ఉద్యోగుల సమస్యలు, వారిని ప్రభుత్వం మోసం చేస్తున్న తీరు పై, శాసన మండలి సభ్యులు, అశోక్ బాబు స్పందించారు. ఆయన మాటల్లోనే, "నిన్న ఒక వార్త పత్రికల్లో ఉద్యోగులపై వచ్చిన వార్త పై అనేక ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు అనుమానం వ్యక్తం చేసారు. ఒక టిడిపి ఎమ్మెల్సీ గానే కాకుండా ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా ఈ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తుందని అనేక సార్లు చెప్పాను. జగన్ మోహన్ రెడ్డి ప్రజలనే కాదు ఉద్యోగస్తులను కుడా మోసం చేస్తున్నాడన్న విషయాన్ని ఇప్పటికైనా ఉద్యోగస్తులు తెలుసుకోవాలి. జగన్ రెడ్డి పాదయాత్రలో ఉద్యోగస్తులకు అనేక హామీలు ఇచ్చారు. 1. అధికారంలోకి వస్తానే సి.పి.ఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. 2. ఉద్యోగస్తులు పదవీ విరమణ పొందే నాటికి ఇల్లు కట్టి ఇస్తాను అనేటువంటి చాలా వాగ్దానాలు చేశాడు. 3. సకాలంలో డి.ఏ ఇస్తామని చెప్పారు. 4. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఇన్ని చేస్తామని చెప్పి మోసం చేయడం ఒక ఆర్దిక నేరస్తుడైన జగన్ కు మాత్రమే చెల్లింది. ఈ రోజు పి.ఆర్.సి విషయంలో గానీ, డి.ఆర్.సి. విషయంలో గానీ ఉద్యోగస్తులను నిలువునా ముంచాడు. ఫైనాన్సు డిపార్ట్ మెంట్ లో ఉన్న కొంతమంది అధికారులు ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఆంద్ర ప్రదేశ్ 27 % ఐ.ఆర్ ఇచ్చిందని, ఇది తెలంగాణ ఇవ్వలేదు కాబట్టి ఇబ్బంది లేదు అని చెబుతున్నారు. ఏపీ లో పి.ఆర్.సి, ఐ.ఆర్ లే కాదు ఉద్యోగస్తులకు సంబంధించి అనేక విషయాలతో ముడిపడి ఉన్నాయి. పి.ఆర్.సి ఇస్తేనే పెన్షన్ లో బెనిఫిట్ వస్తుంది. పి.ఆర్.సి ఇవ్వకపోతే ఐ.ఆర్ లో బెనిఫిట్ రాదు. ఈ సంగతులు ప్రజలకు తెలియదు. ఐ.ఆర్ ఇస్తున్నారులే బాగుంది అనుకుంటున్నారు. నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులు గానీ, మూడు లక్షల మంది పెన్షనర్లు, ఇతర ఉద్యోగస్తులు దాదాపు 66 శాతం జీతం వస్తే తప్ప గడవని పరిస్థితిలో ఉన్నారు. గ్రూప్ 1, ఆ పై స్థాయి ఉద్యోగస్తులు మినహా మిగతా ఉద్యోగులందరూ జీతాలు పెరగకపోతే చాలా ఇబ్బందులు పడుతారు. క-రో-న పరిస్థితులలో వీరి ఇబ్బందులు వర్ణనాతీతం. మొదటి కరోన వేవ్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ తప్ప మిగతా ఉద్యోగస్తులకు జీతాలు కట్ చేస్తే ఎవరూ వ్యతిరేకించలేదు. ఉద్యోగస్తులకు జీతాలు వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు చెబితే దానిపై రాష్ట్ర ప్రబుత్వం అధికార మదంతో సుప్రీం కోర్టుకు వెళ్ళారు. నాడు ఉద్యోగ సంఘాలను పిలిచి వడ్డీ చెల్లించడం ప్రబుత్వానికి కష్టం అని చెప్పి ఉంటే ఉద్యోగస్తులు ప్రబుత్వానికి సహకరించి ఉండేవారు. 2020 అక్టోబర్ లో పి.ఆర్.సి ఇస్తే ప్రభుత్వం ఈనాటికి దాన్ని అమలు చేయలేదు. సి.పి.ఎస్ ను వారంలో రద్దు చేస్తామని ఇంత వరకు పత్తాలేదు. 2021 ఏప్రిల్ లో ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో ప్రభుత్వం సి.పి.ఎస్ ను రద్దు చేయలేమని చెప్పింది.

పి.ఆర్.సి, సి.పి.ఎస్ విషయంలోనూ మాట తప్పింది. ఎన్నికల నాటికి మూడు డి.ఏ లు పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాలు చెల్లించాలని నాడు చాల ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రబుత్వం మారిన తర్వాత నవంబర్ 2020 లో ఒక జీవో విడుదల చేసి జనవరి 21 న ఒక డి.ఏ ఇచ్చే విధంగా 1.7.2018 కి సంబందించిన డిఏ జీతాలలో, పెన్షన్ లలో కలిపి రావాలి. కానీ ఇంత వరకు రాలేదు. కేంద్ర ప్రభుత్వం 1. 1.2020 నుండి డి.ఏ లను ఫ్రీజ్ చేసింది. ౩౦.06.2021 వరకు అంటే 18 నెలల డి.ఏ అరియర్స్ కుడా ఇవ్వలేమని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కుడా కేంద్ర ప్రభుత్వ విధానాన్నే అనుసరిస్తామని జీవో నంబెర్ 95 లో చెప్పింది. 1.07.2018 నుంచి ఇవ్వాల్సిన మూడు డి.ఏ లు ఎప్పుడిస్తారో తెలియదు. 01.01.2020 నుంచి 30.06.2021 వరకు వచ్చే డి.ఏ పరిస్థితి కూడా లేదు. అంటే మొత్తం డి.ఏలకు పంగనామాలు పెట్టె పరిస్థితి తీసుకొచ్చారు. డి.ఏ లు పెరగనప్పుడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం తో క్రింది స్థాయి ఉద్యోగస్తులు ఏ విధంగా బ్రతకాలి. రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు పెరిగితే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు పెరుగుతాయి. డి.ఏ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు పి.ఆర్.సి. విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఎందుకు పాటించడం లేదు? ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ప్రచారాలు. ప్రభుత్వం పేపర్ ప్రకటనలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. ఇదే ముఖ్యమంత్రి రెండు లక్షల ఎనబై వేల మంది గ్రామ వాలంటీర్లు ఉద్యోగస్తులు కాదు అని లేఖలు రాస్తాడు. ఇలాంటి బూటకపు అబద్దపు ప్రచారాలకు ప్రభుత్వం అలవాటు పడిపోయింది. నిన్న వచ్చిన వార్త చూసి ఉద్యోగస్తులు నష్టపోయామా? అని ఆశ్చర్యపోతున్నారు. ఉద్యొగస్థులు సమాజంలో బాగమేనని ముఖ్యమంత్రి గమనించాలి. ఉద్యోగస్తులు ప్రభుత్వ సొమ్మును అనాచితంగా తినడం లేదు. కష్టపడితేనే జీతాలు ఇస్తున్నారు తప్ప ఊరకనే ఇవ్వడం లేదు.

క-రో-నా ఉన్నా ప్రా-ణా-లు కోల్పోతూ డ్యూటీ చేస్తున్న ఉద్యోగస్తులకు ముఖ్యమంత్రి ఇచ్చే నజరానా ఏమిటి? తెలంగాణా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది ఉన్నా అక్కడ ౩౦ శాతం పి.ఆర్.సి. ఇచ్చారు. ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ ఉద్యోగులు, పోలీసులు, మునిసిపల్ ఉద్యోగులు, టీచర్లు, స్వీపర్లు, డ్రైవర్లు కష్టపడుతున్నారు. కష్టపడ్డ వాలంటీర్లకు కోట్లు ఖర్చు చేసి నజరానాలు ఇచ్చారు. మరి ఉద్యోగస్తులకు ఏమి నజరానాలు ఇస్తారు. ఇప్పుదు ఉద్యోగస్తులలో ఉన్న మౌనం తుఫాను ముందర వచ్చే మౌనమే. ఉద్యోగస్తులు నోరుమూసుకుని కుర్చోరని ముఖ్యమంత్రి గమనించాలి. వాళ్ళ గుండెల్లో ఆవేశం రగులుతుంది. కావాల్సిన వాళ్లను సలహాదారులను పెట్టుకుని వారికి అన్నీ ఇస్తున్నారు తప్ప చిరు ఉద్యోగులకు ఏమీ ఇచ్చే పరిస్థితి లేదు. జూనియర్ డాక్టర్లను సైతం మోసం చేసాడు. నవరత్నాలకు ముఖ్యమంత్రి ఇస్తున్న వాటికి ఉద్యోగస్తులు అడ్డు రారు. కానీ నవరత్నాలు సక్రమంగా అమలు కావాలంటే ఉద్యోగస్తులు పనిచేయాలని గుర్తుంచుకొండి. ఇంటింటికి రేషన్ సరుకులు ఇచ్చే వాళ్ళు జీతాలు పెంచాలంటే వారికి రూ . 16000 నుండి 21,000 కు పెంచారు. కానీ మెడికల్ వాళ్లకు ఎందుకు పెంచలేదు?. పి.ఆర్.సి.ని వెంటనే రిలీజ్ చేయాలని టి.డి.పి. ఎమ్మెల్సి గానే కాకుండా ఒక మాజీ ఉద్యోగ సంఘ నాయకుడిగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం సి.పి.ఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, గ్రాటువిటీ ఇచ్చాం. దీని వల్ల చనిపోయిన చాలా మందికి ఫ్యామిలి పెన్షన్ వస్తుంది. ఆర్.టి.సి ని ప్రబుత్వం లో చేర్చినందుకు వారు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. హెల్త్ కార్డుల విషయం చాలమంది ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని క్రమబద్దీకరించాలి. ఇల్లు కట్టిస్తామని చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాలి.

వి-వే-క కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. చాలా రోజులు తరువాత సిబిఐ విచారణ మళ్ళీ మొదలు పెట్టింది. గత ఆరు రోజులుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా వి-వే-క డ్రైవర్ అక్కడ పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ లను ప్రతి రోజు విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ పెద్ద తలకాయల వరకు సిబిఐ విచారణ రాలేదు. సునీత చాలా మంది ప్రముఖుల పై అనుమానం వ్యక్తం చేసినా, వారి దాకా ఇంకా విచారణ రాకపోవటం, విచారణ జరుగుతున్న తీరు పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఏకంగా సునీత కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ దీని పై విచారం వ్యక్తం చేసారు. సిబిఐ విచారణ నెమ్మదిగా సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. ఇది ఇలా ఉంటే, గత ఆరు రోజులు నుంచి విచారణ చేస్తున్న సిబిఐ విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక కారు చుట్టూ విచారణ జరుగుతుంది. ఒకరిని విచారణ చేస్తుంటే, మరొకరి ఆధారం దొరుకుతుంది. అక్కడ నుంచి మరొక లింక్ దొరుకుతుంది. మొత్తానికి ఈ కేసు ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు మధ్య నడుస్తుంది కానీ, అసలు వాళ్ళు ఎవరో ఇప్పటికీ సిబిఐ విచారణ చేయలేక పోయింది. ఇక తాజాగా ఒక కారు చుట్టూ జరుగుతున్న విచారణతో, కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

vivek 13062021 2

కడప, పులివెందులలో రెండు సిబిఐ బృందాలు విచారణ చేస్తున్నాయి. పులివెందుల విచారణలో, వైసీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కొత్తగా తెర పైకి వచ్చారు. నిన్న కిరణ్, సునీల్ అనే వారి నివాసానికి వెళ్లి వారిని ప్రశ్నించారు. హ-త్య- జరిగే 15 రోజులు ముందు, సునీల్ , వి-వే-క-ను కలిసినట్టు అధికారులు గుర్తించారు. వివేక హ-త్య- ముందు రోజు ఆ ప్రాంతంలో తిరిగిన కార్ల వివరాల పై సిబిఐ ఆరా తీసింది. ఆయన నివాసం చుట్టూ కొన్ని కార్లు తిరిగినట్టు గుర్తించారు. అయితే ఒక ఇన్నోవా కారు పై మాత్రం సిబిఐ అధికారులు ఎక్కవ ఫోకస్ పెట్టారు. దాని యజమాని రవి, డ్రైవర్ గోవర్ధన్ ను విచారణ చేస్తున్నారు. వీరి ద్వారా వచ్చిన సమాచారం రికార్డు చేసారు. కేసు విచారణలో ఈ కారు కీలకమైనదిగా గుర్తిస్తున్నారు. ఆ కారులో ఎవరు వచ్చారు అనే దాని పై సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే మరి కొన్ని వాహనాల పై కూడా అనుమానం ఉండటంతో, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ను పిలిచి ఆ వాహనాలకు సంబందించిన వివరాలు సేకరిస్తున్నారు.

వర్షాకాలంలో చెరువులన్నీ నీటితో నిండినట్టు, వైసీపీ పాలనలో నామినేటేడ్ పోస్టులన్నీ జగన్ సొంత సామాజికవర్గంతో నిండిపోయాయని, టిడిపి నేతలు, అనగాని సత్య ప్రసాద్, డోలా బాల వీరాంజనేయస్వామి వ్యాఖ్యానించారు. నిన్న వారు మాట్లాడుతూ, "ఎన్నికలకు ముందు దళితులను ఉద్దరిస్తామని చెప్పి జగన్ అధికారంలో వచ్చాక దళితుల హక్కుల్ని, అవకాశాలను కాలరాస్తున్నారు. దళితులకు పెద్దపీట వేస్తామని ప్రగల్బాలు పలికి దళితులకు న్యాయంగా దక్కాల్సిన పదవులు సైతం దక్కకుండా దళితుల్ని దగా చేస్తున్నారు. దళితులు సలహాదారులుగా పనికిరారని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన జగన్ తన సామాజికవర్గం వారికి మాత్రం ఏ అర్హత లేకున్నా దొడ్డిదారిన పదవులు కట్టబెడుతున్నారు.నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బిసిలను మోసం చేసి తన సొంత సామాజిక వర్గానికి 800 వందలకు పైగా పదవులు కట్టబెట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు రెగ్యులర్ పదవుల్లో న్యాయంగా ఆ వర్గాలకు దక్కాల్సిన పదోన్నతుల్లో సైతం మోసానికి తెర లేపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, కులాలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఏవి? వర్షాకాలంలో చెరువులన్నీ నీటితో నిండినట్టు, వైసీపీ పాలనలో నామినేటేడ్ పోస్టులన్నీ జగన్ సొంత సామాజికవర్గంతో నిండిపోయాయి..ఎంత సేపు కులాల రాజకీయమేనా? వైసిపి కి కులమే ఊపిరి గా మారింది. ఇలాంటి పెడదొరణి ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం .రాగద్వేషాలుపారదర్శకత అని ఊదరగొట్టే జగన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గం వారైతే అర్హతలు లేకున్న పదవులు ఉచితంగా ఇస్తాడనటానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. పంచాయతీ రాజ్ విభాగంలో ఇంజనీర్‌ ఇన్ చీప్ గా పనిచేస్తున్న సుబ్బా రెడ్డికి 2019 లో ఈఈ నుండి ఎస్‌.ఈ గా పదోన్నతి లభించింది. తరువాత పంచాయతీ రాజ్ శాఖలో చీఫ్ ఇంజనీర్ గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా కట్టబెట్టారు. ఇది చాలదన్నట్లు సీనియారిటీకి విరుద్ధంగా సుబ్బారెడ్డికి ఇంజనీర్-ఇన్-చీఫ్ పదవిని కూడ కట్టబెట్టి విజయవాడలోని పంచాయతీ రాజ్ విభాగంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో నియమించారు. ప్యానెల్ జాబితాలో సుబ్బారెడ్డి చాలా జూనియర్ అయినప్పటికీ సర్వీస్ కోడ్ నియమావళికి విరుద్ధంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ గా జీతం డ్రా చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ 31-08-2019 న జి.ఓ. ఎంఎస్.నం 136 విడుదల చేసింది.

ఇంజనీర్ ఇన్ చీప్ గా సుబ్బారెడ్డి మే 31, 2021 న పదవి విరమణ చేసినప్పటికీ ప్రభుత్వం ఎస్సీ, స్ట్రీట్, బిసి వర్గాలకు చెందిన చీఫ్ ఇంజనీర్ల హక్కులను కాలరాస్తూ సుబ్బారెడ్డి పదవీ కాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగిస్తూ మే 28, 2021 న జి.ఓ. ఎం.ఎస్.నం 32 ను జారీ చేసింది. అంతేకాకుండా, పదవి విరమణ పొందిన సుబ్బారెడ్డి జీతభత్యాలకు సంబంధిన వ్యవహారాన్ని ఫైనాన్స్ డిపార్ట్ మెంటు కు తెలపాల్సి ఉంటుంది. కానీ పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ ఎటువంటి నిబంధనలు పాటించకుండా హై స్పీడ్ తో ఆయనకు ఒక సంవత్సరం పాటు పదవి పొడిగించింది. సీనియారిటీ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బిసి ఇంజనీర్లను పక్కన్న పెట్టి రెడ్డి కులానికి ఎక్కడ లేని అధికారాలను కట్టబెడుతూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గం. చీఫ్ ఇంజనీర్ల ప్యానల్ లిస్ట్ సుబ్బారెడ్డికి అనుభవం కూడా లేదు. ఆయన సి.ఈ గా రెండేళ్లు, ఎస్.ఈ రెండేళ్లు మాత్రమే పనిచేసి అనుభవం ఉంది. ఇలాంటప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఆయన సేవలు అవసరమని ఎలా చెబుతుంది? రిటైర్డు అయిన వారికి అడ్డగోలుగా పదవి కట్టబెట్టాల్సిన అవసరం ఏంటి? జగన్ రెడ్డికి దళితులు, గిరిజనులు, బిసిలంటే ఎంత చిన్నచూపో పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ లో ఇచ్చిన ఈ అక్రమ పదోన్నతే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధుల వినియోగం లో ఇంజనీర్-ఇన్-చీప్ కీలక భాద్యతలు పోషిస్తారు. ఆ నిధులను అడ్డగోలుగా మళ్లించుకోవడానికి ఇలా అడ్డదారిన రెడ్డి సామాజిక వర్గానికి పదవులు కట్టబెడుతున్నారు. దళిత ఇంజనీర్లకు అన్యాయం చేయడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక భూమిక పోషించారు. వైసీపీ పాలనలో దళితులు అడగడుగునా అన్యాయానికి గురవుతున్నారు, ఇకనైనా దళితులు జగన్ రెడ్డి మోసాన్ని గ్రహించాలి.

రాష్ట్రంలో రెండో దశ క-రో-నా విలయతాండవం చేస్తూ, ప్రజల ప్రాణాలు హరిస్తుంటే, ప్రజలు వారి చా-వు వారు ఛస్తారులే నాకేంపట్టిందన్నట్లుగా అభినవ నీరోచక్రవర్తి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు కూనరవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! క-రో-నా-ను నిర్లక్ష్యం చేసి, దాన్ని చాలా తేలిగ్గా చూసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అభివృద్ధిలో వెనుకబడిన అనేక రాష్ట్రాలు, క-రో-నా కారణంగా చితికిపోయిన పేదల కుటుంబాలకు సాయం అందించడానికి ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి హోల్ సేల్ అవినీతికి తెరలేపాడు. ఇసుక, మద్యం, మట్టి, మైనింగ్ వంటివాటిని కూడా తన అవినీతికి ఉపయోగించుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయితే, ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తి చూపారని, కానీఇప్పుడు ప్రతిఒక్కరికీ వాస్తవాలు అర్థమవుతున్నాయి. క-రో-నా-తో రాష్ట్రంలో ఇప్పటికే 11,700మంది వరకు చ-ని-పో-యా-రు. ఆ లెక్కలన్నీ ప్రభుత్వం చెప్పిన కాకిలెక్కలు, 14-05-2021న శ్రీకాకుళం జిల్లాలో 6గురు చనిపోయినట్టు, ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాస్తవంలో, అదే రోజున 32 మంది చనిపోయారు. వారిపేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. అదే జిల్లాలో వేర్వేరు రోజుల్లో కూడా మరణాల్లో తప్పుడు సమాచారమిచ్చారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు చనిపోయారు. కానీ మ-ర-ణా-ల-ను ప్రభుత్వం తగ్గించి చూపుతోంది. 17లక్షల 80వేల మంది వరకు కోవిడ్ బారిన పడ్డారని చెబుతున్నారని, కానీ వాస్తవంలో ఆసంఖ్య కంటే పదింతలు ఎక్కువగా బాధితలు ఉంటారు. పేదలకు క-రో-నా వస్తే సరైన మందులు, వైద్యం కూడా అందడంలేదు. వ్యాక్సిన్లు కూడా సమర్థంగా అందించలేని దుస్థితిలో ఈప్రభుత్వం ఉంది. క-రో-నా వేళ అనే కరాష్ట్రాలు పేదలకు ఉదారంగా సాయం చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం దాష్టీకంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. తొలిదశ క-రో-నా వచ్చినప్పుడే పారాసెట్మాల్, బ్లీచింగ్ పౌడర్ అంటూ ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడాడు. దాని ప్రభావమే ప్రజలు ఎక్కువగా క-రో-నా బారినపడటం. తెలంగాణ సీఎం కేసీఆర్ 70ఏళ్లవయస్సులో కూడా ఆసుపత్రులు సందర్శించి, ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. మమతాబెనర్జీ, స్టాలిన్ వంటివారు ప్రజలముందుకు వెళ్లి, వారికి ధైర్యం చెబుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి అక్కడ ఎన్నికలైన మరుక్షణమే పేదల కోసం ప్రత్యేకంగా రూ.20వేల కోట్లతో ప్యాకేజీ ప్రకటించారు. 16రకాల నిత్యావసరాలను ప్రతికుటుంబానికి అందించడానికి సిద్ధమయ్యారు.

ఆపత్కాల సమయంలో రాష్ట్రంలోని కోటి కుటుంబాలు ఉపాధికోల్పోయి అలమటిస్తుంటే, వారికి సాయం చేయడానికి కూడా ప్రభుత్వానికి మనస్సు రావడం లేదు. ధరలు పెంచడం, పన్నుల రూపంలో ఆఖరికి ప్రజలపై కూడా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభు త్వం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని తామే ఇస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నీటిపన్ను, జుట్టుపన్ను, ఆస్తిపన్ను, చెత్తపన్నుతో జగన్మోహన్ రెడ్డి అభినవ తుగ్లక్ గా కూడా మారాడు.రాష్ట్ర ఖజానా నుంచి రూపాయికూడా ఈప్రభుత్వం పేదలకు అందించలేదు. చట్టా న్నినమ్మను, రాజ్యాంగాన్ని గౌరవించను, వ్యవస్థలను లెక్క చేయను అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. పంజాబ్ , ఒడిశా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, హర్యానా, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు సహా, అనేకరాష్ట్రాలు ఆటోడ్రైవర్లకు, ఉపాధికోల్పోయిన ఇతరవర్గాలకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఢిల్లీప్రభుత్వం దాదాపు 70లక్షల కుటుంబాలకుఉచితంగా సరుకులు అందిస్తోంది. ఏపీలో మాత్రం ఎక్కడా ఉచితంగా సరుకులుగానీ, భోజనం కానీ అందించిందిలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్ - డీజిల్ ధరలపై అసెంబ్లీలో గొంతుచించుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడెందుకు రూ.100 దాటినా నోరెత్తడంలేదు. ఈ ముఖ్యమంత్రికి నిజంగా మనస్సుంటే, మానవత్వముంటే, తక్షణమే పేదకుటుంబాల కు ఆర్థికప్యాకేజీప్రకటించాలి. పెట్రోల్ – డీజిల్ ధరలతోపాటు, పెంచినపన్నులు తీసేయాలి. పథకాలపేరుతో ప్రజల్ని దోచుకుంటున్న ముఖ్య మంత్రి, కోవిడ్ కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు రూ.10 లక్షల సాయం చేయలేరా? ప్రజలంతా ఇప్పటికైనా చైతన్యవంతులవ్వాలి. తమనుంచి వసూలు చేస్తున్న సొమ్మంతా ఏం చేస్తున్నారని జనమంతా అధికార పార్టీ వారిని నిలదీయాలి. కో-వి-డ్ కారణంగా అనాథలైన కుటుంబాలను ఆదుకోమని కోరితే ప్రతిపక్షనేతలపై కేసులు పెడతారా? ఎన్ని అక్రమ కేసులుపెట్టినా టీడీపీ నేతలు ప్రజలపక్షాన మాట్లాడుతూనే ఉంటారని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఉపాధికోల్పోయిన కుటుంబాలకు తక్షణమే రూ.10వేల ఆర్థికసాయం ప్రభుత్వం అందించాలి.

Advertisements

Latest Articles

Most Read