గుంటూరు జిల్లా, చిలకలూరి పేట మండలం, తాటపూడి గ్రామంలో విధులు నిర్వర్తించిన రిటర్నింగ్ అధికారిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన చంద్రబాబు నాయుడు. తాటపూడి గ్రామ రిటర్నింగ్ అధికారి ఎన్నికల నియమనిబంధనలకు అనుగుణంగా వ్యవహరించలేదు. వైకాపా ఆదేశాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు పనిచేస్తేన్నారనడానికి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. రిటర్నింగ్ ఆఫీసర్ 08.02.2021 న ఫాం. 8 ను విడుదల నామినేషన్ ధాఖలు చేసిన నలుగురు అభ్యర్ధులలో ఇటూరి కృష్ణవేణి, పోమేపల్లి ప్రభావతి, సోమేపల్లి లక్ష్మీ లు ఉపసంహరించుకున్నారని తెలిపారు. రూల్ నం.14 (2) ప్రకారం ఫాం.8 ను కూడా నోటీస్ బోర్డులో కూడా ప్రదర్శించడం జరిగింది. గ్రామ ప్రజలందరు ఇటూరి అరుణ అనే మహిళా అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని దృవీకరించుకున్నారు. కానీ తరువాత వైకాపా ప్రలోభాలకు తలొగ్గి అకస్మాత్తుగా ఫాం. 9 ను విడుదల చేసి సోమేపల్లి లక్ష్మీని పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. ఫాం.8 లో లేని లక్ష్మీ పేరు ఆశ్ఛర్యకరంగా ఫాం.9 లో చూపించారు. ఒకసారి ఫాం.8 లో కనపడని పేరు ఫాం. 9 లోకి ఎలా వచ్చింది? తాటపూడి గ్రామ రిటర్నింగ్ అధికారి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డ తాటపూడి గ్రామ రిటర్నింగ్ అధికారిపై తగు చర్యలు తీసుకోండి.

ఎన్నికల బెదిరింపులకు పాల్పడుతున్న నరసారావుపేట రూరల్ సి.ఐ అచ్చయ్యపై, రొంపిచర్ల ఎస్.ఐ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తెదేపా అధినేత నారా చంద్రాబాబు నాయుడు. రొంపిచర్ల మండలం అన్నవరంలో ప్రతిపక్ష అభ్యర్ధులపై పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. వార్డుకు నామినేషన్ వేసిన అన్నవరం రైతు కోటేశ్వర రావుపై పోలీసులు జలుం. ఫిబ్రవరి 13 వ తారీఖు పోలింగ్ కు కోటేశ్వరావును ప్రచారం చేసుకోని పోలీసులు ఫ్రిబ్రవరి 9 వ తారీఖు అర్ధరాత్రి 12 గం. సిఐ, ఎస్.ఐ లు మరో ఐదుమంది కానిస్టేబుల్స్ తో కలిసి కోటేశ్వర్ ఇంటిపై దాడి చేసి దుర్బాషలాడారు. పోలీసుల దుశ్చర్యలను వీడియో తీస్తున్న కోటేశ్వరావు భార్య అనూష నుండి సెల్ పోన్ లాక్కుని పగులగొట్టిన పోలీసులు. పోలీసుల చర్యలకు బయపడిన కోటేశ్వర్ పారిపోయారు. సి.ఐ, ఎస్.ఐ లపై వెంటనే తగు చర్యలు తీసుకుని కోటేశ్వరావుకు మరియు అతని కుటుంబానికి రక్షణ కల్పించండి. మిగతా అభ్యర్ధులతో పాటు కోటేశ్వరావు స్వేచ్చాయుత వాతావరణంలో ప్రచారం చేసుకునేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.

రెండో దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ చేస్తున్న రచ్చ పై, చంద్రబాబు స్పందించారు. జరుగుతున్న పరిణామాల పై చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ పై కూడా ఫైర్ అయ్యారు. ఆయన మాటల్లో "పుంగనూరు, మాచర్ల ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల కమిషన్ కూడా సమాధానం చెప్పాలి. ఇదేనా శాంతియుత ఎన్నికల నిర్వహణ? బలవంతపు ఏకగ్రీవాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నా. 38 సంత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంది. వైకాపాకు తాత్కాలికంగా పైశాచిక ఆనందం ఉండొచ్చేమో గానీ భవిష్యత్తులో చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నా. వైకాపా మాదిరి ప్రతిఒక్కరు విధ్వంసాలు చేయాలని చూస్తే ప్రజాస్వామ్యం మనుగడ ఉండేదే కాదు. మీ పిరికితనంతో, మీ బరితెగింపుతో ప్రజాస్వామ్యాన్ని తాకట్టుపెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. తెలుగుదేశం మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. ఈ అక్రమాలకు పాల్పడిన ప్రతిఒక్కరిని కోర్టులకు లాగుతాం. దుర్మార్గులకు వంత పాడాలని చూస్తే మిమల్ని ఎలా కంట్రోల్ చేయాలో చేసే నైతిక శక్తి తెలుగుదేశం కు ఉందని గుర్తుపెట్టుకోండి. రాత్రి ఒంటిగంట వరకు వందల పంచాయతీలలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే అధికారులు వాటన్నింటిని వైకాపాకు డిక్లేర్ చేశారు. ఇదేనా నిబద్ధతా? కొన్ని సందర్భాలలో మీడియాను పెట్టి ఓట్ల లెక్కింపు చేసిన సంధర్బాలు ఉన్నాయి. అదీ ట్రాన్స్ఫరెన్సీ అంటే. అది ప్రజాస్వామ్య గొప్పతనం. వైకాపా చేసేది పిరికితనం. కౌటింగ్ కేంద్రానికి వెళ్లి బ్యాలెట్ లను ఎత్తుకెళ్లే పరిస్థితికి సాక్షాత్తు ఒక ఆర్.డి.ఓ కూడా ధృవీకరించారు. దీనికి పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పాలి. ఎన్నికల కమిషన్ కు కనపడటం లేదా? "

"అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.. ఏ వ్యవస్థ అయినా రాజీపడొచ్చు కానీ.. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం కోసం రాజీపడదు. టీడీపీ తప్పుడు కార్యక్రమాలు చేయాలనుకుంటే.. మీరెవరూ అడ్రస్ కూడా ఉండరు. ఏ ఒక్క వ్యక్తి కూడా తిరిగే పరిస్థితి ఉండదు. ఈ రెండు సంఘటనలపై డీజీపీ సమాధానం చెప్పాలి. ఎన్నికల కోసం వేసిన ఐజీని అడుగుతున్నా... దీనికి సమాధానం చెప్పాలి. ఏం చర్యలు తీసుకున్నారు? పుంగనూరులో పోలీసులు బరితెగించారు. మళ్లీ మీరు ఈ రాష్ట్రంలో పనిచేయరా? ఏమిటీ ఇవన్నీ. మాచర్లలో కూడా ఇంతే. సీఐ, ఎస్ఐ బరితెగించి మానవహక్కులను కాలరాశారు. బలవంతపు ఏకగ్రీవాలపై, తిరస్కరించిన నామినేషన్లపై కోర్టులో వేస్తాం. పుంగనూరుపై కోర్టుకు వెళ్తాం. అవసరమైతే సుప్రీంకు వెళ్తాం. దోషులను బోను ఎక్కిస్తాం. మంత్రికి సహకరించిన ప్రతిఒక్కరికి, చట్టవ్యతిరేకంగా చేసినవారికి శిక్షపడేవరకు వదిలిపెట్టం. మాచర్లపైనా కోర్టుకు వెళ్తాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే మీరు.. ప్రజాస్వామ్య ద్రోహులు. నిన్న బ్రహ్మాండంగా పనిచేసిన కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు మీరు చూపిన పోరాటస్ఫూర్తి చరిత్రలో ఉంటుంది. ప్రజలు కూడా వీరోచితంగా పోరాడారు. వారిని కూడా అభినందిస్తున్నా. ప్రజలందరూ ఒకటైతే.. ఈసీ తన అధికారాలను ఉపయోగించుకోలేకపోయినా మనం ఉపయోగించుకుని ప్రభుత్వం, పోలసులపై ఒత్తిడి పెంచి న్యాయం కోసం, హక్కుల కోసం పోరాడదాం. నిన్న ఎన్నికల్లో చూపించిన చొరవకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ.. భవిష్యత్ లో కూడా అందరూ సమైక్యంగా పనిచేసి మీ గ్రామానికి సరైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకునే బాధ్యత మీరు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో గాంధీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యం కోసం మీరందరూ పనిచేసుకోవాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేయాలి. మీరందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాకోవాలని కోరుకుంటూ.. చేస్తారని ఆశిస్తున్నాను. ఎన్నికల కమిషన్ కు కూడా బాధ్యత ఉంటుందని గుర్తించాలి. " అని చంద్రబాబు అన్నారు.

షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీసింది. అయితే షర్మిల పార్టీ పై చంద్రబాబు స్పందించారు. చంద్రబాబు మాటల్లో "నిన్నే మాట్లాడతాడు, షర్మిల గురించి ఏ2 మాట్లాడతాడు(విజయసాయి రెడ్డి షర్మిల పార్టీ పెట్టలేదు, షర్మిల మాట్లాడిన వీడియో గ్రాఫిక్స్ అంటూ చేసిన వీడియో ప్లే చేసారు). ఈ వీడియో చూసారుగా, షర్మిల గారు మాట్లాడారు, ఎంత గాలి మాటలు ఈ ఏ2వి. ఒక పక్క అక్కడ పార్టీ పెట్టామని, జగన్ అన్న వదిలిన బాణం షర్మిల గారు మాట్లాడారు. ఈ ఏ2కి కనీస జ్ఞానం, ప్రజలు ఏమంటారో అనే ఆలోచన కూడా లేకుండా, ముందు వెనుకా ఆలోచించకుండా, అబద్ధాలు చెప్పటంలో దిట్ట. నేరాలు చేయటంలో దిట్ట ఇతను. అందుకే ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. జగన్ రెడ్డి విషయం అందరికీ తెలుసు. బాబాయ్ ఏమయ్యాడో తెలుసు. ఆరోజు ముందు ఒక మాట సాయంత్రం ఒక మాట చెప్పి, చివరకు సిబిఐ దగ్గరకు వెళ్లి, కోర్టుకు వెళ్లి, సిబిఐ కావలని అడిగిన పెద్ద మనిషి. అధికారంలోకి వస్తూనే, సిబిఐ అవసరం లేదు అంటూ, కోర్టులో పిటీషన్ వేస్తే, సాక్షాత్తు అయన కుమార్తె, నా తండ్రికి న్యాయం చేయండి అంటూ, కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి. దీంతో సిబిఐ ఎంక్వయిరీ వేసారు. దీంతో ప్రతి రోజు ఢిల్లీకి వెళ్లి నా కేసులు అంటూ, అడుక్కునే పరిస్థితి. అదే విధంగా, చెల్లిని ఉపయోగించుకుని, ఆమెకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు వీళ్ళు. ఈ ఏ2, ఏ1 ఏమి సమాధానం చెప్తారు ?"

sharmila 10022021 2

"విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్ మోహన్ రెడ్డి, దీనికి సమాధానం చెప్పాలి. ఏమిటి నీ విశ్వసనీయత ? ఆ రోజు జగన్ అన్న వదిలిన బాణం అన్నారు. ఈ రోజు ఏమైంది ? చెల్లికి కూడా వెన్నుపోటు పొడిచాడు. నువ్వు కూడా వేరే వాళ్ళ గురించి మాట్లాడే వాడివే. ఎన్ని సార్లు మోసం చేస్తావ్ ? ఇంట్లో వాళ్ళని మోసం చేస్తావ్. ప్రజలను మోసం చేస్తావ్. ఒక చెల్లి బాబాయ్ గురించి అడుగుతుంది, ఇంకో చెల్లి బయటకు వచ్చింది. నువ్వు అందరి మీద మైండ్ గేమ్ ఆడతావ్. నువ్వు ఏమైనా గొప్ప నాయకుడివా ? ఆయన పక్కన ఉన్న వాళ్ళు అందరూ ఏ1, ఏ2, ఏ3 ఇలా ఉంటారు. వీళ్ళ గురించి ఏమి చెప్పాలి ? ఆఫీసర్ లు వీళ్ళే, పార్లమెంట్ లో వీళ్ళే. పధ్ధతి లేని వాళ్ళు వీళ్ళు. వ్వ్యస్థలు అన్నీ పతనం చేసాడు. బాబాయ్ ఏమయ్యాడో తేల లేదు. ఆ విషయంలో ఏమవుతుందో అని, జగన్ రెడ్డికి నిద్ర పట్టటం లేదు. ఆ రోజు సిబిఐ కావాలి, ఈ రోజు వద్దు అన్నాడు అంటే, అర్ధం ఏమిటి ? వివేక కూతురుకు ఉన్న కమిట్మెంట్ లో, ఒక్కశాతం ఉన్నా, ఈ పాటికి పట్టుకునే వాడివి కాదా ? ఇప్పుడు ఇంకో చెల్లికి వెన్నుపోటు పొడిచాడు" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ పై, కుట్ర మొత్తం బయట పడింది. ఏదో చేయబోయి ఏదో చేసినట్టు, అధికార పార్టీ నేత విజయసాయి రెడ్డి వేసిన ప్రశ్నతో, బండారం మొత్తం బయట పడింది. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ నేతలు కారుస్తున్న ముసలి కన్నీరు మొత్తం, తేటతెల్లం అయ్యింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోస్కో కంపెనీకి కట్టబెట్టే విషయం మొత్తం అందరికీ ముందే తెలుసు అని కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్ 2019లోనే ఈ కుట్రకు నాంది పలికినట్టు అర్ధం అవుతుంది. ఈ రహస్యం ఈ రోజు పార్లమెంట్ వేదికగా బట్టబయలు అయ్యింది. ఈ కుట్రలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ లో వంద శాతం డిస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని, తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు అర్ధం అవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు కొట్టేసి, పోస్కో అనే కంపెనీ కొత్త స్టీల్ ప్లాంట్ కడుతుంది అనే వాదనలు ఇప్పటికి వరకు బయటకు వచ్చాయి కానీ, దీని పై సరైన ఆధారాలు లేకపోవటంతో, వైసీపీ నేతలు కూడా దొరల్లా బిల్డ్ అప్ ఇస్తూ వచ్చారు. అయితే ఈ వివరాలు, ఈ ఒప్పందం సంగతి ఇప్పుడు ప్రపంచానికి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇది మొత్తం నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి వేసిన ప్రశ్నకు జవాబుగా కేంద్రం చెప్పింది. అసలు పోస్కో గురించి ఏమి తెలియనట్టుగా విజయసాయి రెడ్డి కేంద్రానికి ప్రశ్న వేసారు.

steel 10022021 1

విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పోస్కో చేస్తున్న ఘనకార్యాన్ని రాజ్యసభ సాక్ష్టిగా చెప్పారు. పోస్కో, విశాఖ స్టీల్ ప్లాంట్ మధ్య నాన్ బైండింగ్ ఒప్పందం, 2019లోనే జరిగిందన, ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేసారు. అంతే కాకుండా, ప్లాంట్ లో పోస్కో వాటా 50 శాతం ఉంటుందని స్పష్టం చేసారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ వాటా ఎంత అనేది మాత్రం స్పష్టం చేయలేదు. అయితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వాటా, ఇచ్చే భూముల ధర పైన, ఈ వాటా ఉంటుందనేది స్పష్టం చేసారు. దీనికి సంబంధించి పోస్కో ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చి చర్చించదని, చెప్పారు. అయితే పోస్కో ప్రతినిధులు అక్టోబర్ 2019న జగన్ ను కలిసి, స్టీల్ ప్లాంట్ పెడుతున్నట్టు చెప్పారు. అంటే మంత్రి సమాధానాన్ని బట్టి చూస్తే, ఈ పోస్కో విషయం, జగన్ మోహన్ రెడ్డికి ముందే తెలుసు అని అర్ధం అవుతుంది. అన్నీ తెలిసి కూడా, ఏమి తెలియనట్టు నటిస్తున్న వైసీపీ నేతలకు ఇది చెంపపెట్టు అనే చెప్పాలి.

Advertisements

Latest Articles

Most Read