చిత్తూరు జిల్లాలో ఉన్న దళిత మేజిస్ట్రేట్‌ రామకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. ఆయన అక్కడ ఉన్న మంత్రి పెద్దిరెడ్డి పై, అలాగే జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన విధానం పై, గత కొన్ని రోజులుగా పోరాడుతున్నారు. అయితే ఆయన టీవీ ఛానల్ లో, జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ, ఆయన్ను అరెస్ట్ చేసారు. అయితే ఆయన గత 42 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఆయనకు ఇప్పటికీ బెయిల్ రాలేదు. అయితే ఇప్పుడు ఆయనకు ఇబ్బంది వచ్చింది అంటూ, జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీ కృష్ణ,హైకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసారు. మా తండ్రి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, ఆయనకు ఇప్పుడు ప్రా-ణ-హా-ని ఉంది అంటూ లేఖలో తెలిపారు. తమ తండ్రి చిత్తూరు జిల్లా జైలులో ఉన్నారని, ప్రస్తుతం ఆయన అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారని, లేఖలో తెలిపారు. అయితే ఇప్పుడు తన తండ్రి ఉన్న బ్యారెక్ లోకి ఈ రోజు ఒక అపరచితుడుని పంపించారని, ఆ వ్యక్తి వింత వింతగా ప్రవర్తిస్తూ, మా నాన్నను బె-ది-రి-స్తు-న్నా-ర-ని లేఖలో తెలిపారు. జగన్ మోహన్ రెడ్డిని, పెద్దిరెడ్డిని విమర్శించే స్థాయి నీకు ఉందా, నిన్ను చం-పే-స్తాం- అంటూ బెదిరింపులకు దిగుతున్నారని, ఆ అపరిచిత వ్యక్తి నుంచి తమ తండ్రిని కాపాడాలని, వేరే బ్యారెక్ లోకి తన తండ్రిని పంపించాలి అంటూ, చీఫ్ జస్టిస్ కి లేఖ రాసారు.

ramakrishna 29052021 21

చిత్తూరు జిల్లా జైలులో ఉన్న దళిత మేజిస్ట్రేట్‌ రామకృష్ణ జీవితం ప్ర-మా-దం-లో ఉందని చిత్తూరు జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్‌కు సందేశం పంపిన తెలుగు దేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. "మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజిస్ట్రేట్ రామకృష్ణపై దా--డి చేయించాడని రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ తెలుసు. మెజిస్ట్రేట్ రామకృష్ణ కుమారుడు వంశీ చిత్తూరు జైలులో ఉన్న తన తండ్రి సెల్ సహచరుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని, మంత్రికి వ్యతిరేకంగా తగాదా పడితే ప్రాణాలు పోతాయని తన తండ్రిని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో చిత్తూరు జైలులో జరిగిన హ-త్య-ల అనుభవాలను దృష్టింలో ఉంచుకని జైలులో ఉన్న తన తండ్రి ప్రా-ణా-ల-ను కాపాడాలని మెజిస్ట్రేట్ కుమారుడు వంశీ బయపడుతున్నాడు. అందువల్ల, జైలు పరిస్థితిని పరిశీలించి, మెజిస్ట్రేట్ రామకృష్ణ ప్రా-ణా-లు రక్షించాలని అభ్యర్థిస్తున్నాను." అని వర్ల రామయ్య ఎస్పీకి లేఖలో తెలిపారు. మరి జడ్జి రామకృష్ణ గురించి ప్రభుత్వం ఏమి చెప్తుందో చూడాలి.

కృష్ణపట్నం ఆ-నం-ద-య్య మళ్ళీ అదృశ్యం అయ్యారు. పది రోజుల తరువాత, తన సొంత ఇంటికి వచ్చిన ఆ-నం-ద-య్య, కొన్ని గంటల్లోనే మళ్ళీ అదృశ్యం అయ్యారు. ఆ-నం-ద-య్య నిన్న తన స్వగ్రామానికి వచ్చారు. అయితే ఆయన ఎక్కడ నుంచి వచ్చారో, ఎవరిని నుంచి తప్పించుకుని వచ్చారో తెలియదు. విషయం తెలుసుకుని పోలీసులు గ్రామానికి వచ్చారు. అయితే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకోవటంతో, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మీరు బయట ఉండటం మంచిది కాదని, సురక్షిత ప్రాంతానికి తీసుకుని వెళ్తామని పోలీసులు చెప్పారు. అయితే దానికి ఆయన భార్య సమాధానం చెప్తూ, మా అయన మం-దు తాయారు చేయరని, ఇంట్లోనే ఉంటారని చెప్పారు. అక్కడ ప్రజలు కూడా ఆయన్ను తీసుకుని వెళ్ళటానికి వీలు లేదని, మేము కాపాడుకుంటామని చెప్పారు. అయితే పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో, తాను ఇక ఎక్కడికీ వెళ్లనని, ప్రభుత్వం అనుమతి రాగానే మం-దు ఇస్తానని చెప్పారు. దీంతో అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు తెల్లవారు జామున పోలీసులు వచ్చి, ఆయన్ను తీసుకుని, రహస్య ప్రాంతానికి తరలించారు. ఆయనను పోలీసులు ఎక్కడికి తీసుకుని వెళ్ళారో కూడా చెప్పలేదు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు.

anandaiah 29052021 2

అసలు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదని, ఆ ఇచ్చే భద్రత ఏదో ఇంటి దగ్గరే ఇవ్వొచ్చు కదా అని, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఆయన్ను ఎక్కడకు తీసుకుని వెళ్ళారో చెప్పాలని, తమ వద్దకు తీసుకుని రావాలని డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క ఈ అంశం పై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఆయన్ను ఎందుకు వేదిస్తుందో అర్ధం కావటం లేదని అన్నారు. ఆయన మందు పై ఎందుకు వాస్తవాలు దాచి పెడుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. ఎవరి కోసం మం-దు పంపిణీ ఆపెసారో చెప్పాలని, అసలు ఈ విషయంలో ఎందుకు వైసీపీ నేతలు జోక్యం చేసుకుంటున్నారో చెప్పాలని అన్నారు. అసలు చెవిరెడ్డికి, ఈ ఆయుర్వేద మం-దు-కి ఏమి సంబంధం ఉందో చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ మం-దు తో వైసీపీ నేతలు వ్యాపారం చేసుకుంటున్నారని అన్నారు. ప్రజలకు చెందాల్సిన ఈ మందుని, వైసిపీ నేతలు తమ స్వార్ధానికి వాడుకుంటున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్విడ్ ప్రోకో అనే పదం చాలా సుపరిచితం. సహజంగా ఇలాంటి పదాలు, న్యాయ వృత్తిలో ఉన్న వారికి, అలాగే రాజకీయాల్లో ఉన్న వారికి బాగా తెలుస్తాయి. అయితే ఇలనాటి క్లిష్టమైన పదం, దాని అర్ధం, అది ఎందుకు వాడతారు అనేది, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. దీనికి ప్రధాన కారణం, జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులు, బెయిల్, జైలు, కోర్టు వాయిదాలు, ఇలా అనేకం చూసిన ప్రజలకు, ఆ పదం ఏమిటో అర్ధమై పోయింది. క్విడ్ ప్రోకో అంటే, నీకు ఇది నాకు అది. అది కూడా ప్రభుత్వ సొమ్ముతో లబ్ది పొందటం. ఉదాహరణకు జగన్ మోహన్ రెడ్డి పై మోపిన ఆరోపణల్లో ఒకటి ఏమిటి అంటే, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, జగన్ మోహన్ రెడ్డి ఆ పదవిని అడ్డు పెట్టుకుని, ప్రభుత్వం నుంచి కొంత మంది పారిశ్రామిక వేత్తలకు మేలు చేసారని, భూములు ఇచ్చారని, దానికి ప్రతి ఫలంగా, జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లో ఆ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలని. పది రూపయల షేర్ లు, మూడు నాలుగు వందలకి కొనటం, ఇలా జరిగాయి. క్విడ్ ప్రోకో అంటే ఇదే. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చిన తరువాత, ఇలాంటి వాటి పై, ఇప్పటి వరకు పెద్దగా ఆధారాలు బయట పడలేదు. అయితే ఇప్పుడు మూడు రోజులు క్రిందట జరిగిన వ్యవహారంతో, మళ్ళీ క్విడ్ ప్రోకో బయటకు వచ్చింది.

jagan 280520021 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున, వాదించినందుకు, ఇద్దరు న్యాయవాదులుకు, రూ.1.34 కోట్లు చెల్లించారు. ఒక లాయర్ కోసం, అంత డబ్బు చెల్లించటంతో, అందరూ అవాక్కయ్యారు. అసలు ఈ విషయం ఏమిటో తేల్చే పని చేసింది సోషల్ మీడియాతో పాటుగా తెలుగుదేశం పార్టీ. అమరావతికి సంబందించిన కేసులో సుప్రీం కోర్ట్ లో వాదనలు వినిపించినమ్డుకు, నిరంజన్ రెడ్డి అనే న్యాయవాదికి 96 లక్షలు, అలాగే మోహన్ రెడ్డి అనే న్యాయవాదికి 38.50 లక్షలు చెల్లించారు. ఇంత పెద్ద మొత్తం చెల్లించటంతో, అసలు ఈ న్యాయవాదులు ఎవరు అని ఆరా తీయగా, వీళ్ళు జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, జగన్ తరుపున వాదిస్తున్న న్యాయవాదులుగా తేలింది. ఇప్పుడు ఈ అంశాన్ని క్విడ్ ప్రోకో అని టిడిపి ఆరోపిస్తుంది. తన వ్యక్తిగత కేసులు వాదించే లాయర్లకి, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని, ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము ఇస్తున్నారని, ఇది క్విడ్ ప్రోకో కిందకు వస్తుందని, జగన్ బెయిల్ రద్దు పిటీషన్ లో, ఈ అంశం కూడా ఉపయోగ పడుతుంది అంటూ, టిడిపి ఆరోపిస్తుంది. అయితే, ఇప్పటి వరకు ఈ ఆరోపణలకు ప్రభుత్వం, ఎలాంటి సమాధానం చెప్పలేదు.

2019 ఎన్నికలకు ముందు, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అప్పట్లో రాష్ట్ర విభజన ద్వారా మనకు అనేక హామీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మనకు చట్టం కూడా ఒకటి చేసింది. ఆ హామీల అమలు కోసమే, అప్పట్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీతో కలిసింది. అక్కడ కేంద్ర మంత్రులుగా టిడిపి ఉంటే, ఇక్కడ చంద్రబాబు క్యాబినెట్ లో కూడా బీజేపీ ఉంది. అయితే మూడేళ్ళ పాటు చంద్రబాబు ఓపిక పట్టారు. అయినా కేంద్రం నుంచి విభజన హామీల్లో అన్యాయం జరిగింది. పోలవరం నుంచి అమరావతి వరకు, రైల్వే జోన్ నుంచి, వెనుకబడిన జిల్లాలకు నిధులు వరకు, ఇలా ప్రతి దాంట్లో అన్యాయమే జరిగింది. కేంద్రం మోసం చేస్తుందని గ్రహించిన చంద్రబాబు, ప్రజల అభీష్టం మేరకు, కేంద్రం నుంచే కాక, ఎన్డీఏ నుంచి కూడా వైదొలిగారు. ఇది చివరకు రాజకీయ పోరాటంగా కూడా మారటంతో, చంద్రబాబు నరేంద్ర మోడీ పై రాజకీయంగా కూడా ఎదుర్కున్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసారు. అయితే చివరకు రాజకీయంగా ఓడిపోయారు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ నరేంద్ర మోడీకి భయపడలేదు. రాష్ట్రం కోసం మోడీనే ఎదిరించారు. అయితే ఇప్పుడు అధికారం మారింది. మెడలు వంచేస్తాను అని చెప్పిన వ్యక్తి మాట్లాడటం లేదు. చంద్రబాబు కూడా పరిస్థితికి తగ్గట్టు, కేంద్రాన్ని విభేదించటం, సమర్ధించటం చేస్తున్నారు.

cbn 29052021 2

దేశానికి మంచి అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు, చెడు అనుకుంటే వ్యతిరేకేస్తున్నారు. ఇదే విషయం నిన్న జరిగిన మహానాడులో కూడా టిడిపి చర్చించింది. దేశానికి, ప్రజలకు మంచి అనుకున్న అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, చెడు చేస్తుంది అనుకుంటే వ్యతిరేకించాలని తీర్మానించారు. ఇది పట్టుకుని బులుగు మీడియా, చంద్రబాబు, బీజేపీతో కలుస్తున్నారు అంటూ ప్రచారం చేసింది. అంతే కాదు, బీజేపీ నేత, సునీల్ దియోధర్ కూడా, చంద్రబాబు మాతో కలుస్తాం అంటున్నారు, మేము కలవం అంటూ ట్వీట్ చేసారు. అక్కడ చంద్రబాబు చెప్పింది, దేశానికి మంచి అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం, చెడు అనుకుంటే వ్యతిరేకిస్తాం అని. ఏ పార్టీ అయినా అదే కదా పార్లమెంట్ లో చేసేది ? ఇందులో తప్పు ఏముంది ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దేశం మొత్తం వ్యతిరేకించిన రైతు చట్టాలకు మద్దతు ఇవ్వలేదా ? వారికి ఆ అంశం నచ్చింది కాబట్టి, మద్దతు ఇచ్చారు. అంటే వారు బీజేపీతో కలుస్తారా ? అలాగే మొన్న కాంగ్రెస్ కూడా, ఒక అంశంలో బీజేపీ నిర్ణయాన్ని దేశం కోసం సమర్ధించింది. వాస్తవం ఇలా ఉంటే, బులుగు మీడియా ప్రచారం ఇది అంటూ, టిడిపి వాస్తవంగా అక్కడ ఏమి జరిగిందో చెప్తూ ఒక వీడియో విడుదల చేసింది. మరి ఈ బులుగు బ్యాచ్ ఇప్పుడైనా ఆపుతారో లేదో.

Advertisements

Latest Articles

Most Read