రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిన జగన్ రెడ్డి, తనఇష్టానుసారం దోచుకుంటున్నాడని, అందుకే ఆయన్ని ఈమధ్యన చాలామంది హోల్ సేల్ రెడ్డని కూడా పిలుస్తున్నా రని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవాచేశారు. ఏదైనా సరే హోల్ సేల్ గా దోచుకోవడమే జగన్ రెడ్డికి ఇష్టమని, అందుకే ఆయన్ని దేశంలోని వ్యాపారు లంతా హోల్ సేల్ రెడ్డని పిలుస్తున్నారన్నారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీజాతీయకార్యాలయంలో పట్టాభిరామ్ విలేకరులతో మాట్లాడారు. ఆవివరాలు ఆయన మాటల్లోనే .. "హోల్ సేల్ ప్రతిపాదనలతో వచ్చే వ్యాపారులకు తాడేపల్లి రాజప్రాసాదం గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. రెడ్ కార్పెట్ తో వారికి స్వాగతం లభిస్తుంది. చిల్లరమల్లర వ్యాపారాలను పక్కనెట్టిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రయ్యాక టోకు వ్యాపారం మొదలెట్టాడు. ఉదాహరణకులిక్కర్ వ్యాపారమే తీసుకుంటే, రాష్ట్రంలో దాదాపు 3,500లిక్కర్ షాపులకు హోల్ సోల్ యజమాని జగన్ రెడ్డి. లిక్కర్ డాన్ మారిపోయి, సొంత బేవరేజెస్, డిస్టిలరీలతో తన సొంతబ్రాండ్లనే ఆయన అమ్ముతున్నాడు. తరువాత సిమెంట్ వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న జగన్ రెడ్డి, సిండికేట్ ఏర్పాటుచేసి సి మెంట్ ధరలను అమాంతం పెంచేశాడు. తనసొంత కంపెనీ అయిన భారతిసిమెంట్స్ కు ఏరకంగా దోచిపెడుతున్నాడో చూస్తున్నాం. లిక్కర్ వ్యాపారాన్ని ఒకజేబులో, సిమెంట్ వ్యాపారాన్నిమరో జేబులోపెట్టుకున్న జగన్ రెడ్డి, ఇప్పుడు ఇసుక వ్యాపారం ప్రారంభించాడు. వేలకోట్లు దోచుకోవడానికి అన్నీ సిద్ధంచేశాడు. దానిలోభాగంగా జేపీ పవర్ వెంచర్స్ అనే ప్రైవేట్ కంపెనీకీ రాష్ట్రంలోని ఇసుకరీచ్ లన్నింటినీ కట్ట బెట్టాడు. గతంలో చంద్రబాబునాయుడుగారు ఉచితంగా ఇసు క అందచేసి, సామాన్యులపై ఎటువంటిభారం పడకుండా చేశారు. నిర్మాణరంగంపైఆధారపడి జీవించే లక్షలాదిమంది కార్మికులకు చేతినిండా పనికల్పించిన మహానుభావుడు చంద్రబాబునాయుడు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక లక్షల మంది భవననిర్మాణకార్మికులతోపాటు, ఇంటినిర్మాణం కోసం కలలుగనే పేద, మధ్యతరగతి కుటుంబాలకలను ఆవిరిచేసే లా ఇసుకను ఏవిధంగా దోచుకుతిన్నారో రాష్ట్రమంతా చూసిం ది.
ఉపాధిలేక భవననిర్మాణ కార్మికులుఏరకంగా ఆత్మహత్య లుచేసుకున్నారో కూడా చూశాము. నాలుగైదునెలలపాటు ఇసుకను యధేచ్ఛగా దోపిడీచేసిన ప్రభుత్వం, తరువాత ఆన్ లైన్ విధానమంటూఇసుకను బ్లాక్ చేసింది. ట్రాక్టర్ ఇసుక కొనాలంటే దాదాపు రూ.8నుంచి రూ.9వేలు ఖర్చుపెట్టాల్సిన దుస్థితిని కల్పించింది. కొన్నిప్రాంతాల్లో లారీ ఇసుక రూ. 30వేలు కూడా అమ్మారు. టీడీపీప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500లకే ఇంటివద్దకే చేరేది. లారీ ఇసుక రూ. 3వేలకే లభించేది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక ఇసుకను ఆర్థిక వనరుగా మార్చుకొన్నాడు. ఇప్పుడు రాష్ట్రంమొత్తంగా ఉన్న ఇసుక రీచ్ లను జేపీ పవర్ వెంచర్స్ కు కట్టబెట్టాడు. ఆ సంస్థ వివరాలను ఒకసారి పరిశీలిస్తే, గత 4, 5 సంవత్సరా లుగా పూర్తిగా నష్టాల్లోనే జేపీ పవర్ వెంచర్స్ కొనసాగుతోంది. ఆ సంస్థ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ పరిశీలిస్తే, 2016నుంచి వందల, వేలకోట్లవరకు నష్టాలఊబిలోకి కూరుకుపోయినట్లు స్పష్టమవుతోంది. అటువంటి సంస్థకు జగన్ రెడ్డి ఇసుక టెండర్ ను అప్పగించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 3,500కోట్ల నష్టాన్ని ప్రకటించిన ఆసంస్థ, ఈరకంగా 13జిల్లా ల్లోని ఇసుకరీచ్ లన్నింటినీ ఏరకంగా నిర్వహించగలదో ప్రజ లంతా ఆలోచించాలి. జగన్ రెడ్డికి కావాల్సింది సమర్థవంత మైన వ్యవస్థకాదు.ఎప్పుడూ తనజేబులో ఉండే వ్యవస్థ కావా లి. జగన్ రెడ్డి ఏరికోరి నష్టాల్లో ఉన్నసంస్థలనే తీసుకొస్తాడు. కడపస్టీల్ ప్లాంట్ ను పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన లిబర్టీ స్టీల్ గ్రూపుకు అప్పగించాలని చూశాడు. నేడు ఇసుక రీచ్ లను ఏడాదికి రూ.3,500కోట్లవరకు నష్టాలనుచవిచూస్తూ రేపో,మాపో దివాలా తీయబోయే జేపీ పవర్ వెంచర్స్ కు అప్పగించాడు. జేపీ సంస్థకు గతంలో ఇసుక రీచ్ లను నిర్వ హించిన అనుభవంకూడా లేదు. సిమెంట్ ఇండస్ట్రీ, ధర్మల్ పవర్ యూనిట్ల నిర్వహణలో కాస్తో, కూస్తో అనుభవముంది. ఎలాంటి అనుభవంలేని అటువంటిసంస్థకు ఇసుకరీచ్ లను అప్పగించడానికి ప్రధాన కారణం క్విడ్ ప్రోకో. జగన్ రెడ్డికి బాగాఅలవాటైన పని అదేగా. నీకెంత, నాకెంత అనేసిద్ధాంతం తో, నష్టాల్లో ఉన్నసంస్థలను తెరపైకి తెచ్చి, వాటిముసుగులో రాష్ట్రసంపద మింగేయడమనేది జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యకదా.
జేపీ పవర్ వెంచర్స్ సంస్థలో గతంలో డైరెక్టర్ గా పనిచేసిన పెద్దిబొట్ల గంగాధరశాస్త్రి అనేవ్యక్తి, రామ్ కీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ , రామ్ కీ ఎమ్ఎస్ డబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్, ఎథినా పవర్ లిమిటెడ్ సంస్థల్లో కూడా డైరెక్టర్ గా ఉన్నాడు. రామ్ కీ సంస్థ వైసీపీఎంపీ అయోధ్యరామిరెడ్డిది. ఆయన జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆళ్లరామకృష్ణారెడ్డికి స్వయానా సోదరుడు. అటువంటి అయోధ్యరామిరెడ్డికి చెందిన సంస్థలో కీలకభాగస్వామిగాఉన్న గంగాధరశాస్త్రి గతంలో జేపీ పవర్ వెంచర్స్ లో కూడా భాగస్వామిగా ఉన్నారు. 2008లోనే జేపీ పవర్ వెంచర్స్ లో శాస్త్రి డైరెక్టర్ గా ఉన్నారు. దీన్నిబట్టే పూర్తిగా విషయాన్ని అర్థంచేసుకోవచ్చు. పెద్దిభొట్ల గంగాధర శాస్త్రి అనే బ్రోకర్ ని అడ్డంపెట్టుకొని, క్విడ్ ప్రోకో ఒప్పందాలు మాట్లాడుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నఇసుకమొత్తాన్నిదోచుకో వడానికి జగన్ రెడ్డి పథకరచన చేశాడని అర్థమవుతోంది. ఎథీనా పవర్ సంస్థలో కూడా గంగాధర శాస్త్రి డైరెక్టర్ గా ఉన్నారు. విజయవాడలోని వీటీపీఎస్ ను మూసేసి, చత్తీస్ ఘడ్ లోని ఎథీనాపవర్ సంస్థను కొంటానంటూ గతంలో జగన్ రెడ్డి చక్కర్లుకొట్టాడు. ఏపీజెన్ లోని ఉద్యోగులంతా ఆం దోళనచేపట్టి, వేలకోట్ల పెట్టుబడితో చత్తీస్ ఘడ్ లోని ఎథీనా పవర్ ను ఎందుకుకొంటారంటూ జగన్ ప్రభుత్వాన్ని వారంతా నిలదీశారు. రామ్ కీ, ఎథీనా పవర్ సంస్థల్లో డైరెక్టర్ గాఉన్న గంగాధర శాస్త్రే జేపీ పవర్ వెంచర్స్ లోకూడా డైరెక్టర్ గా ఉన్నాడు. దాన్నిబట్టే జగన్ రెడ్డి కుట్రంతా అర్థమవుతోంది. గంగాధర శాస్త్రిని అడ్డుపెట్టుకొని వేలాదికోట్లను దిగమింగడాని కి జగన్ రెడ్డి వ్యూహాలు మొదలెట్టాడు. టన్నుఇసుకను రూ.375కు విక్రయిస్తూ, జేపీ పవర్ వెంచర్స్ కు ఇసుకరీచ్ లను కట్టబెట్టాక, దానిధరను రూ.450కు పెంచారు. టన్నుఇసుకకొనడంతోపాటు, అదనంగా రవాణా ఛార్జీలు, జేట్యాక్స్ లు చెల్లించాలి. అన్నీకలుపుకుంటే లారీ ఇసుకధర రూ.10వేలవరకు అవుతోంది. ట్రాక్టర్ ఇసుక రూ. 5, 6వేలవరకు అవుతోంది. ఈరకంగా పూర్తిగా సామాన్యుడికి మేలుచేయకుండా, వేలకోట్లు దిగమింగడానికి జగన్ రెడ్డి స్కెచ్ వేశాడు. దానిలోభాగంగానే రీచ్ లనిర్వహణలో ఎలాంటి అనుభవంలేని కంపెనీని తెరపైకి తీసుకొచ్చాడు.
ఏవిధమైన అనుభవంలేని జేపీ పవర్ వెంచర్స్ సంస్థకు ఇసుకరీచ్ లన్నింటినీ ఎలా కట్టబెట్టాడో, ఆసంస్థ లో డైరెక్టర్ గా ఉన్న పెద్దిబొట్ల గంగాధర శాస్త్రి , రామ్ కీ సంస్థ లో, ఎథీనా పవర్ సంస్థలో డైరెక్టర్ గా ఉన్నాడో లేదో జగన్ రెడ్డి సమాధానంచెప్పాలి. రాష్ట్రంలోని ఖనిజసంపదనంతా తన హస్తగతంచేసుకుంటున్న జగన్ రెడ్డి, తన సొంత సంపద నుపెంచుకుంటున్నాడనే వాస్తవాన్ని ప్రజలంతా గ్రహించాలి. రాష్ట్రానికి , ప్రజలకు మేలుచేసేలా జగన్ ఎలాంటిచర్యలు తీసుకోవడేంలేదు. టన్నుకు 375 రూపాయలే సామాన్యుడికి మోయలేని భారం కాగా, రూ.450కి ఇసుకకొనే పరిస్థితిలో సామాన్యుడు ఉన్నాడా? భారతి సిమెంట్స్ కోసం సిమెంట్ ధరలు అమాంతంపెంచేశారు. అటువంటి పరిస్థితు ల్లో సామాన్యుడు ఇల్లుకట్టుకోగలడా? భవననిర్మాణ రంగం పై ఆధారపడి జీవిస్తున్న లక్షలమంది ఉపాధిదొరక్క పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. దోచుకున్న సొమ్ముతో విలా సాలు అనుభవిస్తూ, ఎన్నికల్లో గెలుస్తూ, ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి. ప్రజలంతా జగన్ చర్యల ను గమనించాలి. జగన్ రెడ్డి ఏవిధంగా వ్యవస్థలను నాశనంచేస్తూ, ఖనిజసంపదను దోచుకుంటూ, రాష్ట్రసంప దను తనసొంతసంపదగా ఎలామార్చుకుంటున్నాడో ఆలోచనచేయాలి. ఇదివరకు తనపార్టీనేతలకు ఇసుకను దోచిపెట్టాడు. ఇప్పుడేమో దివాలాతీసినకంపెనీని తెరపైకి తెచి, హోల్ సేల్ గా రాష్ట్రాన్ని ఎల దోచుకోవాలనే దానిపై దృష్టిపెట్టాడో ప్రజలంతా ఆలోచించాలి. ఇసుక ప్రభుత్వం చేతిలో ఉన్నపుడే ధరలను అదుపు చేయడం చేతకాని సర్కారు...ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లాక ఏవిధంగా అదుపు చేస్తారు, ఈ చర్య పేదవాడిపై మరింత భారం పడక తప్పదు.