విశాఖ ఉక్కుప్రైవేటీకరణకు సంబంధించి జగన్ ఆయన ప్రభుత్వం సాగించిన కుట్రలను, తెరవెనుకసాగిస్తున్న బాగోతాన్ని టీడీపీ నేతలు శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మరియు శ్రీ పల్లా శ్రీనివాసరావు తదితరులు నేడు మీడియాముఖంగా బహిర్గతం చేశారు. ఆ వివరాలు... "కొమ్మారెడ్డి పట్టాభిరామ్ : రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు సంబంధించి చేయాల్సిందంతా చేసి, పచ్చి అబద్ధాలతో ఏవిధంగా ప్రజలను మోసగించడానికి కట్టుకథలు చెబుతున్నారో, మోసపూరితమాటలతో ఇంకారాష్ట్రప్రజలను మభ్యపెట్టే కార్య క్రమాలను ఎలాసాగిస్తున్నారో ఆధారాలతోసహా నేడు మీడియావారి సమక్షంలో వివరించబోతున్నాము. ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఇంతనీచానికి ఒడిగట్టి, రాష్ట్రసంపదైన విశాఖఉక్కు కర్మాగారాన్ని తనఅవినీతికోసం తాకట్టుపెట్టగలడా అనిచూస్తే, మాకేఆశ్చర్యంకలిగింది. ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయినమొదటినెల (జూన్ 2019) నుంచీ ఏరకంగా విశాఖఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణకుట్రలో భాగస్వామి అయ్యాడో ప్రజలముందుంచుతున్నాను. జూన్ 22 - 2019నపోస్కో కంపెనీ ప్రతినిధులతోప్రత్యేకంగా సమావేశమై, విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రకు జగన్ రెడ్డి తెరలేపడం జరిగింది. ఆసమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఈ ఒప్పందంలో పోస్కో కంపెనీవారితో, తనవాటాలపై ముఖ్యమంత్రి ఒకఒప్పందానికి రావడం జరిగింది. ఇది జరిగిన తరువాతనే, జూలై 2019లో పోస్కోకంపెనీవారు, కేంద్ర ఉక్కుశాఖాకార్యదర్శి బినయ్ కుమార్ గారినికలిసి, విశాఖ ఉక్కు కర్మాగారం వాటాల కొనుగోలుకు సంబంధించి, ప్రతిపాదనను అందించడం జరిగింది. సెప్టెంబర్ 2019లో విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా కేంద్రఉక్కుశాఖామంత్రి ధర్మేంద్రప్రదాన్ గారితో సమావేశ మయ్యారు. ఈ సమావేశం తరువాత మరుసటినెల అక్టోబర్ 2019లో, పోస్కోకంపెనీకి ఆర్ఐఎన్ఎల్ (విశాఖ స్టీల్ ప్లాంట్) కు మధ్యనఒప్పందంపై సంతకాలుజరిగాయి. నవంబర్8, 2019న కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ రాష్ట్ర పర్యటనకువచ్చి అమరావతిలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సమావేశమైన తరువాతి రోజు, విశాఖపట్నంవెళ్లిన కేంద్రమంత్రి విశాఖ ఉక్కుఫ్యాక్టరీకి సంబంధించి ప్రైవేట్ పార్టనర్ షిప్ ఎంతోఅవసరమని మాట్లాడతారు. వైసీపీఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్టాండింగ్ కమిటీఆన్ స్టీల్ లో సభ్యుడిగా ఉన్నారు. సదరు కమిటీ డిసెంబర్ 6, 2019న విడుదలచేసిన నివేదికలో, విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలో జరుగుతున్న అనేక అభివృద్ధికార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది.
ఆప్రాజెక్టులు అన్నీపూర్తయితే విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిలో పడుతుందని చాలాస్పష్టంగా, వైసీపీ ఎంపీ వేమిరెడ్డిప్రభాకర్ రెడ్డి సభ్యుడిగా ఉన్న స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ నివేదికలో చెప్పడం జరిగింది. రూ.2,500కోట్లతో జరుగు తున్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే, ఆర్ఐఎన్ఎల్ (విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ) కష్టాలన్నీ తీరిపోతాయని స్పష్టంగా చెప్పడం జరిగింది. స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ విభాగం తననివేదిక సమర్పించాక, రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫిబ్రవరి -2020లో అడిగిన ప్రశ్నకు (ప్రశ్ననెం-474) సమాధానంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధిం చిన ఒప్పందం జరిగిపోయిందన్నారు. ఆరోజే స్పష్టంగా కేంద్రమంత్రి ప్రైవేటీకరణ తాలూకాఒప్పందం జరిగిపోయిందని చెబితే, సంవ త్సరం క్రితమే తనకుతెలిసిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తొక్కిపెట్టారు? ప్రజలముందు వాస్తవాలు ఉంచకుండా, వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాటంచేయకుండా, ఎందుకు మౌనంగా ఉన్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వేమిరెడ్డిప్రభాకర్ రెడ్డి సభ్యుడిగా ఉన్న స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ విభాగమేమో, రూ.2,500కోట్లతో జరుగుతున్న ప్రాజెక్టులు పూర్తయితే, విశాఖ ఉక్కుఫ్యాక్టరీ గాడిలో పడుతుందని నివేదిక ఇస్తుంది. ఆ తరువాత పార్లమెంట్లోనేమో కేంద్రమంత్రి ఒప్పందం జరిగిపోయిందని చెబితే, అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమీ తెలియనట్లు మౌనంగా ఉంటారు. స్టాండింగ్ కమిటీఆన్ ఇండస్ట్రీస్, (పెట్టబడుల ఉపసంహరణకు సంబంధించిన కమిటీ) లో వైసీపీ ఎంపీ వై.ఎస్. అవినాశ్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. మార్చి3, 2020న అవినాశ్ రెడ్డి సభ్యుడిగా ఉన్న కమిటీ పెట్టుబుడుల ఉపసంహరణకు సంబంధించిన నివేదికను విడుదలచేస్తుంది. ఆసమయంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ విశాఖఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణకుతాలూకా ఒప్పందం జరిగిపోయిందనే అంశాన్ని, పెట్టుబడుల ఉపసంహరణ కమిటీలో సభ్యుడైన అవినాశ్ రెడ్డి ఎందుకు లేవనెత్తలేదు? అవినా శ్ రెడ్డి ఎందుకు నోరూమూసుకొని కూర్చున్నాడు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి బాధ్యతగల ఎంపీగాఉన్నవ్యక్తి ఎందుకు ప్రశ్నించ లేదు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి కీలకమైన కమిటీల్లో ఉండికూడా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా నోరెత్తకుండా కూర్చోవడానికి కారణం జగన్ రెడ్డి ఆదేశాలే. ఆర్ఐఎన్ ఎల్ కు , పోస్కోకు మధ్యన ఒకవర్కింగ్ గ్రూపు ఏర్పాటుచేయాలని ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆగస్ట్ 2020లో ఆదేశాలిచ్చారు. కేంద్రమంత్రి ఆదేశించినప్పుడు కూడా వైసీపీఎంపీలు మాట్లాడలేదు.
అక్టోబర్ 26న ఆర్ఐఎన్ఎల్ కి, పోస్కోకి మధ్యన జాయింట్ వర్కింగ్ గ్రూపు అనేది ఏర్పాటైంది. అదిఏర్పాటైన రెండురోజుల్లోనే పోస్కోప్రతినిధులు మరలా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. పోస్కో ప్రతినిధులు, విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు సంబంధించిన కీలకఘట్టాలకు ఒక రోజు ముందో, ఒకరోజు తర్వాతో జగన్ తోగానీ, విజయసాయితో గానీ సమావేశమయ్యారు. ఏకుట్రలో భాగంగా ఏ1, ఏ2లు పోస్కో వారితో సమావేశాలు జరిపారోచెప్పాలి. డిసెంబర్ 17-2020న విజయసాయిరెడ్డి, మరలా ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ ను కలిశారు. ఆ తరువాత జనవరి 25-2021కి సెంట్రల్ కేబినెట్ కమిటీ ఆన్ఎకనామిక్ఎఫైర్స్, నూటికినూరుశాతం పెట్టుబడుల ఉపసం హరణ ప్రక్రియకు ఆమోదం తెలుపుతుంది. జూన్ లో పోస్కో వారు ముఖ్యమంత్రినికలుస్తారు. జూలైలోప్రపోజల్ ఇస్తారు, సెప్టెంబర్ లో విజయసాయిరెడ్డి వెళ్లి ధర్మేంద్రప్రధాన్ ను కలుస్తాడు. అక్టోబర్ లో ఎంవోయూ (ఒప్పందం) అయిపోతుంది. డిసెంబర్ లో స్టాండింగ్ కమిటీవారు రిపోర్ట్ ఇస్తారు, నవంబర్8న ముఖ్యమంత్రిని ధర్మేంద్రప్రధాన్ గారు విజయవాడలో కలుస్తారు, ఆమరుసటి రోజే కేంద్రమంత్రి విశాఖకువచ్చి ప్రైవేట్ ఈక్వీటీలగురించి మాట్లాడతారు, అక్టోబర్ లో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైతే, రెండ్రోజుల్లోనే పోస్కో ప్రతినిధులు వెళ్లి జగన్ రెడ్డిని కలుస్తారు. నవంబర్ లో మరలా విజయసాయిరెడ్డి వెళ్లి ధర్మేంద్రప్రదాన్ ను కలుస్తారు, జవనరిలో మొత్తం క్లియరెన్స్ వస్తుంది. జగన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఏవిధంగా అమ్మకానికిపెట్టాడో, ఏవిధంగా కుట్రలోభాగస్వామి అయ్యాడో మొత్తం చరిత్రంతా ఇదీ. తేదీలు, ఆధారాలతో సహా తమ పార్టీ మొత్తంవ్యవహారాన్ని బయటపెట్టింది. దీనిపైముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడో చెప్పాలి. చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఆర్ ఐఎన్ఎల్ కు సొంతఇనుపఖనిజ గనులుకేటాయించడానికి కృషిచే శారు. విశాఖపట్నలో జరిగిన పార్టనర్ షిప్ సమ్మిట్ లో ఆర్ ఐఎన్ఎల్, ఏపీఎండీసీ (ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) మధ్యన ఇదే అంశంపై ఒప్పందం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలోని కుకునూరు ఐరన్ ఓర్ గనులను ఆర్ఐ ఎన్ఎల్ కు కట్టబెట్టడానికి నాటిముఖ్యమంత్రి సమక్షంలోనే ఏపీఎండీసీ ఒప్పందం చేసుకుంది. ఆర్ఐఎన్ఎల్ ను కాపాడటానికి చంద్రబాబు కృషిచేసింది నిజంకాదా?
ఆనాడు ఒప్పందం జరిగినప్పుడు ఆర్ఐఎన్ఎల్ సీఎండీగాఉన్న మదుసూధన్ , కుకునూరు ఐరన్ ఓర్ గనులను కేటాయించి, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడటానికి ముందుకొచ్చిన చంద్రబాబునాయుడిగారికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ కుకునూరు గనుల కేటాయింపువ్యవహారం నీతి అయో గ్ వద్ద ఇప్పటికీ పెండింగ్ లోఉంది. ఫిబ్రవరి 2021న, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సభ్యుడిగాఉన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ వారు ఇచ్చిన నివేదికలో, కుకునూరు ఐరన్‌ఓర్ గనులను అప్పగిస్తే, ఆర్ఐఎన్ఎల్ కుఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పడం జరిగింది. వైసీపీఎంపీ వేమిరెడ్డి సభ్యుడిగా ఉన్న కమిటీ నే, కుకునూరు ఐరన్ ఓర్ గనులను కేటాయిస్తే, సమస్య తీరిపోతు దని చెప్పినా ముఖ్యమంత్రి ఆదిశగా కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేకపోయారు. ప్రధానమంత్రికి లేఖ రాశానంటున్న జగన్ , ఆ లేఖలో ఈఅంశాన్ని ఎందుకుప్రస్తావించలేదు. ఇటీవలే నీతి అయోగ్ తో సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వారివద్ద విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? కుకునూరు ఐరన్ ఓర్ కేటాయింపుల వ్యవహారం గురించి నీతి అయోగ్ వద్ద జగన్ రెడ్డి ఎందుకు ప్రస్తావించలేదు? ఎందుకంటే ఆయనకు ఆర్ఐఎన్ఎల్ (విశాఖస్టీల్ ఫ్లాంట్) నాశనం కావాలి. దాన్ని తన రాజకీయాలకు వాడుకోవాలి. అందుకే ఇంతజరుగుతున్నా తనకేమీ తెలియనట్లు జగన్ రెడ్డి నటించాడు, ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాడు. పోస్కోతో ఒప్పందాలు జరిగాక, దానికి ముందో , వెనకో వారు విజయసాయిరెడ్డితోనో,జగన్ రెడ్డితోనో సమావేశమయ్యారు. విజయసాయిరెడ్డి ధర్మేంద్రప్రధాన్ గారిని కలిసి, మేముపోస్కోవారి తో మాట్లాడుకున్నాము, మీరు ఒప్పందాలు కానివ్వండని చెప్పాకే ఒప్పందాలు జరిగాయి. నవంబర్ 8న ధర్మేంద్రప్రధాన్ గారు తాడేప ల్లిలో ముఖ్యమంత్రిని కలిశారా లేదా....తరువాతిరోజు విశాఖకు వచ్చి ప్రైవేటైజేషన్ అవసరమవుతుందని చెప్పారా లేదా?
అక్టోబర్ 26,2020న పోస్కో, ఆర్ఐఎన్ఎల్ మధ్య వర్కింగ్ గ్రూపు ఏర్పాటైం దా లేదా? తరువాత వెంటనే పోస్కోవారు జగన్ రెడ్డిని ఎందుకు కలిశారు? మనిద్దరి వర్కింగ్ గ్రూపుఏమిటో చర్చించుకుందామని చెప్పివారు ముఖ్యమంత్రిని కలిశారా? ఇలా అనేక విషయాలున్నా యి.వాటి వెనుక ఎవరెవరున్నారో ప్రజలకు తెలియాలి. జగన్ రెడ్డి, రాష్ట్రభవిష్యత్ ను తాకట్టుపెట్టి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయడా నికి సిద్ధమయ్యాడనడంలో సందేహమేలేదు. చంద్రబాబునాయుడు గారు, ఆర్ఐఎన్ఎల్ ను కాపాడటానికి కుకునూరు ఐరన్ ఓర్ గను లను కేటాయించడానికి, ఏపీఎండీసీకి,ఆర్ఐఎన్ఎల్ కుమధ్యన ఒప్పందం చేశారా లేదా? ఆ వ్యవహారం నీతిఅయోగ్ వద్ద పెండింగ్ లోఉంటే, నీతి అయోగ్ సమావేశంలో జగన్ రెడ్డి, ఆవిషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? ప్రధానమంత్రికి జగన్ రాసిన లేఖలో ఏముంది? కుకునూరు ఐరన్‌ఓర్ గనులనుకేటాయించాలని ఎందుకు లేఖలోప్రస్తావించలేదు? ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, నీతి అయోగ్ సమావేశంలో నోరెత్తాలికదా? చెక్కభజన చేయడానికి సమావేశానికి వెళ్లాడా ఈముఖ్యమంత్రి? ఎందుకు నీతి అయోగ్ వారిని ప్రశ్నించలేదు? ఆర్ఐఎన్ఎల్ ను చంద్రబాబునాయుడు గారుకాపాడే ప్రయత్నంచేస్తే, జగన్ దాన్ని చంపేసేప్రయత్నాలు చేస్తున్నాడు. హుద్ హుద్ సమయంలో కొన్నిగంటల వ్యవధిలోనే చంద్రబాబుగారు, ఆర్ఐఎన్ఎల్ కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరింపచేశారు. చంద్రబాబునాయుడుగారు బాగుచేయాలని చూస్తుంటే, ఈయనేమో అన్నీ ధ్వంసంచేయడానికి ప్రయత్ని స్తున్నాడు. ఎందుకంటే, ముఖ్యమత్రికి కళ్లుమూసినా, తెరిచినా స్టీల్ ప్లాంట్ కుచెందిన ఏడువేల ఎకరాలే గుర్తుకొస్తున్నాయి.
సరెండర్ అయ్యాడుకాబట్టే, ఈముఖ్యమంత్రి రాష్ట్రంగురించి మాట్లాడటంలేదు? ఇటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలోనేలేడు. జగన్ రెడ్డి ఆశీర్వాదంతో, ఆర్ఐఎన్ఎల్ కు , పోస్కోకు మధ్యజరిగినఒప్పందంప్రకారం, మొదటిదశలో 1167 ఎకరాలను ఇచ్చేటట్టు, అదిచాలకపోతే, తరువాత మరింత భూమి ఇచ్చేలా ఒప్పుకున్నారు. అమరావతి అంకురార్పణలో భాగంగా సింగపూర్ ప్రభుత్వసహాయసహాకారాలు రూపాయిఖర్చులేకుండా నాటిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొందగలిగారు. జగన్ రెడ్డే మో, విశాఖస్టీల్ ప్లాంట్ భూములను, పోస్కోకు ధారాదత్తం చేసి, వాటికి సంబంధించి ఏవైనా వివాదాలుతలెత్తితే, సింగపూర్ వెళ్లి న్యాయపోరాటంచేసేలా ఒప్పందాలుచేసుకున్నారు. మన రాష్ట్రంలోని ఆస్తులకుసంబంధించి వివాదాలుతలెత్తితే, వాటిని పరిష్కరించుకోవడానికి దేశంలోని న్యాయస్థానాలుసరిపోవా? సింగపూర్ వరకువెళ్లి, పోరాడాలా? ఇదా జగన్ చేస్తున్న ఘనకార్యం. ఈవిధంగా చేయాల్సిన కుట్రలన్నీచేసి, ఆర్ఐఎన్ఎల్ ను పోస్కోకు అప్పగించిన తొలిముద్దాయి జగన్ రెడ్డి. ఆయన చేసిన కుట్రంతా ప్రజలముందుపెట్టాము. దమ్ము,ధైర్యముంటే, ఆయనే ప్రజలముందుకువచ్చి సమాధానంచెప్పాలి. ఆధారాలులేకుండా, తెలుగుదేశం నాయకులమని ఏదిపడితే అది తాము మాట్లాడటంలేదు. దొంగపేపర్, దొంగఛానల్ చేతిలో ఉన్నాయికదాఅని వాళ్లలా బురదజల్లే అలవాటుమాకు లేదు. ఏదైనాన్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఆధారాలతోనే మాట్లాడతాము. మాపై ఎన్నిదాడులు చేసినా, ఎంతలా భయపెట్టాలనిచూసినా భయపడేదే లేదు. ఇప్పటికే రెండుసార్లు నాపై దాడిచేశారు. ఇప్పడు స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వాస్తవాలుచెప్పానని మూడోసారి దాడిచేయడానికి సిద్ధమవుతున్నారు. అయినా వెనకడుగువేసేది లేదు. మేమంతా కలిసికట్టుగా రాష్ట్రప్రజలకోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టంచేస్తున్నాము.