ఒక పక్క భారత దేశంలో క-రో-నా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకానొక సమయంలో పరిస్థితి చేయి దాటిపోయిందా అనేలా అయ్యింది. అందరూ ప్రధాని నరేంద్ర మోడి పై విమర్శలు గుప్పించారు. ప్రపంచ దేశాల్లో కూడా మోడీ రేటింగ్ తగ్గిపోయింది. సరైన వైద్యం, ఆక్సిజన్ లాంటి కనీస అవసరాలు కూడా తీర్చలేకపోయింది ఈ దేశం. ఇక వ్యాక్సిన్ ల విషయంలో అయితే, పూర్తిగా ఫెయిల్ అయ్యింది. అన్నిటికంటే ప్రజలకు కోపం తెప్పించిన విషయం ఏమిటి అంటే, మన దేశంలో, మన ప్రజలకు వ్యాక్సిన్ లు వేయకుండా, ఇతర దేశాలకు మనం తయారు చేసిన వ్యాక్సిన్ అమ్ముకోవటం. ఇక్కడ మనకు ఇబ్బంది అయితే, అది చూడకుండా, ఇక్కడ ప్రజలను రిస్క్ లోకి నెట్టి, ఇతర దేశాలకు వ్యాక్సిన్ అమ్ముకోవటం ప్రజలకు ఆగహ్రం తెప్పించింది. ఇక మన రాష్ట్రంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. పక్క రాష్ట్రాలతో పోల్చితే అధ్వాన పరిస్థితి ఉంది. కేసులు కూడా విపరీతంగా ఉన్నాయి. తెలంగాణా, తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పోల్చితే, మన రాష్ట్రం కో-వి-డ్ ని ఎదుర్కోవటంలో తీవ్ర ఇబ్బందులు పడింది. అటు దేశంలో , ఇటు రాష్ట్రంలో ప్రజలు వైద్యం కోసం పరిగెత్తాల్సిన పరిస్థితి. బెడ్ లు దొరకలేదు, ఆక్సిజన్ దొరకలేదు, సిబ్బంది కొరత, చివరకు మందులు కూడా బ్లాక్ లో అమ్మే పరిస్థితి.
ఈ పరిస్థితిలు ప్రభుత్వాల మీద నమ్మకం కంటే, ఒక వ్యక్తి మీద ఈ దేశ ప్రజలు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అతనికి తమ సమస్య తెలిస్తే చాలు, తమ సమస్య పరిష్కారం అయిపోయినట్టే అనుకున్నారు. ఆ వ్యక్తి పేరే సోనూ సూద్. ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తుంటే సోనూ సూద్ మాత్రం, సహయం చేయటానికి ముందుకు వచ్చారు. ప్రజలు కూడా తమ సమస్యలు ఆయనకే చెప్పుకున్నారు. ఇదే కోవలో, నెల్లూరు జిల్లాలో, కర్నూల్ జిల్లాలో, తమ ఫౌండేషన్ తరుపున ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూ సూద్ ముందుకు వచ్చారు. దీంతో ఆ జిల్లా కలెక్టర్లు ఆయన్ను అభినంధించారు. అలాగే ఆర్మీకి చెందిన ఒక వ్యక్తి, తమ అవసరాలు కోసం బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు కావాలని సోనూ సూద్ కు లేఖ రాసారు. చివరకు ఆర్మీ వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని కాకుండా సోనూ సూద్ వైపు చూసారు. నెల్లూరు, కర్నూల్ జిల్లాలో జగన్ ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్ లు పెట్టలేదా ? సోనూ సూద్ చేస్తున్నారు అంటే, అది ప్రభుత్వానికి అవమానం కాదా ? పైగా ఇది పెద్ద ఖర్చుతో కూడినది కూడా. ఇక ఆర్మీకి చెందిన వారు కూడా కేంద్రాన్ని కాకుండా సోనూ సూద్ ని చూస్తున్నారు అంటే, ఇది కేంద్రానికి అవమానం కాదా ? ఒక్క సోనూ సూద్ ఇంత చేస్తుంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎంత చేయవచ్చు ?