కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడి, అమిత్ షా అంటే చాలు, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలకులు, నోరు తెరవటానికి భయపడతూ ఉంటారు. చివరకు ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం విషయంలో కూడా , కేంద్రాన్ని ప్రశ్నించలేరు. ఇప్పుడు క-రో-నా కాలంలో కూడా, వివిధ రాష్ట్రాలు కేంద్రాన్ని నిందిస్తుంటే, వ్యాక్సిన్ పై ప్రశ్నిస్తుంటే, మన రాష్ట్రం మాత్రం విమర్శ చేయటానికి వెనకడుతుంది. కేవలం లేఖలతో సరి పెడుతున్నారు. మొన్న లైవ్ లోనే ఢిల్లీ సియం కేజ్రివాల్, మోడీ పై విరుచుకు పడటంతో, తరువాత రోజు కేంద్రం వ్యాక్సిన్ ఫ్రీ అని ప్రకటన చేసింది. ఇలా గట్టిగా అడిగితే కానీ కేంద్రం స్పందించిన పరిస్థితి. ఇలా గట్టిగా అడగ లేకనే, పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు 53 వేల కోట్లకు ఆమోదించి కూడా, తరువాత ఇప్పుడు మళ్ళీ 20 వేల కోట్లు అని మాట మార్చారు. రాష్ట్ర భవిషత్తు మొత్తం ఆధారపడి ఉన్న ప్రాజెక్ట్ కు కేంద్రం డబ్బులు ఇవ్వటం, మన హక్కు. మన హక్కుని కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడగలేక పోతుంది. ఇది ఒక్కటే అనేక అంశాల్లో కేంద్రాన్ని ప్రశ్నించాలీ అంటేనే వెనుకాడుతున్నారు. ప్రతిపక్షాలు మాత్రం, ఇది జగన్ అసమర్ధతగా, కేసులకు భయపడా తత్వంగా విమర్శలు చేస్తున్నాయి. కేసులు కోసం, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపిస్తున్నాయి.
జగన్ మోహన్ రెడ్డి ఇలా ఉంటే, ఆమె చెల్లి వైఎస్ షర్మిల మాత్రం, కేంద్రం అంటే డోంట్ కేర్ అంటున్నారు. కేంద్రాన్ని లెక్క చేసే పనే లేదని తేల్చి చెప్తున్నారు. బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు షర్మిల క-రో-నా ఇబ్బంది పడుతున్న వారి ఒక వీడియో పోస్ట్ చేసి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు లేదని అన్నారు. ఒక పక్క టెస్టింగ్ కిట్స్ లేవని, హాస్పిటల్ లో బెడ్స్ లేవని, ఆక్సిజన్ లేదని, వ్యాక్సిన్ లేవని, డాక్టర్లు పట్టించుకోవటం లేదని అన్నారు. క-రో-నా బాధితుల పట్ల కనీసం బాధ్యత అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి లేకుండా పోయింది అంటూ షర్మిల వాపోయారు. గవర్నర్ కలుగు చేసుకోవాలని అన్నారు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని విమర్శలు తరువాత, కనీసం హక్కుగా రావాల్సిన వాటి పై కూడా మౌనంగా ఉంటుంటే, మరో పక్క షర్మిల మాత్రం కేంద్రాన్ని లెక్క చేయం అనే విధంగా మాట్లాడటం, ఇద్దరిలోని స్వభావాన్ని తెలియ చేస్తుంది. షర్మిల తెలంగాణాలో పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే.