ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు ఆంధ్రప్రదేశ్ లో జుబ్లీ హిల్స్ లో ఉన్న చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే అమరావతి రాజధాని భూములు అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి, తాజాగా మరో కేసు నమోదు కావటం, అందులో చంద్రబాబుని కూడా దోషిగా పెట్టారు. ఈ కేసుకు సంబంధించి, ముఖ్యంగా రాజధానిలో అసైన్డ్ భూములుకు సంబంధించి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ముందుగానే రాజధాని ఇక్కడ వస్తుందని చెప్పి, తన అనుచరులు ద్వారా, ఇక్కడ భూములు కొనిపించి, ఆ తరువాత ఇక్కడ రాజధాని ప్రకటించటం వల్ల, తన అనుచరులకు లబ్ది చేకూర్చారు అని ఆ కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించి, కొంత మంది ఫిర్యాదు చేయటంతో, ఈ కేసు నమోదు అయ్యిందని చెప్తున్నారు. అయితే దీన్ని ఇంకా అధికార వర్గాలు దృవీకరించలేదు. మొత్తం ఎనిమిది మంది పై ఈ కేసు నమోదు అయ్యిందని చెప్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు పేరు కూడా ఉండటంతో, చంద్రబాబుకి నోటీసులు ఇచ్చేందుకు, ఏపి సిఐడి అధికారులు ఆయన ఇంటికి వెళ్ళారని తెలుస్తుంది. ఈ కేసులో విచారణకు హాజరు కావల్సిందిగా, నోటీసులు ఇచ్చేందుకు అక్కడకు వెళ్ళారని సమాచారం అందుతుంది. అయితే చంద్రబాబుకి నోటీసులు ఇచ్చారా, ఆయన తీసుకున్నారా అనే విషయం పై ఇంకా క్లారిటీ లేదు. చంద్రబాబు ప్రస్తుతం, హైదరాబాద్ లో ఉన్నారు.

cbn 16032021 2

ఆయన్ను కలుసుకోవాలి అంటే, ముందు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేన పక్షంలో, సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి, టైం తీసుకుని, నోటీసులు ఇచ్చే అవకాసం ఉంది. ఇప్పటి వరకు అయితే, సిఐడి అధికారులు చంద్రబాబు నివాసం బయట మాత్రమే ఉన్నారని, మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజధాని భూముల్లో గతంలో కూడా కొన్ని కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులకు సంబంధించి ముఖ్యంగా , హైకోర్టులో కొన్ని తీర్పులు కూడా వచ్చాయి. ల్యాండ్ పోలింగ్ ప్రక్రియకు ముందు, అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రాజధాని అమరావతిలో వస్తుందని లీక్ చేసి, తన అనుచరులతో భూములు కొనిపించారని, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ, హైకోర్టులో కేసులు వేసారు. అయితే హైకోర్టు ఈ కేసులు కొట్టేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు మరో కేసు పెట్టి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టె ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని టిడిపి అంటుంది. దీని పై న్యాయ స్థానాల్లో తేల్చుకుంటాం అని అంటున్నరు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఇందులో బీజేపీకి, వైసీపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని, పార్లమెంట్ లో చెప్పినా, పోస్కోతో డీల్ గురించి బయటకు వచ్చినా, ఉద్యమం జరుగుతున్నా, విశాఖలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం రావటంతో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో, సంపూర్ణ సహకారం ఉంది అనుకున్నారో ఏమో కానీ, కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వెళ్తుంది. ఈ రోజు ఈ సమస్య పై, ఒకే రోజు ఇద్దరు కేంద్ర మంత్రులు తెగేసి చెప్పేసారు. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం పై, మరోసారి కేంద్రప్రభుత్వం పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు. దేశంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తామని స్పష్టం చేసారు. ఇలా ప్రైవేటు పరం చేయటం ద్వారా, కేంద్రానికి రూ.1.75 లక్షల కోట్లు వస్తాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో, ఆ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళటానికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. ఆ ప్లాంట్ రుణ భారం పెరిగి పోయిందని, తుక్కువ ఉత్పత్తి చేస్తున్నారని, ఇవి ముఖ్య కారణాలు అంటూ ఆమె వివరించారు.

steel 15032021 2

అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇక మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా స్పందించారు. "ప్రభుత్వ రంగ స్టీల్ కంపెనీలకు అవసరమైన ఇనుప ఖనిజం, బొగ్గు సొంత గనుల ద్వారా సమకూరుతుంది. సొంత గనులు లేని సంస్థలు దేశీయ మార్కెట్ లేదా దిగుమతి చేసుకుంటాయి. తమకు సొంత గనులు కేటాయించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ సంస్థ, ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఏపీని కోరింది. కేంద్ర ఉక్కు శాఖ సైతం ఒడిశా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. 2020 మార్చిలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు జార్ఖండ్‌లోని రబోడి బొగ్గు గనులు కేటాయిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం ఆమోదించింది,. కానీ సొంత ఇనుప ఖనిజం గనులు లేవు అంటూ, ధర్మేంద్ర ప్రధాన్ మరోసారి పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసారు. అయితే నిన్న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో అధికార వైసిపీ పార్టీని ప్రజలు గెలిపించారు అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతున్నారని అర్ధం చేసుకుని, కేంద్రం కూడా దూకుడుగా వెళ్తుంది ఏమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మున్సిపల్ఎన్నికల ఫలితాల పై అధికార వైసీపీ అబద్ధాలు చెబుతోందని, గెలుపుకోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవస్థను, ఎన్నికలవిధానాలను ఎలామార్చేశాడనే దానిపై ఆ పార్టీనేతలు, ప్రజలు ఆలోచించాలని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్నికల్లో గెలుపుకోసం రాజకీయపార్టీలు పోటీపడేవని, ఏపార్టీకి ఆపార్టీ వాటివాటి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ల డానికి ప్రయత్నించేవని, పోలీసులు అధికారులు రిఫరీ పాత్ర పోషించేవారని రఫీ పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలను, చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసులు సరిచేసేవారన్నారు. ప్రజలు తమ ఓటుహక్కుని స్వేఛ్చగా వినియోగించుకోవడానికి సదరు పోలీస్, అధికారవ్యవస్థ ఉపయోగపడేదన్నారు. జగన్ అధికారంలోకివచ్చాక, గతంలోఉన్న పద్ధతికి భిన్నంగా అంతా మారిపోయిందన్నారు. పోలీస్, అధికారవ్యవస్థలు పూర్తిగా చేతులెత్తేసి ప్రభుత్వానికి దాసోహమయ్యాయన్నారు. వైసీపీ గెలుపులో ప్రభుత్వం, పోలీసులు, ప్రభుత్వయంత్రాంగం, వాలంటీర్ వ్యవస్థ, డబ్బుపంపిణీ వంటివి కీలకపాత్ర పోషించాయన్నారు. ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ అధికార పార్టీతోకాకుండా, పైనచెప్పిన ఐదుశక్తులతో పోటీ పడే పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం కల్పించిందన్నారు. సంక్షేమ పథకాలనేవి అన్నిప్రభుత్వాలు, అందరు నాయకులు అమలు చేశారని, కానీ తమకు ఓటేయకుంటే, ఆయా పథకాలను తీసేస్తామనే బెదిరింపు ధోరణి, భయానకవాతావరణాన్ని ఈప్రభుత్వంలో చూస్తున్నామన్నారు.

ycp 15032021 2

వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి గెలుపు అందించడంలో కీలకపాత్ర పోషించిందని రఫీ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలమధ్యన కాకుండా, ప్రభుత్వం కిందున్న ఐదు వ్యవస్థలతో ప్రతిపక్షాలు తలపడాల్సి వచ్చిందన్నారు. వాలంటీర్లు చెప్పింది వినకుంటే, తమ రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లస్థలాలు ఎక్కడ తీసేస్తారోనన్న భయమే ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలపై ఆధారపడి బతికే పేదలంతా విధిలేక, గతిలేక వాలంటీర్ల బెదిరింపులకు తలొగ్గాల్సి వచ్చిందన్నారు. దాని తోపాటు, ఓటర్ల ఓట్లను తారుమారుచేయడం, ఒక డివిజన్ లో ఉండాల్సిన ఓట్లను మరోడివిజన్ కు మార్చడం వంటివి కూడా ఓటింగ్ పై ప్రభావం చూపిందన్నారు. అన్నివ్యవస్థలు కలగలిసిన కొండచిలువవంటి ప్రభుత్వంతో, తెలుగుదేశంపార్టీ ప్రాణాలకు తెగించి పోరాడిందన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూశాక, ప్రభుత్వంతోపాటు, మిగిలినశక్తులను ఎలా తట్టుకోవాలనే దానిపై టీడీపీ ఇప్పటికే దృష్టిసారించింద న్నారు. అన్నింటికన్నా చివరిదైన డబ్బు ప్రభావాన్ని ఎలా నిలువరించాలనే దానిపై కూడా ఆలోచనచేస్తున్నామన్నారు. తాడిపత్రి, మైదుకూరులో టీడీపీనేతలు చేసినపోరాటమే, అన్నిచోట్లా చేయాలనే విషయాన్ని తమపార్టీనేతలు ఆలస్యం గా గ్రహించారన్నారు. విశాఖ ఉక్కుప్రైవేటీకరణ, అమరావతి, ఆస్తిపన్ను పెంపువంటి అంశాలను టీడీపీ ప్రజలకు తీసుకె ళ్లిందని, అయినప్పటీకీప్రజలు వాటిని ఒప్పుకొనే ఓటింగ్ కు రావడంజరిగిందన్నారు. ఫలితాలు అమరావతికి వ్యతిరేకమని, మూడురాజధానులకు అనుకూలమని చెప్పుకుంటున్న వైసీపీనేతలంతా ఆస్తిపన్నుపెంపును, ధరలపెరగుదలను కూడా ప్రజలు ఆమోదించారని చెప్పగలరా అని రఫీ ప్రశ్నిం చారు.

అనంతపురం జిల్లాలో మంత్రి దూకుడు మాటలకు, అక్కడ ఉన్న ప్రభుత్వ మహిళా డాక్టర్ కంటతడి పెట్టిన ఘటన కలకలం రేపింది. మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలకు అక్కడ మహిళా డాక్టర్ మీడియా ముందే కంటతడి పెట్టుకోగా, అక్కడ ఉన్న మిగతా సిబ్బంది ఆమెకు బాసటగా నిలిచారు. ప్రభుత్వం వైపు నుంచి అరకొర సౌకర్యాలు వస్తున్నా, సరిపడా సిబ్బంది లేకపోయినా, తాము ఎక్కడ ఇబ్బంది లేకుండా విధుల్లో పాల్గుని, రాష్ట్రంలోనే ఈ హాస్పిటల్ కు మంచి పేరు తీసుకురాగా, మంత్రి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పై, వారు కూడా మీడియా ముందు ధీటుగా స్పందించారు. తమపై వేటు వేసినా సరే, తాము దేనికైనా సిద్ధం అని అంటున్నారు. ఇక సంఘటన వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో, ఇరు వర్గాల ప్రజల మధ్య జరిగిన గొడవలో, వైసీపీకి చెందిన ఇద్దరికీ గాయాలు అయ్యాయి. రెండు వర్గాలు వైసీపీ వారే కావటం గమనార్హం. అయితే దెబ్బలు తగిలిన వీరిని, నిన్న రాత్రి 11.30 ప్రాంతంలో అనంతపురం జిల్లా, పెనుకొండలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. వారికి అప్పుడే విధుల్లో ఉన్న వైద్యులు చికిత్స అందించారు. అయితే తమ వర్గం వారు కావటంతో, ఈ రోజు ఉదయం రోడ్లు భవనాలశాఖ మంత్రి శంకర్‌నారాయణ హాస్పిటల్ కు వెళ్లారు.

doc 15032021 2

అక్కడ చికిత్స పొందుతున్న తమవారిని పరామర్శించారు. ఈ నేపధ్యంలోనే హాస్పిటల్ పని తీరు పై, అక్కడ ఉన్న సౌకర్యాల పై, అక్కడ ఉన్న వైద్యులు, సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది, కొన్ని సమస్యలు చెప్పగా వారి పై మంత్రి ఫైర్ అయ్యారు. ఇక్కడ వైద్యులు సకాలంలో స్పందించటం లేదని, సరిగ్గా డ్యూటీలు చేయటం లేదని, ప్రైవేటు క్లినిక్ లు పెట్టుకుని, అక్కడే ఉంటున్నారని అక్కడ ఉన్న డాక్టర్ల పై మండి పడ్డారు. వెంటనే వైద్యశాఖ ఉన్నతాధికారులను ఫోన్‌ చేసి, ఇక్కడ ఉన్న వైద్యులకు మేమోలు ఇవ్వాలని, వారి పై చర్యలు తీసుకోకపోతే, నీ మీద చర్యలు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే మంత్రి మాటలకు అక్కడే ఉన్న మహిళా డాక్టర్ సుకన్య కంటతడి పెట్టారు. తాము ఇక్కడ ఎంతో నిబద్దతో పని చేస్తున్నామని, సౌకర్యాలు, నిధులు లేకపోయినా, కష్టపడి రాష్ట్రంలోనే ఈ హాస్పిటల్ కు మంచి ర్యాంక్ తెచ్చిపెడితే, మంత్రే ఇలా తమ పై ఆరోపణలు చేయటం ఆవేదన కలిగిస్తుందని వాపోయారు. ఇక మంత్రి వ్యాఖ్యల పై స్పందించిన సూపరింటెండెంట్ డాక్టర్ బుడం సాహెబ్, సిబ్బంది కొరత, ఇక్కడ ఉన్న ఇబ్బందులు చెప్తూ, ఇంతలా కష్టపడుతున్న మమ్మల్ని ఇలా అనటం పై అభ్యంతరం వ్యక్తం చేసారు.

Advertisements

Latest Articles

Most Read