జాతీయఉపాధి హామీపథకం కింద 2018-19, 2019-20లకు గాను, గతంలో టీడీపీప్రభుత్వం దాదాపు రూ4వేల కోట్ల విలువైనపనులు చేయించిందని, ఆ పను లకు సంబంధించిన నిధులచెల్లింపుపై ఇప్పుడున్న ప్ర భుత్వ ఎందుకు స్పందించడంలేదని టీడీపీసీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నిలదీశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిధుల విడు దల వ్యవహారంపై టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో కూడా ప్రస్తావనచేశారన్నారు. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలకు విజ్ఞప్తిచే సినప్పటికీ జాప్యం జరుగుతుండటంతో నిధులకోసం కోర్టులను కూడా ఆశ్రయించడం జరిగిందన్నారు. దానిపై హైకోర్టు న్యాయమూర్తి జే.కే.మహేశ్వరి నెలరోజుల్లో ఉపా ధి హామీ పనులనిధులు చెల్లించాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. గతప్రభుత్వంలో జరిగిన పను లకు సంబంధించి కేంద్రం రూ.2,400కోట్లను విడుదల చేసిందని, గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లులకు సొ మ్ముచెల్లించాలని, ఒకవేళ చెల్లింపులు ఆలస్యమైతే, ఆ కాలానికి వడ్డీకూడా కలిపి ఇవ్వాలని కేంద్రప్రభుత్వంలో ని నరేగా చట్టంలో పేర్కొనడం జరిగిందని మాజీమంత్రి వివరించారు. గతప్రభుత్వం చేసిన పనులకు నిధులు చెల్లించకుండా ఇప్పుడున్నప్రభుత్వం విచారణలపేరుతో కావాలనే జాప్యంచేస్తోందన్నారు. ఒకసారి సోషల్ ఆడిట్ జరిగాక దానికిసంబంధించి, చట్టప్రకారం ఎటువంటి నివేదికలు ఇవ్వడం కుదరదని విజిలెన్స్ బృందం, పంచాయతీరాజ్ శాఖాధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేసినప్పటికీ, కావాలనే పాలకులు జాప్యం చేస్తున్నా రన్నారు. కావాలనే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరి స్తోందన్న ఆలపాటి, ఈ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధిపనులు జరిగాయో చెప్పాల న్నారు. పాఠశాలలు, పంచాయతీభవనాలు, రోడ్లు, కాల్వలు, నీటవసతి కల్పన వంటి ఇతరత్రా పనులన్నిం టినీ వైసీపీప్రభుత్వం పక్కనపెట్టిందన్నారు. గతప్రభు త్వంలో చేసిన పనులకు సంబంధించి నిధులు ఇవ్వకుం డా కాంట్రాక్టర్లను, కూలీలను ఎందుకు వేధిస్తున్నారో పా లకులు సమాధానం చెప్పాలని రాజేంద్రప్రసాద్ డిమాం డ్ చేశారు.

పెండింగ్ బకాయిలను ముందు చెల్లించాలని కేంద్రం చెబుతుంటే, 2019మేలో వచ్చిన ప్రభుత్వం ఆ నిధులను ఏంచేసిందో చెప్పాలన్నారు. గతప్రభుత్వంలో చేసిన పనులతాలూకూ కేంద్రంనుంచి వచ్చిన రూ.2,400కోట్లు ఏమయ్యాయో కూడా ప్రభుత్వం చెప్ప డం లేదన్నారు. 2019 మే నుంచి, 2021 మార్చిమధ్య రూ.6,400కోట్లు ఖర్చుచేసినట్టు, జెట్ స్పీడులో ఉపాధి హామీ పనులు చేసినట్టు ఈ ప్రభుత్వంచెప్పుకోవడం సి గ్గుచేటన్నారు. ప్రభుత్వం ఎక్కడ, ఏగ్రామంలో తట్ట మట్టి తీసిందో చెప్పాలన్నారు. హైకోర్టు అనేకమార్లు ఉపాధి హామీ నిధులు ఎందుకుచెల్లించడంలేదని ప్రశ్నించినా, ప్రభుత్వం నుంచి స్పందనలేదన్నారు. రూ.5లక్షల లోపు జరిగిన పనులతాలూకా నిధులను 80శాతం వరకు విడుదలచేసినట్టు చెప్పిన ప్రభుత్వాన్ని, అందుకు సంబంధించిన ఆధారాలు తమకు సమర్పిం చాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. మిగిలిన 20శాతం నిధులను ఎందుకు చెల్లించడంలేదని కూడా న్యాయస్థా నం ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్నారు. 2019 అక్టోబర్ లో కోర్టులో వ్యాజ్యాలు వేయడం జరిగిందని, అప్పట్నుం చీ, ఇప్పటివరకు ఎందుకు జాప్యంజరిగిందో పాలకులు సమాధానంచెప్పాలన్నారు. కొన్ని పనులను ఎమ్ బుక్ ల్లో రికార్డుచేయలేదని, కళ్లముందు జరిగిన పనులు కని పిస్తున్నా, కావాలనే వాటిని నమోదుచేయలేదన్నారు. విధ్వంసపు ఆలోచనలతో ఉన్నప్రభుత్వం, తనవారికి ఒక న్యాయాన్ని, పరులకు మరోన్యాయాన్ని అమలు చే స్తోందని ఆలపాటి మండిపడ్డారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధు లను ఇళ్లస్థలాల చదునుకోసం వాడామని, రూ.4వేలకో ట్లను అందుకోసం విడుదలచేశామని ప్రభుత్వం చెబు తోందన్నారు. రూ.4వేలకోట్లలో, రూ.500కోట్లను కూడా ప్రభుత్వం వినియోగించలేదన్నారు. ఈ ప్రభుత్వంలో చే సిన పనులపై మాత్రం ఎటువంటి విచారణలకు ఆదేశిం చకుండా, అధికారుల సంతకాలతో ఉపాధి నిధులను జగన్ ప్రభుత్వం దోచుకుంటోందన్నారు.

గతప్రభుత్వం లో ఏగ్రామానికి వెళ్లినా పూర్తైన పనులు కళ్లముందు కనిపించేవని, కానీ నేడు పనులుచేయకుండానే, పాల కులు తమవారికి అడ్వాన్స్ లరూపంలో ఉపాధి నిధుల ను ధారాధత్తంచేస్తున్నారన్నారు. కోర్టుల ఆదేశాలను కూడా పాలకులు పెడచెవిన పెడుతున్నారని, కేంద్రం అడుగుతున్నాకూడా సమాధానం చెప్పడంలేదన్నారు. రూ.5లక్షలలోపు జరిగిన పనులకుసంబంధించి కేవలం పుంగనూరు, పులివెందులలో మాత్రమే ప్రభుత్వం నిధులు చెల్లించిందితప్ప, రాష్ట్రంలో ఎక్కడా ఎవరికీ రూపాయి ఇవ్వలేదన్నారు. గతప్రభుత్వంలో జరిగిన పనులకు సంబంధించి విచారణ పేరుతో ఈ ప్రభుత్వం ఇచ్చిన 1000పేజీల నివేదికలో ఎటువంటి సారం లేద న్నారు. కేవలం జాప్యంకోసమే జగన్ ప్రభుత్వం కమిటీ లు వేసిందని, గతప్రభుత్వంలో పనులుచేసిన సర్పంచ్ లు, ఇతరత్రా గ్రామ, మండలస్థాయి నాయకులను పార్టీ మారితేనే నిధులిస్తామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందన్నా రు. సిగ్గు, లజ్జలేని ప్రభుత్వం దేనికైనా తెగిస్తుందని, న్యా యస్థానాల ఆదేశాలనుకూడా ఖాతరు చేయకుండా అహంకారంతో వ్యవహరిస్తోందన్నారు. ఏప్రియల్ 23న ఈ అంశం తిరిగి విచారణకు రాబోతోందని, అప్పడు ఈప్రభుత్వం, కోర్టుకి ఏంసమాధానం చెబుతుందో చూస్తామన్నారు. అవకతవకల పేరుతో కోర్టులను పక్క దారిపట్టిస్తున్న జగన్ ప్రభుత్వం, 2019లోజరిగి, పెండింగ్ లోఉన్న పనుల బకాయిలను నిలిపివేశార న్నారు. కోర్టులు అక్షింతలు వేసినా, ఆగ్రహం వ్యక్తంచేసి నా దులుపుకొని పోతున్న ప్రభుత్వం 23వతేదీన న్యా యస్థానంలో దోషిగా నిలబడితీరుతుందని ఆలపాటి స్పష్టంచేశారు. అవినీతి, అక్రమాల ప్రభుత్వం గతప్రభు త్వంలో జరిగిన దాదాపు రూ.8లక్షల విలువైన పనుల కు నేటికీ రూపాయికూడా చెల్లించలేదన్నారు.

వైసీపీ నేత అంబటి రాంబాబుకి చెందిన కేసు విచారణలో హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది, పిల్ వేసిన వారి తరుపు న్యాయవాది ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారని, అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు కోర్టు నిర్ధారణకు వచ్చిందని, మైనింగ్ జరిగినప్పుడు ప్రభుత్వం ఎందుకు జరిమానా విధించలేదని ప్రశ్నించిందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేయిస్తున్నారంటూ, వైసీపీ కార్యకర్తలే ఫిర్యాదు చేశారని, మైనింగ్ కు పాల్పడిన వారిపై ఎందుకు జరిమానా విధించలేదన్న హైకోర్టు ప్రశ్నపై రాంబాబు ఏంసమాధా నం చెబుతాడని టీడీపీనేత నిలదీశారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదనే వాస్తవాన్ని, టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని తప్పుపట్టి, వెకిలిగా మాట్లాడిన రాంబాబు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో, రెండు సీట్లు సాధించిన బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తామని ఎలా అనగలుగుతుందో తెలుసుకోవాలన్నా రు. వైసీపీ ప్రభుత్వమే శాశ్వతంగా రాష్ట్రాన్ని పాలిస్తుంద నే పగటి కలలు రాంబాబు మానుకుంటే మంచిదన్నారు. అంబటికి నిజాయితీ ఉంటే, తన ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కు బాధ్యత వహిస్తూ, తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రతిపక్షం కోరకుండానే అంబటి ఆ పని చేసుంటే ప్రజలు హర్షించేవారన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో అంబటి ఏపీఐఐసీ ఛైర్మన్ గా పనిచేశాడని, ఆనాడు ఆయన అవినీతికి భయపడి,తరువాత రెండు సార్లు వై.ఎస్. టిక్కె ట్ ఇవ్వలేదన్నారు. అటువంటి గత చరిత్ర ఉన్నవ్యక్తి, టీడీపీని, ఆపార్టీ జరుపుకున్న ఆవిర్భావ సభను తప్పుపట్టడం ఆయనలోని కుసంస్కారానికి నిదర్శనమన్నా రు.

వైసీపీ అంతర్థానసభ ఏపార్టీ ఎప్పుడుచేస్తుందో, ప్రజలు ఏరూపంలో ఆపార్టీనేతలకు బుద్ధిచెబుతారో అంబటి కి త్వరలోనే బోధపడుతుందన్నారు. రాంబాబు రాజకీ యచరిత్రగురించి ఎంతతక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడిపై సీఐడీ పెట్టిన తప్పుడుకేసులో, ఆయనకు నిజాయితీ ఉంటే స్టే వేకేట్ చేయించుకోవాలంటున్న రాం బాబు, తనపై ఒకమహిళ పెట్టిన కేసువిషయంలో తెచ్చుకున్న గ్యాగ్ఆర్డర్ గురించి ఏం చెబుతాడన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వయంగా అక్రమమైనింగ్ జరిగింద ని, దానిపై ప్రభుత్వం ఎందుకు జరిమానా విధించలేదని ప్రశ్నించినా కూడా రాంబాబు నోరుమెదపకపోవడం సి గ్గు చేటన్నారు. రాంబాబుపై వైసీపీవారే కేసుపెట్టారని, దానికి టీడీపీకి ఎలాంటి సంబంధంలేదన్నారు. టీడీపీ గురించి మాట్లాడేఅర్హత, ఎన్నిజన్మలెత్తినా రాంబాబుకి రాదన్నారు. రాంబాబు తననోటిని అదుపులో పెట్టుకో కుంటే, ఆయనపై చట్టపరమైనచర్యలు తీసుకుంటామని అశోక్ బాబు హెచ్చరించారు. మీడియాముందు సచ్చీలుడిలా మాట్లాడే అంబటికి ఏమాత్రం నిజాయితీ ఉన్నా తక్షణమే తనఎమ్మెల్యే పద వికి రాజీనామా చేయాలన్నారు. మళ్లీ ఆయన గెలిస్తే, ఆయన గురించి అప్పుడుఆలోచిస్తామన్నారు.

రాంబా బుపై ఒకమహిళ వేసిన కేసులో, ఆయన గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడని, వైసీపీనేత జగన్ అనేకకేసుల్లో ముద్దాయిగా ఉండి బెయిల్ పై తిరుగతున్నాడని, అవన్నీ మర్చిపోయి అంబటి మాట్లాడటం హాస్యాస్పదం గా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలమాదిరే ఎంపీటీ సీ, జడ్పీటీసీ ఎన్నికలుకూడా ఎక్కడ ఆగాయో, అక్కడ నుంచే జరుగుతాయని, వాటిని తాముసమర్థంగానే ఎదుర్కొంటామని విలేకరులు అడిగినప్రశ్నకు సమాధా నంగా అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వంతప్పులను ఎత్తిచూపే అధికారులపై కక్షతో వ్యవహరిస్తున్నారని, నిమ్మగడ్డ పదవీవిరమణను కూడా రాష్ట్రప్రభుత్వం జీర్ణించుకోలేక పోతుందనడానికి పేర్నినాని వ్యాఖ్యలే నిదర్శనమన్నా రు. కొత్తగా వచ్చిన ఎన్నికలకమిషనర్ తో కూడా ప్రభుత్వం నిమ్మగడ్డతో వ్యవహరించినట్లే వ్యవహ రిస్తుందా అని అశోక్ బాబు ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ టీడీపీకి అనుకూలంగాపనిచేశారంటు న్న నాని, కొత్త ఎన్నికల కమిషనర్ వైసీపీ మనిషని, ఆపార్టీకి అనుకూలమని తామంటే మంత్రులు, ప్రభుత్వపెద్దలు ఊరుకుంటారా అని టీడీపీనేత ప్రశ్నిం చారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు అయిన ఒక కేసులో, కావాలని జాప్యం చేస్తూ, కోర్టు ముందుకు రాకుండా జాప్యం చేసే విధంగా చేసిన ఉదంతం, ఇప్పుడు సంచలనం అయ్యింది. సాక్ష్యాత్తు హైకోర్టు ధర్మాసనం, ఈ విషయం గుర్తించింది. బాధ్యుల పై చర్యలకు ఉపక్రమించింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనలోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, గత నాలుగు నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మధ్య, ఒక చిన్న సైజు వార్ నడిచింది. ఒకరి పై ఒకరు పై చేయి సాధించటానికి, చేయని ప్రయత్నం లేదు. ఎన్నో కోర్టుల్లో పోరాడి పోరాడి, ప్రతి సారి ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గెలుస్తూ వచ్చారు. ఇదే సందర్భంలో, ఎన్నికల నిర్వహణలో, ప్రభుత్వం వైపు నుంచి ఎన్నికల కమిషన్ కు సంపూర్ణ సహకారం అందించాలని, హైకోర్టు ఆదేశాలు ఉన్నా, ప్రభుత్వం వైపు నుంచి తనకు సహకారం అందటం లేదు అంటూ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి చీఫ్ సెక్రటరీ నీలం సాహనీ, అలాగే పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది, ప్రస్తుత చీఫ్ సెక్రటరీ పై కూడా కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు.

hc 31032021 2

అయితే ఈ పిటీషన్ నిన్న విచారణకు వచ్చింది. ఈ పిటీషన్ పై విచారణ చేసిన హైకోర్టు, ఈ పిటీషన్ విచారణ ముగిసినట్టు ఉత్తర్వులు ఇస్తూ, ఆదేశాలు జారీ చేసింది. ఎలక్షన్ కమిషన్ తరుపు న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ, తాము పిటీషన్ వేసిన తరువాత, నిధులను విడుదల చేస్తూ, సహకారం అందించే విషయంలో, ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. దీంతో ఆ వివరాలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, ఈ కోర్టు ధిక్కరణ పిటీషన్ పై విచారణ చేయాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇదే సందర్భంలో కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన ఈ కోర్టు ధిక్కరణ పిటీషన్, 42 రోజులు పాటు కోర్టు ముందుకు విచారణకు రాలేదని, దీని పై జాప్యం జరిగిందని, నెంబర్ కేటాయించలేదని, ఈ కేసు విచారణకు రాకుండా చేసిన హైకోర్టులోని ఒక సెక్షన్ ఆఫీసర్ , లాగే డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ పై, సోమోటోగా తీసుకుని, కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలనీ ఆదేశాలు ఇచ్చారు. అయితే అసలు ఈ కేసు జాప్యం చేయమని, వీరికి ఎవరు చెప్పారు, అసలు ఎందుకు జాప్యం చేసారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.

నెల్లూరు జిల్లాలో ఉన్న కబాడీపాలెంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు సంబంధించి, ఆ స్థలంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేయటం పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని పై, సీనియర్ న్యాయవాది శ్రావణ్ కుమార్, రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఎస్సీల కోసం నిర్మించిన హాల్ లో, గ్రామ సచివాలయం ఏర్పాటు చేయటం వల్ల, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. శుభకార్యాల కోసం, ఎస్సీల అభ్యున్నతి కోసం, ఈ ప్రభుత్వం ఎస్సీ కమ్యూనిటీ హాల్ లను నిర్మించిందని, ఇటువంటి హాల్స్ లో, ప్రభుత్వ కార్యాలయాలు ఎలా నిర్మిస్తారని, ఆయన ప్రశ్నించారు. ఎస్సీకి ఏ ప్రయోజనాల కోసం అయితే, ఈ హాల్స్ నిర్మించారో, ఆ ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయని, ఆయన కోర్టుకు తెలిపారు. దీంతో, పిటీషన్ ను పూర్తిగా పరిశీలించి, వాదనలు విన్న హైకోర్టు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే ఆ కమ్యూనిటీ హాల్ లో ఉన్న సచివాలయాన్ని, అక్కడ నుంచి వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మునిసిపల్ కమీషనర్ నాలుగు వారాల్లో ఈ కమ్యూనిటీ హాల్ నుంచి, ఖాళీ చేసి, వేరే చోటకు ప్రభుత్వ కార్యాలయాన్ని మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Latest Articles

Most Read