ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమి పాపం చేసుకుందో కానీ, ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనతో అట్టుడుకుతూనే ఉంటుంది. 2014 ముందు వరకు సమైఖ్యాంధ్ర పోరాటం అంటూ రోడ్డుల మీద పడ్డాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆ విభజన కూడా అన్యాయంగా చేసారు. ఎన్నో విభజన హామీలు ఇచ్చినా, ఒక్కటీ నెరవేరలేదు. 2014 నుంచి వాటిని సాధించుకోవాలి అనే పోరాటాలతోనే సరిపోయింది. ఇప్పటికి 7 ఏళ్ళు అయినా, ఆతీ గతీ లేవు. ఇవన్నీ ఢిల్లీలో ఉన్న వాళ్ళు చేసినవి అయితే, 2019 నుంచి మూడు ముక్కల రాజధాని అంటూ, మన రాష్ట్రం చేసిన తప్పుతో, మళ్ళీ వెనుకబడ్డాం. ఎలా అయినా అమరావతి నుంచి వైజాగ్ వెళ్లిపోవాలి అని జగన్ మోహన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేస్తున్నా కుదరటం లేదు. ఇప్పుడు అదే వైజాగ్ లో మరో ఉద్యమం వచ్చి పడింది. అదే ఆంధ్రుల ఉక్కు సంకల్పంతో సాధించుకున్న, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ. గత 20 రోజుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేస్తున్నాం అంటూ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుంచి, పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది. అయితే అధికార వైసిపీ పార్టీ పై, ఈ విషయంలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయం పై వైసీపీకి మాట్లాడటానికి మూడు రోజులు పట్టింది. ఈ విషయం తెలిసిన మరుసటి రోజు వైసిపీ ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టి సమయంలో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడవద్దు అన్నారు అంటూ, వాయిస్ లీక్ అవ్వటంతో, అనుమనాలు బలపడ్డారు.

steel 14022021 2

పోస్కో కంపెనీతో విజయసాయి రెడ్డి డీల్ కుదిర్చి, జగన్ వద్దకు తెచ్చారని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను, పోస్కో కంపెనీకి కట్టబెట్టటానికి, డీల్ సెట్ అయ్యిందని, దీని వెనుక పెద్ద ఎత్తున ఆర్ధిక లావాదేవీలు ముడిపడి ఉన్నాయని టిడిపి ఆరోపిస్తుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై, ప్రధానికి ఒక లేఖ రాసి ఊరుకున్నారు. ఈ నేపధ్యంలోనే, జగన్ మోహన్ రెడ్డి, ఈ నెల 17న వైజాగ్ వెళ్తున్నారు. శారదాపీఠం వార్షికోత్సవాల్లో పల్గునటానికి ఆయన వైజాగ్ వెళ్తున్నారు.ఇప్పటికే పెద్ద ఎత్తున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఆ రోజున దీక్షా స్థలం వద్దకు వచ్చి, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతారా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఒక వేళ వస్తే కనుక, తన పై వస్తున్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేయవచ్చు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం జరుగుతున్న ప్రాంతానికి వచ్చి, మద్దతు ఇవ్వకపొతే ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. ఇది ఆత్మగౌరవ పోరాటం కాబట్టి, జగన్ వచ్చి మద్దతు తెలుపుతారనే అందరూ ఆశిస్తున్నారు. మొత్తానికి 17వ తేదీ తేలిపోనుంది.

రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఈ రోజు జరిగాయి. ఫలితాలు లెక్కింపు కూడా ప్రారంభం అయ్యింది. ఇప్పటికే 600 వరకు పోటీ ఇచ్చాయి. అయితే మొదటి విడతలో గట్టి పోటీ ఇచ్చినట్టే ఇప్పుడు కూడా, టిడిపి, వైసీపీకి దీటుగా పోటీ ఇస్తుంది. పోటా పోటీగా ఫలితాలు వస్తున్నాయి. అయితే ఇందులో చెప్పుకునే విషయం ఏమిటి అంటే, మంత్రి కొడాలి నాని సొంత గ్రామంలో, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్ధి, 800 ఓట్లతో విజయం సాధించారు. గుడివాడ నియోజకవర్గం పామర్రు మండలం యలమర్రు గ్రామం, కొడాలి నాని సొంత గ్రామం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్ధి కొల్లూరి అనూష 800 ఓట్లతో భారీ విజయం సాధించారు. కొడాలి నాని సొంత గ్రామంలో ఓడిపోవటంతో, టిడిపి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బూతుల మంత్రిగా పేరున్న కొడాలి నాని, ఉచ్చం నీచ్చం తెలియకుండా మాట్లాడుతున్న మాటలతో, ప్రజల్లో చులకను అయ్యారని చెప్పేందుకు, ఇదే ఉదాహరణ అని టిడిపి నేతలు చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విచ్చలవిడి ఏకగ్రీవాల పై ఎలక్షన్ కమిషన్ కూడా ఏమి చేయలేక పోవటం, తెలుగుదేశం పార్టీ హైకోర్టుని ఆశ్రయించింది. ముఖ్యంగా పుంగనూరు, మాచర్లలో జరిగిన ఏకగ్రీవాల పై హైకోర్టుకు వెళ్ళగా, ఈ రోజు హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు ఏకగ్రీవాలతో పాటుగా, నామినేషన్ లు తిరస్కరించిన చోట తగు చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అక్కడ వచ్చిన ఫిర్యాదులు అన్నీ పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిబందులు ఎలా ఉన్నాయో, వాటి ప్రకారం తగు చర్యలు తీసుకోవాలి కోరింది. పుంగనూరు, మాచర్లలో విచ్చలవిడిగా ఎగ్రీవాలు అయ్యాయి. మాచర్లలో 77కి 76 ఏకగ్రీవం అయ్యాయి. అలాగే పుంగనూరులో రెండు పంచాయతీలు తప్ప, మిగతావి అన్నీ ఏకగ్రీవం అయ్యాయి. ముఖ్యంగా పెద్దిరెడ్డి ఉండే సదుం మండలంలో, ఏకంగా అన్ని పంచాయతీలు, అన్ని వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఈ రకంగా ఏకాగ్రీవాలు అవ్వటం పై, తెలుగుదేశం పార్టీ సీరియస్ అయ్యింది. అన్ని విషయాల పై ఇప్పటికి అనేక ఫిర్యాదులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు చేసినా, ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోలేదని, అందుకే కోర్టుకు వెళ్లి, తమ హక్కులు సాధించుకుంటాం అని కోర్టులో కేసు వేసారు.

hc 120220212

జరుగుతున్న పరిణామాల పై వర్ల రామయ్య స్పందించారు..."ఎన్నికలవిధుల్లో ఉన్న అధికారులంతా, వైసీపీకాని వారి నామినేషన్లను ఇష్టానుసారం తిరస్కరిస్తున్నారు. అధికారపార్టీ నేతలమెప్పుకోసం , వారికళ్లల్లో వెలుగులుచూడటంకోసం అధికా రులు వ్యవహరిస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం ఇష్టమొచ్చిన ట్టు చేస్తే టీడీపీ ఊరుకోదు. ఎక్కడైతే అధికారులు అకారణంగా, తప్పుడువిధానాల్లో అభ్యర్థులను, వారిపత్రాలను తిరస్కరించారో అవన్నీ గుర్తించడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని కేసులను హైకోర్టులోవేశాము. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులెవరినీ వదిలేదు లేదు. అవసరమైతే వారివ్యక్తిగత హోదాలపై కూడా కేసులు వేస్తాము. రిటైరైనా కూడా వారిని వదలకుండా, వారుచేసినతప్పులకు శిక్షపడేలా చేస్తాము. అధికారులు ఎవరైనా సరే, ఆత్మపరిశీలనచేసుకోరా.. వారు తమ ఆత్మలకుసమాధానం చెప్పుకోరా? అవేమీ ఆలోచించకుండా ప్రమోషన్లకోసం, ఇతరత్రా ప్రయోజనాలకోసం అధికారపార్టీకి ఊడిగం చేస్తారా? విశాఖపట్నంలో, చిత్తూరులో, మాచర్లలో అంత అడ్డగోలుతనంగా ఎలా వ్యవహరిస్తా రు? జరుగుతున్న వాటిపై డైరెక్టర్ జనరల్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ ఇంతజరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమేంటి? కట్టుదిట్టంగా ఎన్నికలు జరపకుండా, ఇష్టారాజ్యాంగ అధికారులు వ్యవహరిస్తుం టే, టీడీపీ చేతులుకట్టుకొని కూర్చోవాలా? ఎన్నికల కమిషన్ చేతు లెత్తేస్తే ఇక మిగిలింది న్యాయస్థానాలే. " అని వర్ల అన్నారు.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కోడలి నాని పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొద్ది సేపటి క్రితం, కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. కొడాలి నాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, నేరపూరిత బెదిరింపులు వంటి సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేయాలని, ఐపీసిలోని 504, 505, 506, మొత్తం ఈ మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఎన్నికల కమిషన్ గురించి దురుద్దేశాలు ఆపాదించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు, మోరల్ కోడ్ అఫ్ కాండక్ట్ లోని, ఎన్నికల్ ప్రవర్తనా నియమావళి క్లాజ్ 1 అండ్ 4, ఈ సెక్షన్ ల కింద కూడా కేసు నమోదు చేయాలని, ఆదేశాలు జారీ చేసింది. నిన్న ఉదయం కొడాలి నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో, మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో ఎన్నికల కమిషన్ ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారని, దీని పై వెంటనే తగు వివరణ ఇవ్వాలని, వెంటనే ఎన్నికల కమిషన్, కొడాలి నానికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ షోకాజ్ నోటీస్ కు సమాధానంగా నిన్న సాయంత్రం, మూడు గంటలకు, ఆయన న్యాయవాది చిరంజీవి ద్వారా, రిప్లై పంపారు. తనకు ఎన్నికల కమిషన్ ను కించపరిచే ఉద్దేశం లేదు అని చెప్పారు.

nani 13022021 2

పోలింగ్ సమయంలో, తెలుగుదేశం పార్టీ వేధింపులు గురించి మాట్లాడటానికే మీడియా సమావేశం ఏర్పాటు చేసానని, తన వ్యాఖ్యలు తప్పుగా అర్ధం చేసుకున్నారని, తనకు రాజ్యాంగ సంస్థల పట్ల పూర్తి గౌరవం ఉందని చెప్తూ, తనకు ఇచ్చిన షోకాజ్ నోటీస్ ను, ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ నేపధ్యంలోనే, షోకాజ్ నోటీస్ లో ఇచ్చిన వివరణతో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందలేదని పేర్కొంటూ, గత రాత్రి ఆయన పై క్రమశిక్షణా చర్యలకు పూనుకుంది. ఈ నెల 21వ తేదీ వరకు కొడాలి నాని, మీడియాతో మాట్లాడకూడదు అని, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదు అని, ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా ఆయన బహిరంగ సభలు, గ్రూపు సమావేశాలలో కూడా మాట్లాడటానికి వీలు లేదని స్పష్టం చేసింది. అయితే దీని పై కొడాలి నాని, ఈ రోజు హైకోర్టు లో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేయాలని అనుకుంటూ ఉండగానే, ఇప్పుడు ఎన్నికల కమిషన్, కొడాలి నాని పై కేసు నమోదు చేయాలని చెప్పటం సంచలనంగా మారింది.

Advertisements

Latest Articles

Most Read