ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం ముదురుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, రాజ్యంగ పదివిలో ఉన్న ఎలక్షన్ కమీషనర్ ని పట్టించుకోక పోవటంతో, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు గవర్నర్ కూడా బయటకు ఏమి చెప్పకపోయినా, లోపల లోపల ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నారో తెలియదు కానీ, ప్రభుత్వ వైఖరిలో మాత్రం, ఎలాంటి మార్పు లేదు. ఎన్నికల ఓటర్ల జాబితా రెడీ చేయకపోవటం, కలెక్టర్ కాన్ఫరెన్స్ కు రాకపోవటం, నియమావళి పాటించని పలువురు అధికారుల పై, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ చర్యలు తీసుకుంటూ, గత వారం రోజులుగా, చీఫ్ సెక్రటరీకి అనేక లేఖలు రాస్తున్నారు. అయితే ఆయన పంపించిన ఆదేశాలు అన్నీ చీఫ్ సెక్రటరీకి వెళ్తున్నాయి. అయితే చాలా ఆదేశాలు అన్నీ అమలు కావటం లేదు. తాజాగా ఈ విషయం పై, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. చీఫ్ సెక్రటరీకి ఘాటుగా లేఖ రాసారు. ప్రవీణ్ ప్రకాష్ ను తొలగించాలి అంటూ తాను ఇచ్చిన ఆదేశాలు ఇప్పటి వరకు అమలు కాక పోవటం పై, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
చీఫ్ సెక్రటరీకి తన ఆదేశాలు అమలు చేయాలా లేదా అని రివ్యూ చేసే అధికారం లేదని, ఎన్నికల కమిషన్ ఇచ్చే ఆదేశాలు అమలు చేయాల్సిందే అని లేఖలో తెలిపారు. హైకోర్టు ఇప్పటికే, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి సహకారం అందించాలని ఇచ్చిన ఆదేశాలు గుర్తు చేసారు. ఈ నేపధ్యంలో చీఫ్ సెక్రటరీ ఆదేశాలు పాటించకపొతే, కోర్టు ధిక్కరణ కిందకు కూడా వస్తుందని తెలిపారు. ప్రవీణ్ ప్రకాష్ స్టేటస్ కో మెయిన్టైన్ చేయటం కోసమే, ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గున కుండా చేసానని, ఆయనే ఒప్పుకున్నారని, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించకపోవటం వల్లే, మొదటి విడత ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చిందని, దానికి ఆయన బాధ్యులను చేసినట్టు గుర్తు చేసారు. చర్యలు తీసుకోమంటే, ఎందుకు తీసుకోలేదు అంటూ, చీఫ్ సెక్రటరీ పై, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే దీని పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం, దీని పై కూడా వ్యతిరేకించే అవకాసం ఉంది. ఇక ఇది కూడా కోర్టు వరకు వెళ్ళే అవకాసం కనిపిస్తుంది.