తిరుమలలో, శ్రీవారికి భక్తితో, భక్తులు సమర్పించే తలనీలాలు, అస్సాం కు సమీపంలో, విదేశాలకు సంగ్లింగ్ చేస్తూ, కేంద్ర బలగాలకు పట్టుబడటం, పెను సంచలనం అయ్యింది. దీనికి పై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. టిటిడికి సంబంధించి, తలనీలాల విషయంలో, గ్రేడ్ ల వారీగా తలనీలాలను డివైడ్ చేస్తారు. జుట్టు సైజుని బట్టి, ఈ గ్రేడింగ్ జరిగేది. ఒక్కో గ్రేడుకు, ఒక్కో రేటు ఉండేది. గతంలో ప్రతి గురువారం, వారం వారం, ఈ జుట్టు వేలం జరిగేది. అయితే తరువాత, దీన్ని నెలకు మార్చారు. అయితే ఇప్పుడు కొత్తగా, దీన్ని మూడు నెలలకు పెట్టారు. అయితే ఈ వేలం జరిగే విషయంలో, ఒక రింగ్ ఏర్పడి, ఎవరినీ వేలంలోకి రానివ్వటం లేదని విమర్శలు కూడా ఉన్నాయి. ఇతరలు రాకుండా, ఒకే వ్యక్తి, వివిధ రాష్ట్రాల్లో కంపెనీలు ఏర్పాటు చేసి, అతనే ఈ మొత్తం వ్యవహారం నడుపుతున్నాట్టు ఆరోపణలు ఉన్నాయి. తిరుమలలో 70 ఇంచీల వరకు జుట్టు లభించటం, అలాగే తెల్ల జుట్టు కూడా పెద్ద సైజులో ఇక్కడ దొరుకుతూ ఉండటంతో, తిరుమల తలనీలాల పై డిమాండ్ ఎక్కువుగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో దీనికి డిమాండ్ ఉంది. ప్రతి రోజు తిరుమల నుంచి తిరుపతికి, తలనీలాలు తీసుకుని వస్తు ఉంటారు. ఈ భవనంలో మొత్తం ప్రతి రోజు వచ్చే తలనీలాలు అన్నీ రిజిస్టర్ చేస్తూ ఉంటారు.
తిరుపతి భవనంలోనే, ఈ గ్రేడింగ్ జరిగి, ఎన్ని కేజీలు ఉన్నాయో చూసి, దీన్ని ఈ వేలంకు పెడతారు. అయితే ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళటానికి, భారీగా టాక్స్ లు కట్టాల్సి రావటంతో, ఇలా స్మగ్లింగ్ జరుగుతుంది అనే అనుమానం వస్తుంది. ఈ నేపధ్యంలోనే, అస్సాం బోర్డర్ లో, వచ్చిన ఒక లారీలో బస్తాలు అన్నీ తలనీలాలు ఉండటం, వారిని ఎంక్వయిరీ చేయగా తిరుమల నుంచి వస్తుందని గ్రహించి సీజ్ చేసారు. అయితే ఈ తలనీలాలు ఎలా వచ్చాయి అనే దాని పై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే దీని పై టిటిడి స్పందించింది. ఆ తలనీలాలకు, తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. తాము , తలనీలాలు అన్నీ ఈ వేలం ద్వారా అమ్ముతామని చెప్పారు. అయితే ఆ తలనీలాలు ఆ కంపెనీ కొన్న తరువాత, తమకు సంబంధం ఉండదు అని అన్నారు. వాళ్ళు మా దగ్గర కొన్న తరువాత ఎక్కడ అమ్ముతారో తెలియదని, నిన్న జరిగిన సంఘటన కూడా, తమకు సంబంధం లేని విషయం అని ప్రకటన చేస్తూ, ఆ కంపెనీ పేరు ఏమిటో చెప్తే, బ్లాక్ లిస్టు లో పెడతామని టిటిడి చెప్పింది.