ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క-రో-నా పరిస్థతి పై, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం, కో-వి-డ్ నియంత్రణ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై, హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సామాజిక కార్యకర్త తోటా సురేష్ బాబు వేసిన పిటీషన్ విచారణ నేపధ్యంలో, రాష్ట్రంలో ప్రస్తుతం కో-వి-డ్ ఉన్న పరిస్థితిపై, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై ఎప్పటికప్పుడు ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన గదులు, బెడ్స్ సంఖ్యను డిస్ప్లే చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నోటిఫై చేసిన హాస్పిటల్స్ కు సంబంధించి, నోడల్ ఆఫీసర్లు, వారి ఫోన్ నెంబర్లని కూడా ఎప్పటికప్పుడు డిస్ప్లే చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అత్యవసర మండుపు, ఆక్సిజన్ సప్లై, గదులు ఇలా ప్రతి సామాచారం, రోజు వారీ నివేదిక రూపంలో, హైకోర్టు దృష్టికి తీసుకురావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా రాష్ట్రంలో కో-వి-డ్ నిర్ధారణ పరీక్షలు వాటి సంఖ్య, ఫలితాలు, వీటి పై కూడా ధర్మాసనానికి రిపోర్ట్ ఇవ్వాలని తెలిపింది. దాదాపుగా రెండు గంటల పాటు, పిటీషనర్ తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జెనెరల్ తో పాటు, ఇతర న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు.

hc 28042021 2

ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థతి చాలా దారుణంగా ఉందని, బెడ్ల విషయంలో కావచ్చు, బాధితులకు పరీక్షలు, ఫలితాలు రావటానికి సమయం పట్టటం, ఈ లోపు చాలా మందికి వైరస్ అంటటం లాంటివి జరుగుతున్నాయని, పిటీషనర్ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఆసుపత్రులు వద్ద కూడా చికిత్స అందించేందుకు ఇబ్బందులు పడుతున్నారు, బెడ్లు దొరకటం లేదు, అంబులెన్స్ ల లోనే, వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది, ఇలాంటి పరిస్థితిలో కో-వి-డ్ బాధితుల సంఖ్య పెరిగిపోతుందని, అదే విధంగా చికిత్సకు సంబంధించి, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తుందని, ప్రభుత్వం ఆదేశాలు అమలు కావటం లేదని, ప్రైవేట్ హాస్పిటల్ లో దోపిడీ జరుగుతుందని, హైకోర్టు కు తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో హైకోర్టు జోక్యం చేసుకోవాలని కోరగా, స్పందించిన హైకోర్టు, కొన్ని కీలక సూచనలు ప్రభుత్వానికి చేయటమే కాకుండా, ప్రతి రోజు , రోజు వారీ నివేదిక, తమకు ఇవ్వాలని, రోజు వారీ సమీక్ష చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, అదే పార్టీకి చెందిన రఘురామకృష్ణ రాజు, సిబిఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన సిబిఐ కోర్టు , జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ, రఘురామకృష్ణం రాజు పిటీషన్ వేసారని, మీ బెయిల్ రద్దు పిటీషన్ పై సమాధానం చెప్పండి,ఈ పిటీషన్ పై వివరణ ఇవ్వండి అంటూ, సిబిఐ కోర్టు, జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటీషన్ పై తదుపరి విచారణ, మే 7వ తేదీకి సిబిఐ కోర్టు వాయిదా వేసింది. అయితే, ఇదే పిటీషన్ పై, సిబిఐ వాదన కూడా, కోర్టు వినే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. సిబిఐకి కూడా, కోర్టు నోటీసులు ఇచ్చే అవకాసం ఉంది. జగన్ మోహన్ రెడ్డి పై అక్రమ అస్తుల ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పై అభియోగాలు మోపిన సిబిఐ, ఈడీ కేసులు కూడా పెట్టాయి. ఆయన ఆస్తులు కూడా జప్తు చేసిన విషయం తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి పై అక్రమ ఆస్తులు కేసులుగా, సిబిఐ 11 కేసులు పెట్టగా, ఈడీ 5 కేసులు పెట్టింది. ఈ కేసుల్లో చార్జ్ షీట్ కూడా వేసారు. ఇదే కేసుల్లో జగన్ మోహన్ రెడ్డి, 16 నెలలు జైల్లో కూడా ఉన్నారు.

jagann 28042021 2

అయితే తరువాత కండీషనల్ బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ కేసు గత 9 ఏళ్ళుగా సాగుతూనే ఉంది. ఇంకా కేసు ట్రైల్స్ లోకి కూడా రాలేదు. శుక్రవారం విచారణ అని కోర్టు చెప్పినా, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కేవలం ఒకసారే కోర్టుకు వెళ్ళారు. అలాగే మూడు నెలల నుంచి రోజు వారీ విచారణ అంటున్నా, అది కూడా ఇంకా ట్రైల్స్ దాకా వెళ్ళలేదు. ఈ లోపు కొంత మంది బీజేపీ నేతలు, జగన్ ని మళ్ళీ జైలుకు పంపిస్తాం అని చెప్తూ ఉండటంతో, వీటికి నొచ్చుకున్న రఘురామకృష్ణం రాజు, మా ముఖ్యమంత్రి రాముడో, రాక్షసుడో తెల్చేస్తాను అంటూ కేసు వేసారు. ఈ పిటీషన్ లో, జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించి, సాక్షులను ప్రభావితం చేస్తున్నారు అంటూ, పిటీషన్ లో తెలిపారు. ఇన్నేళ్ళు అయినా ఇంకా కేసు విచారణ జరగటం లేదని, వాపోయారు. అందుకే కేసు ప్రభావితం అవ్వకుండా, సాక్ష్యులు ప్రభావితం అవ్వకుండా, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, రఘురామరాజు పిటీషన్ వేసారు.

సంగం డెయిరీపై 20 ఏళ్ల క్రితమే కుట్రలు చేసారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. సంగం డెయిరీపై నాడు రాజశేఖర్‍రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్లారని అన్నారు. నరేంద్ర ఛైర్మన్ కాకముందే భూబదలాయింపు జరిగిందని, ఇప్పుడు దాని పై కేసు పెట్టారని అన్నారు. యడ్లపాటి వెంకట్రావు సంగం డెయిరీని ప్రారంభించారను, సంగం డెయిరీని ధూళిపాళ్ల వీరయ్య ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. అమూల్ కోసం సంగం డెయిరీని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. కోర్టులో పెండింగ్‍లో ఉన్న అంశంపై అరెస్టు ఎలా చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. దాదాపు రూ.1000కోట్ల టర్నోవర్ తో నడుస్తున్న సంగం డెయిరీ, ప్రతిరోజూ 3లక్ష లలీటర్ల పాలను సేకరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థకు 30 చిల్లింగ్ పాయింట్లు ఉన్నాయి. గత పదేళ్లలో 206 కోట్ల రూపాయల బోనస్ ను పాడి రైతులకు చెల్లించడం జరిగింది. ధూళిపాళ్ల నరేంద్ర ఛైర్మన్ కాకముందు రూ.200కోట్ల టర్నోవర్ తో ఉన్న సంగం డెయిరీ, నేడు రూ.1000 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరింది. గతంలో 3 చిల్లింగ్ సెంటర్లు మాత్రమే డెయిరీ, నేడు 30 చిల్లింగ్ సెంటర్లు నెలకొల్పింది. సంగం డెయిరీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకాదు, ఒక ప్రొప్రయిటర్ ఫరమ్ కాదు. సంగం డెయిరీ అనేది ధూళిపాళ్ల నరేంద్రకుటుంబాని కి చెందింది కాదు. అది ఒక ప్రొడ్యూసర్స్ కంపెనీ. సంగం డెయిరీ సంస్థ, కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం, సెక్షన్ 465-1ప్రకారం అది ఏర్పాటైంది

cbn 28042021 2

సంగం డెయిరీ ప్రొడ్యూసర్స్ కంపెనీలో 367 సోసైటీలు సభ్యులుగా ఉంటే, లక్షా 20వేలమంది పాడిరైతులు వాటాదారులుగా ఉన్నారు. వైసీపీవారు, జగన్ రెడ్డి ఏదేదో చెబుతున్నారు. సంగం డెయిరీని ధూళిపాళ్ల నరేంద్ర దోచుకుంటున్నాడన్నట్లు మాట్లాడుతున్నారు. నరేంద్రకూడా ఒక సొసైటీతరుపున ఎన్నికకాబడి, పాడిరైతులకు ప్రతినిధిగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. నరేంద్ర లక్షా20వేలమంది పాడిరైతులు ఎన్నుకున్న ఛైర్మన్ మాత్రమే. దానిలో 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. కంపెనీస్ యాక్ట్ ప్రకారం సంగం డెయిరీ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పడింది. అంటువంటి కంపెనీని ఏరకంగా హస్తగతంచేసుకుంటారు? ఏసీబీ అధికారులు నమోదుచేసిన ఎఫ్ ఐఆర్ లో ఏముంది? ధూళిపాళ్ల వీరయ్య చౌదరి పేరుతో నమోదైన ఒక ట్రస్ట్ కు పదిఎకరాల భూమిని బదలాయించారని, దానిలో ఒక ఆసుపత్రి నిర్మించి, పేదరైతులకు సేవలు అందిస్తున్నారని, అదినేరమని రాశారు. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? ఆసుపత్రి నిర్మించి పేదరైతులకు సేవలందిస్తే అదినేరమా?

దేశం అల్లకల్లోలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ రోజుకి బ్రతికితే చాలు, వైరస్ బారిన పడకుండా ఉంటే చాలు అంటూ, ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థతిలో ప్రజలు ఉన్నారు. అయితే భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వమే, ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకో చేస్తున్నారో తెలియదు, అసలు ఏ ఉద్దేశం ఉందో తెలియదు, పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు పెట్టి తీరుతాం అని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. పిల్లలు, పెద్దలు, ప్రతిపక్ష పార్టీలు, పరీక్షలు పెట్టద్దు బాబోయ్ అంటున్నా, ప్రభుత్వం మాత్రం వినిపించుకోవటం లేదు. ఏది ఏమైనా పరీక్షలు పెట్టి తీరుతాం అని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ విషయం పై మొదటి సారి జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు స్పందించారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఇది సరి కాదని అన్నారు. నేను ప్రతి విద్యార్ధి భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తుంటే, విపత్కర పరిస్థితి అంటూ కొంత మంది విమర్శలు చేస్తున్నారని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన పాలసీ ఉండాలని లేదని, కేంద్రం కూడా పరీక్షలు పెట్టుకునే విషయం, రాష్ట్రాలకు వదిలేసిన సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు.

jagan 28042021 2

పరీక్షలు జరిపి తీరుతాం అని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అని, జగన్ మోహన్ రెడ్డి తెగేసి చెప్పారు. అయితే జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం పై పలువురు ఆశ్చర్య పోతున్నారు. సర్టిఫికేట్ లు కంటే, ప్రాణాలు ముఖ్యం అని పరిస్థితిలో ప్రస్తుతం దేశం ఉందని, ఇలనాటి పానిక్ పరిస్థితిలో, పరీక్షలు ఎలా రాయగలరని, 15 లక్షల మంది విద్యార్ధులు అంటే, ఎన్ని కుటుంబాలు భయం భయంతో ఉండాలో ఆలోచించాలని అన్నారు. ఒక పక్కన ఆంక్షలు విధిస్తూ, మరో పక్క పరీక్షలు పెట్టటం ఏమిటో, అసలు జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఈ నిర్ణయం సమర్ధించుకోవటం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు రద్దు చేయకుండా, కనీసం వాయిదా అయినా వేయటానికి, ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరో పక్క, ఇదే అంశం పై ఇప్పటికే నారా లోకేష్, గత వారం రోజులుగా, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నారు. మరో పక్క రఘురామకృష్ణం రాజు, ప్రధాని మోడీకి కూడా లేఖ రాసారు. ఇక కేఏ పాల్, ఇదే విషయం పై హైకోర్టులో కేసు కూడా వేసారు.

Advertisements

Latest Articles

Most Read