రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతోందని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు అన్నారు. ప్రజాస్వామ్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై అఖిలపక్ష నాయకులతో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, ప్రజాసంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో చంద్రబాబునాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో నేను 43 ఏళ్ల నుంచి ఉన్నా. వేడివేడి చర్చలు, విమర్శలు జరిగాయి. నేను కూడా అనేక మంది ముఖ్యమంత్రులను చూశా. ప్రతిపక్ష నేతగా చూశా. ప్రత్యర్థులపై దేశద్రోహం కేసు ఉంటుందని నాకు తెలియదు. మొదటిసారి చూస్తున్నా. నోటీసు ఇవ్వకుండా కేసులు పెడుతున్నారు. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే.. అక్రమ కేసులు పెట్టి పిచ్చివాడిని చేశారు. ఎవరైనా నోరు తెరిస్తే వారి పనైపోతోంది. వైఎస్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు మీడియా వాచ్ అనే జీవో తీసుకువచ్చారు. పేపర్ లో లీకైతే నేను అసెంబ్లీలో ప్రశ్నించా. దీంతో భయపడి వెనక్కి తీసుకున్నారు. ఇవాళ 2430 జీవో తీసుకువచ్చారు. మీడియాను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. టీవీ5, ఏబీఎన్ పై రాజద్రోహం కేసులు పెట్టారు. మీడియాకు రాజకీయ నాయకులు భయపడటం మాని, రాజకీయ నాయకులను చూసి మీడియా భయపడే పరిస్థితి వచ్చింది. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను తుపాకీతో కా-ల్చే-యా-ల-ని, చెప్పులతో కొ-ట్టా-ల-ని, చీపుర్లతో కొ-ట్టా-ల-ని, బంగాళాఖాతంలో పడేయాలని, ఉ-రి తీయాలని మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడారు. అయినప్పటికీ మేం ఏనాడు కేసులు, రాజద్రోహం కేసులు పెట్టలేదు. రుయా ఆసుపత్రి ఘటన పరిశీలించడానికి వెళితే సీపీఐ నారాయణ, టీడీపీ నేతలను అడ్డుకున్నారు. తమిళనాడులో అధికార, ప్రతిపక్ష నేతలు కలిసి కరోనాపై పోరాడుతున్నారు. కేంద్రం కూడా అఖిలపక్షం నిర్వహించింది. కులం గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు. సామాజిక న్యాయం గురించి పోరాడాం. మేం విమర్శలను సద్విమర్శలుగా చేసుకున్నాం.

రెండేళ్లుగా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, బూతులు తిట్టడం, కులాల గురించి మాట్లాడటం చేస్తున్నారు. కులాల గురించి కేసులు పెట్టాల్సి వస్తే.. మొదట వైసీపీ నేతలపై సుమోటో కేసులు పెట్టాలి. వారు కనపడలేదా? అధికారం ఉందని ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారు. శుక్రవారం వస్తే భయం. జేసీబీ వస్తుంది, భవనాలు కూలుస్తారు. లేదా అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తారు. శని, ఆదివారం కోర్టులు ఉండవు. 7 సంవత్సరాలపైన శిక్ష ఉంటే కేసులు పెడితే నోటీసులు కూడా ఇచ్చే పనిలేదని ఈ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు. రఘురామకృష్ణంరాజు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే జైల్లో పెడతారు. జైల్లో కొ-డ-తా-రు. ఆయన కాలికి గా-యా-లు చూశాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించాలని చెబితే ఉల్లంఘిస్తారు. సీఐడీ అడిషనల్ ఏజీ ఆసుపత్రికి వెళ్తారు. వైసీపీ లీగర్ సెల్ వ్యక్తి భార్య ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్. గతంలో జ్యుడీషియల్ మరణాలు కూడా జరిగాయి. నేడు సుప్రీంకోర్టు జోక్యంతో హైదరాబాద్ లో ఆర్మీ ఆసుపత్రికి తరలించే పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరుగుతోంది? విమర్శలు చేసుకుంటాం. ప్రజలు నిర్ణయించుకుంటారు. వైసీపీ విమర్శలు గమనిస్తే.. నన్ను అసెంబ్లీలోనే ఇష్టానుసారంగా తిట్టారు. ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైతే అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రజా చైతన్యం తీసుకురావాలి. కోర్టులద్వారా లిమిటెడ్ రిలీఫ్ మాత్రమే వస్తోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. తప్పు చేస్తే శిక్షించడంలో తప్పు లేదు. ఆ తప్పేదో చెప్పడం లేదు.

ఎంపీపై పెట్టిన కేసులన్నీ మనం చూశాం. ఆయనవి హేట్ స్పీచ్ లైతే మీవి హేట్ స్పీచ్ లు కాదా? మీరు కులం గురించి మాట్లాడలేదా? రూల్స్ అందరికీ సమానంగా ఉండాలి కదా? ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా బాగా నడిచే సంస్థలను మూసివేయవచ్చని నాకు ఇంతవరకు తెలియదు. నేను ఏనాడూ భారతి సిమెంట్ ను, సాక్షిని మూసివేయలేదు. నాపై సాక్షిలో ఎన్ని పిచ్చి రాతలు రాశారో చూశాం. రాష్ట్ర భవిష్యత్ కోసం పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాలు చేస్తున్న ఈ పని అభినందనీయం. రఘురామపై ఇష్టానుసారంగా కేసులు పెడితే మాట్లాడటం తప్పా? ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడతాం. అధికారం శాశ్వతం కాదని హెచ్చరిస్తున్నా. అందరం కలిసి ప్రజాచైతన్యం తీసుకురావాలి. చట్టాలు అమలుచేసే బాధ్యతను అందరూ తీసుకోవాలి. లేనిపక్షంలో రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుంది. క-రో-నా విషయంలో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి. టీడీపీ ఎన్ని పోరాటాలు చేసింది. ఇప్పుడు పోరాటాలను కొనసాగిస్తాం. అధికారులు కూడా హద్దులు మీరడం సరికాదు. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా. 2430 జీవోపై మీడియా కూడా మాట్లాడలేని పరిస్థితి. అందరం సంఘటితంగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.

నాలుగు రోజులు క్రితం, వైఎస్ఆర్ సోషల్ మీడియాలో, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, జగన్ మోహన్ రెడ్డికి భారీగా ఎలివేషన్ లు ఇస్తూ, పోస్ట్ లు పెట్టారు. అదేమిటి అంటే, వారం రోజులు క్రితం, కోవాక్సిన్ కు సంబంధించి, జగన్ మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీకి లేఖ రాసరాని, కోవాక్సిన్ ఫార్ములాని ఇతరులకు ఇస్తే, వాళ్ళు కూడా కోవాక్సిన్ తయారు చేస్తారని లేఖ రాసారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. కాని అంతకు ముందే కేంద్రం, భారత్ బయోటెక్ తో మాట్లాడి, మూడు ప్రభుత్వ రంగ కంపెనీలతో, కోవాక్సిన్ ఉత్పతికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి లేఖ రాసిన తరువాత, ఇప్పటికే కోవాక్సిన్ ఉత్పత్తికి, మూడు కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. ఇంకేముంది, ఇది పట్టుకుని, జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖ వల్లే, కేంద్రం దిగి వచ్చి, భారత్ బయోటెక్ ని ఆదేశించటం వల్లే, ఒప్పుకున్నారు అంటూ, మా జగన్ విజనరీ అంటూ, సోషల్ మీడియాలో హడావిడి చేసారు. చివరకు జగన్ మోహన్ రెడ్డి సొంత మీడియా సాక్షిలో కూడా, జగన్ లేఖ వల్లే కదలిక అంటూ, వార్తలు వండి, ప్రజల్లో జగన్ మోహన్ రెడ్డి ఒక విజనరీ అనే విధంగా, తీసుకుని వెళ్లారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ ప్రచారం నీతి ఆయోగ్ వరకు చేరటంతో, నీతి ఆయోగ్ ఘాటుగా స్పందించింది.

nitiayog 17052021 2

ఎవరో చెప్పటం వల్ల, కేంద్రం కోవాక్సిన్ తయారికి మూడు ప్రభుత్వ రంగ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది అంటూ, జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు అంటూ, నీతి ఆయోగ్ ప్రెస్ మీట్ లో తీల్చి చెప్పింది. ఒప్పందాలు ఎవరో చెప్తే జరగవు అని, దానికి సాంకేతిక అంశాలు అనేకం ఉంటాయని, ఒక వ్యాక్సిన్ బయటకు రావాలి అంటే ఎన్నో ప్రాసెస్ లు ఉంటాయని చెప్పింది. కోవ్యాక్సిన్ ని వేరే కంపెనీలతో ఉత్పత్తి చేసే విషయం పై, కొన్ని నెలలుగా సమాలోచనలు జరుగుతున్నాయని, ఇప్పటికే మూడు కంపెనీలకు నిధులు కూడా ఇచ్చామని చెప్పింది. కోవ్యాక్సిన్ తయారికి బీఎస్‌ఎల్‌3 ల్యాబ్ లు కావాలని, ఈ ల్యాబ్ లు మన దేశంలో ఎక్కడా లేవని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎవరో చెప్తే నిర్ణయం తీసుకుని, రేపు ఉత్పత్తి మొదలు పెట్టే వ్యవహారం ఇది కాదని తేల్చి చెప్పింది. కోవ్యాక్సిన్ ఉత్పత్తి భారీగా పెరుగుతుందని, దీని కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ లు తయారు చేసే కంపెనీలు, శాస్త్రవేత్తల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా చేయవద్దు అంటూ పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డికి సూచనలు చేసింది.

జగన్ మోహన్ రెడ్డి అక్రమఆస్తుల కేసులో, ఆయనకు ఇచ్చిన కండీషనల్ బెయిల్ రద్దు చేయాలి అంటూ, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ పై, ఈ రోజు సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ రోజు కూడా జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాది, సిబిఐ తరుపు న్యాయవాది మరోసారి తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టుని కోరారు. దీంతో కోర్టు ఈ విషయం పై ఇక ఇదే మీకు చివరి అవకాసం అని, ఈ నెల 26వ తేది ఫైనల్ అని, ఆ రోజు లోపు కౌంటర్ దాఖలు చేయాల్సిందే అని, ఇక సమయం ఇవ్వబోము అంటూ తేల్చి చెప్పింది. మొదటి వాయిదాలో, మే 7 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కోరగా, మే 7న కూడా జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాదితో పాటు, సిబిఐ తరుపు న్యాయవాది కూడా, తమకు సమయం కావాలి అని కోరటంతో, మే 17 అంటే, ఈ రోజుకు కోర్టు వాయిదా వేసింది. అయితే ఈ రోజు మరోసారి వాయిదా కోరటంతో, ఇక ఇదే చివరి అవకాసం అంటూ, కోర్టు ఈ కేసుని మళ్ళీ ఈ నెల 26కు వాయిదా వేసింది. మరి ఆ రోజు ఏమి అవుతుందో చూడాల్సి ఉంది.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై , ఈ రోజు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. రఘురామకృష్ణం రాజుని, వెంటనే సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ హాస్పిటల్ కు తెసుకుని వెళ్లి వైద్య పరీక్షలు చేయాలని, ట్రీట్మెంట్ ఇవ్వలేని ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు రఘురామకృష్ణం రాజు తరుపున సీనియర్ న్యాయవాదులు ముకుల్, ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. అలాగే ప్రభుత్వం తరుపున దేవ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వాదనలు ప్రరంభించిన ముకుల్, మా క్లైంట్ సిట్టింగ్ ఎంపీ అని, అధికార పార్టీ ఎంపీ అని, అయితే ఆయన ప్రభుత్వం చేస్తున్న తప్పుల పై విమర్శలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలోనే ఆయన తమ ప్రభుత్వం పైన నమ్మకం లేదు అంటూ, ఢిల్లీ హైకోర్టులో బద్రత కోసం పిటీషన్ వేసారని అన్నారు. ఆయనకు వై క్యాటగిరీ బద్రత కూడా ఇచ్చారని అన్నారు. అయితే ఈ సందర్భంలో కలుగు చేసుకున్న ప్రభుత్వం తరుపు న్యాయవాది తనకు సమయం కావాలని, ఈ కేసు నాకు నిన్నే వచ్చిందని, దీని స్టడీ చేయాలని, శుక్రవారం వాయిదా వేయాలని కోరారు. అయితే రఘురామరాజు తరుపు న్యాయవాది అందుకు ఒప్పుకోలేదు.

rrr sc 17052021 1

తమ క్లైంట్ కు బెయిల్ ఇచ్చి, ఒక న్యూట్రల్ హాస్పిటల్ లో కానీ, ఏదైనా ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం చేయాలనీ కోరారు. తన క్లైంట్ ను పోలీసులు కొట్టారని, ఇదే విషయం హైకోర్టుకు తెలుపుగా కోర్టు, మెడికల్ బోర్డు ఒకటి పెట్టినందని, వాళ్ళు ఏమి గాయాలు లేవని చెప్పారని, అయితే ఇక్కడ ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రభావతి భర్త, వైసీపీ పార్టీ లీగల్ సెల్ లో ఒక మెంబెర్ అని కోర్టుకు తెలిపారు. అందుకే ఆయన్ను ఆర్మీ హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాలని కోరారు. అయితే ప్రభుత్వం తరుపు న్యాయవాది మా దగ్గర ఎయిమ్స్ ఉందని చెప్పగా, అది న్యూట్రల్ కాదని కేంద్ర పరిధిలోనిది అని, ఆర్మీ హాస్పిటల్ అయితే న్యూట్రల్ గ ఉంటుందని వాదించారు. దీంతో కోర్టు ఆర్మీ హాస్పిటల్ దగ్గరలో ఎక్కడ ఉందని కోరగా, హైదరాబాద్ లో ఉందని, వైజాగ్ లో మరింత దూరం అని చెప్పారు. దీనికి స్పందించిన కోర్టు గంట పాటు విచారణ వాయిదా వేసింది. చివరకు సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాలని ఆదేశాలు ఇచ్చింది. జ్యుడీషయల్ అధికారిని నియమిస్తామని, ఆర్మీ హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాలని, తమకు మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని, కేసుని 21కి వాయిదా వేసింది. బెయిల్ పిటీషన్ శుక్రవారం వింటామని చెప్పింది.

Advertisements

Latest Articles

Most Read