ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో , ఈ రోజు అమరావతిలో అసైన్డ్ భూములు స్కాం అంటూ, ఏపి సిఐడి వేసిన కేసు పై విచారణ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ వేసిన క్వాష్ పిటీషన్ పై ఈ రోజు వాదనలు జరిగాయి. దీని పై విచారణ చేసిన హైకోర్టు, ఇరువురి వాదనలు విని, ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వనికి ఝలక్ ఇస్తూ, విచారణ పై నాలుగు వారాలు స్టే విధించింది. సిఐడి విచరణలో ఏమి గుర్తించారు అని చెప్పగా, ఇప్పుడే ఏమి చెప్పలేం అని సిఐడి చెప్పింది. ఇక చంద్రబాబు తరుపున సుప్రీం కోర్ట్ సీనియర్ లాయర్ సిద్ధార్ధ లుత్రా వదనాలు వినిపించారు. అదే విధంగా నారాయణ తరుపున, సీనియర్ లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ తమ వాదనలు వినిపించారు. ఇక ప్రభుత్వం తరుపున జాస్తి భూషణ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రధానంగా, ముఖ్యంగా మూడు అంశాలు చంద్రబాబు వైపు నుంచి వాదించారు. జీవో నెంబర్ 41 అనేది, సీఆర్డీఏ ఆక్ట్ కి అనుబంధంగా తాయారు చేసిందని, ఆ తరువాత ప్రభుత్వం ర్యటిఫై కూడా చేసిందని చెప్తున్నారు. ఇక రెండో అంశం ప్రధానమైనది, ఎవరైతే బాధితులు, రైతులు ఉన్నారో, వారు ఫిర్యాదు చేయకుండా, వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయటం పై కూడా, దీని పై అభ్యంతరాలు లేవనెత్తారు. ఇక మూడో అంశం, రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్ అనేవి విశాల ప్రజా ప్రయోజనాల కోసం, రాజధాని కోసం తీసుకున్నామని, వాటికి ఇచ్చే ప్యాకేజి కూడా తాము అప్పట్లో జీవో జారీ చేసామని వాదించారు.

courtu 19032021 1

దీంతో పాటుగా, ఇంకో ప్రధానమైన అంశం, ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్స్ తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, ఇది ఆక్ట్ లో కూడా ఉందని, అయితే తాము వారికి కూడా లబ్ది చేకూర్చే విధంగా ప్యాకేజి ఇచ్చామని వాదించారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి, ముందుగానే తెలిసి, అసైన్డ్ భూములు మీకు ఎవరికీ ప్యాకేజి ఇవ్వం అని ముందు చెప్పి, వారి వద్ద నుంచి ముందే భూములు కొనుగోలు చేసి, తరువాత జీవో 41 ఇచ్చి, కొన్న వారికి లబ్ది చేకూర్చే విధంగా ఈ ప్రక్రియ సాగిందని, భూములు కొన్నది ప్రభుత్వ పెద్దలు అని వాదించారు. ఇక్కడ కుట్ర జరిగందని, చంద్రబాబుకి, నారాయణకు ఇది తెలిసి చేసారని అన్నారు. ఈ దశలో, కోర్టు కలుగ చేసుకున్న న్యాయమూర్తి, సిఐడి వద్ద స్పష్టమైన ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పాలని, ప్రాధమిక దశలో మీరు ఏమి గుర్తించారని సిఐడిని ప్రశ్నించారు. దీని పై స్పందించిన సిఐడి, ఈ దశలో తాము ఏమి చెప్పలేం అని, పూర్తి స్థాయిలో విచారణ చేస్తే, అన్ని విషయాలు అప్పుడు తెలుస్తాయి అంటూ కోర్టుకు సమాధానం ఇచ్చారు. దీంతో కోర్టు, నాలుగు వారాల పాటు స్టే విధించింది. పెట్టిన సెక్షన్ లను కూడా, కోర్టు ప్రశ్నించింది.

అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబుకి సిఐడి నోటీసులు ఇవ్వటం, రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఒక పక్క, ఈ కేసు విషయం పై, హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే మరోపక్క ఈ రోజు కొంత మంది రైతులు, తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. విచారణలో భాగంగా సిఐడి పోలీసులు, రైతులకు ఒక్కొక్కరికీ నోటీసులు ఇచ్చి, స్టేషన్ కు రమ్మన్నారని సమాచారం. దీంతో రైతులు స్టేషన్ కు వచ్చారు. వారి వద్ద నుంచి సిఐడి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. దాంట్లో భాగంగానే, నిన్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి నుంచి, నిన్న ఫిర్యాదు పై, ఆయన వద్ద నుంచి కూడా వివరాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు కొంత మంది రైతులని పిలిచి, వారిని విచారించారు. అందులో ప్రధానంగా, భూములు ఏ విధంగా తీసుకున్నారు, ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా, మీరు స్వచ్చందంగా ఇచ్చారు, ఈ భూములు కోనోగుళ్ళు ఏమైనా జరిగాయా, ఎవరు కొన్నారు లాంటి పలు ప్రశ్నలు, వారికి వేసి, సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే దీనికి కొంత మంది రైతులు సమాధానం ఇస్తూ, తాము స్వచ్చందంగానే భూమి ఇచ్చామని, తమను ఎవరూ బెదిరించలేదని, రైతులు సమాధానం చెప్పినట్టు చెప్పారు. ఇదే విషయం వారు బయటకు వచ్చి, మీడియాతో కూడా పంచుకున్నారు.

cid 19032021 21

అదే విధంగా, ప్రభుత్వం నుంచి రావలసిన పరిహారం కూడా తమకు అందిందని కొంత మంది రైతులు చెప్తూ, ఇదే విషయాన్ని సిఐడి అధికారులకు కూడా చెప్పినట్టు చెప్పారు. ఈ రోజు ఉదయం రైతులను, మరికొంత మందికి నోటీసులు ఇచ్చి , వారిని కూడా విచారణకు పిలిచినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని రైతులు, బయటకు వచ్చి మీడియాతో తెలిపారు. ఇక సిఐడి అధికారులు అప్పటి కీలక అధికారులను కూడా ఎంక్వయిరీ చేస్తున్నట్టు సమాచారం వస్తుంది. ఐఏఎస్ అధికారి, గతంలో గతంలో సీఆర్డీఏ కమిషనర్‍గా పనిచేసిన చెరుకూరి శ్రీధర్‍ను సిఐడి విచారణకు పిలిచి, ఆయన్ను విచారిస్తుంది. ముఖ్యంగా ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి, అప్పటి కీలక అధికారిగా ఉన్న శ్రీధర్ నుంచి కూడా , సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇక్కడకు వచ్చిన రైతులు ఎవరూ అప్పటి ప్రభుత్వం, చంద్రబాబు పై ఎలాంటి నెగటివ్ పాయింట్ చెప్పకపోగా, తాము లాభ పడ్డాం అని చెప్పటం, ఎలాంటి ఒత్తిడులు తమ పై లేవని, రాజధానికి మేమే భూములు ఇచ్చాం అని చెప్పటంతో, ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి.

ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ఒక ముఖ్య అధికారిని విచారణకు పిలిపించాలని, తన పై శాఖాపరమైన విచారణ చేపట్టిన కమీషనర్ అఫ్ ఎంక్వైరీస్ కు, ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కోరారు. సచివాలయంలో కమీషనర్ అఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియా చేపట్టిన తోలి రోజు విచారణకు హాజరయిన ఏబి వెంకటేశ్వరరావు వివిధా ఆధారాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ఒక ముఖ్య అధికారితో పాటుగా, ఏసిబిలోని సిఐయి విభాగం డిప్యూటీ డైరెక్టర్ సాయి కృష్ణ, సిఐడి డీఎస్పీ విజయ్ పాల్ ను కూడా విచారణకు పిలిపించాలని కోరారు. నిఘా పరికరాల కొనుగోళ్లకు సంబంధించి, ఒప్పందాలు, ప్రభుత్వ ఆదేశాలు, కేంద్ర హోం శాఖ, డీజీపీ, ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, డిఐజి సహా, వేరు వేరు విభాగాలు ఇచ్చిన నివేదికలు, లేఖల కూడా, ఏబి వెంకటేశ్వరరావు సమర్పించారు. తనను సస్పెండ్ చేయటానికి నెల రోజులు ముందుగానే వేతనం నిలిపివేసారని, కుట్ర పూరితంగా తనను తప్పుడు కేసులో ఇరికించే నిర్ణయం తీసుకునే ముందే, ఈ వ్యవహారం జరిగిందని, ఏబివి చెప్పారు. తనకు జీతం నిలిపివేస్తూ, చీఫ్ సెక్రటరీ కార్యాలయం, డీజీపీ కార్యాలయం మధ్య నడిచిన ఫైల్స్ తెప్పించాలని, తన తరుపున వాదనలకు, ఈ ఫైల్స్ తనకు కీలకం అవుతాయని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

abv 19032021 2

తన వాదనలు మొత్తం, ఏబీ వెంకటేశ్వర రావు, రాత పూర్వకంగా నాలుగు లేఖలో రూపంలో విచారణా అధికారి ముందు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం వివరాలు అన్నీ, ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఆరోపణలు తిప్పి కొడుతూ, పలు ఆధారాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక అలాగే కొన్ని డాక్యుమెంట్ లు కూడా, తెప్పించాలని ఆయన వ్యూహాత్మకంగా కోరటంతో, ప్రభుత్వం ఇచ్చే ఆ ఫైల్స్ తోనే, వారికి సమాధానం చెప్పాలని, ఆయన ఉద్దేశంగా తెలుస్తుంది. ఈ విచారణ ఈ రోజు, రేపు కూడా నడిచే అవకాసం ఉంది. ఇక మరో పక్క, ఈ విచారణ తొందరగా చేసి, తమ ముందు ఉంచాలి అంటూ కోర్ట్ ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు ఆదేశాలు ప్రకారం, వెంటనే విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే నిఘా పరికరాల కొనుగోళ్ళు జరగలేదని, అసలు ఎక్కడా ఏమి జరగని చోట, కుంభకోణం జరిగింది అంటూ, ఆరోపిస్తున్నారు అంటూ, ఏబీ వాదిస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, గత రెండేళ్లుగా ఇలా చేస్తున్నారని వాపోయారు.a

రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములకు సంబంధించి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి మునిసిపల్ మంత్రి నారాయణ పై, ఏపి సిఐడి నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చెప్తూ, హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ క్వాష్ పిటీషన్ లో చంద్రబాబు తరుపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా, నారాయణ తరుపున హైకోర్టు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు దాదాపుగా, ఇరువురి వాదనలు కూడా గంటన్నర పాటు సాగాయి. ఈ వాదనలు విన్న అనంతరం, హైకోర్టు, ఈ కేసు మధ్యానం మూడు గంటలకు వాయిదా వేసింది. మూడు గంటల తరువాత, ఈ కేసులో, ప్రభుత్వం తరుపు నుంచి వాదనలు వింటాం అని చెప్పి, హైకోర్టు పేర్కొంది. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, చంద్రబాబు తరుపున వాదించారు. సిద్ధార్థ లుత్రా తన వాదనలు వినిపిస్తూ, సీఆర్డీఏ చట్టం ద్వారా తీసుకొచ్చిన జీవో చెల్లదని ఎలా అంటారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం అనేది, విశాల ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టేదని, అటువంటి రాజధాని నిర్మాణం చేపట్టే సమయంలో, వివిధ వర్గాలకు చెందిన భూములను సమీకరించే సమయంలో, ఆయా వర్గాలకు లబ్ది చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ చట్టంలోని నిబంధనలను అనుసరించి, జీవో జారీ చేసిందని పేర్కొన్నారు. ఆ జీవో జారీ చేసే విషయంలో, ఉన్నతాధికారులు లిఖిత పూర్వక ఆదేశాలను ఉల్లంఘిస్తే, ఐపీసిలోని 166, 167 ఫిర్యాదుని వర్తింప చేయాలని, కానీ అలా కాకుండా, ఉన్నతాధికారులు లిఖిత పూర్వక ఆదేశాలను ఉల్లంఘించకుండానే, ఈ సెక్షన్ లు ఎలా వర్తింప చేసారని ఆయన పేర్కొన్నారు.

hc 19032021 12

ఉన్నతాధికారులు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు, ఆ ఆదేశాలు ఉల్లంఘించటం అనేది, ఇక్కడ ఉత్పన్నం కాదు అని చెప్పి, స్పష్టం చేసారు. ఫిర్యాదులో ఉండే ఆరోపణలకు పెట్టిన సెక్షన్ లకు కూడా సంబంధం లేదని, ఆయన వాదనలు వినిపించారు. అధికారులు జీవో విడుదల చేసిన తరువాత, 35 రోజులు అనంతరం, దాన్ని సియం ఆమోదించారని, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి చెందిన ఈ ఫిర్యాదు పై, సిఐడి ప్రాధమిక విచారణలో, ఆ విచారణను పేర్కొందని, అటువంటి అప్పుడు ఈ జీవోని , జారీ చేసేప్పుడు, సియంకి తెలిసి ఇచ్చారని ఎలా పేర్కుంటారని ఆయన ప్రశ్నించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద , ఈ ఫిర్యాదులో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయటం కూడా కుదరదని కూడా వాదనలు వినిపించారు. ఇక నష్టపోయిన రైతులు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదని గుర్తుంచుకోవాలని , చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడా ఈ ప్రక్రియలో పాల్గునలేదని, దానికి ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెడతారని వాదించారు.

Advertisements

Latest Articles

Most Read