ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టు తీర్పువచ్చిన తర్వాతచదువు సంధ్యలు, విషయజ్ఞానంలేని, అవగాహనలేని కొందరు వైసీపీ నేతలు లేమెన్లలా మాట్లాడుతున్నారని, సిగ్గులేని అధికారపార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరుచూసి సిగ్గే సిగ్గుపడుతోందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆ మంత్రి బయటతిరగడానికి వీల్లేదు, అతనిఆలోచనలు, భాషసరిగాలేవు, అతను అధికారులను బెదిరిస్తున్నాడని, అతనితీరు గర్హనీయమని చెప్పడం జరిగింది. దానిపై సదరు మంత్రి హైకోర్టుకి వెళితే, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీనేతలు ఎస్ఈసీకి చెంపదెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నారు. వారికి తెలియని విషయమేమిటంటే, హైకోర్టు తీర్పు ఎస్ఈసీకి చెంపదెబ్బకాదు, మంత్రిపెద్దిరెడ్డికి చావుదెబ్బఅని గ్రహించకపోవడం హైకోర్టు తీర్పుచూశాక మంత్రిపెద్దిరెడ్డి సిగ్గుతో తలవంచుకోవాలన్న వర్ల, మంత్రి తప్పుడు మాట్లాడతారు, అసభ్యంగా మాట్లాడతారని భావించే కదాహైకోర్టు ఆయన్ని మీడియాముందు మాట్లాడవద్దని చెప్పిందన్నారు. హైకోర్టు తీర్పుతో మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి, కానీఆయనకు సిగ్గు,శరంలేవుకనుక చేయరని రామయ్య ఎద్దేవాచేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్నికలకమిషనే సుప్రీం , అందులో ఎలాంటిసందేహం లేదని రామయ్య స్పష్టంచేశారు. మంత్రి తప్పుడువిధానాలు ప్రజలకు చెబుతాడనే ఆయన్ని మీడియా ముందు మాట్లాడొద్దని న్యాయస్థానం చెప్పిందన్నారు. హైకోర్టు మంత్రిపెద్దిరెడ్డి ఆచెంప, ఈ చెంప వాయించినా కూడా, తగుదనమ్మా అంటూ తనదే పైచేయి అనిచెప్పుకోవడం సిగ్గుచేట న్నారు. పెద్దిరెడ్డికి నిజంగా నైతికతఅనేది ఉంటే, ఆయన తక్షణమే తనమంత్రిపదవికి రాజీనామా చేయాలన్నారు.

మంత్రి చేతగానిత నం, నైతికవిలువలకు ఆయన తిలోదకాలిచ్చినతీరు గురించి తాను మాట్లాడుతున్నానుతప్ప, ఎస్ఈసీని సమర్థించేలా మాట్లాడటం లేదని రామయ్య స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి ఒక్కసారి ఇటువంటి మంత్రి తన కేబినెట్ లో అవసరమా అని ఆలోచించాల న్న రామయ్య, మంత్రినోరు తెరవకుండా హైకోర్టు అతనినోటిని కుట్టేస్తే, దానిపై ముఖ్యమంత్రిగా ఆలోచనచేయాల్సిన బాధ్యత జగన్ పై లేదా అని రామయ్య ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతిక విలువలున్నా, తక్షణమే పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. అప్పుడైనా ముఖ్యమంత్రి మనోవికాసం పొందారని ప్రజలు గ్రహిస్తారన్నారు. ప్రెస్ ముందు నోరెత్తవద్దని, ఎన్నికల్లో వేలుపెట్టవద్దని హైకోర్టు చాలా స్పష్టంగా పెద్దిరెడ్డిని నిందించి, ఆయన చెంపలను వాయగొడితే, దానిగురించి మాట్లాడ కుండా, ఎస్ఈసీకి హైకోర్టు చెంపదెబ్బ కొట్టిందని చెప్పుకోవడం సి గ్గుచేటు కాకఏమవుతుందన్నారు. అవగాహనలేని, విషయ పరిజ్ఞానం లేనినోరు కాబట్టే, దాన్ని తెరవవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. సిగ్గులేని మంత్రిపెద్దిరెడ్డి తీరుని చూసి సిగ్గే సిగ్గుపడుతోందని గ్రహించైనా జగన్ ఆయన్ని కేబినెట్ నుంచి తొల గించాలన్నారు. అలా కాకుండా హైకోర్టు తీర్పుని పట్టించుకోకుండా మనకేంటి సిగ్గు అంటూ ముఖ్యమంత్రి, మంత్రి చెట్టాపట్టాలేసుకు తిరుగుతారా అని రామయ్య దెప్పిపొడిచారు. నోరుతెరిస్తే అసభ్యం గా, అసహ్యంగా, సిగ్గులేకుండా, విషయపరిజ్ఞానం లేకుండా మాట్లా డతాడు కాబట్టే, ఆయననోరు న్యాయస్థానం కుట్టేసిందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంత్రి పెద్దిరెడ్డిపై జగన్ చర్యలు తీసుకోకుంటే, ఈ ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగంప్రకారం పనిచేయడం లేదని ప్రజలంతా భావించాల్సి ఉంటుందన్నారు.

మంత్రి పెద్దిరెడ్డిరామంచంద్రారెడ్డి జీవితం, ఎదుగుదల తప్పులపరంపర అన్న రామయ్య, అతను తప్పులనే మెట్లుగా చేసుకొని పైకొచ్చాడన్నారు అటువంటిమంత్రిపై చర్యలు తీసుకోవ డానికి జగన్ ఎందుకు ఉపేక్షిస్తున్నాడో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్, ఇసుక మద్యంమాఫియాలకు కేంద్రబిందువుగా మారి, జడ్జిరామకృష్ణను బెదిరించడం, దళితయువకుడు ఓంప్రతాప్ చా-వుకు కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఎందుకు వెనకాడు తున్నాడన్నారు. అతనిపై చర్యలు తీసుకుంటే, తన ప్రభుత్వానికి ఏమైనా గడబిడఅవుతుందనే మీమాంసలో ముఖ్యమంత్రి ఉన్నాడా అని రామయ్య సందేహం వెలిబుచ్చారు. ఇప్పటికైనా రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా సాగేలా ముఖ్యమంత్రి డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని, అధికారులు, మంత్రులు ఎవరి విధినిర్వహణ వారుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిగ్గుఎగ్గూ లేకుండా నోరు మూసుకొని తిరగమనిహైకోర్టు మంత్రికి చెబితే, అతను ఏమాత్రం సిగ్గులేకుండా తనదే పైచేయి అన్నట్లు మాట్లాడుతున్నాడని, అటువంటి వ్యక్తిపై ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకుంటాడన్నారు. ఎస్ఈసీ రమేశ్ కుమార్, ఈ విధంగా నేరాలు-ఘోరాలకు అలవా టుపడినవారంతా, ఇలానే ప్రవర్తిస్తుంటారని గ్రహించాలన్నారు. మంత్రి పెద్దిరెడ్డి నోరుమూసుకొని కూర్చోవాలని చెప్పడంతోపాటు, ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పిన న్యాయస్థానం, ఆయన్ని ఇంటికే పరిమితంచేసుంటే ప్రజలంతా సంతోషపడేవార న్నారు. అప్పుడే న్యాయంసంపూర్ణంగా జరిగినట్లుగా అందరూ భావించేవారన్నారు. కొందరు వ్యక్తులను బైండోవర్ చేస్తున్న పోలీసుల మాదిరే, హైకోర్టు కూడా మంత్రిని ఇంటికే పరిమితం చేసుంటే బాగుండేదని రామయ్య అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతికతఉన్నా, తక్షణమే పెద్దిరెడ్డిని తన కేటినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. పెద్దిరెడ్డిని ఉద్దేశించి హైకోర్టు వెలువరించినతీర్పుపై సిగ్గులేని వైసీపీనేతలు ఏవిధంగా సిగ్గే సిగ్గుపడేలా మాట్లాడారో గ్రహిస్తే మంచిదన్నారు.

గవర్నర్ గారు కూడా తనబాధ్యతను ఉపయోగించి, ఆయనకున్న హక్కులను ఉపయోగించి మంత్రిపెద్దిరెడ్డిపై చర్యలు తీసకోవాలని రామయ్య విజ్ఞప్తిచేశారు. మంత్రిని తక్షణమే కేబినెట్ నుంచి గవర్నర్ డిస్మిస్ చేయాలన్నారు. నేనెవర్నీ లెక్కచేయను, ఏదైనా మాట్లాడతాను అన్నచిలుక హైకోర్టు తీర్పువచ్చాక భయపడిందని అర్థమవుతోందన్నారు. కోర్టుతీర్పును ధిక్కరించి, పెద్దిరెడ్డి నిస్సిగ్గుగా బయటకువచ్చి, ప్రవర్తిస్తే, అతను చేసే సంజ్ఞలు, హావ భావాలను పాత్రికేయులు, ప్రజలు నిశితంగా గమనించాలని, ఆయన నడత, నడకపై కూడా ఎస్ఈసీ నిఘా పెట్టాలని రామయ్య కోరారు. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని చెప్పుకుంటున్న వైసీపీనేతలను చూస్తుంటే, భార్యచేతిలో తన్నులు తిని బయటకువచ్చి వీరుడునని చెప్పుకునే వ్యక్తి తీరులా ఉందని రామయ్య గేలిచేశారు. రాజకీయనాయకుడికి కీలకమైనది నోరేనని, అదికుట్టేశాక, అతను హావభావాలకు పరిమి తమవుతాడని, వాటిపై కూడా ఎస్ఈసీ ఒకకన్నేసి ఉంచితే మంచి దని రామయ్య సూచించారు.

తొలివిడత పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గతంలో తనకున్న నేరచరిత్రను, నేరస్వభావాన్ని చూపించి, అధికారయంత్రాంగాన్ని ఓటర్లను భయపెట్టేందుకు తీవ్ర మైన ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆఖరికి ఎన్నికలకమిషనర్ పై కూడా బెదిరింపులకు దిగాడని, టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పెద్దిరెడ్డి జీవితమంతా నేరాలమయమని, ఆయన పీలేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రామ్మోహన్ రెడ్డి అనేనేతను చం-పిం-చా-డ-ని, ఆతరువాత వరుసగా కొన్నిహ-త్య-లు జరిగాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలను, ఎర్రచందనాన్ని నరికేగ్యాంగ్ ను, ఎర్రచందనం రవాణాచేసే వ్యవస్థను, పెద్దఎత్తున సమకూర్చుకొని ఈ రాష్ట్రంనుంచి రామచంద్రామరెడ్డే భారీస్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నారనే దానిపై పెద్ద చర్చే జరిగిందన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాతో కోట్లకుకోట్లు సంపాదించి, తననేరసా మ్రాజ్యాన్ని ఆయన విస్తరించుకున్నాడన్నారు. అధికారం లేనప్పుడు ఎక్కడో మడుగులోదాక్కొని, తలొంచుకొని తిరిగిన వ్యక్తి, నేడు అధికారంరాగానే మళ్లీ తననేరస్వభావాన్ని, విశృంఖలంగా వ్యాపింపచేస్తున్నాడన్నారు. చిత్తూరుజిల్లా తనఅడ్డా అంటూ, అక్కడజరిగే అవినీతి, అక్రమాలను ప్రశ్నించేవారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడన్నారు. డాక్టర్ అనితా రాణి, జడ్జీ రామకృష్ణల ఘటనలే అందుకు నిదర్శనాలనని మర్రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డిపై మోదీ కన్నెర్రచేస్తే, కాలం కలిసొచ్చి ఆయన జైలుకు వెళితే, ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్న పెద్దిరెడ్డి తీసుకొచ్చిన మద్యం పాలసీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. పేదలసొమ్ముని కల్తీమద్యంద్వారా పీల్చు కుంటున్నారని ప్రశ్నించిన పాపానికి దళితయువకుడు ఓంప్రతాప్ హ-త్యకావించబడ్డాడన్నారు. ఓంప్రతాప్ హ-త్య-కు గల కారణాలను, అందుకు కారకులైనవారిని పోలీసులు ఇంతవరకు పట్టుకోలేక పోయారన్నారు. చనిపోయిన ఓంప్రతాప్ కాల్ డేటాను కూడా పోలీసులు బయటపెట్టలేకపోయారంటే, పెద్దిరెడ్డి రౌడీరాజకీయం ఏస్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చన్నారు.

జడ్జీరామకృష్ణ స్థలాన్నిఆక్రమించి, అతన్నే ఇంటినుంచి బయటకురాకుండా నిర్బంధించిన వైనాన్నికూడా చూశామన్నారు. ఈ విధంగా అడుగడుగునా నేరపూరితస్వభావంతో ఉన్న పెద్దిరెడ్డి, నేడు ఎన్నికలకమిషనర్ ని ఉద్దేశించి వాడు-వీడుఅని దూషించే స్థాయికి వచ్చాడన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ యొక్క వికృతరూపమే ఈ ఘటనలన్నింటికీ ప్రధానకారణమని మర్రెడ్డి తేల్చిచెప్పారు. తంబళ్లపల్లెలో, పుంగనూరు నియోజకవర్గాల్లో టీడీపీతరుపున నామినేషన్లు వేయడానికి వస్తున్నవారిపై ఏవిధంగా దా-డు-ల-కుపాల్పడుతున్నారో, నామినేషన్లు వేయనీయకుండా ఎలాఅడ్డుకుంటున్నారో రాష్ట్రమంతా గమనిస్తూనే ఉందన్నారు. టీడీపీనేత నల్లారికిషోర్ కుమార్ రెడ్డిపై, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డిపై తంబళ్లపల్లెలో ఏవిధంగా దా-డి-కి పాల్పడ్డారో చెప్పాల్సిన పనిలేదన్నారు. ప్రజల దురదృష్టంకొద్దీ పెద్దిరెడ్డికి పంచాయతీ రాజ్ శాఖ దక్కిందని, ఆయన శాఖకు సంబంధించిన పంచాయతీల్లో నేడు ఎన్నికలుజరుగుతుంటే, గ్రామస్వరాజ్యం దిశగా చర్యలుతీసుకోవాల్సిన వ్యక్తే, పచ్చనిపల్లెల్లో అక్రమాలను, అరాచకాలను పెంచిపోషిస్తున్నాడన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉండాలని, జగన్ కుధీటుగా తన ప్రభవెలగాలన్న దురుద్దేశంతో, తనకున్న నేరస్వభావంతో పెద్దిరెడ్డి ఎన్నికలవాతావరణాన్ని కలుషితంచేశాడన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థను, ఎన్నికల కమిషన్ ను బెదిరిస్తూ మాట్లాడటం భయభ్రాంతులకు గురిచేయడంకాక ఏమవుతుందన్నారు. మార్చి 31తర్వాత ఎవరిపై చర్యలు తీసుకుంటాడో, ఎందుకు తీసుకుంటాడో రామచంద్రారెడ్డే చెప్పాలన్నారు. ఆఖరికి బయట తిరగడానికికూడా ఆయన కోర్టు అనుమతి తీసుకునే పరిస్థితి వచ్చిందంటే, అందుకు కారణం ఆయన కాదా అని మర్రెడ్డి నిలదీశారు. ఎర్రచందనం, ఇసుక, మద్యం,మైనింగ్ మాఫియాలను అడ్డుపెట్టుకొని వేలకోట్లుసంపాదించి, విస్తరించిన నేరసామ్రాజ్యం ఏదోఒకరోజు కూకటివేళ్లతో సహా పెకలించివేయబడక తప్పదనే వాస్తవాన్ని పెద్దిరెడ్డి గ్రహిస్తే ఆయనకే మంచిదని శ్రీనివాసరెడ్డి హితవుపలికారు. పెద్దిరెడ్డి చేస్తున్న నేరాలకు తగినఫలితం అనుభించక తప్పదన్నారు. రామచంద్రారెడ్డిలా వ్యవహరించే ప్రతిఒక్కరూ ఎప్పటికైనా సరే కృష్ణజన్మస్థానానికి చేరకతప్పదని, ఆయన ఇప్పటికైనా తన నేరస్వభావాన్ని తగ్గించుకుంటే మంచిదని టీడీపీనేత హితవుపలికారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు పెద్దిరెడ్డి వేసిన హౌస్ మోషన్ పిటీషన్ పై విచారణ జరిగింది. ఈ రోజు ఆదివారం అయినా సరే, హౌస్ మోషన్ పిటీషన్ వేయటం, మంత్రిని నియంత్రిస్తూ ఆదేశాలు రావటంతో, హైకోర్టు ఈ కేసు తీవ్రత దృష్టిలో పెట్టుకుని విచారణ చేసింది. అయితే ఈ పిటీషన్ లో పెద్దిరెడ్డికి కొంత ఊరట లభించింది. మంత్రి పెద్దిరెడ్డిని ఇంటి వద్దే ఉండాలని నియంత్రణ చేయలేము కానీ, మంత్రి మీడియాతో మాట్లాడవద్దు అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు మాత్రం పాటించాల్సిందే అని తేల్చి చెప్పింది. మంత్రి మీడియాతో పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడటానికి వీలు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో పెద్దిరెడ్డికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకుంటే నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా, మంత్రిగా విధులు నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఇప్పుడు కోర్టు మాత్రం, ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని చెప్పింది. అయితే మీడియాతో మాట్లాడకూడదు అని హైకోర్టు కూడా సమర్ధించటం, మంత్రి కంట్రోల్ తప్పి మాట్లాడుతున్న మాటలకు కళ్ళెం వేసింది అనే చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాల పై నిన్న మంత్రి పెద్దిరెడ్డి హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ఆ పిటీషన్ ని ఈ రోజు హైకోర్టు విచారణ చేసి ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

hc 07022021 2

తన పై ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షంగా ఉన్నాయని, కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా, ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం పై, పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్లారు. ఇక ఈ కేసు పూర్వాపరాలు చూస్తే, పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఏకాగ్రీవాల్లో, చిత్తూరు, గుంటూరు జిల్లాల ఏకాగ్రీవాలు అసాధారణంగా వచ్చాయి. మిగతా జిల్లాల్లో నామమాత్రంగా ఉంటే, ఈ రెండు జిల్లాల్లో అధికంగా రావటంతో, ఎన్నికల కమిషన్ వాటి పై పరిశీలన చేసిన తరువాతే ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే మంత్రి పెద్దిరెడ్డి మీడియా సమావేశం పెట్టి, నిమ్మగడ్డ మాటలు విని ఏకాగ్రీవాలు ప్రకటించకపోతే, ఎన్నికలు అయిన తరువాత అధికారులను బ్లాక్ లిస్టు లో పెడతాం అని, వెంటనే అధికారులు ఏకాగ్రీవాలు ప్రకటించాలని హుకుం జారీ చేసారు. ఎన్నికల వ్యవహారాల్లో తల దూర్చటమే కాక, ఏకంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను బెదిరించటంతో, ఎన్నికల కమిషన్ పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చి, మీడియాతో మాట్లాడవద్దు అని చర్యలు తీసుకుంది. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, హౌస్ అరెస్ట్ చేయమనే ఆదేశాలు కొట్టేస్తూ, మీడియాతో మాట్లాడ వద్దు అని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు సమర్ధించింది.

మాతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు, అన్ని పనులు చేపించుకుని, మాకు ఇస్తున్న జీతం మాత్రం 5 వేలు, అవి దేనికీ సరిపోవటం లేదు, ఇప్పటికి రెండేళ్ళు అవుతుంది, మా పరిస్థితి ఏంటి అంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇవ్వటానికి రెడీ అయ్యారు వాలంటీర్లు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, వాలంటీర్ అనే వ్యవస్థ తీసుకుని వచ్చారు. సంక్షేమ పధకాలకు వారధిలా వీళ్ళు పని చేస్తారు అని చెప్తున్నా, వీరి పై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఒకే పార్టీకి కొమ్ముకాస్తూ, వీళ్ళు చేస్తున్న అరాచకాలు, ప్రతి రోజు వార్తల్లో వస్తూనే ఉన్నాయి. సాక్షాత్తు విజయసాయి రెడ్డి , 90 శాతం మంది వాలంటీర్లు మా పార్టీ వాళ్ళే అని బహిరంగంగా గొప్పగా చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది చర్చ కాదు, ఇది పక్కన పెడితే, ఈ 90 శాతం మంది వైసీపీ కార్యకర్తలు ఉన్న వాలంటీర్లు, ఇప్పుడు తమ ప్రభుత్వం పైనే నిరసనకు సిద్ధం అవుతున్నారు. తమకు ఇస్తున్న జీతాలు సరిపోవటం లేదని, తమకు ఇచ్చే పనులు ఎక్కువ, చేసే చాకిరీ ఎక్కువ, మీరు ఇచ్చే డబ్బులు తక్కువ అంటూ, ఆందోళన బాట పట్టారు వాలంటీర్లు. ఇప్పటికే గుంటూరులో ఉన్న బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో వాలంటీర్లు సమావేశం అయ్యారు. తమ కష్ట నష్టాలు చర్చించుకున్నారు. ప్రభుత్వం తమను చిన్న చూపు చూస్తుందనే భావనకు వచ్చారు.

volunteer 07022021 2

తమకు జీతాలు పెంచటమే కాక, ఉద్యోగాలకు కూడా క్రమబద్దీకరించాలని డిమాండ్ చేసారు. రేపు దీని పై విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఈ నిరసనకు అన్ని జిల్లాల నుంచి వాలంటీర్లు తరలి రావాలని పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం కనుక తమ డిమాండ్లకు స్పందించక పోతే, ఉద్యమ బాట పడతామని, తేల్చి చెప్పారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజుకి ఒక తల నొప్పి వస్తుంది. ఇప్పటికే బియ్యం వ్యాన్ లు తోలే డ్రైవర్లు , రెండు రోజులుకే తాము ఈ పని చేయలేం అని, మూటలు మోసే పని కూడా మేమే చేయాల్సి వస్తుందని, ఆయిల్ ఎక్కువ తాగేస్తుందని, ఇలా పెద్ద చిట్టా చెప్పి,మొత్తానికి బియ్యం పంపిణీ ఆపేసారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం, అన్ని ఖర్చులకు కలిపి,మరో 5 వేలు పెంచింది. అయితే మూడు రోజులు క్రితం వచ్చిన వాళ్ళే నిరసన చేయగానే 5 వేలు పెంచారని, తాము రెండేళ్ళ నుంచి చేస్తున్నా, తమ జీతాలు పెంచలేదని, అందుకే తాము కూడా నిరసన తెలిపి, తమ జీతాలు పెంచే వరకు ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం అని వాలంటీర్లు వాపోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read