నేడు తాను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) యోగానంద్ గారిని కలిసి, తిరుపతి ఉపఎన్నికలో జరుగుతున్న విధానాలు, కేంద్రఎన్నికల సంఘం చేయాల్సిన కొన్నిఏర్పాట్లు, అధికారపార్టీ స్థానిక ఎన్నికల్లో అనుసరించినట్లుగానే తిరుపతి ఉపఎన్నికలో కూడా వెళ్లాలని చూస్తోందని, దౌ-ర్జ-న్యం-గా, అప్రజాస్వామికంగా గెలుపుపొందాలని చూస్తోందని, కొన్నికారణాలతో సీఈవోకి ఫిర్యాదుచేయడం జరిగిం దని, ఆయన తామిచ్చిన ఫిర్యాదుని క్షుణ్ణంగా పరిశీలిం చారని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలుఆయన మాటల్లో... "తిరుపతి ఉపఎన్నికలో స్థానికసంస్థల్లో అనుసరించినట్టే వైసీపీ అనుసరిస్తున్న విధానాలపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశాం. చంద్రబాబునాయుడి సభలో రాళ్లేమీ పడలేదని డీఐజీ అంటున్నాడు. అలాంటప్పుడురాళ్లు ఆకాశం నుంచి పడ్డాయా? లేక మాయలఫకీర్ గానీ, పాతాళభైరవి మాంత్రికుడేమైనా విసిరాడా? అల్లాఉద్దీన్ అద్భుతదీపం నుంచి ఏమైనా వచ్చాయా? ఎలావచ్చాయో డీజీపీచెప్పాలిగా. దర్యాప్తు పూర్తికాకుండా, ఏమిజరిగిందో తెలుసుకోకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే డీఐజీ ఉటంకించడం అభ్యంతరకరం. డీఐజీకంటే ఒక ఎస్సైకి చెప్పి ఉంటే, అతను రాళ్లు ఎక్కడినుంచి వచ్చాయో బాగా దర్యాప్తు చేసేవాడు. డీఐజీ తనవ్యాఖ్యలను వెనక్కు తీసుకొని, రాళ్లు విసిరిన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. రాళ్ల దా-డి ఘటనపై పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకోవాలని సీఈవోని కోరాం. ఉపఎన్నికకోసం 23 కంపెనీల కేంద్రబలగాలు రాబోతున్నాయని తెలిసింది. సున్నితమైన పోలింగ్ బూతుల్లో లోకల్ పోలీసుల ప్రమేయం లేకుండా, కేంద్రబలగాలను నియమించాలని సీఈవోని కోరాం. దానిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీఈవో చెప్పారు.

అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు, వెబ్ స్ట్రీమింగ్ (లైవ్) ఏర్పాట్లుచేయమని సీఈవోని కోరాము. తిరుపతి ఉపఎన్నికలో నకిలీ ఓటర్ ఐడీకార్డులు 2లక్షలున్నాయని తెలిసింది. వైసీపీ ఎన్నికల్లో పోటీచేయడం మొదలెట్టాకే ఇటువంటి కొత్తకొత్త వింతలన్నీ చూస్తున్నాం. దొంగఓటర్ కార్డుతో పాటు, మరో గుర్తింపుకార్డుని కూడా పరిశీలించాలని కోరాం. బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఇలాంటివి ఏవైనా పర్వాలేదని చెప్పాము. దానిపై కేంద్రఎన్నికల సంఘాన్ని సంప్రదిస్తామని సీఈవోచెప్పారు. సున్నితమైన బూత్ లలో మైక్రో అబ్జర్వర్స్ ని నియమించాలని సీఈవోకి విజ్ఞప్తిచేశాము. అందుకో సం కేంద్రసర్వీసుల్లో పనిచేసిన కొంతమందిని నియమించడం జరిగిందని సీఈవో తమతో చెప్పారు. అలానే రూట్ అబ్జర్వర్లను కూడా కట్టుదిట్టంగా నియమించాలని కూడా కోరాము. తాముచేసిన విజ్ఞప్తులపై సీఈవో సానుకూలంగా స్పందించారు. కలెక్టర్లు, ఎస్పీల మీటింగులో ఈ అంశాలపై చర్చిస్తామని చెప్పారు. రోగులను తరలించాల్సిన అంబులెన్సులను ఎన్నికలడబ్బు రవాణాకు అధికారపార్టీ వాడుకుంటోందని తెలియచేశాము. దొంగతనాలు ఎన్నిరకాలుగా చేయొచ్చో, ఎన్ని కొత్తవిధానాలు అమలు చేయొచ్చో వైసీపీవారుచేసి చూపిస్తున్నా రు. అంబులెన్సులనేవి రోగులకోసం ఉపయోగిస్తారు సంఘవ్యతిరేకవ్యవహారాల్లో బాగా అనుభవం గడించిన వారు చేసేది మీకు చెబుతున్నా. వైసీపీవ్యక్తే అంబులెన్స్ లో పేషెంట్ గాఉండి, ఆ వాహనాలద్వారానే కోట్లకుకోట్ల సొమ్ముని తరలిస్తున్నారని సీఈవోకి చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. సిన్సియర్ పోలీసులు ఎవరైనా చెక్ చేస్తే, రోగిఉన్నట్లు భ్రమింపచేస్తారు. ప్రభుత్వానికి ఇటువంటి సలహాలు ఎవరిస్తున్నారో తెలియడంలేదు. సలహాదారులా లేక... ఖిలాడీకింగ్ విజయ సాయిరెడ్డి చెబుతున్నాడా? వాహానాల్లో చేరాల్సిన సొమ్ము చేరాల్సిన చోటికి చేరుతుంది. పడాల్సిన ఓట్లు పడతాయి. వైసీపీకి కరుడుగట్టిన అభిమానంతో ఉన్న కొందరు పోలీస్ అధికారుల కార్లలో (వాహానాల్లో) కూడా డబ్బు తరలిస్తున్నారని తెలిసింది.

అలాజరగడం లేదు.. జరిగితే సదరుపోలీస్ అధికారులను తక్షణమే తొలగించి, కస్టడీలోకి తీసుకుంటామని డీజీపీ స్టేట్ మెంట్ ఇవ్వగలరా అని అడుగు తున్నాను. పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరురాకుండా నిజంగా అలాంటివి జరిగితేచర్యలు తీసుకోవాలని సీఈవోని కోరాము. కేంద్రబలగాలను సద్వినియోగం చేసేలా నియమించాలని, లోకల్ పోలీసుల అజమా యిషీ, డైరెక్షన్ లేకుండా చూడాలని కోరాము. ఎన్నికలకోడ్ అమల్లో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ (టీటీడీ) ప్రధానార్చకుడిగా రమణదీక్షితుల్ని నియమించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలియచేశాం. గతంలో తొలగించబడిన వ్యక్తిని కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలా నియమించారు? ఆయన వ్యాఖ్యలన్నీ అధికా పార్టీకి అనుకూలంగా, ప్రధాన ప్రతిపక్షనేతకు వ్యతి రేకంగా ఉంటాయికదా? అటువంటివ్యక్తిని ప్రధాన అర్చకుడిగా నియమించడం నేరంకాదా? ఆయననియామకం ఒకవర్గంవారిని సంతోష పెడుతుందికదా? కాబట్టి ఆ నియామకాన్ని వెంటనే రద్దుచేయాలని సీఈవోకి తెలియచేశాం. రమణదీక్షితులు ముఖ్యమంత్రిని విష్ణుమూర్తితో పోల్చడం చాలా అభ్యంతరకరం. ఎన్నోకేసుల్లో ముద్దాయిని, 16నెలలు చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీని, ప్రతిశుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తినిభగవంతుడైన విష్ణుమూర్తితో పోల్చడం, రమణదీక్షితులు దిగజారుడుతనానికి నిదర్శనం. రమణదీక్షితులి వ్యాఖ్యలపై మతపెద్దలు, ధార్మికసంస్థలు, జీయర్ స్వాములు, పెద్దపెద్దమఠాధిపతులు ఎందుకు స్పందించడంలేదో అర్థంకావడం లేదు." అని వర్ల రామయ్య అన్నారు..

డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 130వ జయంతినాడే, ఆ మహనీయుడిని వైసీపీప్రభుత్వం అవమానించిందని, సాక్షిపత్రికలో ప్రచురించిన ఆ మహనీయుడి చిత్రం అవహేళనగా, వ్యంగ్యంగాఉందని, అవినీతిపరులు, డెకాయిట్ల ఫొటోల్లా సాక్షిపత్రికలో ప్రచురించారని టీడీపీ అధికారప్రతినిధి పిల్లిమాణిక్యరావు మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ... "అంబేద్కర్ చిత్రాన్ని ఆ విధంగా ప్రచురించడం ఎవరూ చేయని సాహసం. అంబేద్కర్ మహనీయుడి చిత్రాన్ని సాక్షిపత్రికలో వ్యంగ్యంగా, అవహేళనగా ముద్రించారు. అవినీతిపరులు, కుంభకోణాలకు పాల్పడేవారు, డెకాయిట్ల ఫోటోమాదిరి అంబేద్కర్ ఫొటోని ప్రచురించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించాలి. అలా ప్రచురించినందుకు జగన్మోహన్ రెడ్డి దళితజాతికి క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకుంటే దళితులంతా సాక్షి పత్రికను బహిష్కరిస్తారు. అంబేద్కర్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని అభివర్ణించడం కంటే సిగ్గుమాలిన తనం మరోటిలేదు. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నది జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి అమలుచేయడం లేదు. దళితులకు రక్షణగా అంబేద్కర్ తీసుకొచ్చిన చట్టాలను జగన్ అమలుచేస్తున్నాడా? శ్రీకాకుళం నుంచి చిత్తూరువరకు దళితులను నానారకలుగా హిం-సి-స్తుం-టే ఏనాడూ నోరెత్తని వైసీపీలోని దళితనేతలు, జగన్మోహన్ రెడ్డి దళితులకోసం పాటుపడుతున్నాడని చెప్పడం, ఆయా వర్గాలను వంచించడమే అవుతుంది. మేరుగనాగార్జున మాటలు వింటుంటే, అసలు ఆయన దళితుడేనా అన్న అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో అడుగడుగునా దళితులను అవమానిస్తున్నది జగన్ ప్రభుత్వమేననే విషయం నాగార్జునకు తెలియదా? దళితులను వేధిస్తున్నవారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటోంది"

manikyalarao 14042021 2

"దళితులను పిచ్చివాళ్లను చేసింది, వారికి శిరోముండనాలు చేసింది, వారిపై అట్రాసిటీ కేసులపెట్టింది.... వారిపై అ-త్యా-చా-రా-లు-, హ-త్య-ల-కు పాల్పడింది అందరూ వైసీపీనేతలు, కార్యకర్తలే. దళితుల అవకాశాలను, అభివ్రుద్ధిని జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. వివేకా హ-త్య పై లోకేశ్ విసిరిన సవాల్ పై జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదు. కేసు విచారణపై రాష్ట్రప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని జగన్ ప్రతిపక్షంలోఉన్నప్పుడు అన్నాడు. కేసు విచారణను ఆనాడు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన వ్యక్తి, అధికారంలోకి వచ్చాక దోషులను ఎందుకు పట్టుకోలేదు. వారు పట్టుబడితే తనకే ప్రమాదమని ఆయన భావిస్తున్నాడా? తన బాబాయిని చం-పిం-ది ఇంటిదొంగలేనని ముఖ్యమంత్రికి తెలుసు. తమకు, తమకుటుంబానికి సంబంధంలేదని, తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధమని లోకేశ్ అంటే, జగన్ ఎందుకు జారుకున్నాడు. కేసు విచారణలో సీబీఐఎందుకు ముందుకెళ్లలేకపోతోందని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆలోచన చేయడం లేదు. ఆనాడు ఎన్టీఆర్ పక్కన చేరి, టీడీపీని కబళించాలని ఒక శిఖండి చూసింది. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఆ శిఖండి నుంచి టీడీపీని చంద్రబాబు కాపాడారని కన్నాలేసే కన్నబాబు తెలుసుకుంటే మంచిది. టీడీపీని కాపాడుకోవడంతో పాటు, గడపగడపకు అభివ్రుద్ధిని పరిచయం చేసిన ఘనత చంద్రబాబుది. తన తండ్రిని చం-పిం-ది రిలయన్స్ వారేనన్న జగన్, ఇప్పుడు వారితో రాసుకుపూసుకు తిరగడమేంటి?

రిలయన్స్ వారే తనతండ్రిని చం-పి-తే, జగన్ వారితాలూకా మనిషిని ఎందుకు రాజ్యసభకు పంపాడు? తప్పుడు ప్రమాణాలతో తనక్షేత్రాన్ని అపవిత్రం చేస్తాడని, ఏడుకొండలకు అపకీర్తి కలుగుతుందని ఏడుకొండలవాడే ముఖ్యమంత్రిని తిరుపతికి రాకుండా చేశాడు. సొంత బాబాయిని చం-పిం-ది ఇంటిదొంగలేనని ముఖ్యమంత్రికి తెలుసు. బయటివారు చం-పి-తే జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టేవాడా? జగన్ కు, ఆయన కుటుంబంలోని వారికి వివేకా హ-త్య-తో సంబంధం లేకుంటే, ఆయన ఎందుకు ప్రమాణానికి రాలేదు. తల్లిని, చెల్లిని రోడ్డుపై పడేసింది జగన్ కాదా? ఒక చెల్లి ఢిల్లీ వీధుల్లో తనకు న్యాయం చేయాలని విలపిస్తుంటే, ఆమెకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోతున్నాడు. మరోచెల్లి తెలంగాణ వీధుల్లో తిరుగుతోంది. ఏడుకొండలవాడి సాక్షిగా తిరుపతిని, తిరుమలక్షేత్రాన్ని జగన్ బారినుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తిరుపతి పార్లమెంట్ ఓటర్లదే. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థికి ఓటేసే ముందు ఓటర్లంతా ఒక్కసారి ఆలోచన చేయాలి. తండ్రి శ-వం తాలూకా ర-క్త-పు ముద్దలను పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రిపదవికోసం జగన్ ఆరాటపడ్డాడు. వ్యక్తిగత సేవచేసే వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి మరణించిన దళితఎంపీ కుటుంబాన్ని, దళితజాతిని తీవ్రంగా అవమానించాడు. తిరుపతి పార్లమెంట్ తోపాటు, రాష్ట్రాన్ని కాపాడుకునేదిశగా తిరుపతివాసులు ఆలోచన చేయాలి. తిరుపతి పార్లమెంట్ ఓటర్లు అత్యధిక మెజార్టీతో పనబాకలక్ష్మిని గెలిపిస్తే, జగన్ జైలుకెళ్లడం ఖాయమని స్పష్టంచేస్తున్నా." అంటూ చెప్పుకొచ్చారు.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. లోకేష్ , చంద్రబాబు రోడ్ షోలు, మీటింగ్ ల తో, మంచి ఊపు వచ్చింది. మరో పక్క వైసీపీ ప్రచారం రొటీన్ అయిపొయింది. కొడాలి నాని బూతులు, అనిల్ యాదవ్ అరుపులు, పెద్దిరెడ్డి శాపనార్ధాలు తప్ప, వైసీపీకి ఊపు తెచ్చేలా వారి ప్రచారం సాగటం లేదు. కేవలం చివరి రెండు రోజులు, చెయ్యాల్సిన వాటి పైనే ఫోకస్ పెట్టారు. అయితే ఇంటలిజెన్స్ రిపోర్ట్ లు ద్వారా విషయం అర్ధమైన జగన్ మోహన్ రెడ్డి, తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే లోకేష్, వివేక కేసు పై ప్రమాణం చేయాలి అని చెప్పటంతో , ఆ విషయం హైలైట్ అయ్యింది. దీంతో, తిరుపతి వస్తే, ఆ కేసు పై స్పందించాల్సిన పరిస్థితి జగన్ కు రావటంతో, జగన్ వెనకడుగు వేసారు. క-రో-నా కారణంతో తప్పించుకున్నారు. మరో పక్క వివేక కేసు, ఒక పక్క టిడిపి దూకుడుతో, ఉక్కిరిబిక్కిరి అయిన వైసీపీకి, ఒక తలతిక్క వీడియో దొరికింది. ఆ వీడియోను కొన్ని మార్పులు చేర్పులు చేసి, బులుగు మీడియాలోకి, పేటీయం కూలీల తోటి సోషల్ మీడియాలోకి వదిలారు. నిన్న ఉగాది పండగ కూడా చేసుకోకుండా, ఆ వీడియోని తిప్పటం పైనే, వైసీపీ క్యాడర్ మొత్తం పని చేసింది. ఆ వీడియోలో అచ్చేన్నాయుడు, లోకేష్ ని తిడుతున్నాడు అంటూ సృష్టించారు.

blue 14042021 2

అచ్చేన్నాయుడు టిడిపి పార్టీని తిడుతున్నాట్టు చేపించారు. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి, ఏదో సెటిల్మెంట్ విషయంలో, తనకు చంద్రబాబు, లోకేష్ అండగా లేరు అంటూ వాపోతున్నాడు. అసలు చంద్రబాబు, లోకేష్ , ఎందుకు సెటిల్మెంట్ లు చేస్తారు ? ఇవేమీ పట్టించుకోకుండా, తెలుగుదేశం శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బ తీయాలని, అచ్చేన్నాయుడు పై అనుమానాలు రేకెత్తించే విధంగా చేయాలని ప్లాన్ చేసారు. అయితే వారి ఆశలు, పాపం 24 గంటలు కూడా నిలువలేదు. అచ్చేన్నాయుడు, లోకేష్ ఇద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. ఒకరి పై ఒకరు చేతులు వేసి, ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ చర్యతో, తాము అంతా ఒక్కటే అని, బీసీ నాయకత్వానికి, లోకేష్, టిడిపి ఎంత గౌరవం ఇస్తుందో చెప్పకనే చెప్పారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా, తమను ఏమి చేయలేరు అనే సంకేతాలు ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ ని ఇలా చూసినా బులుగు మీడియా, నిన్న అంత కాష్ట పడి చేసిన ఎడిటింగ్ లు అన్నీ, బూడిదలో పోసిన పన్నీరు కావటంతో, పాపం వారి రియాక్షన్ ఇప్పుడు ఏమిటో అంటూ టిడిపి నేతలు అంటున్నారు.

కొడాలి నాని అంటేనే, ఆయన భాషకు పెట్టింది పేరు. నీ అమ్మ మొగుడుతో మొదలు పెట్టి, బూతులుతోనే మాట్లాడుతూ ఉంటారు. ఎవరి ఎన్ని చెప్పినా డోంట్ కేర్ అంటారు. చివరకు తన అనుచరులు పేకాటలో దొరికినా, ఏమవుతుంది, ఫైన్ కడతారు, మళ్ళీ వచ్చి ఆడుకుంటారు అంటూ, మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు ఇవన్నీ పట్టించుకోరు అనుకుంటారో ఏమో కానీ, ఆయన శైలి మాత్రం మారదు. ఇక చంద్రబాబు, లోకేష్ గురించి అయితే చెప్పే పనే లేదు. రెండు సార్లు టికెట్ ఇచ్చి, రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుని, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే, ఇప్పుడు ఈయన ఏ పని చేసుకునే వాడో గుడివాడ ఒక్కటే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు అని టిడిపి నేతలు విమర్శలు చేస్తూ ఉన్నా, ఆయన మాత్రం చంద్రబాబు పై ఒంటి కాలు మీద వెళ్తూ ఉంటారు. ఈయన పని తనం నచ్చిన జగన్ గారు, ఈయన్ని తిరుపతిలో ఒక ఇంచార్జ్ గా పెట్టారు. తిరుపతిలో ఉప ఎన్నికల ప్రచారంలో, అదే కోవాలో, కొడాలి నాని ప్రచారం చేస్తున్నారు. అందరినీ బూతులు తిడుతూ కొడాలి నాని ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు ఆయన ఆడవారిని కూడా తిట్టటం, బాడీ షేమింగ్ చేయటం చేస్తున్నారు. ఇది చాలా జుబుక్సాకరంగా ఉంటుందని అందరూ వాపోతున్నారు.

kodalinani 140420212

నిన్న సత్యవేడులో మాట్లాడిన కొడాలి నాని, టిడిపి అభ్యర్ధి పనబాక లక్ష్మీని ఉద్దేశిస్తూ బాడీ షేమింగ్ చేసారు. ఆయన డైరెక్ట్ గా, ఆమె పేరుతో అనక పోయినా, ఆవిడను టార్గెట్ చేసినట్టు ఇట్టే అర్ధం అవుతుందని. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తికి ఓటు వేయాలని చెప్తూ, ఆవిడకు అనుభవం ఉందని చెప్తుంది, ఏమి చేస్తారు ఆ అనుభవంతో, నువ్వు చంద్రబాబు అంటూ వ్యంగంగా మాట్లాడారు. నాలిక గీసుకోవటానికి కూడా మీ అనుభవం పనికి రాదు అని చెప్తూ, రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని, చురుగ్గా ఉండేవాళ్ళు రావాలని, ఏదైనా సమస్య వస్తే టక్కుని లెగిసి, పరిగెత్తుకుని వచ్చే స్వభావం ఉండాలి, ఫిజిక్ కూడా ఉండాలి, అంతే కానీ బౌన్స్‌ లా వచ్చే వాళ్లని రాజకీయాల్లో పెట్టుకుని ఏం చేస్తాం అంటూ, పనబాక లక్ష్మి పై బాడీ షేమింగ్ చేస్తూ, కొడాలి నాని చేసిన ప్రసంగం ఎబ్బెట్టుగా ఉందని వాపోతున్నారు. ఆడవారి ఆకృతి గురించి మాట్లడే స్థాయికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు దిగజారి పోయి మాట్లాడుతున్నారని, అసలు ఎన్నికల ఎజండా ఏమిటి, వీరు మాట్లాడే మాటలు ఏమిటి అంటూ పలువురు వాపోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read