ప్రముఖ సీనియర్ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు, జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. కోటా శ్రీనివాస రావు, సినీ నటుడే కాదు, రాజకీయ నాయకుడు కూడా. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా కూడా చేసిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారు. తెలుగుదేశంతో పొత్తులో ఉన్నప్పుడు, విజయవాడ నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేసిన వ్యాఖ్యలు చర్చనీయంసం అయ్యాయి. నేను మొదటి నుంచి బీజేపీ పార్టీలో ఉన్నానని, ఇప్పటకీ బీజేపీలోనే ఉన్నానని, పార్టీలు మారే అలవాటు లేదని అన్నారు. ఇక రెండు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల పరిపాలన గురించి అడగగా, రెండు రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలు అని, ఇలా అనుకుంటే అసలు గొడవలే ఉండవు కదా అని అన్నారు. ఇంకా ఎందుకు మనకు గొడవలు అని అన్నారు. ఇక జగన్ పాలన గురించి ఒక్క మాటలో చెప్తానని చెప్తూ, నిద్ర పోయే వాళ్ళని లేపగలం కానీ, నిద్ర నటించే వాళ్ళని లేపలేం కదా అని కోటా అన్నారు. పరిపాలన అంతా కూడా నిద్ర నటిస్తున్నట్టే ఉందని అన్నారు. తెలుగు మీడియం ఎత్తేయటం గురించి చెప్తూ, జగన్ వాళ్ళ నాన్న డాక్టర్ చదివారని, ఆయన ఇంగ్లీష్ మీడియంలోనే చదవారా అని అన్నారు.
మేమందరం కూడా తెలుగు మీడియంలోనే చదివామని, మాకు ఇంగ్లీష్ రాదా అని ప్రశ్నించారు. ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా చదువుకున్నాం అని అన్నారు. లేని పోని సమస్యలతో, తమ పరిపాలన గురించి చర్చ లేకుండా, సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. మొన్నటి దాకా రఘురామరాజు చుట్టూ తిప్పారని, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కృష్ణా జలాల విషయం తెర పైకి తెచ్చారని అన్నారు. పరిపాలన లేకుండా ఇలా కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. తెలంగాణా వడ్డించిన విస్తరి అని, సాగుతాయని, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆకులు పోగేసి ఇస్తరి కుట్టుకోవాలని, మరి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం పరీక్షలు రద్దు చేస్తే, ఇక్కడ పరీక్షలు పెడతారని అన్నారు. అందరినీ మాస్కు పెట్టుకోమని, ఈయన పెట్టుకోరని అన్నారు. వెంకటేశ్వర స్వామి గుడి ముందు బైబుల్ చదవటం, చెప్పులు వేసుకుని గుడిలోకి వెళ్ళటం, ఏమిటివి అని ప్రశ్నించారు. మూడు రాజధానులు అనవసరం అని, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టటం తప్ప, ఎందుకు ఉపయోగం అని తన అభిప్రాయం చెప్పారు.