రాష్ట్రంలో క-రో-నా పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని, కేసులు పెరుగుతూనే ఉన్నాయని, పాజిటివిటీ రేటు 25శాతానికి మించిపోయిందని, దానికి తగినట్టు సౌకర్యాలు కల్పించి, ప్రజలప్రాణాలు కాపాడేదిశగా ప్రభుత్వం ఎలాంటిచర్యలు చేపట్టడంలేదని, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "జగన్మోహన్ రెడ్డి అధికారిక పత్రిక అయిన సాక్షిలో నిన్న ఒక వార్త ప్రచురించారు. కో-వి-డ్ కు సంబంధించి, గత ఏడాది కాలంగా ప్రభుత్వం ఎంత నిధులను ఖర్చుపెట్టిందో వివరంగా రాశారు. కోవిడ్ కు పెట్టిన ఖర్చు రూ.2,229 కోట్లని శీర్షిక కూడా పెట్టారు. రాష్ట్రంలో 2020 మార్చి నుంచి ఇప్పటి వరకు, క-రో-నా నియంత్రణ కోసం రూ.2,229 కోట్ల పైచిలుకు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించిందని వార్త రాశారు. ఆ నిధులు ఎక్కడినుంచి వచ్చాయో, దేనికెంత ఖర్చుపెట్టారో కూడా రాశారు. రూ.2,229 కోట్లలో జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి రూ.497 కోట్లు, స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (రాష్ట్రవిపత్తుల సహాయనిధి) రిలీఫ్ ఫండ్ నుంచి రూ.645 కోట్లు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ నుంచి రూ.133 కోట్లు, రాష్ట్రప్రభుత్వ వాటాగా రూ.934 కోట్లు, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటినుంచీ రూ.18 కోట్లు వచ్చినట్టుగా పత్రికలో రాశారు. కోవిడ్ కు సంబంధించి ఖర్చుచేసిన సొమ్ములో రాష్ట్రప్రభుత్వ వాటాగా కేవలం రూ.934 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దాదాపు రూ.1150 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వ నుంచి వచ్చాయని సాక్షి లెక్కలే చెబుతున్నాయి. ఆ నిధులను దేనికి.. ఎంతెంతఖర్చు చేశారోకూడా సాక్షిపత్రికలో రాయడం జరిగింది. డ్రగ్స్, మరియు మెడిసిన్స్ కు రూ.1173కోట్లు, ల్యాబ్ లు, టెస్టింగ్ కిట్లకు రూ.120కోట్లు, కోవిడ్ తాలూకా ఆయుష్ మందులకు రూ.2కోట్లు, పెద్దాసుపత్రుల్లో ఆక్సిజన్ చెల్లింపులకు రూ.24కోట్లు, రెండోశ్రేణి ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా చేసిన కంపెనీలకు చెల్లించింది రూ. 12కోట్లు, జిల్లాల్లో సిబ్బంది వేతనాలు, నిర్వహణ వ్యయం నిమిత్తం రూ.874కోట్లు, హెడ్ క్వార్టర్స్ వ్యయం కింద రూ.21కోట్లు, దేనికెంతఖర్చుపెట్టారనే జాబితాను సాక్షిలో పైవిధంగా రాశారు. డ్రగ్స్, మెడిసిన్స్ కు దాదాపు రూ.1173కోట్లు, తరువాత సిబ్బంది వేతనాలు, నిర్వహణ వ్యయానికి దాదాపు రూ.900కోట్లు ఖర్చుచేశారని చెప్పారు, ఆ రెండూకలిపితే దాదాపు రూ.2047కోట్లు ఖర్చైంది. రూ.2,229కోట్లలో రూ.2047కోట్లు మందులు, జీతాలకే అయిపోయాయి. ఇక మిగిలిన సొమ్ములో ఆక్సిజన్ సరఫరా చేసిన కంపెనీలకు రూ.34 కోట్ల వరకు చెల్లించారు.
ముఖ్యమంత్రి సొంత పత్రికలోనే ఈ లెక్కలన్నీ రాశారు. రూ.2,229కోట్లలో ముఖ్యమంత్రి లెక్కప్రకారం రూపాయైనా ఆసుపత్రుల్లో మౌలికవసతులు, ఇతరసౌకర్యాల కల్పనకు ఖర్చుచేశారా అంటే ఏం లేదు? ఇదిగో ఈ వెంటిలేటర్ల కొనుగోలుకు ఇంత ఖర్చపెట్టాము.. ఆక్సిజన్ సిలిండర్ల కొంటానికి ఇన్ని నిధులు అయ్యాయి.. ఐసీయూ పడకలు కొనడానికి, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు, క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలుకు, ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లకు ఇన్నినిధులు ఖర్చుపెట్టామని ప్రభుత్వం ఎక్కడాచెప్పలేదు? ప్రజలు ఏవైతే లేవని ప్రాణాలు పోగోట్టుకుంటున్నారో, వాటిపై గత సంవత్సరకాలంగా ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చుపెట్టలేదన్న విషయం ఇప్పుడు తేటతెల్లమైంది. ఆక్సిజన్ ట్యాంకర్లకు, ఐసీయూ పడకలు, ఆక్సిజన్ పడకలకు, వెంటిలేటర్ల కొనుగోలుకు రూపాయికూడా ఖర్చు చేయలేదని సాక్షిలో రాసిన రాతలతోనే బట్టబయలైంది. దీనిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు? ఆయన నిర్లక్ష్యం, ఉదాసీనతవల్ల ఎన్నిప్రాణాలు పోయాయో ఇప్పటికైనా అర్థమైందా? కేవలం మందులకే రూ.1173 కోట్లు ఖర్చయ్యాయా? ఎంత మందికి ఎన్ని మందులు సరఫరా చేశారు? కేవలం జీతాలు, నిర్వహణ వ్యయానికి దాదాపు రూ.900కోట్ల అయ్యాయా? జీతాలనేవి నెలానెలా సాధారణ ఆరోగ్యశాఖ బడ్జెట్ నుంచి ఎప్పటిలానే ఇస్తున్నారు కదా? మరి కొత్తగా కో-వి-డ్ నిధులనుంచి జీతాలివ్సాల్సిన అవసరం ఏముంది? కో-వి-డ్ ప్రత్యేక విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్లు తమకు జీతాలందలేదని రోడ్లపైకి వచ్చి, ధర్నాలు చేశారుకదా? మరి జీతాలపేరుతో ఇన్నికోట్లరూపాయలను ఎవరికి దోచిపెట్టారు? దానిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు? వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకలు, ఆక్సిజన్ ట్యాంకర్లకు వెచ్చించిన సొమ్మెంతో సాక్షిలో రాయలేదేం? ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ కు రూపాయికూడా ఖర్చుచేయలేదుగా?