తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, నారా లోకేష్ ఈ రోజు సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించి, బహిరంగ సభలో పాల్గున్నారు. ఈ సందర్భంగా, నాయుడుపేటలో జరిగిన సభలో, సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. జగన్ మోహన్ రెడ్డి 14వ తేదీ తిరుపతి వస్తున్నారని, ఈ సందర్భంగా ఆయనకు సవాల్ విసురుతున్నా అని అన్నారు. వైఎస్ వివేకను మేము చం-పిం-చామని అంటున్నారని, మా పైన ఆరోపణలు చేసారని, అందుకే 14వ తారిఖు మనం ఇద్దరం వెంకన్న సాక్షిగా ప్రమాణం చేద్దామని అన్నారు. అందులో, నా ప్రమేయం కానీ, నా కుటుంబం ప్రమేయం లేదని, తాను ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నాని, జగన్ రెడ్డి కూడా, తనకు, తన కుటుంబ సభ్యులకు కానీ, ఈ హ-త్య లో ఎలాంటి సంబంధం లేదని, వెంకన్న ముందుకు వచ్చి ప్రమాణం చేయగలరా అని, సవాల్ విసిరారు. దీంతో ఇప్పుడు, జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకునే స్థితిలో పడ్డారు. ఇప్పటికే ఈ విషయం పై, గత వారం రోజులుగా అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తుంది. దీంతో జగన్ మోహన్ రెడ్డి, ఆమె తల్లి విజయమ్మని రంగంలోకి దించారు. జగన్ మోహన్ రెడ్డికి ఏమి సంబంధం లేదని, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ, ఒక అయుదు పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే.

lokesh 070420212

ఇక మరో పక్క లోకేష్ తన ప్రసంగంలో జగన్ మోహన్ రెడ్డి వైఫల్యాల గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి ఉన్న 28 మంది ఎంపీలను, తోలు బొమ్ములుగా వర్ణించారు. మొదటి రోజు గొర్రెలు, రెండో రోజు రోబో, మూడో రోజు పిల్లులు అంటూ, జగన్ మోహన్ రెడ్డి ఎంపీలను సంబోధించిన లోకేష్, ఈ రోజు తోలుబొమ్మలు అంటూ హేళన చేసారు. వీళ్ళు రాష్ట్ర సమస్యల పై మోడీని నిలదీయలేరని, మోడీ కనిపిస్తే, కాళ్ళ మీద పడతారని అన్నారు. పుదిచ్చేరి కి హోదా ఇస్తాం అని బీజేపీ అంటే, ఈ తోలు బొమ్మలు పుదిచ్చేరి వెళ్లి బీజేపీకి ఎన్నికల ప్రచారం చేసి వచ్చారని అన్నారు. నెల్లూరు , చిత్తూరు జిల్లాలో ఒక్క విభజన హామీ పైన అయినా, ఈ తోలుబొమ్మలు పోరాటం చేస్తున్నాయా అని ప్రశ్నించారు. కృష్ణపట్నం,దుగ్గిరాజపట్నం,రామాయపట్నం పోర్ట్లు,నెల్లూరు ఎయిర్ పోర్ట్ , ఇలా ఒక్కటి కూడా పట్టించుకోలేదని లోకేష్ అన్నారు. ఒక సీనియర్ మహిళగా, అనుభవం ఉన్న వ్యక్తిగా, మహిళలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం గురించి పోరాడే, మన ఇంటి లక్ష్మీ, పనబాక లక్ష్మీ గారిని గెలిపించాలని కోరారు.

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం, గొనుగునూరు గ్రామ పంచాయతీ పేటగుట్టలో సుబ్రమణ్య స్వామీ విగ్రహాల ద్వంసం పై రాష్ట్ర డిజిపి కి లేఖ రాసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. "జూన్ 2019 నుండి రాష్ట్రంలో ప్రార్ధనా స్థలాలపై దా-డు-లు పెరిగిపోయాయి. తాజాగా పేట్టగుట్టలో సుబ్రమణ్య స్వామీ దేవాలయంలోని విగ్రహాలు ద్వసం చేయబడ్డాయి. ప్రభుత్వ ఉదాసీన వైఖరితో రాష్ట్రంలో అసాంఘీక శక్తులు పేట్రేగిపోతున్నాయి. పోలీసులు నేరస్తులను పట్టుకోకుండా న్యాయం చేయాలని కోరుతున్న తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఏప్రిల్ 6, 2021 న పోలీసులు 40 మంది టిడిపి నాయకులను అరెస్టు చేసి కనీసం తిండి కూడా పెట్టకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ త్రిప్పుతున్నారు.నిన్న అర్ధరాత్రి పోలీసులు వారికి సెక్షన్ 160 కింద నోటీసులు జారీచేశారు. అరెస్టు చేసిన మొత్తం 40 మంది నాలుగు గ్రామాలకు చెందిన గౌరవ మాజీ సర్పంచ్ లు, ఎంపీటిసి అభ్యర్ధులు ఉన్నారు. సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేయడం అర్ధరహితం, కుప్పం పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ నం.69/2021 నమోదు చేయటం అన్యాయం. జరుగుతున్న పరిణామలను తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తెదేపా నాయకులపై సైతం కేసులు పెట్టారు. న్యాయం కోసం వచ్చిన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం కలోనియల్ వలస పాలనను తలపిస్తుంది.

dgp 07042021 2

"ఈ రోజు 07.04.2021 న మాజీ అగ్రికల్చర్ మార్కెటింగ్ మాజీ డైరక్టర్ సత్యేంద్ర శేఖర్, కుప్పం అర్బన్ పార్టీ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ మరియు కాణిపాకం వెంకటేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు." ఆశ్చర్యకరంగా ఎప్.ఐ.ఆర్.నం.69/2021 కుప్పం పోలీస్ స్టేషన్ లో రికార్డు చేయగా... అదుపులోకి తీసుకున్న ముగ్గురు నాయకులను గుడుపల్లి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఒక వర్గం పోలీసులు అధికార వైసీపీతో కుమ్మక్కై రాజకీయ కక్షసాధింపుతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. పోలీసులు తెదేపా నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తవేసి నిజమైన నేరస్తులను పట్టుకోవాలి. అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న కొంత మంది పోలీసులు అధికారులపై విచారణకు ఆదేశించాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రార్ధనా స్థలాలకు రక్షణ కల్పించి వాటిని కాపాడాలి. పెట్టీ రాజకీయాలకు అతీతంగా పోలీసులు చర్యలు తీసుకున్నప్పుడే రాష్ట్రంలోని ప్రార్ధనా స్థలాలలై దాడులు ఆగుతాయి. ప్రజలలో పోలీసులపై నమ్మకం కలుగుతుంది."

నిన్న వైఎయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న సిబిఐ, ఈడీ కేసుల్లో విచారణకు హాజరు కావటం లేదని, ఇష్టం వచ్చినట్టు విచారణ ఎగ్గోడుతున్నా, కోర్టులు ఏమి అనటం లేదని, అలాగే ఆయన కేసుల్లో సహా నిందితులుగా ఉన్న వారికి, పదవులు ఇస్తున్నారని, మరో పక్క వివిధ పార్టీల నేతలు, మా జగన్ జైలుకు వెళ్తాడాని వార్నింగ్ ఇస్తున్నారని, ఇవన్నీ అసలు ఎందుకు, సిబిఐ జగన్ బెయిల్ రద్దు చేసి, త్వరగా విచారణ చేయాలని, సిబిఐ కోర్టులో పిటీషన్ వేసినట్టు నిన్న చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జగన్ బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామరాజు వేసిన పిటీషన్ పై, సిబిఐ కోర్టు ఏమి చెప్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రోజు కొన్ని టీవీ చానల్స్ లో, రఘురామరాజు సిబిఐ కోర్టులో వేసిన పిటీషన్ ని రిజెక్ట్ చేసారు అంటూ వార్తలు వచ్చాయి. రఘురామరాజు వేసిన పిటీషన్ సరిగ్గా లేదని, అందుకే ఆయన పిటీషన్ రిజెక్ట్ చేసారు అంటూ కొన్ని టీవీ చానల్స్ లో వార్తలు వచ్చాయి. అయితే ఇంకేముంది, ఈ వార్త పట్టుకుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైడ్ సోషల్ మీడియా చెలరేగి పోతుంది. రఘరామరాజు పై బూతులతో విరుచుకు పడుతూ, మా అన్నని టచ్ కూడా చేయలేవు, ఇదీ అదీ అంటూ, వారికి తెలిసిన తాడేపల్లి విద్యతో చెలరేగిపోయారు.

rrr 07042021 2

అయితే వీరి ఆనందం గంట కూడా అవ్వకుండానే, రఘురామ రాజు ఓక వీడియో సందేశం పంపిస్తూ, బ్లూ మీడియా చేస్తున్న అసత్య ప్రచారం పై, విరుచుకు పడ్డారు. ఆయన మాట్లాడుతూ, తన పిటీషన్ ఏదో రిజెక్ట్ చేసినట్టు, ఆ మీడియా చానల్స్ లో వార్తలు వేసుకుని సంబరపడుతున్నారని అన్నారు. అయితే వాస్తవం ఏమిటి అంటే, సిబిఐ కోర్టు తన పిటీషన్ రిజెక్ట్ చేయలేదని, కొన్ని అంశాలు పై క్లారిటీ కోరుతూ వెనక్కు పంపించారని అన్నారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి బెయిల్ కాపీ అడిగారని, మరొక అంశం పైన కూడా మరిన్ని వివరాలు అడిగారని, కొన్ని టెక్నికల్ రీజన్స్ తో వెనక్కు పంపించారు కానీ, రిజెక్ట్ చేయలేదని అన్నారు. అయితే మళ్ళీ శుక్రవారం నాడు, అన్ని వివరాలతో మళ్ళీ, సిబిఐ కోర్టు ముందు పిటీషన్ వేస్తామని అన్నారు. వాళ్ళు ఏదో సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ పిటీషన్ అడ్మిట్ కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అవేమి కుదరవు అని, ఈ పిటీషన్ సిబిఐ ముందుకు విచారణకు వస్తుందని, వచ్చే వారం ఈ కేసు పై ఆదేశాలు ఉంటాయని అనుకుంటున్నామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత అప్పులు అధికంగా చేస్తూ, ప్రజల నెత్తిన బండను పెడుతున్న విషయం తెలిసిందే. ఆదాయం సంపాదించే మార్గాలు రోజు రోజుకీ తగ్గిపోవటంతో, కేవలం అప్పుల మీద నెట్టుకుని వస్తున్నారు. గత చంద్రబాబు హాయాంలో, 5 ఏళ్ళలో లక్షా 25 వేల కోట్లు అప్పు చేస్తే, జగన్ మోహన్ రెడ్డి వచ్చిన 22 నెలల్లోనే లక్షా 50 వేల కోట్ల వరకు అప్పులు చేసారని లెక్కలు చెప్తున్నాయి. ఇక దీనికి మరో లక్ష కోట్లు పెండింగ్ బిల్లులు అధనం. ఇలా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు అంటూ, వివిధ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్రానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. అయితే కేంద్రం ఇప్పటి వరకు ఆపింది లేదు. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు కేంద్రం కొన్ని నిబంధనలు పాటించాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 15 వ ఆర్ధిక సంఘం సిఫారుసు మేరకు, కొంత లిమిట్ వరుకే అప్పులు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర జీడీపీలో, కేలవం నాలుగు శాతం వరుకే మాత్రం, నికరంగా రుణాలు పొందే వీలు ఉంటుంది. దీని ప్రకారం లెక్క కట్టిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్ధిక ఏడాదిలో రూ.42,472 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రుణంగా పొందే అవకాసం ఉంటుంది. ఇందులోనే అన్ని రకాల అప్పులు ఉంటాయని, కేంద్రం స్పష్టం చేసింది.

debt 07042021 2

ఈ పరిమితి దాటి అప్పులు చేయటానికి వీలు లేదని కేంద్రం తేల్చి చెప్పింది. మరో పక్క, ఈ ఏడాది కచ్చితంగా రూ.27,589 కోట్లు రూపాయలు పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేయాలని తెలిపింది. అలా చేయని పక్షంలో, రుణ పరిమితిని మరి కొంత తగ్గిస్తారు. పెట్టుబడి వ్యయం చెప్పినంత ఖర్చు చేయకపోతే, 0.5 శాతం వరకు ఋణం పొందే అవకాసం కోల్పోతారు. అంటే దాదాపుగా 5 వేల కోట్లు వరకు రుణ పరిమితి తగ్గిపోతుంది. ఇక దీంతో పాటుగా సమగ్ర వివరాలు పంపాలని, కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రెండు రకాల ఫార్మటు లు , రాష్ట్ర ప్రభుత్వానికి పంపి, అవి పూర్తి చేసి పంపించామని కోరారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, రుణ పరిస్థితి, డిస్కంల వివరాలు, ఇలా పూర్తి వివరాలు కేంద్రానికి పంపించాలని కోరారు. ఇవి పంపిన తరువాతే, ఆర్బిఐ నుంచి రుణం పొందే అవకాసం ఉంటుందని, కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు 80 వేల వరకు ఏడాదికి అప్పు చేస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పుడు సగానికి ఈ అప్పు తగ్గించటంతో, ఎలా నెట్టుకుని వస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read