వాదనలు విన్న సుప్రీం కోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఇందులో కొన్ని వివరాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానవు. రఘురామకృష్ణం రాజుకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమని టీవీ5 చైర్మెన్, రూ.8.8 కోట్లు ఇచ్చారు అంటూ ఆ అఫిడవిట్ లో తెలిపారు. అసలు రఘురామకృష్ణం రాజుకి, టీవీ5 డబ్బులు ఇచ్చి మాట్లాడమని చెప్పటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అసలు ఏ ఆధారం ప్రకారం, ఈ ఆరోపణలు చేసారో తెలియదు.
ఇక దీంతో పాటు, చంద్రబాబు, లోకేష్, తరుచూ రఘురామరాజుతో వాట్స్ అప్ లో మాట్లాడుకుంటారని కూడా అఫిడవిట్ లో తెలిపారు. జగన్ బెయిల్ పిటీషన్ రద్దు అంశం పై కూడా చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపారు. ఇందులో కూడా ఏమి తప్పు ఉందో అర్ధం కావటం లేదు. అయితే ఈ ఆరోపణల పై, టీవీ యాజమాన్యం స్పందించింది. తాము రఘురామకృష్ణం రాజుకి డబ్బులు ఇచ్చాం అని చెప్పటం అబద్ధం అని చెప్పింది. ఏపి సిఐడి చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పింది. తమ సంస్థకు రఘురామరాజుకి మధ్య ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు జరగలేదని చెప్పింది. తాము ప్రజల కోసం పని చేస్తున్నామని, తెలిపింది. ఇదే సందర్భంలో తమ పై తప్పుడు ఆరోపణలు చేసి, తమ పై తప్పుడు అఫిడవిట్ వేసిన అధికారులు పై, పరువు నష్టం దావా వేస్తున్నట్టు తెలిపింది. సుప్రీం కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ అఫిడవిట్ పై, న్యాయ పరంగానే తేల్చుకుంటాం అని, సుప్రీం కోర్టులోనే ఈ విషయం పై న్యాయ పరంగా ఎదుర్కుంటాం అని తెలిపింది.