గత చంద్రబాబు హయాంలో, అనేక ఫేక్ అంశాలు ప్రచారంలోకి వచ్చి, చివరకు ఈ అబద్ధాలు తిప్పి కొట్టలేక,ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కూడా. అయితే ఆ ఫేక్ ప్రచారాల్లోని అంశాలు మాత్రం, ఇప్పటికీ చర్చలో ఉన్నాయి. అయితే ఈ సారి అవి వైసీపీకి ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. అవన్నీ నిజాలు కావని, ఒక్కోటి ఒక్కోటి ఇప్పుడు, ప్రజలకు తెలుస్తున్నాయి. అలంటి ఒక అతి పెద్ద ప్రచారామే, పింక్ డైమెండ్. శ్రీవారి ఆలయంలో పింక్ డైమెండ్ ఉండేదని, దాన్ని దేశాలు దాటించారు అంటూ, ఏకంగా అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలు చేసారు. ఈ ఆరోపణలు అందుకున్న వైసీపీ, తమకు వచ్చిన టక్కుటమార విద్యలు అన్నీ ఉపయోగించి, అది చంద్రబాబు అమ్మేశాడు అంటూ, ప్రజలను నమ్మించే ప్రయత్నం కూడా చేసారు. విజయసాయి రెడ్డి అయితే, ఆ పింక్ డైమెండ్ తో పాటుగా, శ్రీవారి నగలు కూడా చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని, తీవ్రమైన ఆరోపణలు చేసారు. దీంతో అప్పటి టిటిడి బోర్డు, అసలు లేని పింక్ డైమెండ్ పై, ఈ గోల ఏమిటి అంటూ, కోర్టులో రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డి పై పరువు నష్టం దావా వేసింది. ఈ పిటీషన్ ఇంకా విచారణలో ఉంది. అయితే ఇది పక్కన పెడితే, అసలు ఈ ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు గారు, చాలా రోజులు తరువాత, మీడియా ముందుకు వచ్చారు.
తనను మళ్ళీ నియమించిన జగన్ మోహన్ రెడ్డి గారికి, ధన్యవాదాలు తెలిపేందుకు తాడేపల్లి వచ్చి, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా సోదరులు, మీ పైన పింక్ డైమెండ్ పై, ఇప్పటికీ మీ పైన పరువు నష్టం కేసు ఉంటే, మీరు మళ్ళీ ఈ పదవి తీసుకోవటం విమర్శలు వస్తున్నాయి, పింక్ డైమెండ్ ఏమైంది అని ప్రశ్నించగా, అది కోర్టు పరిధిలో ఉన్న అంశం అని, దాని పై తాను ఏమి మాట్లాడను అంటూ, రమణ దీక్షితులు సమాధానం చెప్పారు. ఇక ఈ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి పై, పొగడ్తలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి విష్ణుమూర్తిలా ధర్మాన్ని రక్షిస్తున్నాడని అన్నారు. ధర్మాన్ని రక్షిస్తున్న జగన్ మోహన్ రెడ్డి సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్ధించినట్టు చెప్పారు. అలాగే అర్చకులకు భూమి ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డిని కోరినట్టు చెప్పారు. ఇక తిరుమల పై లేని పోని ఆరోపణలు చేస్తూ, రాజకీయాలకు వాడుకుంటున్నారని, ఇలా చేయటం బాధ వేస్తుందని, రాజకీయాలకు అతీతంగా గుడిని ఉంచాలని అన్నారు.