నిన్న బులుగు మీడియా, పేటీయం సోషల్ మీడియాలో, లోకేష్ ని తిట్టారు అంటూ, ఒక ఫేక్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో అచ్చేన్నాయుడు లోకేష్ ని తిట్టాడని, పార్టీని తిట్టాడు అంటూ, మార్ఫింగ్ వీడియో ఒకటి బులుగు మీడియా తిప్పింది. అయితే నిన్నే దీని పై అచ్చేన్నాయుడు క్లారిటీ ఇస్తూ, వైసీపీని వాయించి పడేస్తే, ఈ రోజు సాక్షి మీడియా సాక్షిగా, అందరూ చూస్తూ ఉండగా లోకేష్, ఆ మార్ఫింగ్ వీడియో పై వాయించి పెట్టారు. ఈ రోజు , తిరుమల వెంకన్న సాక్షిగా లోకేష్ ప్రమాణం కోసం అలిపిరి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ అలిపిరి వద్ద, లోకేష్ మీడియాతో మాట్లాడారు. అయితే యధావిధగా అక్కడ వచ్చిన సాక్షి మీడియా, వివేక కేసు పై కాకుండా, నిన్న బులుగు మీడియాలో వచ్చిన ఫేక్ వీడియో పై లోకేష్ ని ప్రశ్నించారు. నిన్న వెంకట్ అనే మీ కార్యకర్త వీడియో బయటకు వచ్చింది, అందులో మిమ్మల్ని కూడా తిట్టారు కదా, దీని పై మీ సమాధానం ఏమిటి అంటూ, సాక్షి విలేఖరి అడిగారు. దానికి లోకేష్ ఘాటుగా బదులు ఇచ్చారు. మా కార్యకర్తలను మేము పట్టించుకున్నట్టు ఎవరైనా పట్టించుకున్నారా అని సాక్షి విలేఖరిని ప్రశ్నించారు. మాది కార్యకర్తల పార్టీఅని, కార్యకర్తలకు విలువ ఇచ్చే పార్టీ అని, కార్యకర్తల సంక్షేమ నిధి అని, పెట్టి వారికి సహాయం చేస్తున్నాం అని, ఏ పార్టీ అయినా అలా చేస్తుందా అని ప్రశ్నించారు.
కార్యకర్తల కోసం 90 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేసామని, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో చదువుకున్న పిల్లలు, ఐఏఎస్ లు అయిన వారు ఉన్నారని అన్నారు. మీ రాజశేఖర్ రెడ్డి, చం-పే-సి-న మా కార్యకర్తల పిల్లలను ఇక్కడ చదివిస్తున్నాం అని, మీరా మమ్మల్ని కార్యకర్తలకు ఏమి చేయటం లేదు అని అడిగేది అంటూ, సాక్షి విలేఖరి పై ఫైర్ అయ్యారు. ఆ వీడియో ఏంటో, అనేది తేలుస్తాం అని అన్నారు. అయితే నిన్న ఆ వీడియోలో ఉన్న వెంకట్ అనే వ్యక్తి ఏదో వ్యాపారంలో, ఎవరికో డబ్బులు విషయంలో, ఏదో తేడా వస్తే, అది సెటిల్ చేయమని చంద్రబాబు చుట్టూ, లోకేష్ చుట్టూ, బాలయ్య చుట్టూ తిరగటం, వాళ్ళు ఇలాంటివి పట్టించుకోరు కాబట్టి, నేను 30 ఏళ్ళ నుంచి సేవ చేశా, పార్టీకి ఖర్చు పెట్టా, ఇప్పుడు నన్ను పట్టించుకోవటం లేదు అంటూ గొడవ గొడవ చేసాడు. అసులు చంద్రబాబు ఇలాంటి సెటిల్మెంట్ లు చేసే వాడని, ఈయన ఎలా అనుకున్నాడో ఏమో, ఈయన్ను పట్టుకుని ఒక వీడియో తీసుకుని, దాన్ని ఎడిట్ చేసి, నిన్న బులుగు మీడియాలోకి వదిలి సంబరపడ్డారు.