తిరుపతి ఉప ఎన్నిక వేడి, నెమ్మదిగా హీట్ ఎక్కుతుంది. వేసవి ప్రారంభమై, రోజు రోజుకీ వాతావరణం వేడెక్కుతున్నట్టు, తిరుపతి ఎన్నిక కూడా రోజు రోజుకీ హీట్ ఎక్కుతుంది. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకోవటం తారా స్థాయికి చేరుకుంది. అయితే కొంత మంది చేసే విమర్శలు మాత్రం, చాలా చిల్లరగా ఉంటున్నాయి. ముఖ్యంగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగ్ లు, చూస్తే, ఇలాంటి వాళ్ళు కూడా నీతులు చెప్పే వాళ్ళేనా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డికి తోడుగా, సోము వీర్రాజు కూడా తయారు అయ్యారు. ఎప్పుడో పాత వీడియోలు, చిల్లర చిల్లరగా, సోషల్ మీడియాలో పెట్టుకునే బ్యాచ్, పెట్టుకునేవి తీసుకుని వచ్చి, అఫీషియల్ బీజేపీ ఖాతాలో వేస్తున్నారు. అప్పట్లో పనబాక లక్ష్మి ఇలా చంద్రబాబుని తిట్టారు అంటూ ఒకటి, రామ్మోహన్ నాయుడు స్పెషల్ స్టేటస్ అడిగితే, చంద్రబాబు వద్దు అన్నారు అంటూ మరో వీడియో పోస్ట్ చేసారు. అయితే ఇదే సోము వీర్రాజు స్పెషల్ స్టేటస్ కోసం రోడ్డు మీద డొల్లుతూ పోరాడిన ఫోటోలు అంటూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటికి సమాధానం ఉండదు. చంద్రబాబుని దండలతో ముంచెత్తి, కాకా పట్టి, ఏమ్మెల్సీ టికెట్ తీసుకోవటం అడిగితే సమాధానం ఉండదు. అసలు ఇవన్నీ ఎందుకు ? తిరుపతికి ఏమి చేస్తారు అనేది కదా కావలసింది ?

panbaka 31032021 2

మేము తిరుపతికి ఇది చేస్తాం అది చేస్తాం, వాళ్ళు తిరుపతికి ఏమి చేయలేదు. ఎన్నికల అజెండా అంటే ఇలా ఉండాలి. కానీ బీజేపీ మాత్రం, ఎంత సేపు చంద్రబాబు స్మరణ చేసుకుంటూ, జగన్ ని సాఫ్ట్ గా టచ్ చేస్తూ వెళ్తుంది. వీళ్ళ అజెండా ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. తిరుపతి గెలవాలని బీజేపీ అనుకుంటుందా ? లేక తెలుగుదేశం రాకూడదు అనే అజెండా ఒక్కటే బీజేపీకి ఉందా అనేది అర్ధం కావటం లేదు. అయితే సోము వీర్రాజు పై, టిడిపి ఎంపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి ఫైర్ అయ్యారు. సోము వీర్రాజు సోషల్ మీడియాలో, నేను చంద్రబాబుని తిట్టాను అంటూ ఒక వీడియో పెట్టారని, అది ఫేక్ వీడియో అని , మార్ఫింగ్ చేసారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఫేక్ వీడియోలు పెట్టి, తప్పుడు ప్రచారం చేస్తున్న వీర్రాజు పై పోలీస్ కేసు కూడా పెడతానని అన్నారు. సోము వీర్రాజు చేస్తున్న తప్పుడు ప్రచారం పై, ఏ దేవుడు ముందు అయినా, తాను వచ్చి ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. సోము వీర్రాజుకు దమ్ము ఉంటే తన సవాల్ స్వీకరించి, ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి అంటూ హైకోర్టు ప్రశ్నించింది. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. దీని పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. దీని పై ఈ రోజు ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించింది. అక్రమ మైనింగ్ చేస్తున్న వారికి నోటీసులు ఇచ్చారా ? వారి నుంచి జరిమానా వధించారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీని పై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది, అక్రమ మైనింగ్ చేస్తున్న వారి పై క్రిమినల్ కేసు ఇప్పటికే నమోదు చేసామని చెప్పారు. తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని, దీని పై అఫిడవిట్ రూపంలో, పూర్తి స్థాయిలో కోర్టుకు తెలియ చేస్తామని కోర్టుకు వివరించారు. ఇరు వైపుల వాదనలు విన్న ధర్మాసనం, ఈ కేసు విచారణను వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది. మరో పక్క ఈ కేసు పై అంబటి రాంబాబు పై ప్రతిపక్ష టిడిపి విరుచుకు పడింది. టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చింది. ప్రతిఇంటిపై రూ.2.50లక్షలవరకు భారంమోపారు. ముందుంది ముసళ్లపండగనే నిజాన్ని రాంబాబు మర్చిపోతే ఎలా? తన నియోజకవర్గం సంగతిచూసుకోలేని వ్యక్తి, రాజకీయాల్లో మకుటంలేనిమహారాజైన చంద్రబాబుని విమర్శించడం సిగ్గుచేటు. "

ambati 30032021 2

"సత్తైనపల్లి నియోజకవర్గం లోని రాజుపాలెం మండలం కొండమోడులో జరుగుతున్న అక్రమమైనింగ్ వ్యవహారంపై వైసీపీవారే అంబటిపైకోర్టులో కేసువేశారు. అవన్నీమర్చిపోయి, ఎదుటివారిపై విమర్శలుచేస్తే, జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవిఇస్తాడనే భ్రమల్లో రాంబాబు ఉన్నాడు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడుజరుపుకుంటే, అంబటికి వచ్చిన నొప్పేమిటి? ఆవిర్భావదినోత్సవాలు ఉదయా న్నే చేయాలనే నిబంధన ఎక్కడుందో రాంబాబు చెప్పాలి. కోవిడ్ దృష్ట్యానే టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తాము సాదాసీదాగా నిర్వహించడం జరిగిం ది. ప్రజలు గెలిపిస్తేనో, 151 సీట్లుఇచ్చేస్తేనో, జగన్మోహన్ రెడ్డి తప్పులు, అవినీతికేసులుఅన్నీ మాసిపోయినట్లు కాదు. ఆ విషయంకూడా తెలియకుండా రాంబాబు మీడియాముందు మాట్లాడితేఎలా? రాజకీయ విమర్శ లుచేయడం రాంబాబు మానుకోవాలి. కాంగ్రెస్ నుంచి రాజశేఖర్ రెడ్డి గెలిస్తే, జగన్మోహన్ రెడ్డి కూడా ఆపార్టీలో నే కొనసాగాలికదా? సొంతపార్టీఎందుకు పెట్టాడు? రెండే ళ్లుంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీప్రభుత్వం ఏం ఊడబెరి కిందో ప్రజలకు అర్థమవుతుంది. ఇసుక, మద్యం వ్యాపా రాలతో ఎంతకాలం నెట్టుకొస్తారోప్రజలు గమనిస్తూనే ఉన్నారు." అని అన్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ, మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారయణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. ప్రధానంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంటూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటాన్ని రద్దు చేయాలని, ఆయన పిటీషన లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు, విశాఖ ఉక్క ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 5 వేల కోట్లు ఖర్చు చేసి, పన్నుల రూపంలో 30 వేల కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తే, ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమి లేదని, తన పిటీషన్ లో స్పష్టం చేసారు. విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేటీకరణ అంశాన్ని, ఇప్పటికే వ్యతిరేకిస్తూ, కార్మిక సంఘాలు, గత కొన్ని రోజులుగా, విశాఖలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. అనేక పౌర సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసారు. ఈ పరిస్థితిలో సిబిఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. అయితే రేపు హైకోర్టులో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణకు వచ్చే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. రేపు ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ కేసుని విచారణకు తీసుకుంది, నోటీసులు ఇస్తుందా లేదా అని వేచి చూడాలి.

hc 3003200021 2

ఇది ఇలా ఉంటే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పై పార్లమెంట్ లో ముగ్గురు మాత్రమే ఉన్నా, కేంద్రాన్ని మాత్రం టిడిపి ఎంపీలు వదలటం లేదు. ఇప్పటికే రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో విశాఖ ఉక్కు పై ఇచ్చిన స్పీచ్ తో, ఒక్కసారిగా ఈ అంశం పై, దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే దీని పై మరో టిడిపి ఎంపీ గల్లా జయదేవ్, ఈ విషయం పై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన కు , లేఖ రాసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగటం మంచిది కాదని, వేల మంది కార్మికుల జీవితాలు , దాంతో ముడి పడి ఉన్నాయని, అందుకే కేంద్ర నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. దీనికి బదులు ఇస్తూ, కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి, తిరిగి మళ్ళీ గల్లా జయదేవ్ కు ఈ రోజు లేఖ రాసారు. ఇప్పటికే కేంద్రం, ప్రైవేటీకరణ పై నిర్ణయం తీసుకుందని, తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణ వల్ల అంతా మంచి జరుగుతుందని, అక్కడ పని చేసే ఉద్యోగులకు కానీ, స్టీల్ ప్లాంట్ లో భాగస్వామ్యం అయిన వారికి కాని ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దీనికి సంబంధించి అనేక చర్యలు తీసుకున్నామని, గల్లాకు లేఖ రాసారు.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో హైకోర్టు న్యాయవాదుల బృందంతో జాతీయ అధ్యక్ష్యులు నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా నరేగా బిల్లుల చెల్లింపుల్లో నిబంధనలు అతిక్రమిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి చర్చకు వచ్చింది. నేడు ఆ విషయంపై హైకోర్టు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేయటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. నరేగా బిల్లుల చెల్లింపులపై హైకోర్టు ధర్మాసనం తీర్పును కూడా చిత్తశుద్దితో ప్రభుత్వం అమలు చేయక దిక్కరణకు వడిగట్టడంపై అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు బోను ఎక్కించే అవకాశముంటుందని కోర్టు హెచ్చరించింది. 7 లక్షల మంది సామాన్యులు, మద్యతరగతికి చెందిన వారి నరేగా బిల్లులు రెండేళ్ల నుంచి నిబంధనలు అతిక్రమించి తొక్కిపెట్టడం ఎంతో కాలం సాద్యం కాదు. చట్టం చేతిలో మూర్ఖత్వం చివరకు నిలువజాలదు. కనుక ఇప్పటికైనా అధికారుల్ని బలిపెట్టేవిధానాన్ని జగన్ రెడ్డి విడనాడాలి. నరేగా పనులు చేసిన వారిపై కక్ష్యసాధింపు విధానాలు మానుకోకపోతే జగన్ రెడ్డి ప్రభుత్వం తగు మూల్యం చెల్లించుకోకతప్పదని అభిప్రాయం వ్యక్తమైంది. న్యాయవాదులతో జరిగిన సమావేశంలో వైసీపీ ప్రభుత్వం ప్రతి బిల్లు చెల్లించేంతవరకు గట్టి పోరాటం కొనసాగించాలని న్యాయవాదులను చంద్రబాబు నాయుడు కోరారు.  నరేగా పనులు చేసి నష్టపోయిన వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read