ఎంపీ రఘురామకృష్ణం రాజు కేసు విషయంలో, సిఐడితో పాటు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ పై, వాళ్ళు టైంకి రిపోర్ట్ ఇవ్వకపోవటంపై, తమ ఆదేశాలు పాటించకపోవటంపై, హైకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలు ప్రరంభించిన విషయం తెలిసిందే. అయితే నిన్న సుప్రీం కోర్టులో, తమ పై ఈ కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసారని, హైకోర్టు కేసు కొట్టేయాలని కోరగా, ఆర్డర్ కాపీ ఉంటేనే మేము దాన్ని పరిశీలిస్తామని సుప్రీం కోర్టు చెప్పింది. అయితే ఈ రోజు హైకోర్టు ఆర్డర్ కాపీని అప్లోడ్ చేసింది. ఇందులో కొన్ని సంచలన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్, సుధాకర్ రెడ్డి, కోర్టు పై ప్రవర్తించిన తీరు పై హైకోర్ట్ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. తమ ముందు వాదనలు వినిపిస్తూ, అడిషనల్ అడ్వొకేట్ జనరల్, సుధాకర్ రెడ్డి, గట్టిగా గట్టిగా కోర్టు పై అరిచారని, ఆర్డర్ ఫేక్, ఇల్లీగల్ అంటూ వ్యాఖ్యలు చేసారని, ఆయనకు అభ్యంతరం ఉంటే, అపీల్ చేసుకోవాలని కోర్ట్ వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలు ఎందుకు పాటించలేదు అని అడిగితే, అదే బిగ్గర గొంతుతో, మీరు ఇచ్చిన ఆర్డర్ కాపి రాత్రి 11 గంటలకు వచ్చింది, అప్పుడు మీ కోసం జైలు తలుపులు తెరవమంటారా అని అడిగారని, మరి ఉదయం ఎందుకు హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళలేదు అని అడిగితే, వాళ్ళు సుప్రీం కోర్టులో కేసు వేసారు కాబట్టి తీసుకుని వెళ్లలేదని చెప్పారని తెలిపింది.

hc 22052021 2

కోర్టు తనకు అడ్డుపడితే, తాను కోర్టు నుంచి వాక్ అవుట్ చేస్తానని అదే బిగ్గర గొంతుతో మాట్లాడారని కోర్టు తెలిపింది. అంతటితో ఆగకుండా, అసలు ఈ కేసులో మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు అంటూ, ఏకంగా కోర్టు పైన నినండలు మోపే ప్రయత్నం చేయటంతో, కోర్టు అతన్ని హెచ్చరించి, మాటలు అదుపులో ఉంచుకోవాలని సూచించినట్టు తెలిపింది. అయితే తాము పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగిన చోట కచ్చితంగా కలుగు చేసుకుంటామని, ఒక ఎంపీని కొ-ట్టా-ర-ని చెప్తున్నారని, ఫోటోలు బయటకు వచ్చాయని, సిఐడి కోర్టు మేజిస్ట్రేట్ కూడా గా-యా-లు ఉన్నట్టు చెప్పారని, అలంటి అప్పుడు, తాము తలుపులు మూసుకుని కూర్చోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక గుంటూరు హాస్పిటల్ డాక్టర్ కూడా, తాము 12 గంటలకు రిపోర్ట్ అడిగితే, సాయంత్రం 6.30 నిమిషాలకు ఇచ్చారని, అంతకు ముందు అనేక సార్లు కోర్టు నుంచి నివేదిక ఇవ్వమని ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదని, చివరకు 3.30 గంటలకు ఫోన్ లో కలిసి, రిపోర్ట్ పంపించేస్తున్నామని చెప్పి, చివరకు కోర్టు ఆరు గంటలకు కూర్చుంటే, 6.30 నిమిషాలకు ఇచ్చారని కోర్టు తెలిపింది. వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకునే, కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయమన్నామని కోర్ట్ తెలిపింది.

రఘురామకృష్ణం రాజుకి బెయిల్ ఇస్తూ, నిన్న సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దానికి సంబందించిన బెయిల్ ఆర్డర్ కాపీ కొద్దిసేపటి క్రితమే, సుప్రీం కోర్టు విడుదల చేసింది. అయితే ఇక రఘురామరాజుకి బెయిల్ పై విడుదల అయ్యే విషయం, ఆయన పూచికత్తుని, కింద కోర్టులో ఇచ్చిన తరువాత, ఆయన విడుదల అయ్యే అవకాసం ఉంది. కింద కోర్టు రిలీస్ ఆర్డర్ ఇచ్చిన తరువాత, ఆ కాపీని ఆర్మీ హాస్పిటల్ వైద్యులకి ఇస్తే, ఆయన్ను విడుదల చేసే అవకాసం ఉంది. అయితే ఈ ప్రక్రియ అంతా అవ్వటానికి సమయం పడుతుంది కాబట్టి, ఈ రోజు సాయంత్రం కుదరకపొతే, సోమవారమే రఘురామరాజు విడుదల అయ్యే అవకాసం ఉంది. అయితే నిన్న జరిగిన వాదోపవాదనలు తరువాత, కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఇందులో అయిదు కండీషన్లు పెట్టింది. మొదటిది ఆయన దర్యాప్తుకి పూర్తి సహకారం అందించాలని, కేసుకి సంబంధించి ఎలాంటి ఆధారాలు తారుమారు చేయకూడదని. రెండోది అయానను దర్యాప్తుకి పిలివాలి అంటూ, 24 గంటల ముందు, ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు సమాచారం ఇవ్వాలని. మూడోది, రఘురామరాజున లాయర్ సమక్షంలోనే విచారణ చేయాలని. నాలుగోది, రఘురామరాజు ,ఈ కేసుకి సంబంధించి, మీడియాతో, సోషల్ మీడియాతో మాట్లాడకూడదని.

sc 22052021 2

అయిదవది, లక్ష రూపాయాల పూచికత్తు, ఇద్దరు ష్యురిటి ఇవ్వాలని. ఇలా మొత్తం అయిదు కీలక అంశాలను బెయిల్ ఆర్డర్ లో కోర్టు పెట్టింది. ఇవన్నీ జెనెరల్ గా అన్ని కేసుల్లో, అందరికీ పెట్టే కండీషన్స్ ఏ. అయితే నిన్న ఒక వర్గం మీడియా మాట్లాడుతూ, రఘురామరాజుని, అసలు మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ మాట్లాడకూడదని, సుప్రీం కోర్టు చెప్పినట్టు, ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తూ, అదేదో తమ గొప్ప విజయంలాగా చెప్పుకున్నారు. అయితే ఈ రోజు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ కాపీలో, సుప్రీం కోర్ట్ ఈ విషయం పై స్పష్టత ఇచ్చింది. రఘురామరాజు కేవలం ఈ కేసు విషయం పైనే, మీడియాతో కానీ, ప్రింట్ మీడియాతో కానీ, సోషల్ మీడియాతో కానీ మాట్లాడకూడదు అంటూ, తన తీర్పులో స్పష్టం చేసింది. మరి నిన్న అంతా ప్రచారం చేసిన, ఆ వర్గం మీడియా, ఈ విషయం పై, నిన్న మేము తప్పు చెప్పాం, సుప్రీం కోర్టు చెప్పింది ఇది అంటూ, క్లారిటీ ఇస్తారో లేదో మరి. ఏది ఏమైనా, ఈ రోజు కానీ, సోమవారం కానీ రఘురామరాజు విడుదల అయ్యే అవకాసం ఉంది.

విశాఖ జిల్లా, నర్సీపట్నంలో మత్తు డాక్టర్ గా, ప్రభుత్వ హాస్పిటల్ లో సేవలు అందిస్తున్న డాక్టర్ సు-ధా-క-ర్ గురించి అందరికీ తెలిసిందే. డాక్టర్ సు-ధా-క-ర్ ఈ రోజు గుం-డె-పో-టు-తో మ-ర-ణిం-చా-రు. గత ఏడాది ప్రభుత్వాన్ని మాస్కులు ఇవ్వటం లేదు అని ప్రశ్నించినందుకు, ఆయనను, ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఆ తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది పోలీసులు ఆయన పై నడి రోడ్డు మీద ప్రవర్తించిన తీరు, తరువాత ఆయన పి-చ్-చోడు అని చెప్పటం, దళిత సంఘాలు పోరాడటం, తరువాత హైకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే కేసు హియరింగ్ లో ఉండగానే, డాక్టర్ సు-ధా-క-ర్ చ-ని-పో-యా-రు. గత ఏడాది నుంచి జరిగిన పరిణామాలతో, డాక్టర్ సు-ధా-క-ర్ తీవ్ర మనో వే-ద-న-కు గురయ్యారు. ఈ రోజు గుం-డె-పో-టు-తో చ-ని-పో-యా-రు. సిబిఐ కేసులో ఫైనల్ తీర్పు వచ్చే లోపు ఆయన చ-ని-పో-వ-టం బాధ కలిగించే విషయం. త్వరలోనే ఆయనకు న్యాయం జరిగి, ఆయన ఆ-త్మ-కు శాం-తి చేకూరలని ఆశిద్దాం..

జగన్ మోహన్ రెడ్డికి చెందిన అక్రమ ఆస్తుల కేసుల్లో, మరొక నిందితుడుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారికి, తెలంగాణా హైకోర్టు షాక్ ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో, ఇప్పటికే సిఐడి కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే తన పై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు ఉన్నాయని, వాటిని సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తుందని, సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలుపుదల చేయాలి అంటూ, ఆయన తెలంగాణా హైకోర్టుకు వెళ్ళారు. దీని పై వెంటనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే తెలంగాణా హైకోర్టు మాత్రం, ఆయనకు షాక్ ఇస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. మాజీ ఐఏఎస్ బీపీ ఆచార్య, జగన్ మోహన్ రెడ్డికి చెందిన అక్రమ ఆస్తులు కేసులో ఒకటైన లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసులో, ఆయన పై కూడా అభియోగాలు నమోదు అయ్యింది. అయితే బీపీ ఆచార్య పై, అవినీతి నోరోధక చట్టం కింద, పలు సెక్షన్లలో నమోదైన కేసులు విషయంలో, విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం గతంలో అంగీకరించ లేదు కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం, మాజీ ఐఏఎస్ అధికారి పై, విచారణకు, సిబిఐకి అనుమతి ఇచ్చింది. అయితే కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, వెంటనే నిలిపి వేయాలి అంటూ, బీపీ ఆచార్య హైకోర్టులో ఒక కేసు వేసారు.

bpacharya 22052021 2

అయితే ఆ గడువు ఇప్పుడు ముగియటంతో, సిబిఐ కోర్టు బీపీ ఆచార్య పై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేసి, విచారణకు ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని పై బీపీ ఆచార్య హైకోర్టుకు వెళ్ళారు. తాను ఇప్పటికే కేంద్రం వద్దకు అభ్యర్ధన పెట్టుకున్నా అని, కేంద్రం నుంచి ఏదో ఒక న్రినయం వచ్చే దాకా, ఈ కేసు నిలుపుదల చేయాలని, అలాగే సిబిఐ ఇచ్చిన ఉత్తర్వులను, వెంటనే కొట్టేయాలని, ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై తెలంగాణా హైకోర్టులో విచారణ జరిగింది. దీని పై ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి హైకోర్టు ఒప్పుకోలేదు. దీని పై, త్వరలోనే తుది విచారణ చేపడతామని హైకోర్టు చెప్పింది. అయితే మధ్యంతర ఉత్తర్వులు మాత్రం ఇవ్వమని చెప్పింది. ఇక మరో పక్క బీపీ ఆచార్య పిటీషన్ పై, కౌంటర్ దాఖలు చేయలని, హైకోర్టు, సిబిఐని ఆశ్రయించింది. ఇక రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఏపీఐఐసీ వైస్‌ఛైర్మన్‌, ఎండీగా ఉన్న బీపీ ఆచార్య, నిబంధనలకు విరుద్ధంగా, సుమారుగా, 8,841 ఎకరాలను, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు ఇచ్చారనేది అభియోగం.

Advertisements

Latest Articles

Most Read