మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు పర్యటనను ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. కరోనా నిబంధనల పేరుతో చంద్రబాబుని అడ్డుకున్నారు. అయితే దీనికి నిరసనగా చంద్రబాబు గత నాలుగు గంటలుగా ఎయిర్ పోర్ట్ లోనే నిరసన తెలుపుతున్నారు. తనను చిత్తూరు వెళ్ళనివ్వాలని చంద్రబాబు కోరుతున్నా పోలీసులు స్పందించటం లేదు. అయితే చంద్రబాబుని ఎయిర్ పోర్ట్ నుంచి పమించి వేయాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు స్పైస్‍జెట్‍ ఉండటంతో, ఆ ఫ్లైట్ లోనే చంద్రబాబుని తిప్పి పంపించాలని పోలీసులు ప్లాన్ చేసారు. అయితే ఆ ఫ్లైట్ లో టిక్కెట్ లు అన్నీ అయిపోవటంతో, చంద్రబాబుని పంపించటానికి, మార్గాలను పోలీసులు వెతుకుతున్నారు. విమానం పూర్తిగా నిండిపోవటంతో, చంద్రబాబుని ఎలా పంపిస్తారు అనే విషయం పై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ దశలో చిత్తూరు జిల్లా ఎస్పీ, ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. చంద్రబాబుతో చర్చిస్తున్నారు. తనను ఎందుకు ఎయిర్ పోర్ట్ లో నిర్బంధించారో చెప్పాలని చంద్రబాబు ఎస్పీని నిలదీశారు. ఎన్నికల సంఘం కూడా తన పర్యటనకు అనుమతి ఇచ్చిందని, మీరు ఎందుకు నన్ను అడ్డుకున్నారు అంటూ, చంద్రబాబు ఎస్పీని నిలదీసారు.

ఇక తెలుగుదేశం పార్టీ నేతలు, తమ అధినేతను కావాలని అవమానించటం పై, ఆగ్రహంగా ఉన్నారు. అన్ని జిల్లాల్లో నిరసన తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ, ఇప్పటికే అనేక సార్లు చంద్రబాబుని అడ్డుకున్నారని, ఇంకా ఎంత కాలం ఇలా ఆరాచకాలతో పాలన సాగిస్తారు అంటూ ట్వీట్ చేసారు. జగన్ పతనానికి నాంది, ఈ సంఘటన అంటూ వాపోయారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందిస్తూ, ఈ వ్యవహారం పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా స్పందించాలని, సుమోటోగా వ్యవహారం పై ఎన్నికల కమిషన్ స్పందించాలని అన్నారు. మేము ఎన్నో ఫిర్యాదులు ఇస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్టించుకోవటం లేదని, కేవలం వాటిని కలెక్టర్ లకు పంపి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ, చంద్రబాబును నిర్బంధించడాన్ని ఖండిస్తున్నాం అని, రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదని అన్నారు. జగన్ పాలనలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, ఈ పధ్ధతి మారాలని వాపోయారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మునిసిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకల పై, ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఆయన గాంధీ విగ్రహం ముందు కూర్చుని నిరసన తెలపటానికి సిద్ధం అయ్యారు. అదే విధంగా తిరుపతిలని 43వ డివిజన్ లో టిడిపి తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధి టీ కొట్టు పడగొట్టటంతో, అక్కడకు కూడా వెళ్ళాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే అనూహ్యంగా, చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. దీని వాళ్ళు చెప్తున్న కారణం ఎన్నికల నిబంధనలు, కరోనా నిబంధనలతో పాటుగా మొత్తం ఆరు కారణాలు. అయితే తిరుపతిలో రోజు 50 వేల మంది వచ్చి పోతూ ఉంటారని, అలాంటిది ఇప్పుడు నేను ఒక్కడినే వస్తే వచ్చిందా అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసన చంద్రబాబు ఎయిర్ పోర్ట్ లోనే నిరసనకు దిగారు. పోలీసులు అడ్డుకోవటంతో చంద్రబాబు ఎయిర్ పోర్ట్ లో నేల పై కూర్చుని నిరసన తెలిపారు. అయితే ఈ సందర్భంలో పోలీసులు చంద్రబాబుని చుట్టు ముట్టి, బ్రతిమిలాడుతూ ఉన్న వీడియో బయటకు వచ్చింది. పోలీసులు బ్రతిమిలాడుతూ అర్ధం చేసుకోండి అనే విధంగా, వాళ్ళ హావభావాలు ఉన్నాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ, పోలీసులు ఎంత ఒత్తిడిలో ఉన్నారో అని వాపోతున్నారు.

అయితే ఈ సందర్భంగా పోలీసులు చంద్రబాబుని బ్రతిమిలాడుతూ, సార్ మీరు పెద్ద వాళ్ళు, ఇక్కడ ఇలా కూర్చోవద్దు, పక్కకు వచ్చి కూర్చోండి అని చెప్పగా, నేనేమీ పెద్ద వాడిని కాదులే, మీరు నాకు ఇస్తున్న గౌరవం చాలా బాగుంది అని అన్నారు. నేను కలెక్టర్, ఎస్పీని కలవాలి అని చెప్పగా, వాళ్ళే ఇక్కడకు వస్తారు అని పోలీసులు బదులు ఇచ్చారు. వాళ్ళు ఎందుకు నేనే వెళ్తాను, మీడియాతో మాట్లడతాను అని చెప్పగా, పోలీసులు బదులు ఇస్తూ, వాళ్ళే ఇక్కడకు వస్తారు సర్, ఇది మీ పై హానర్ అని చెప్పారు. నాకు ఏమి హానర్ అవసరం లేదు, ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడండి, ఇదే నాకు హానర్ అంటూ చంద్రబాబు బదులు ఇచ్చారు. నన్ను ఎందుకు అడ్డుకున్నారో చెప్పండి, నేను ప్రజలను కలవాలి అంటూ చంద్రబాబు బదులు ఇచ్చారు. అయితే ఇదంతా పక్కన పెడితే, చంద్రబాబు పక్కనే నెల పైన మోకాళ్ళ మీద కూర్చున్న పోలీసులు, చంద్రబాబుని బ్రతిమిలడుతూ ఉన్న దృశ్యాలు చూసిన అందరికీ, పోలీసులు ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్ధం అవుతుందని అంటున్నారు. అయితే చేసింది అంతా చేసి, ఇప్పుడు ఇలా చేయటం ఎందుకు అని అనే వాళ్ళు కూడా ఉన్నారు.

చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తిరుపతి చిత్తూరులో, తెలుగుదేశం నాయకులను హౌస్ అరెస్ట్ చేసారు. చంద్రబాబుకు ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలకటానికి వస్తున్న నేతలను, అరెస్ట్ చేసారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే దారిలో పోలీసులు మొహరించారు. ఎవరినీ  అనుమతించటం లేదు. ఎయిర్ పోర్ట్ దగ్గరకు ఎవరూ రాలేని పరిస్థితి ఉంది. చంద్రబాబు ఈ రోజు వైసీపీ అరాచకాల పై, చిత్తూరులో నిరసన కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుపతిలో, 43వ డివిజన్ లో పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్ధి టీ కొట్టుని నిన్న పడేసారు. అక్కడకు కూడా చంద్రబాబు వెళ్లనున్నారు. అయితే ఈ రెండు కార్యక్రమాలను అనుమతి లేదని, పోలీసులు చెప్తున్నారు. నిన్న టిడిపి నేతలు అనుమతి కోరినా, వినతి పత్రం పోలీసులు తీసుకోలేదని, దీంతో వాట్స్ అప్ లో, పోలీసులకు అనుమతి కోరినా, చివరకు నిన్న అర్ధరాత్రి అనుమతి లేదని చెప్పటం జరిగింది.

చంద్రబాబు ఇండిగో విమానంలో రేణిగుంట విమానశ్రాయం చేరుకున్నారు. అయితే చంద్రబాబుని విమానాశ్రయంలోనే పోలీసులు నిర్బందించారు. ఎయిర్ పోర్ట్ దగ్గరకు, జిల్లా టిడిపి నేతలను ఎవరినీ రానివ్వలేదు. అందరినీ హౌస్ అరెస్ట్ చేసారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో మొత్తం పోలీసులు మొహరించారు. చంద్రబాబు కాన్వాయ్ ని కూడా అరైవల్ బ్లాక్ లో కాకుండా, చాలా దూరంగా ఆపేసారు. దీంతో చంద్రబాబుని బయటకు రానివ్వకుండా, ఎయిర్ పోర్ట్ లోనే నిర్బందిస్తారని తెలుస్తుంది. చంద్రబాబుతో పాటుగా వచ్చిన ప్రయాణికులు, చంద్రబాబు మాతో పాటు బయటకు వస్తారని అనుకున్నాం అని, అయితే ఇప్పటి వరకు ఆయన బయటకు రాకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుందని అన్నారు. ఇక టిడిపి నేతలు ఈ పరిణామం పై మండి పడుతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, పోలీసులు చంద్రబాబుకు నోటీసులు అందించినట్టు తెలుస్తుంది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుంది అంటూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసారు. అలాగే క-రో-నా నిబంధనల గురించి కూడా అనుమతి లేదని నోటీసులో తెలిపారు. అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటాం అని పోలీసులు నోటీసులో తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read