విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో నాటకాలు ఆడుతూ, గల్లీలో హడావిడి చేస్తున్న బ్యాచ్ ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న అఖిలపక్ష నేతల నిరసనల్లో, వైసీపీ నేతలు కూడా పాల్గుతున్నారు. ప్రశాంతంగా ప్రారంభం అయిన అఖిలిపక్ష సమావేశం, ఒక గందరగోళ పరిస్థితిలోకి మారింది. ఈ పరిస్థితికి కారణం విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు. యదావిధిగా, మీ కోసం ప్రాణం ఇస్తాం, మీ తరుపున పోరాడతాం, కేంద్రం మెడలు వంచుతాం అంటూ, మాట్లాడి, చివరిగా మాత్రం, అసలు విషయం చెప్పటంతో, కార్మికులు ఎదురు తిరిగారు. ప్రధాని మోడి అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాను, అయితే ఆయనతో కలవటం గురించి గ్యారంటీ ఇవ్వలేను, కేంద్ర మంత్రిని అయితే కలుద్దాం, ఇక్కడ ఉన్న వారిని తీసుకుని వెళ్లి, కేంద్రంతో చర్చలు జరుపుదాం అంటూ విజయసాయి రెడ్డి చెప్పటంతో, ఒక్కసారిగా ఆందోళన రేగింది. అంతే కాకుండా, మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం, ప్రతి సారి సక్సస్ అవ్వదు కదా, కొన్ని సార్లు మన లక్ష్యం నెరవేరోచ్చు, కొన్ని సార్లు కుదరదు, మనకు కూడా కొంచెం పట్టు విడుపులు అనేవి ఉండాలి అంటూ విజయసాయి రెడ్డి చెప్పటంతో, కార్మికులు షాక్ అయ్యారు.

vsreddy 10022021 2

మీకు నచ్చినా, నచ్చక పోయినా నేను చెప్పేది వాస్తవం, మీరు నాతో పాటు ఢిల్లీ వస్తే రండి, లేకపోతే లేదు అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. అయితే కార్మికులు విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పై గట్టిగా నిలదీశారు. ప్రధాని మోడీ ఎందుకు కలవరు ? ముందే మీరు ఎలా చెప్తారు అంటూ నిలదీశారు. వేదిక పైనే విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. విజయసాయి రెడ్డి మాట్లాడిన తీరుతో, ఆయన ప్రసంగించిన తీరుతో అవాక్కయ్యారు. అయితే అవుతుంది లేకపోతే లేదు, పట్టు విడుపులు ఉండాలి అంటూ మాట్లాడటం ఏమిటి అని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి వైఖరి చూస్తుంటే అనుమానం కలుగుతుందని అన్నారు. కొంత మంది విజయసాయి రెడ్డి ప్రసంగానికి అడ్డుపడగా, మంత్రి అవంతి ఎంత వారించినా వాళ్ళు ఆందోళన విరమించకపోవటంతో, విజయసాయి రెడ్డి అక్కడ నుంచి జారుకున్నారు. అయితే కార్ ఎక్కే సమయంలో కూడా, విజయసాయి రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు సాయంతో వెళ్ళిపోయారు.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, రెవిన్యూ వ్యవస్థ చేయాల్సిన పనులు కూడా, వాలంటీర్లు అంటూ మరో వ్యవస్థ పెట్టి, వారి చేత కొన్ని పనులు చేపిస్తూ, తన ప్రభుత్వానికి ఇది ఎంతో ప్రతిష్టాత్మకం అని చెప్పుకుంటూ ఉంటారు. అంతే కాదు, వాలంటీర్ ఉద్యోగులు నాలుగు లక్షల మందికి ఇచ్చాం, ఇది మేము కల్పించిన ఉపాధి అని కూడా వైసిపీ నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక విజయసాయి రెడ్డి లాంటి నేతలు అయితే, మరో అడుగు ముందుకు వేసి, 90 శాతం వాలంటీర్ ఉద్యోగాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చేసాం అంటూ, బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఇలాంటి వాలంటీర్లు, తమ చేత చాకరీ చేపించుకుంటున్నారు, అన్ని పనులు మాపైనే వేస్తున్నారు, అందరి చేత మాటలు పడుతున్నాం, మాకు ఇచ్చే జీతం మాత్రం 5 వేలా, మాకు జీతం పెంచాలి అంటూ, పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వస్తుంది అనుకుంటే, జగన్ మోహన్ రెడ్డి నుంచి ఒక బహిరంగ లేఖ వాలంటీర్లకు వచ్చింది. అందులో ఉన్న విషయాలు చూసి వాలంటీర్లు అవాక్కయ్యారు. తమ జీతాల పెంపు గురించి, తమ డిమాండ్ల గురించి, తమ శ్రమ దోపిడీ గురించి మాట్లాడకుండా, సేవ చేసి సన్మానాలు పొందండి అనే విధంగా ఆ లేఖలో ఉంది. నిన్న రాత్రి వాలంటీర్లను ఉద్దేశించి, జగన్ మోహన్ రెడ్డి ఒక బహిరంగ లేఖ రాసారు. అందులే అసలు విషయం చెప్పేసారు జగన్. వాలంటర్ అంటే స్వచ్చంధంగా పని చేసే వారని గుర్తు చేసారు.

volunteers 10022021 2

మీరు చేసేది ఉద్యోగం కాదు, స్వచ్చంద సేవ అనేది గుర్తుపెట్టుకోవాలని రాసారు. వాస్తవానికి దూరంగా జీతాలు పెంచాలని రోడ్దేక్కటం బాధించిందని లేఖలో పేర్కొన్నారు. వాలంటీర్లకు ఇచ్చిన హ్యాండ్ బుక్ లోనే, మీకు ఇచ్చేది గౌరవభృతి అనేది స్పష్టంగా రాసాం అని, అది ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరారు. ఇంతకంటే మెరుగైన ఉద్యోగాలు వచ్చే దాకా, ఈ సేవ చేయమని కోరామని, దాని కోసం గౌరవభృతి ఇస్తాం అని తెలిపామని చెప్పారు. మీరు కూడా మీకు వీలుని బట్టి, వారిని మూడు రోజులు, మీ ఇష్టం వచ్చిన సమయంలో వచ్చి సేవ చేస్తున్నారు. ఇలా సేవ చేసినందుకు, ప్రజల ఆశీస్సులు పొందుతున్నారు అని తెలిపారు. మీరు సేవ చేస్తున్నారు కాబట్టే, మీకు ప్రజల్లో గౌరవం ఉందని, మీరు జీతం తీసుకుంటే, మీకు ఈ గౌరవం వచ్చేదా అని ప్రశ్నించారు. అలాగే మీరు బాగా పని చేస్తే, మీకు శాలువా కప్పి సన్మానం చేస్తున్నారు, ఇలాంటి మీరు, ఎవరో రెచ్చగోడితే, ఇలా రోడ్డు ఎక్కటం బాధించింది, వారికి దూరంగా ఉండి, మీ సేవ మీరు చేయండి అంటూ, జీతం పెంపు గురించి మాత్రం ఎక్కడ చెప్పలేదు. మరి వాలంటీర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఈ రోజు రాజ్యసభలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, వెంకయ్య నాయుడుకి క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. అన్ని పార్టీలు హెచ్చరించటం, వివిధ పార్టీలు చర్యలు తీసుకోవాలని కోరటంతో, విజయసాయి రెడ్డి దిగి వచ్చి, క్షమాపణ చెప్పారు. అంతే కాదు, బీజేపీకి ఈ చర్య పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నిన్న అంతలా విరుచుకుపడిన విజయసాయి రెడ్డి, ఈ రోజు ఇలా వెంటనే దిగి వచ్చి, క్షమాపణ చెప్పటం వెనుక, ఏదో జరిగిందని అందరూ భావిస్తూ ఉండగా, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామాకృష్ణం రాజు ఈ రోజు జరిగిన రాజధాని రచ్చబండలో అసలు విషయం చెప్పారు. విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పటం వెనుక ఉన్న కారణం చెప్పారు. విజయసాయి రెడ్ది క్షమాపణ చెప్పటం వెనుక, జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి డోస్ ఇవ్వటం వల్లే, ఈ రోజు విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పి ఉంటారని తాను అనుకుంటున్నా అని రఘురామరాజు అన్నారు. ఇక నుంచి అయినా విజయసాయి రెడ్డి తన హద్దులు తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిది అని రఘురామరాజు అన్నారు. విజయసాయి రెడ్డి, ఉపరాష్ట్రపతి పై నిన్న చేసిన వ్యాఖ్యలకు కనీసం ఆరు నెలలు శిక్ష పడి ఉండేదని అన్నారు. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంత సీరియస్ వ్యాఖ్యలు అని అన్నారు.

rrr 09022021 2

జగన్ మోహన్ రెడ్డి మందలించి ఉంటారని, అందుకే సారి చెప్పి ఉంటారని అన్నారు. అలాగే సభలోనే మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా హెచ్చరించటం మనం చూసాం అని అన్నారు. విజయసాయి రెడ్డి కూడా తప్పు అయిపోయిందని, ఏదో మూడ్ లో ఉండి ఈ వ్యాఖ్యలు చేశాను, మరోసారి చేయను అని చెప్పారని, అన్నారు. గత కొంత కాలంగా, ఉక్కుసంకల్పంతో, విజయసాయి రెడ్డి పై విరుచుకుపడుతున్న విజయసాయి రెడ్డి, నిన్న నిమ్మగడ్డ గారు ఏదో కంటి ఇన్ఫెక్షన్ వచ్చి కంటి ఆసుపత్రికి వెళ్తే, కంటి చూపు లేదా, బుర్ర లేదా, వెళ్ళాల్సింది ఎర్రగడ్డకు అని మాట్లాడిన విజయసాయి రెడ్డి, 24 గంటల్లోనే తనకే బుర్ర లేక మాట్లాడానని , ఆ దేవుడే చెప్పించాడని, రఘురామరాజు కౌంటర్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి ఏదో కన్ఫ్యూషన్ లో ఉండి మాట్లాడనని సభలోనే చెప్పారు, ఆయనతో పరువు పోయే ప్రమాదం ఉంది జగన్ రెడ్డి గారు, మీ పరువు, ఆయన పరువుతో పాటు, మా పరువు కూడా పోతుంది అంటూ, రఘురామరాజు కౌంటర్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల వోటింగ్ ముగిసింది. ఎన్నికల కౌంటింగ్ కూడా మొదలు అయ్యింది. ఇప్పటికే కొన్ని చోట్ల నుంచి ఎన్నికల ఫలితాలు కూడా వస్తున్నాయి. అయితే సహజంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి. అయితే జగన్ మోహన్ రెడ్డి 90 శాతం టార్గెట్ పెట్టటంతో, అందరూ ఫలితాలు ఇంచు మించు అలాగే ఉంటాయని అనుకున్నారు. ఇక అధికార పార్టీ అరాచకాలు చూసి, ఈ ఎన్నికలు వైసీపీ పార్టీకి వన్ సైడ్ అనుకున్నారు. వచ్చిన ఏకాగ్రీవాలు కూడా వైసీపీకి 95 శాతం పైగా వచ్చాయి. అయితే ఎన్నికలు జరిగిన చోట ఫలితాలు చూస్తే మాత్రం హోరాహోరీగా ఫైట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులకు 220 పంచాయతీలు రాగా, తెలుగుదేశం పార్టీకి 18౦ వచ్చాయి. దీంతో ఎన్నికలు హోరాహోరీగా జరగటంతో, వైసీపీ షాక్ అయ్యింది. ఏకగ్రీవలతో కలిపి చూస్తే వైసీపీకి భారీ మెజారిటీ కనిపిస్తున్నా, ఎన్నికలు జరిగిన చోట్ల మాత్రం, గట్టిగానే టిడిపి ఇవ్వటం, వైసీపీకి షాక్ కు గురి చేసింది. అలాగే రాయలసీమలో కూడా టిడిపి గట్టి పోటీ ఇచ్చింది. చిత్తూరు, కర్నూల్ లో గట్టిగానే పోటీ ఇచ్చింది. ఏ జిల్లాలో కూడా ఇప్పటి వరకు వన్ సైడ్ గా అధికార పార్టీకి రాలేదు. పూర్తి ఫలితాలు వచ్చిన తరువాత ట్రెండ్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read