ఒక మాజీ ముఖ్యమంత్రిని పది గంటల పాటు నిర్బంధించటం, ఎప్పుడో అరుదుగా చూస్తూ ఉంటాం. ఆయన ఏమీ ఆరాచకాం చేయటానికి వెళ్ళ లేదు. శాంతియుతంగా, శాంతికి మారు పేరు అయినా, గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలపటానికి వస్తున్నారు. అదే ఆయన చేసిన పాపం. అందుకే ఈ నిర్బంధం. మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ, వైసీపీ చేస్తున్న అరాచకాల పై చంద్రబాబు నిరసన దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేస్తానని పిలుపు ఇచ్చారు. అలాగే తిరుపతిలో పోటీలో ఉన్న టిడిపి 43 వ వార్డుకు చెందిన అబ్ధ్యర్ది, తమకు లొంగలేదని, ఆయనకు కొన్నేళ్లుగా ఉన్న షాపుని కూల్చివేసిన సంఘటన ప్రదేశానికి వెళ్ళాలని కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారమే ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. నిన్న చిత్తూరు జిల్లా నాయకులు, పోలీస్ పర్మిషన్ అడగగా, నిన్న రాత్రి పొద్దు పోయిన తరువాత, పర్మిషన్ లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం, నిరసన దీక్షలో పాల్గుంటానని తేల్చి చెప్పారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచే హైడ్రామా నెలకొంది. రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు వస్తున్న నేతలను హౌస్ అరెస్ట్ చేసారు. అంతే కాదు కార్యకర్తలను ఎవరినీ ఎయిర్ పోర్ట్ వద్దకు రానివ్వ లేదు. ఉదయం నుంచి ఇదే పనిగా వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసారు. పెద్ద స్థాయి నేతలను ఇంట్లోనే నిర్బందిన్చారు. వీటి అన్నిటి మధ్య తొమ్మిది గంటల సమయంలో చంద్రబాబు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.

ఆయన ఫ్లైట్ దిగటంతోనే, పోలీసులు ఆయన్ను చుట్టు ముట్టారు. మీ పర్యటనకు అనుమతి లేదని అన్నారు. కరోనా, ఎన్నికల నిబంధనలు కారణంగా చెప్పారు. తనకు ఈసీ పర్మిషన్ ఉందని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో చంద్రబాబు నిరసన దీక్షకు దిగారు. నేల పై కూర్చుని నిరసన తెలిపారు. తను జరుగుతున్న అన్యాయం పై ఎస్పీ, కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయాలనీ, నిరసన దీక్ష చేయాలని అన్నారు. ఎంతకీ పోలీసులు ఒప్పుకోలేదు. గంట, రెండు గంటలు, మూడు గంటలు, ఇలా పది గంటలు గడిచి పోయాయి. చంద్రబాబు నీళ్ళు కూడా ముట్టలేదు. భోజనం చేయలేదు. అలాగే పది గంటల పాటు దీక్ష కొనసాగించారు. ఆయన్ను ఏదో ఒక ఫ్లైట్ లో తిప్పి పంపించాలని పోలీసులు చూసినా వల్ల కాలేదు. చివరకు జాయింట్ కలెక్టర్, ఎస్పీ వచ్చి, సాయంత్రం ఏడు గంటల ఫ్లైట్ కు వెళ్ళాలని, అదే చివరి ఫ్లైట్ అని, మీరు ఇక్కడే ఉంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, బలవంతంగా ఫ్లైట్ ఎక్కించటంతో, చివరకు 10గంటల ఉత్కంఠ కు తెర పడింది. అయితే చంద్రబాబు మాత్రం, తాను అనుకున్నట్టే, అధికార పార్టీ అరాచకాలను ప్రజలు చెప్పగలిగారు. అలాగే దీక్ష కూడా చేసారు. ఆయన్ను అలా వదిలేసి ఉంటే, ఒక రాజకీయ పార్టీ ప్రసంగం అయ్యేది, కానీ ఇప్పుడు అడ్డుకుని, ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేసి, సెల్ఫ్ గోల్ వేసుకున్నారు.

రాష్ట్ర ప్రజాస్వామ్యప్రక్రియలో నేడు దుర్దినమని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాజ్యాంగానికిలోబడి ఏదీ జరగడంలేదని, ప్రజలందరి నోళ్లలో నానుతున్న రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేసేప్రక్రియలో తెలుగువారి కీర్తిప్రతిష్టలను ప్రపంచానికిచాటినవ్యక్తి, మాజీ ముఖ్య మంత్రిని నిర్బంధించడంద్వారా, ముఖ్యమంత్రి తన పైశాచిక ఆనందాన్నిచాటుకున్నాడని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరి లోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రంలో అమల్లోఉందా లేదాఅని నేడు జగన్ తనిఖీచేశాడని, ఆప్రక్రియలో భాగంగానే సూర్యుడిపై ఉమ్మేయడాని కి ప్రయత్నించి భంగపడ్డాడన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి సిగ్గులేకుండా చీకటికార్యకలాపాలు సాగిస్తుంటే, నాలుగ్గోడలమధ్యనే నక్కినక్కి బతుకుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. చంద్రబాబునాయుడి నిర్బంధా న్ని సమర్థించుకోవడానికి వారుచెబుతున్న అబద్ధాలు అన్నీఇన్నీ కావన్నారు. చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లాలను కున్నప్పుడే, ఆప్రాంతంలోపోలీస్ యాక్ట్ 30అమల్లోకి వస్తుందని మర్రెడ్డి ఎద్దేవాచేశారు. చంద్రబాబు తిరుపతికి, చిత్తూరుకి వెళ్లాల్సిన పరిస్థితులు కల్పిచింది ఎవరో సజ్జలకు, పెద్దిరెడ్డికి తెలియదా అని టీడీపీనేత నిగ్గదీశారు. టీడీపీతరుపున మున్సిపల్ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిని నానారకాలుగా వేధించడం, వారిపై తప్పుడుకేసు లుపెట్టడం, నామినేషన్లు బలవంతంగా ఉపసంహరింపచేయడం వంటి చర్యలనుకట్టడి చేయడానికే చంద్రబాబునాయుడు తిరుపతికి వెళ్లడం జరిగిందన్నారు.

తిరుపతికి రోజూ వేలకొద్దీ భక్తులువస్తున్నా రని, ఊరేగింపులు, సభలు, సమావేశాల్లో వైసీపీనేతలు, ఆపార్టీ కార్యకర్తలు వేలాదిగా గుమికూడుతున్నారని, వారికెవరికీ వర్తించ ని కరోనా నిబంధనలు ప్రతిపక్షనాయకుడికే వర్తిస్తాయనడం విచి త్రంగా ఉందన్నారు. గతంలో జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు విశాఖలో జరిగే పారిశ్రామికవేత్తల సదస్సుని అడ్డుకోవడానికి వెళ్తే, ఆసందర్భంలోరాష్ట్రప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నాడు ఆయన్ని అడ్డుకోవడంజరిగిందన్నారు. ఆనాడు జరిగిన ఉ దంతంతో,నేటి చంద్రబాబునాయుడి నిర్బంధాన్ని సజ్జల, పెద్దిరెడ్డి పోల్చడం పిచ్చివాళ్లమాటల్లా ఉన్నాయన్నారు. తెలుగుదేశం మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితేలేదని, ప్రజలు వైసీపీని గెలిపిస్తున్నారని వారుచెప్పడం సిగ్గుచేటన్నారు. వైసీపీని ప్రజలు అంతబాగా ఆదరిస్తున్నప్పుడు, ఎన్నికల్లో గెలిచేసత్తా వారికున్న ప్పుడు, పోలీసులను, రెవెన్యూ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని గెలవాల్సిన అవసరం ఏమొచ్చిందని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. పంచాయతీరాజ్ శాఖను అడ్డుపెట్టుకొని పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేసినవారిని భయపెట్డడం, వారిపై అక్రమకేసులు పెట్టడంవంటి చర్యలకు ఎందుకు పాల్పడ్డారన్నారు. జగన్మోహన్ రెడ్డి, ఆయనమంత్రులు గెలుపుకోసం దిగజారినప్పుడే వారిపరిస్థితి ఏమిటో ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో చంద్ర బాబునాయుడితో జగన్ ఆడుతున్న వికృతక్రీడ ఆయన, వైసీపీ ప్రభుత్వనాశనానికే దారితీస్తుందన్నారు.

చంద్రబాబునాయుడు అడుగుబయటపెడితేనే వైసీపీప్రభుత్వం వణికిపోతోందని, దానిలో భాగంగానే పోలీసులతో మాజీముఖ్యమంత్రిని అడ్డుకుంటున్నార న్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని ఎన్నాళ్లు పాలిస్తారో వైసీపీవారే ఆలోచించాలన్నారు. పెద్దిరెడ్డి నోటొకొచ్చినట్లు మాట్లాడే ముందు, 28మందిఎంపీలను చేతిలోపెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా ఎందుకు తీసుకురాలేదో సమాధాన చెప్పాలన్నారు. జగన్ ఢిల్లీవెళ్లిన ప్రతిసారీ ఆయనకేసులకోసం విన్నపాలు, వేడుకో ళ్లుచేసుకోవడమే సరిపోయిందని మర్రెడ్డి ఎద్దేవాచేశారు. మెడలు వంచుతా, తొడలుకొడతా అన్న జగన్మోహన్ రెడ్డి నేడు ప్రత్యేకహో దా తీసుకురాలేక, చేవలేక, చేతగాక మూలనకూర్చున్నాడన్నారు. అటువంటి వ్యక్తి నిర్వాకాలను చూసి సిగ్గుపడకుండా, పెద్దిరెడ్డి చంద్రబాబునాయుడి పనైపోయిందనిచెప్పడం గురివిందగింజను గుర్తుచేస్తోందన్నారు. ప్రజలుమరిగేవరకు, వారిలో తిరుగుబాటు ప్రారంభమయ్యేవరకు మాత్రమే పెద్దిరెడ్డి, జగన్ రెడ్డిల చీకటి కార్యక కలాపాలు సాగుతాయన్నారు. చీకట్లో దుష్టరాజకీయాలుచేస్తున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డిలకు చంద్రబాబునాయుడి రూపంలో, టీడీపీరూపంలో భవిష్యత్ లో తగినవిధంగా కోలుకోలేని దెబ్బ తగిలితీరుతుందని శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు. వడ్డీతో సహా, జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వంలోని వారు తగిన మూల్యం చెల్లించుకొ ని తీరుతారన్నారు.

ప్రపంచ దేశాల్లో పేరు ఉన్న నేత, దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో తన మార్క్ గుర్తింపు ఉన్న నేత, ఒక తరానికి హీరో, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అలాంటి శిఖరం, నేడు ప్రజాస్వామ్య పధ్ధతిలో, ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల పై నిరసన తెలిపే హక్కు లేక, నేల మీద కూర్చుని, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని వేడుకుంటున్నారు. ఈ రోజు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుని, కరోనా నిబంధనల పేరుతో ప్రభుత్వం, చంద్రబాబుకు పర్మిషన్ ఇవ్వలేదు. నన్ను ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు నన్ను వెళ్ళనివ్వరు అంటూ చంద్రబాబు ఎయిర్ పోర్ట్ లోనే నిరసనకు దిగారు. చంద్రబాబు వెంట కేవలం ఆయన వ్యక్తిగత సహాయకుడు, వ్యక్తిగత డాక్టర్ మాత్రమే ఉన్నారు. చంద్రబాబును కలవటానికి వచ్చిన ఏ ఒక్క నేతను కూడా ఆయన వద్దకు పంపించలేదు. అంతే కాదు చంద్రబాబు వద్ద, ఆయన వ్యక్తిగత సహాయకుల వద్ద ఉన్న ఫోన్లు కూడా లాక్కున్నారు. అయితే చంద్రబాబు గత ఆరు గంటలుగా నేల పైనే అలా కూర్చుని నిరసన తెలుపుతున్నారు. కనీసం మంచి నీళ్ళు కూడా ముట్టలేదు. అంతే కాదు, మధ్యానం ఇచ్చిన భోజనం కూడా వద్దు అని అన్నారు. దీంతో గత ఆరు గంటలుగా చంద్రబాబు దీక్ష కొనసాగుతూనే ఉంది.

తిరుపతి ఎస్పీ అప్పలనాయుడు, దాదాపుగా అరగంటకు పైగా చంద్రబాబుతో చర్చలు జరిపారు. అయితే చంద్రబాబు ఒకటే ప్రధానంగా చంద్రబాబు చెప్తున్నారు. చిత్తూరులో నిరసన తెలపటానికి తనకు అనుమతి ఇవ్వాలని అన్నారు. చంద్రబాబు ఆరు గంటలుగా నేల పైనే కూర్చుని ఉండటంతో, ఆయన కాళ్ళ నొప్పులతో రెండు కాళ్ళు మడుచుకుని, రెండు చేతులతో అడ్డు పెట్టుకుని, నొప్పులు భరిస్తూ అలాగే కూర్చున్నారు. ఉదయం నుంచి కూడా పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని, తనను కించపరుస్తూ ప్రవర్తించారని కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసారు. నన్ను అడ్డగించాలని నిర్ణయం తీసుకుంటే, మీరు ఎందుకు రాలేదు ? ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటూ ఆయన్ను కూడా ప్రశ్నించారు. కలెక్టర్ కూడా దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు దీక్ష గురించి తెలుసుకున్న ఎస్పీ, బిస్కెట్ లు ఇచ్చి, ఇవి అయినా తీసుకోండి, దీక్ష విరమించండని కోరారు. మరో పక్క చంద్రబాబుని మధ్యానం 3.10 ఫ్లైట్ కి పంపించేయాలని అనుకున్నా, అప్పటికే ఫ్లైట్ ఫుల్ అవ్వటంతో, వీలు పడలేదు. రాత్రి ఏడు గంటల వరకు ఫ్లైట్ లేకపోవటంతో, అప్పటి వరకు చంద్రబాబుని పోలీసులు ఎక్కడ ఉంచుతారో చూడాల్సి ఉంది.

రేణిగుంట విమానశ్రయంలో ఉదయం నుంచి చంద్రబాబు నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సమయం గడుస్తున్న కొద్దీ ఏమి జరుగుతుందా అనే టెన్షన్ నెలకొంటు వస్తుంది. కొద్ది సేపటి క్రితం తిరుపతి ఎస్పీ కూడా వచ్చి చంద్రబాబుతో చర్చలు జరిపారు. మధ్యానం 3.10కి చంద్రబాబుని పంపించి వేయాలని ప్రయత్నం చేసినా, విమానంలో అప్పటికే అన్ని టికెట్స్ బుక్ అయిపోయి ఉండటంతో, అది విరమించుకున్నారు. ఈ నేపధ్యంలోనే రేణిగుంట విమానశ్రయంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఏమి జరుగుతుందో అర్ధం కాక, అక్కడ ఉద్రిక్త వాతవరణం పెరిగిపోతుంది. చంద్రబాబు బయటకు వస్తారని, మీడియాతో మాట్లాడతారని సమాచారం రావటంతో, అందరూ అరైవల్ బ్లాక్ దగ్గర వచ్చి నిలబడ్డారు. చంద్రబాబుకు సెక్యూరిటీగా ఉండే బ్లాక్ క్యాట్ కమెండోలు కూడా అక్కడకు చేరుకున్నారు. అంతే కాకుండా, చంద్రబాబు కాన్వాయ్ కూడా రెడీ చేసారు. అయితే చంద్రబాబు బయటకు వస్తారని, చిత్తూరు వెళ్తారని లీక్ ఇచ్చారు. దీంతో అందరూ చంద్రబాబు ఎప్పుడు వస్తారా అని చూస్తున్నారు. అయితే చంద్రబాబు ఎంత సేపటికి బయటకు రాకపోవటంతో, గందరగోళం నెలకొంది. అయితే అసలు ఏమైంది అని ఆరా తీయాగా, పోలీసులు వ్యూహాత్మికంగా ఇలా చేసారని అర్ధం అవుతుంది.

ఒక పక్క ఇలా ఏర్పాట్లు చేస్తూనే, చంద్రబాబుని బలవంతంగా మరో ఫ్లైట్ ఎక్కించటానికి ప్రయత్నాలు జరుగుతున్నయనే సమాచారం వచ్చింది. ట్రూజెట్ తో పాటుగా, ఇండిగో, స్పైస్ జెట్ విమానాల్లో చంద్రబాబు తిరుగు ప్రయాణానికి పోలీసులు టికెట్ ను బుక్ చేసారు. అయితే ఇప్పటికే స్పైస్ జెట్ విమానంవెళ్ళిపోయింది. రన్ వేపై ఇండిగో విమానం సిద్ధంగా ఉండటంతో, చంద్రబాబుని ఆ విమానంలో పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం, వెళ్ళేది లేదని, తన కార్యక్రమంలో పాల్గుని వెళ్తానని అన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబుని బయటకు వాడులుతారా, లేదా బయటకు పంపించి మధ్యలో అడ్డుకుంటారా, లేక ఎయిర్ పోర్ట్ లోనే ఉంచి, అటు నుంచి అటు పంపించేస్తారా అనేది, ఈ మూడు విషయాల్లో ఏది జరుగుతుంది అనేది ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. మొత్తంగా మళ్ళీ ఎయిర్ పోర్ట్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి పోలీసులు ఏమి చేస్తారు ? చంద్రబాబుని ఎలా ఒప్పిస్తారు ? లేదా బలవంతంగా లిఫ్ట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read