రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి, రాష్ట్ర సంపదను తనవ్యక్తిగతసంపదగా మార్చుకుంటున్న జగన్ రెడ్డి, అవినీతిని కేంద్రీకరించి 10 వేలకోట్ల దోపిడీకి శ్రీకారంచుట్టాడని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ఇసుకపేరుతో జగన్ రెడ్డి గతరెండురోజులుగా వేలకోట్ల దోపిడీకీ ఏవిధంగా తెగబడుతున్నాడో, తనజేబు కంపెనీ అయిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కంపెనీకి రాష్ట్రంలోని ఇసుకరీచ్ లను ఏవిధంగా కట్టబెట్టాడో అందరం చూస్తూనే ఉన్నరన్నారు. టీడీపీపక్షాన ప్రజలతరపును కొన్ని ప్రశ్నలతో ప్రభుత్వానికి ఒకకరపత్రాన్ని విడుదలచేస్తున్నామని, కరపత్రంలో చెప్పినప్రశ్నలకు సమాధానంచెప్పే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. 1. జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ ముసుగులో ఎ1 జగన్‌రెడ్డి, అతని సహనిందితుడు ఎ4 ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, 'పంచాయతీల' మంత్రి పెద్దిరెడ్డి కలసి హోల్‌సేల్‌గా రూ.10వేల కోట్ల దోపిడీకి తెరతీయడం వాస్తవం కాదా? రాంకీ గ్రూపులో నేటికీ డైరెక్టర్‌గా ఉన్న గంగాధర శాస్త్రి జెపి గ్రూపులో గతంలో డైరెక్టర్‌గా ఉండి నేడు క్విడ్‌ ప్రోకో వ్యవహారాన్ని నడిపిన మాట వాస్తవం కాదా? 2. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జెపి వెంచర్స్‌ రూ.3,500 కోట్లు నష్టాన్ని ప్రకటించి దివాళాకు సిద్ధంగా ఉన్న విషయం వాస్తవం కాదా? నష్టాల ఊబిలో ఉన్న ఒక సంస్థకు ఇసుక సంపద కట్టబెట్టడం మీ లోపాయికారీ ఒప్పందం కాదా? 3. చంద్రబాబునాయుడు పాలనలో ఉచిత ఇసుక విధానం ద్వారా ట్రాక్టర్‌ ఇసుక 1200 రూపాయలకు వినియోగదారుడి ఇంటికి చేరితే...ఇప్పుడు నాలుగు రెట్లు పెంచి రూ.5 వేలకు చేర్చిన మీ ఇసుక పాలసీ ప్రజలకు ఏ విధంగా మేలైంది? ఇది ప్రజాద్రోహం కాదా? 4. మీ దోపిడీకి రూపొందించిన ఇసుక పాలసీలతో 125 రకాల నిర్మాణ రంగాలపై ఆధారపడిన 50లక్షల మంది కార్మికులు రోడ్డున పడటం నిజంకాదా? పనులు దొరక్క 60మంది ఆత్మహత్యలు చేసుకోవడం వాస్తవం కాదా?

sand 23032021 2

5. చంద్రబాబునాయుడు హయాంలో పంచాయితీలు, స్థానిక సంస్థలు, డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుకను విక్రయిస్తే విమర్శించిన మీరు ఇప్పుడు మీ జేబు సంస్థకు అప్పగించడం హోల్‌ సేల్‌ దోపిడీకి తెరతీయడం కాదా? 6. మీరు చెప్పిన లెక్కల ప్రకారమే... రాష్ట్రంలో ప్రతిరోజూ 1.25లక్షల టన్నుల చొప్పున ఏడాదికి 4కోట్ల టన్నుల ఇసుక లభ్యత ఉండగా, 2కోట్ల టన్నులు అని ఎలా చెబుతారు? దీనినిబట్టి మీరు మిగిలిన 2కోట్ల టన్నుల ఇసుకను బ్లాక్‌ మార్కెటింగ్‌ ద్వారా మూడేళ్లలో 10వేల కోట్లరూపాయలకు పైగా హోల్‌సేల్‌ దోపిడీకి సిద్ధమైంది నిజం కాదా? -గతంలో నవంబర్ 18, 2019న దొంగపత్రిక సాక్షిలో ఇచ్చినప్రకటనలో ప్రతిరోజు 2లక్షలటన్నుల ఇసుకసరఫరా చేస్తామని చెప్పుకున్నా రు. రోజుకి 2లక్షల టన్నులైతే, వర్షాలు, వరదల వల్ల ఒక 60 రోజులు తీసేసినా, మిగిలిన 300రోజులకు 6కోట్ల టన్నుల ఇసుకను సరఫరా చేయవచ్చు. ఈలెక్కలు ప్రభుత్వమేచెప్పింది. 6కోట్ల టన్నులసంగతి వదిలేసి, ఇప్పుడిచ్చిన ప్రకటనల్లో 2కోట్లటన్నులకు లెక్కలు చెప్పడమేంటి? -బ్లాక్ మార్కెట్ ద్వారా ప్రభుత్వమే మిగిలిన 2కోట్ల టన్నులఇసుకను అమ్ముకుంటోంది. అలా అమ్మడంద్వారా ఏటా ప్రభుత్వా నికి రూ.3వేలకోట్లవరకు వస్తోంది. ఈ ప్రభుత్వం ఇంకా మూడేళ్లుంటుంది కాబట్టి, మూడేళ్లలో రూ.10వేలకోట్లు స్వాహాచేస్తోంది. గతంలో సాక్షిపత్రికలో ఇచ్చిన ప్రకటన ప్రకారం 6కోట్లటన్నులకు లెక్కకడితే, దాదాపు రూ.20వేలకోట్లవరకు ఇందులో కుంభకోణం దాగి ఉంది. 7. టన్ను రూ.375 ఉన్న ఇసుకను రూ.475 లకు పెంచి దానికి అదనంగా టన్నుకు రూ.150 వరకు హ్యాడ్లింగ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్న మాట నిజం కాదా? దీనికి రవాణా ఛార్జీలు అదనం కాదా? ఇదంతా జె-ట్యాక్స్‌ కోసం సామాన్యుడిపై మీరు మోపుతున్న భారం కాదా? 8. ఎంఎస్‌టిసి కేవలం ఒక సర్వీసు ప్రొవైడర్‌ మాత్రమే. ఇసుక టెండరు పారదర్శకంగా ఎంఎస్‌టిసి ద్వారా నిర్వహించామని చెబుతున్న మీరు, లోపభూయిష్టమైన టెండరు నిబంధనలు రూపొందించింది మీరు కాదా? మీ జేబు సంస్థకు కట్టబెట్టింది వాస్తవం కాదా?

9. టెండరు దక్కించుకున్న జెపి పవర్‌ వెంచర్స్‌ సంస్థ ఇదివరకు ఎప్పడైనా ఇసుక తవ్వకాలు నిర్వహించిందా? 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలకు కేవలం 9 లక్షల టన్నుల తవ్వకాల సామర్థ్యం సరిపోతుందని టెండరు నిబంధనను ఎవరికి మేలు చేయడం కోసం రూపొందించారు? 10. రూ.100 కోట్లకు పైగా ఉన్న ప్రతి టెండర్‌ను జ్యుడీషియల్‌ రివ్యూకు పంపుతామని ప్రగల్భాలు పలికిన మీరు నేడు వేల కోట్ల ఇసుక టెండర్‌ను ఎందుకు జ్యుడీషియల్‌ రివ్యూకు పంపలేదు? ఈ మొత్తం వ్యవహారం తాడేపల్లి ప్యాలెస్‌ డబ్బు తరలించడంలో భాగంగా కాదా? 11. ప్రభుత్వరంగ సంస్థలైన ఏపీయండిసి, ఎన్‌యండిసిలను కాదని, ప్రజలకు మేలు చేసే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి జెపి పవర్‌ వెంచర్స్‌ అనే ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టడం మీ దోపిడీ దాహం కాదా? 12. సూట్‌కేసు కంపెనీలు సృష్టించి, మనీలాండరింగ్‌ చేసే మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి నేడు ఇసుక తవ్వకాలలో ఎటువంటి అనుభవం లేని ట్రైడంట్‌ కెంఫర్‌ మరియు కెయన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వారితో డమ్మీ టెండర్ల నాటకమాడి మీ జేబు సంస్థ జెపికి కట్టబెట్టలేదా? 13. విశాఖ ఉక్కు, పోర్టుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమిస్తుంటే మీరు ఇసుకను ప్రైవేట్‌పరం ఏ విధంగా చేస్తారు? 14. రెండేళ్లు వైకాపా నేతల రిటైల్‌ దోపిడీని నేడు అధినేతలే హోల్‌సేల్‌ దోపిడీగా మార్చిన మాట వాస్తవం కాదా? 15. నాడు మద్యం, సిమెంటు విషయంలో అవినీతిని కేంద్రీకృతం చేసి వేలకోట్ల దోపిడీకి తెగబడుతున్న మీరు నేడు ఇసుకను కూడా దోపిడీ కోసం కేంద్రీకృతం చేసింది నిజం కాదా?

ఈ రోజు పార్లమెంట్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో, తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానంతో, మరోసారి కేంద్రం ఎలా లెక్క లేకుండా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఉందో అర్ధం అవుతుంది. ఇదే విషయం రామ్మోహన్ నాయుడు, సభలో కూడా ప్రస్తావించారు. నేను అడిగిన ప్రశ్న ఏమిటి, కేంద్ర హోం శాఖ ఇచ్చిన సమాధానం ఏమిటి అంటూ ఫైర్ అయ్యారు. ఈ సమాధానం చూస్తుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు అంటే, మీకు లెక్క లేదా ? లేదా నిర్ల్యక్షమా అని ఘాటుగా ప్రశ్నించారు రామ్మోహన్ నాయుడు. నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేక పోయారు అంటూ అసహనం వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి, చట్టంలో పెట్టిన విషయాలు గురించి, అసలు కేంద్రం ఇప్పటి వరకు ఏమి చేసింది, అసలు ఏమి అమలు చేసింది, ఇంకా ఏమి అమలు చేయాలి అంటూ, విభజన చట్టం పై, రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి బదులు ఇచ్చిన మంత్రి, విభజన హామీల్లో ఉన్న పెండింగ్ అంశాలకు సంబంధించి, వివిధ మంత్రిత్వ శాఖలు వాటిని పరిష్కారం చేయటం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు.

ram 23032021 2

అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సహకరించి, ఇరువురూ కూర్చుని పరిష్కారం చేసుకోవాలి అంటూ తన సమాధానం చెప్పారు. అయితే దీనికి రామ్మోహన్ నాయుడు దీటుగా బదులు ఇచ్చారు. ఈ చట్టం ఉంది 10 ఏళ్ళు, ఇప్పటికే 8 ఏళ్ళు అయిపొయింది, ఇంకా చాలా పెండిన్ లో ఉన్నాయి, అదేమంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకోవాలి అంటున్నారు, కేంద్రం పరిధిలో ఉన్న అంశాలు మీరు ఏమి చేసారు, ఇవి రెండు రాష్ట్రాలకు సంబంధం లేదు కదా, ఇందులో మీరు ఏమి చేసారు ? నేను అడిగిన దానికి సారైన సమాధానం లేదని, ఈ సమాధానం చూస్తుంటే లెక్క లేని తనమో, లేక తెలియని తనమో అర్ధం కావటం లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసారు. అలాగే ప్రత్యెక హోదా ఏమైంది అని అడగగా, కేంద్ర మంత్రి మళ్ళీ అదే పాట పాడారు. 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని చెప్పిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యెక హోదా ఇవ్వటం కుదరదు అని తేల్చి చెప్పారు. అయితే, విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో, కేంద్ర ప్రభుత్వం అంత సుముఖంగా లేదని, మరోసారి స్పష్టం అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో కొత్త, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ నెల 31వ తేదీన, ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ఉన్న, నిమ్మగడ్డ రమేష్ కుమార్, పదవీ విరమణ చేస్తున్న తరుణంలో, కొత్త ఎన్నికల కమీషనర్ నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి, నిన్న సాయంత్రం, ఈ రోజు ఉదయం, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, ఆదిత్యనాద్ దాస్ వద్ద, ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మొత్తం మూడు పేర్లు ప్రతిపాదించారు. ఈ పేర్లను, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈ పేర్లను పరిశీలించిన అనంతరం, ఒక ఫైల్ తయారు చేసి, ఆ ఫైల్ ని, రాష్ట్ర గవర్నర్ కు పంపాల్సి ఉంటుంది. ఆ ముగ్గిరిలో ఒకరి పేరుని రాష్ట్ర గవర్నర్ ఎంపిక చేస్తారు. ఈ ముగ్గురికీ సంబంధించి కూడా 65 ఏళ్ళ లోపు ఉన్న వారు, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ లో చీఫ్ సెక్రటరీ లేదా, ప్రినిసిపల్ సెక్రటరీ స్థాయిలో పని చేసిన అధికారులను ఎంపిక చేస్తారు. ఈ ముగ్గిరి పేర్లలో, రాష్ట్ర గవర్నర్ కు పంపించిన అనంతరం, అందులో ఒక పేరుని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించే అవకాసం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పేరునే, దాదాపుగా, రాష్ట్ర గవర్నర్ కూడా ఫైనల్ చేసే అవకాసం ఉంది.

kanakaraj 23032021 2

ఇందులో ప్రధానంగా, మాజీ ప్రాధాన కార్యదర్శి, ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ఉన్న నీలం సాహనీ పేరు దాదాపుగా ఖరారు అవుతుందని అంటున్నారు. దాదాపుగా ఆమె పేరు ఖరారు అవుతుందనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతంది. ప్రస్తుతం ఆమె పదవీ విరమణ చేసిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహదారుగా వ్యవహరిస్తున్నారు. ఆమె పేరుని పరిగణలోకి తీసుకుంటారని చెప్తున్నారు. ఇక మరో ఇద్దరి పేర్లుగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ జాబితాలో జస్టిస్ కనకరాజ్ పేరు లేకపోవటంతో, అందరూ షాక్ అయ్యారు. నిమ్మగడ్డను తీసి, గతంలో కనకరాజ్ ను పెట్టిన విషయం తెలిసిందే. అయితే, అప్పట్లో కోర్టు జోక్యంతో, మళ్ళీ నిమ్మగడ్డ వచ్చారు. అయితే కనకరాజ్ ను చెన్నై నుంచి తీసుకుని వచ్చి, ఇక్కడ పెట్టటం, ఆయన రెంట్ కూడా చెల్లించలేదనే ఆరోపణలు రావటం, ఇప్పుడు ఆయన్ను కనీసం పరిగణలోకి తీసుకోక పోవటం పై, అందరూ షాక్ అయ్యారు. దీని పై వైసీపీ ఎంపీ రఘురామరాజు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

క-రో-నా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. పాత రోజుల్ని గుర్తుకు తెస్తూ నగరంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత నెల్లో కంటే కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. గతంలో మాదిరి బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలను కట్టుదిట్టం చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఎక్కువగా జనం గుమికూడే ప్రాంతాలపై దృష్టిపెట్టనున్నారు. మాస్కు ధరించని వారి నుంచి రూ. 500 నుంచి రూ.1,000 వసూలు చేస్తూ పోలీసులు జరిమానాల మోత మోగిస్తున్నారు. దేవాలయాల్లో నియంత్రణ చర్యలు ప్రారంభంకాగా, ఆర్టీసీ బస్సుల్లో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు బోగట్టా. కో-వి-డ్ కేసులు పెరుగుతున్న దృష్యా లాక్ డౌన్ విధిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కొట్టిపారేశారు. అలాంటి ఆలోచనే లేదన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యలు పాటిస్తూ ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పాత వీడియోలు సర్క్యులేట్ చేస్తూ, కొంత మంది ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారని, వారి పై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని, ప్రజల్ని తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించారు. దీని పై చాలా సీరియస్ గా ఉన్నామని, ఇలాంటి పాత వీడియోలు ఇప్పుడు తిప్పుతున్న వారి పై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

intiyaz 23032021 2

మన జాగ్రత్తే, మనకు శ్రీరామరక్ష. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పలువురు -కో-వి-డ్ ప్రోటోకాల్ లో భాగమైన మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత ఆచరించడం వంటి అంశాలకు తిలొ 'దకాలు ఇచ్చేశారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులకు ఈ నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ముఖ్యంగా గత సంవత్సరం కో-వి-డ్ ప్రారంభమైనప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చే వారి పట్ల కొంత జాగ్రత్తగా వ్య వహరించేవారు. అయితే ప్రస్తుతం రవాణా విస్తృతమైన దృష్ట్యా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారు, ఇతర ప్రాంతాలకు పనుల మీద వెళ్లి తిరిగి వస్తున్న వారి తో క-రో-నా కేసులు వెలుగులోకి వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇంటి వద్ద కానీ, బయటకు పని మీద వెళ్లినప్పుడు కానీ, ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లినా కూడా కో-వి-డ్ ప్రోటోకాల్ లో భాగమైన మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం పాటిం చడంవంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వచ్చే అవకాశమే లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉండకుండా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మన జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష అని వైద్య నిపుణులు స్పష్టం చేయడం జరుగుతోంది.

Advertisements

Latest Articles

Most Read