ఆస్తి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను లిఖితపూర్వకమైన కారణాలు చూపకుండా తిరస్కరించరాదని హైకోర్టు తీర్పుని చ్చింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని లిఖితపూర్వకంగా తెలియజేయా లని స్పష్టం చేసింది. అలా కాకుండా మొత్తంగా డాక్యుమెంట్లను తిరస్కరించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి రాష్ట్రం లో పలు ప్రాంతాల నుంచి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నాయని నిబంధనల ప్రకారం వ్యవహరించేలా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా లసు హైకోర్టు ఉత్తర్వులు అందేలాసంబంధిత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగం ఐజీకి పంపాలని హైకోర్టు ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. నెల్లూరు జిల్లా కావలి మునిసిపల్ పరిధిలో ఇల్లు రిజిస్ట్రేషన్‌ నిమిత్తం సమర్పించిన డాక్యుమెం ట్లను కావలి సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించటాన్ని సవాల్ చేస్తూ నాగసూరి మహేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాదరావు విచారణ అనంతరం తీర్పును వెలువరించారు. పిటిషన్ తరుపున న్యాయవాది టీసీ కృషన్ వాదనలు వినిపిస్తూ డాక్యుమెంట్ సమర్పించినప్పుడు అధికారులు పరిశీలన జరిపి అభ్యంతరాలు ఉంటే స్టాంప్ ఫీజు వసూలు చేయాలని ఆపై రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు.

hc 28032021 2

డాక్యుమెంట్ లోని ఆస్తి రిజిస్ట్రేషన్ ట్టంలోని సెక్షన్ 22 ఏ పరిధిలోకి వస్తే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా వివరిస్తూ తిరస్కరించే వీలుందన్నారు. ఈ కేసులో సబ్ రిజిస్ట్రార్ కారణాలు లేకుండా తిరస్కరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు స్పందిస్తూ సబ్ రిజిస్టార్లు కారణాలు లేకుండా తమ రిజిస్టేషన్ డాక్యుమెంట్లను తిరస్కరిస్తున్నారంటూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖల వుతున్నాయని నిర్దిష్టమైన కారణాలతో తిరస్కరిస్తే వాటిని లిఖితపూర్వకంగా తెలియజేయటంతో పాటు రిజిస్ట్రేషన్ తిరస్కరణ పేరుతో బుక్-2లో నమోదు చేయాలని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. ఈ కేసులో కావలి సబ్ రిజిస్ట్రార్ నిబంధనలు పాటించటంలో విఫలమయ్యారని పిటిషనర్ సమర్పించే డాక్యు మెంటు చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని తీర్పుని చ్చారు. డాక్యుమెంట్లను కారణాలు లేకుండా తిరస్కరించటం నిబంధనలను అతిక్రమించడంతో పాటు విధి నిర్వహణలో దుష్ప్రవర్తన కిందకు వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఆదేశాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నింటిలో అమలు చేయాలని ఆదేశించారు. డాక్యుమెంట్ల స్వీకరణ, తిరస్కరణ విషయంలో ఇకపై హైకోర్టులో ఇదే తరహా వ్యాజ్యాలు దాఖలైతే, సబ్ రిజిస్ట్రార్లను బాధ్యులుగా చేస్తూ కోర్టు ముందుకు హాజరు పరచాల్సి ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు హెచ్చరించారు.

రైతు శ్రమను అవమానించేలా మాట్లాడిన శ్రీరంగనాథరాజును తక్షణమే మంత్రి పదవి నుండి తొలగించాలని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.  వరిసాగు సోమరిపోతు వ్యవసాయం అంటూ మంత్రి శ్రీరంగనాథరాజు చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరంగనాథరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో  ఆదివారం చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీరంగనాథరాజు వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి జగన్, వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. లిక్కర్ అమ్ముకుని బతికే వైసీపీ నాయకులు బాధ్యత లేకుండా రైతులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తిండిగింజలు పండించి దేశానికి అన్నం పెట్టే రైతులను సోమరి రైతులుగా మాట్లాడిన మంత్రి రాజీనామా చేయాలని అన్నారు. పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు కనీస మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించలేకపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బొంతు శివసాంబిరెడ్డి, తిరువీధుల బాపనయ్య, కుమార స్వామి,  ఇంటూరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

మే6న విశాఖకు వెళ్ళిపోతున్నాం అంటూ, గత కొన్ని రోజులుగా రాజధాని తరలింపు ప్రక్రియకు సంబంధించి చేస్తున్న హడావిడికి మళ్ళీ బ్రేక్ పడింది. రాజధాని కేసులన్నీ మే 3వ తేదీ నుంచి మళ్లీ మొదటినుంచి విచారణ ప్రారంభించాలన్న హైకోర్టులో నిర్ణయంతో ఈ ఏడాది కూడా రాజధాని తరలింపు కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం మంచిదనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు సచివాలయ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. అమరావతి రాజధాని మార్పునకు సంబంధించి హైకోర్టులో దాదాపు వంద పిటిషన్లున్నాయి. ఇవన్నీ కలిపి రోజువారీ విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. అయితే విచారణ ఎంత వేగంగా నిర్వహించినా కనీసం తుది తీర్పు వెలువడడానికి కనీసం మూడు నెలలు పైనే పడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో 2021-22 విద్యాసంవత్సరం ప్రారంభం కానుండడంతో ఉద్యోగస్తుల పిల్లలకు ఇబ్బంది కనుక, మరో ఏడాది వాయిదా వేసుకోవడమే మంచిదన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం సాగుతున్న తరుణంలో సమస్య ఉన్న చోటుకి వెళ్ళడం మంచిది కాదనే భావనలో పాలక పెద్దలున్నారు. ఇంకోవైపు సెకండ్ వేవ్ విజృంభిస్తుండడం, వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో ఉద్యోగులపై కూడా తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇంకోవైపు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రాజధాని తరలింపు అన్ని విధాలా ఇబ్బందేనని గమనించిన ప్రభుత్వం వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.

amaravati 28032021 1

అభివృద్ధి వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి పేరుతో వైసీపీ సర్కారు తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినా, ఈ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఏడాదిన్నరగా విశాఖకు రాజధాని తరలించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించడం లేదు. రాజధాని నిర్మాణం కోసం ఉచితంగా భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా గత ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తూ నిర్ణయాలు తీసుకోవడం వివాదాస్పదమైంది. వాస్తవానికి గత ఏడాది జనవరి 26నాటికే విశాఖకు రాజధాని తరలుతుందన్న ప్రచారం జరిగింది. సచివాలయ ఉద్యోగులు, హెచ్ఓడీ కార్యాలయాల ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ఆయా కార్యాలయాల తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్న ఆదేశాలు కూడా వెళ్ళాయి. సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్ భవన్, డీజీపీ కార్యాలయం, సచివాలయం, హెచ్ఓడీలు తాత్కాలిక ఏర్పాటుకు అవసరమైన భవనాలను కూడా విశాఖలో గుర్తించారు. ఈ ప్రయత్నాలపై రైతులు పెద్దసంఖ్యలో పిటిషన్లు దాఖలు చేయడంతో హైకోర్టు రాజధాని తరలింపునకు బ్రేక్ వేసింది. కోర్టు తీర్పు ఇచ్చేవరకు ఏ ఒక్క కార్యాలయాన్ని విశాఖకు తరలించినా ఆశాఖా కార్యదర్శి బాధ్యత వహించాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన గతితప్పిందనడాని కి పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రిచేసిన వ్యాఖ్యలే నిదర్శన మని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్, తమరాష్ట్రంలో ఎకరం పొలం అమ్మితే, ఇప్పుడు ఆంధ్రాలో రెండెకరాలు కొనొచ్చన్న వ్యాఖ్యలు జగన్ పాలనఎలా ఉందో తెలియచేస్తున్నాయ న్నారు. జగన్మోహన్ రెడ్డిపాలనలో, రాష్ట్రానికి ఒక్కపెద్ద కంపెనీకూడా రాలేదని, 22నెలల్లో ఒక్కటంటే ఒక్క నోటి ఫికేషన్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. చంద్రబాబు నాయుడి హాయాంలో విశాఖపట్నంలో మిలీనియం టవ ర్ కట్టి, తద్వారా 10లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నాటి రాష్ట్రప్రభుత్వం ఆలోచనచేస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక విశాఖను పరిపాలనరాజధాని చేస్తానంటూ, మిలీనియం టవర్స్ ని ఎవరికీ, ఎందుకు కేటాయించకుండా నిరుప యోగంగా మార్చారని రామ్ ప్రసాద్ తెలిపారు. విశాఖప ట్నంలో ఉన్న కంపెనీలకు సరైన స్పేస్ లేదన్నారు. 10 లక్షలఉద్యోగావకాశాలు కల్పించే పెద్ద భవనసముదా యాన్ని 22నెలలుగా ఖాళీగా ఉంచడమేంటన్నారు? విజయవాడలోని మేథాటవర్స్ కూడా శ్మశానంలా మారి పోయిందని, మంగళగిరిలోని ఐటీ ఎన్ ఆర్టీ టెక్ పార్క్ లోని కంపెనీలు కూడా వెళ్లిపోయాయన్నారు. ఇంత జరిగినా ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ, ప్రభుత్వ అధికారులుగానీ ఏమీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తి నట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఖండించకపోవడం చూస్తుంటే,ఆయన వ్యాఖ్యలను వారంతా సమర్థించిన ట్టుగా భావించాల్సి వస్తోందన్నారు.

jagan 28032021 2

రాష్ట్రంలో ఎన్ ఆర్ ఐలు పెట్టిన పెట్టుబడులుకూడా నిరుపయోగమై పోయాయని బుచ్చిరామ్ ప్రసాద్ వాపో యారు. రాష్ట్రంలోని నిరుద్యోగులంతా ఉద్యోగాలకోసం కం పెనీలచుట్టూ తిరుగుతుంటే, కంపెనీలు, పరిశ్రమల వారు సబ్సిడీలు, రాయితీలకోసం ప్రభుత్వంచుట్టూ తిరు గుతున్నారన్నారు. అదానీ, హెచ్ సీఎల్ లాంటి పెద్ద కంపెనీలను టీడీపీప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొస్తే, అవన్నీ వెనక్కువెళ్లిపోయాయన్నారు. వైసీపీప్రభుత్వ నిర్వాకంతో ఆయాకంపెనీల సీఈవోల ఉద్యోగాలుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కంపెనీలు, పరిశ్రమలు రాకుండా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఎక్కడికి తీసుకెళుతు న్నారో చెప్పాలన్నారు. జగన్ నాయకత్వంలో రాష్టపారి శ్రామికరంగం పతనావస్థకు చేరిందని, ఇతరరంగాల పరి స్థితికూడా దారుణంగా తయారైందని రామ్ ప్రసాద్ ఆవే దన వ్యక్తంచేశారు. జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా వ్యవస్థలను గాడిలోపెట్టి, పరిశ్రమలకుఇవ్వాల్సిన రాయి తీలు ఇస్తేనే కొత్తపరిశ్రమలు వస్తాయన్నారు. ఏటా విద్యాభ్యాసం ముగించుకొని బయటకువచ్చే విద్యార్థులంతా ఇతరరాష్ట్రాలబాటపట్టే పరిస్థితులను తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనేఉందన్నారు. ఎన్ఆర్ ఐల పరిస్థితికూడా దారుణంగా ఉందని, విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు చంద్రబాబునాయుడు రుణ సాయం చేస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక వివిధ వర్గాల కార్పొరేషన్లన్నీ నిర్వీర్యమైపోయాయన్నారు. రూపాయిసాయం కూడా విదేశాల్లోచదువుకునే విద్యా ర్థులకు ప్రభుత్వంనుంచి అందడంలేదన్నారు. ఈ విధంగా ఎలాచూసినా, రాష్ట్రంలో పాలన ఎలాఉందో అర్థ మవుతోందని అందుకు కేసీఆర్ చేసినవ్యాఖ్యలే నిదర్శ నమని రామ్ ప్రసాద్ స్పష్టంచేశారు.

Advertisements

Latest Articles

Most Read