ఈ రోజు వచ్చిన మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో, టిడిపికి ఎదురు దెబ్బ తగిలినా, తాడిపత్రిలో మాత్రం, టిడిపి జెండా ఎగురవేసింది. అక్కడ 36 వార్డులకు, 21 వార్డులు టిడిపి మద్దతుదారులు గెలిచారు. తాడిపత్రి 24 వార్డు అభ్యర్ధిగా జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, ఆయన గెలిపించుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నంత మంచి క్యాడర్ ఎక్కడా లేదని, ఎవరికీ లేదని, అయితే నాయకులు మాత్రం సగం మంది బోగస్ గాళ్ళే ఉన్నారు అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు గారు ప్రక్షాళన చేయాలని, నాయకులను మార్చితే, కార్యకర్తలు గెలిపించుకుంటారని అన్నారు. నిలబడే నాయకులే కరువు అయ్యారని అన్నారు. ఇక్కడ మాకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు వచ్చాయంటే, ఊరికే వచ్చాయా, పార్టీ ఎంత బలంగా ఉందో తెలుస్తుంది కదా అంటూ, జేసీ అన్నారు. ఏ రోజు అయితే పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చి, తనను బండ బూతులు తిట్టారో, అప్పుడే ఇక్కడ ప్రజలు తన వెంట వచ్చారని, ఇక్కడ వీళ్ళు చేస్తున్న అరాచకాలకు ఫుల్ స్టాప్ పడాలనే, సేవ్ తాడిపత్రి అనే నినాదం పెట్టమని అన్నారు. తాడిపత్రిని మీరే కాపాడుకోవాలని ప్రజలను కోరామని, ప్రజలు కూడా అర్ధం చేసుకుని, తాడిపత్రిని కాపాడుకున్నారని జేసీ అన్నారు.

పార్వతీపురంలో టెన్షన్ వాతవరణం నెలకొంది. అక్కడ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని చెప్పి, ఏడు గంటలకే పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు అక్కడకు చేరుకున్నారు. ఈ దశలో ఓట్ల లెక్కింపు ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యింది. తొలత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. ఈ దశలో స్థానిక వైసిపీ ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే జోగారావుని పోలీసులు లెక్కింపు కేంద్రం వద్దకు అనుమతించారు. అయితే ఇది తెలుసుకుని స్థానికంగా ఉండే టిడిపి ఎమ్మెల్సీ అయిన జగదీశ్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఇద్దరూ కలిసి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు వచ్చారు. అయితే మాజీ ఎమ్మెల్యేని లోపలకు అనుమతించలేదు. అయితే జగదీష్ ను మాత్రం నేను ఎమ్మెల్సీని, నన్ను కూడా లోపలకు అనుమతించాలని, వైసీపీ ఎమ్మెల్యేను ఏ విధంగా అనుమతించారో, నన్ను కూడా పంపించాలని జగదీశ్ పట్టుబట్టారు. అయితే దీనికి పోలీసులు అభ్యంతరం చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేను పంపించి, నన్ను ఎందుకు పంపించలేదు అనటంతో, పోలీసులకు, ఎమ్మెల్సీకి మధ్య వాదన జరిగింది. ఈ వాదన క్రమంలో, జగదీశ్ ని నెట్టే క్రమంలో, ఈ గొడవలో, ఆయన చొక్కా పూర్తిగా చిరిగిపోయింది. దీంతో టిడిపి నేతలు అక్కడ నిరసన చేస్తున్నారు.

కృష్ణాజిల్లాలోని ప్రభుత్వకార్యాలయాలు, ఇతర ముఖ్య సంస్థలను, కొత్తగా నిర్మించాలనుకుంటున్నవాటిని ముఖ్య మంత్రి జగన్ రెడ్డి తనసొంతజిల్లా అయిన కడపకు తరలిస్తూ, రాజధానిప్రాంతానికి తీవ్రఅన్యాయం చేస్తున్నాడని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేయాల నుకున్న పశుసంవర్థకశాఖ కార్యాలయాలను తరలిస్తూ ప్రభుత్వమిచ్చిన జీవోపై స్పందించకుండా సదరుజిల్లాకు చెందిన మంత్రులు, అధికారపార్టీఎమ్మెల్యేలు ఏంచేస్తున్నార ని రఫీ ప్రశ్నించారు. చంద్రబాబుని, టీడీపీని దూషించడానికి నోరుతెరిచే మంత్రులు, ముఖ్యమంత్రి ఇంతచేస్తున్నా ఎందు కు నిస్సహాయస్థితిలో ఉన్నారన్నారు. వెల్లంపల్లిశ్రీనివాస్, పేర్నినాని, కొడాలినాని లు ముఖ్యమంత్రిని ఈ వ్యవహారంపై ఎందుకు నిలదీయలేకపోతున్నారని రఫీ నిలదీశారు. మెట్రో కార్యాలయం, విజిలెన్స్అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం, కృష్ణా ట్రైబ్యునల్ కార్యాలయాలను విజయవాడనుంచి వివిధ ప్రాంతాలకు తరలించారన్నారు. విజయవాడపై ముఖ్యమంత్రి కి ఎందుకంత కసి, కోపమో ఆయనే చెప్పాలన్నారు. కృష్ణా జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి ఈవిధంగా అన్యాయం చేస్తు న్నా, సదరు మంత్రులు ఎందుకు నోరెత్తడంలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అన్నీఇచ్చేసిన ముఖ్యమంత్రి, అమరావతిని కూడా ధ్వంసం చేసేపనిలో ఉన్నాడన్నారు. పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ భవనాలను కూల్చేసి, సరికొ త్తహంగులతో నూతనభవనాలు నిర్మించుకుంటుంటే, ఇక్కడే మో జగన్ ఉన్నవాటిని నాశనం చేస్తున్నాడని రఫీ వాపోయా రు. జగన్ మిత్రుడైన కేసీఆర్ నుంచి రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవడంలో ఏపీసీఎం ఘోరంగా విఫలమయ్యాడన్నా రు. 58-42 నిష్పత్తిప్రకారం విజయడెయిరీ ఆస్తులను ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని కోర్టు తీర్పుచెప్పిందని, అదేవిధంగా ఆర్టీసీ ఆస్తులను కూడా పంచాల్సి ఉండగా, దానిపై జగన్ ఎందుకు కేసీఆర్ ని ప్రశ్నించలేకపోతున్నాడన్నారు.

జెన్ కో నుంచి ఏపీకి రూ.7కోట్లు రావాల్సి ఉందని, ఉద్యోగుల విభజ న వ్యవహారంకూడా కోర్టులో ఉందని, దాన్ని కూడా జగన్ పట్టించుకోవడంలేదన్నారు. అమరావతికి కేటాయించిన రైలు మార్గానికి రాష్ట్రంవాటాగా అవసరమైన నిధులు ఇవ్వకపోవ డంతో ఆప్రాజెక్ట్ కూడా అటకెక్కిందన్నారు. ప్రత్యేకహోదా, రై ల్వేజోన్, పోలవరం నిధులు, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై కేంద్రాన్నిప్రశ్నించలేని దుస్థితిలో జగన్ ఉన్నాడన్నారు. ఈవిధంగా రాష్ట్రానికి రావాల్సినవాటిని వది లేస్తూ, ఉన్నవాటిని వేరేవారికి అప్పగించేస్తున్న జగన్ అంతి మంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడన్నారు. కృష్ణాజిల్లాలోని కార్యాలయాలను పులివెందులకు తరలించడం ఏమిటన్నా రు. కేవలం పులివెందులలోనే రూ.663కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి, తనతండ్రిసమాధి సుందరీకరణ పనులకోసం రూ.27కోట్లను కేటాయించాడన్నా రు. జగన్ వైఖరి చూస్తుంటే, ఆయన రాష్ట్రానికి ముఖ్యమం త్రా లేక పులివెందులకా అన్న అనుమానం కలుగుతోందన్నా రు. కేంద్రం, పొరుగురాష్ట్రంనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల ను, భవనాలను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నవాటిని తనసొంత జిల్లాకు, తరలించుకోవడం ఏమిటని రఫీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చర్యలతో ప్రాంతీయవిబేధాలు తలెత్తే అవకాశముందన్నారు.

రాజధానిప్రాంతంలో నివాసం ఉంటూ, అక్కడినుంచే పాలనచేస్తున్న ముఖ్యమంత్రి తనప్రేమనంతా పులివెందులపై చూపడం ఏమిటన్నారు. ఉన్న కార్యాలయాలను యథాతథంగాఉంచేసి, కొత్తవాటిని తన ప్రాంతంలో ఏర్పాటుచేసుకునేదిశగా ముఖ్యమంత్రి ఆలోచిస్తే మంచిదని రఫీ హితవుపలికారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన వాటిని ఈ ముఖ్యమంత్రి ఎందుకొదిలేశాడో చెప్పాలన్నారు. కేసీఆర్ చెప్పాడని పోలవరం ఎత్తుతగ్గించడా నికి జగన్ రెడ్డి సిద్ధమవ్వడం సిగ్గుచేటన్నారు. టీడీపీనేతల ను వేధించడం, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం, ప్రజల ను సంక్షేమపథకాల పేరుతో మోసగించడం తప్ప, తనపాల నలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేమీలేదన్నారు. రూ. 3,600కోట్లవరకు స్థానికఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఖర్చు చేసినట్లు జనచైతన్యవేదిక వారు చెప్పారన్నారు. పులివెందు ల నియోజకవర్గం మాదిరే, ఇతర నియోజకవర్గాలపై కూడా జగన్ దృష్టిసారించాలన్నారు. కృష్ణాజిల్లాలోని కార్యాలయాల ను ఇతరప్రాంతాలకు తరలించే ఆలోచనలను ముఖ్యమంత్రి తక్షణమే మానుకోవాలని రఫీ డిమాండ్ చేశారు. ఆ జిల్లా మంత్రులుకూడా ప్రజలముందుకొచ్చి, ముఖ్యమంత్రి చర్యలపై సమాధానంచెప్పాలన్నారు. విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవే టీకరణను అడ్డుకునేదిశగా ముఖ్యమంత్రి తక్షణమే తనకార్యాచరణ ప్రకటించి ప్రజల్లోకి వచ్చిపోరాడాలని రఫీ డిమాండ్ చేశారు.

కడపస్టీల్ ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లావాసులను ఇదివరకే ఎలామోసగించాడో అందరి కీ తెలిసిందేనని, విశాఖఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి కేంద్రంతో కుమ్మక్కైన జగన్ రెడ్డి, విశాఖ ఉక్కు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కడపలో స్టీల్ ప్లాంట్ అంటూ కొత్తరాగం ఆల పిస్తున్నాడని టీడీపీనేత, ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టంచేశారు. శనివారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడారు. కడపలోస్టీల్ ప్లాంట్ ఏర్పాటుకుసంబంధించి, 2021 ఫిబ్రవరిలో లిబర్టీసంస్థతో రాష్ట్రప్రభుత్వం సంయుక్త ఒప్పందం చేసుకుందని, అందుకు కావాల్సిన భూమి, నీరు, విద్యుత్, ఇతర మెటీరియల్, మౌలికసదుపాయాలను కల్పిస్తున్నట్లు ఆ వెంటనే రాష్ట్రమంతివర్గం తీర్మానించడం జరిగిందన్నారు. గతనెలలో కేబినెట్ ఆమోదం లభించగానే, ఈనెల 1న సదరు కంపెనీ దివాలాతనం బయటపడిందన్నారు. సదరు సంస్థ ఇదివరకే దివాలాతీసినట్లు, ఎక్కడా ఎటువంటి పెట్టుబ డులు పెట్టే స్తోమతదానికి లేదని సంస్థే చెప్పడం జరిగింద న్నారు. దివాలాతీసిన కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చి, కడప లో స్టీల్ ప్లాంట్ పెడుతున్నట్లు వైసీపీప్రభుత్వం ప్రజలను నమ్మించాలని చూసిందన్నారు. సదరు కంపెనీకి ఇదివరకే నాయుడుపేటలో భూములుకేటాయిస్తే, అవిఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయన్నారు. దివాలాకంపెనీతో జగన్ ప్రభుత్వం ఎలాఒప్పందం చేసుకుందో, ఆఒప్పంద వివరాలే మిటో వెంటనే బహిర్గతంచేయాలని రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ రెడ్డికి నిజంగా కడపలోస్టీల్ ప్లాంట్ పెట్టాలనిఉంటే, ఆయన తనచిత్తశుద్ధిని నిరూపించుకోకుండా విశాఖఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని డైవర్ట్ చేయడానికే కడప అంశాన్ని తెరపైకి తెచ్చాడన్నారు. కడపజిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టేఉద్దేశం జగన్ కు ఉంటే, ఆయన దివాలాకంపెనీని తెరపై కి తెచ్చి దివాలాకోరు రాజకీయాలుచేయడన్నారు. జగన్ సదరు కంపెనీతో చేసుకున్న చీకటిఒప్పందం వివరాలను ఆయనే బహిర్గతం చేయాలని టీడీపీఎమ్మెల్సీ డిమాండ్ చేశా రు.

కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేయకుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పటీకి చరిత్రహీనుడిగానే మిగిలిపోతాడన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేయకుంటే, ఆయన్ని వదిలేదిలేదన్నారు. కడపస్టీల్ ప్లాంట్ ఏర్పాటువిషయంలో కూడా జగన్, కేంద్రం దొంగాట ఆడుతున్నాయన్నారు. అవసరమైతే, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సొంతంగా రాష్ట్రప్రభుత్వమే నడుపుతుందని చెబుతున్న జగన్, నిజంగా వైసీపీప్రభుత్వానికి అంతటి సమర్థతే ఉంటే, కడపలో సొంతంగాస్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎందుకు పూనుకోవడంలేదని మారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు చొరవతో, రాష్టప్రభుత్వమే సొంతఖర్చులతో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొ చ్చిందన్నారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో అందుకోసం శం ఖుస్థాపన కూడా చేయడం జరిగిందన్నారు. జగన్ వచ్చాక కనీసం అక్కడ రోడ్డుని కూడా ఏర్పాటుచేయలేకపోయాడ న్నారు. నిజంగా తనసొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన, చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి ఉంటే, దివాలాతీసిన కంపెనీని తీసుకొచ్చి రాజకీయాలు చేసేవాడు కాడన్నారు. చెత్తకంపెనీలను తెరపైకి తీసుకొచ్చి నాటకాలు ఆడకుండా, ముఖ్యమంత్రి తక్షణమే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషిచేయాలన్నారు. ఆయన ఆదిశగా నిర్ణయం తీసుకోకుంటే, కడపజిల్లావ్యాప్తంగా విద్యార్థులు, యువత, నిరుద్యోగులతో కలిసి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉద్యమిస్తా మని రవీంద్రనాథ్ రెడ్డి తేల్చిచెప్పారు. దివాలాకోరు కంపెనీతో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని బహిర్గతంచేయడంతో పాటు, సదరుఒప్పందం చేసుకున్న అధికారులపై కూడా ముఖ్య మంత్రి చర్యలు తీసుకోవాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. లేకుంటే త్వరలోజరిగే అసెంబ్లీ, మండలి సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిగా నిలబెడతా మని ఆయన హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read