ఈ రోజు మూడు మూడు రోజుల పాటు, తెలుగుదేశం పార్టీ రైతు కోసం కార్యక్రమం నిర్వహిస్తుంది. వరుస విపట్టులతో రైతులకు ఎదురైన ఇబ్బందులు, అలాగే ప్రభుత్వ వైఖరితో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా తెలుగుదేశం పార్టీ మూడు రోజుల కార్యాచరణకు పిలుపు ఇచ్చింది. ఇందులో భాగంగా 175 నియోజవర్గాల్లో తెలుగుదేశం నేతలు, ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇక అవినగడ్డ నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులను, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గునటం కోసం నారా లోకేష్ ఈ రోజు ఉదయం అవనిగడ్డ బయలుదేరి వెళ్ళారు. అయితే అవనిగడ్డ వెళ్తున్న సమయంలో, నారా లోకేష్ కాన్వాయ్ నిమ్మకూరు రాగానే, సడన్ గా రహదారి పై ఆగింది. నిమ్మకూరులో రహదారి పై వెళ్తున్న రైతులను చూసి, కాన్వాయ్ ఆపి, వారి వద్దకు వెళ్లారు నారా లోకేష్. ఈ సందర్భంగా, ధాన్యంతో వెళ్తున్న ట్రాక్టర్ కూడా ఆగింది. అక్కడ రైతులతో మాట్లాడారు నారా లోకేష్. అయితే ప్రభుత్వం చెప్పినట్టుగా ధాన్యం కొనటం లేదని, రైతులు లోకేష్ కు తెలిపారు. తుఫానులో దెబ్బ తిన్న ప్రతి గింజ కొంటాం అని ప్రభుత్వం చెప్పింది కానీ, రంగు మారిన ధాన్యం కానీ, తడిచిన ధాన్యం కానీ ప్రభుత్వం కొనటం లేదని లోకేష్ దృష్టికి తెచ్చారు రైతులు.

lokesh 28122020 2

అలాగే సరైన మద్దతు ధర లేక, నిండా మునిగిపోయాం అని అన్నారు. ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు ఇస్తుంది కానీ, వాస్తవంలో ఆ పరిస్థితి లేదని తెలిపారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక పోవటంతో, తాము దళారుల వద్దే తక్కువ రేటుకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుందని లోకేష్ కు తెలిపారు రైతులు. ఇక ఇక్కడ నుంచి లోకేష్ బయలుదేరి, అవనిగడ్డ చేరుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం కొత్త మాజేరు గ్రామం నుంచి రైతు కోసం యాత్ర ప్రారంభించారు. మాజేరు లో ఉన్న పంట పొలాలను లోకేష్ పరిశీలించారు. అదే ప్రాంతంలో తుఫాను వల్ల పంట నష్టపోవటం, ప్రభుత్వం ఆదుకోక పోవటంతో, నష్టపోయిన పంట పొలంలో ఉండగానే, అక్కడ రైతు పొలం మొత్తాన్ని దున్నేసిన సంఘటన ఇక్కడ జరిగింది. ఆ రైతుని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం చెప్తున్న దానికి, జరుగుతున్న దానికి సంబంధం ఉండటం లేదని అన్నారు. కౌలు రైతులకు ఎటువంటి సహాయం అందడం లేదని, భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, భీమా అందడం లేదని, రంగు మారిన బియ్యం కొనుగోలు చెయ్యడం లేదు అంటూ, లోకేష్ ముందు తమ ఆవేదన చెప్పుకున్నారు రైతులు.

పెళ్లి పేరుతో ఎస్టీ యువతి ప్రియాంకను మోసం చేసిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, నిందితులకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అండగా ఉండటం సిగ్గుచేటని, రాష్ట్రంలో ఆడ బిడ్డలకు రక్షణ లేదు అంటూ, శాసన మండలి సభ్యులు, టిడిపి నేత గుమ్మడి సంధ్యారాణి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆమె మాటల్లో " రాయచోటి పట్టణం, లక్ష్మీపురంలో నివాసం ఉంటున్న ఎస్టీ వర్గానికి చెందిన పూజారి వెంకటేశ్వర్లు కుమార్తె ప్రియాంకను రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అనుచరుడు శంకర్ రెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అవమానాన్ని తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ప్రియాంక కోమాలోకి వెళ్లింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రియాంకకు ఇప్పటి వరకు వైద్య ఖర్చులు రూ.20 లక్షలు అయ్యాయి. ప్రియాంక వైద్య ఖర్చులకు తక్షణమే ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలి. ఘటన జరిగి నాలుగు నెలలు అవుతున్నా ముఖ్యమంత్రి, మంత్రులు స్పందించకపోవడం దారుణం. పెళ్లి చేసుకుని వచ్చాక మళ్లీ పెళ్లి చేస్తామని మాయ మాటలు చెప్పి ప్రియాంక మెడలో తాళిని తెంపించారు. దీనిపై వెంకటేశ్వర్లు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినా సీఐ రాజు కేసు నమోదు చేయకుండా అవమానకరంగా మాట్లాడారు. పులివెందుల జేఎన్టీయూలో ఇంజనీరింగ్ ద్వితియా సంవత్సరం చదువుతున్న ఎస్టీ యువతి ప్రియాంక జీవితాన్ని రాజశేఖర్ రెడ్డి నాశనం చేశారు."

srikanthreddy 27122020 1

"రాజశేఖర్ రెడ్డిని రక్షించడానికి కేసు నమోదు చేయకుండా పోలీసులపై ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒత్తిడి చేశారు. తక్షణమే వైసీపీ అదిష్టానం శ్రీకాంత్ రెడ్డిని, శంకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిని వైసీపీ నుండి సస్పెండ్ చేయాలి. రోజుకో మహిళ రాష్ట్రంలో రోధనకు గురవుతోంది. మొన్న పులివెందులో దళిత మహిళను హత్య చేశారు. ఇప్పుడు ప్రియాంకను పెళ్లి పేరుతో మోసం చేశారు. వారంలోనే కడప జిల్లాలో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రియాంకకు న్యాయం చేసే వరకు టీడీపీ పోరాడుతుంది." అని సుధారాణ అన్నారు. అయితే ఇదే అంశం పై నారా లోకేష్ కూడా ట్వీట్ చేసారు. వైకాపా ఎమ్మెల్యే అనుచరుడు ఒత్తిడికి ఒక గిరిజన యువతి బలి అయ్యిందని లోకేష్ అన్నారు. తనకు జరుగుతున్న అన్యాయం పై, తన తండ్రి ఫిర్యాదు చేయటానికి వెళ్ళగా, ఆయనకు జరిగిన అవమానం తెలుసుకుని, ఆ యువతి ఆ-త్మ-హ-త్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రభుత్వం ఆ యువతికి మెరుగైన వైద్యం అందించి, ఈ ఘటనకు కారణమైన వైసీపీ నాయకులను అరెస్ట్ చేయలని లోకేష్ డిమాండ్ చేసారు.

అనంతపురంలో రాజకీయ పరిస్థితులు కొంచెం వేరుగా ఉంటాయి. ఒకే పార్టీలో ఉన్నా ప్రత్యర్ధులుగా ఉండే వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. తెలుగుదేశం పార్టీలో జేసి, పరిటాల ఫ్యామిలీ మధ్య సఖ్యత తక్కువ అనే చెప్పాలి. కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి, వాళ్ళు ముందుకు వచ్చి, కలిసిపోతూ ఉంటారు. గత 5 ఏళ్ళలో ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. తాజాగా జేసీ పై జరిగిన దా-డిని పరిటాల శ్రీరాం ఖండించారు. జేసి కుటుంబానికి మద్దతుగా శ్రీరాం మాట్లాడటం, ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన ఏమన్నారంటే "అనంతపురంలో జరుగుతున్న సంఘటనలు అన్నీ ఒకసారి గమనించినట్టు అయితే, స్నేహలత అమ్మాయి సంఘటన కానీ, తాడిపత్రిలో జరిగిన సంఘటన కానీ, జిల్లాలో శాంతిబధ్రతలు ఎలా ఉన్నాయో అర్ధం అవుతుంది. స్నేహలత అయితే, వాళ్ళ తల్లి దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేసినా కూడా ఎవరూ పట్టించుకోవ పోవటం వలన, ఈ రోజు ఆ అమ్మాయి దూరం అయ్యింది. అదే దిశా చట్టం, ఘటనలు జరగక ముందే భయం కల్పించే విధంగా ఉంటే ఏమైనా ఉపయోగం ఉంటుంది కానీ, ఘటనలు జరిగిపోయిన తరువాత, గొప్పగా చెప్పుకోవటానికి తప్ప దేనికీ ఉపయోగపడదు. దిశ పోలీస్ స్టేషన్ లు కానీ, ఆ యాప్ లు కానే పెట్టేది, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి, ఘటనలు జరిగిన తరువాత స్పందించటానికి కాదు. ఇప్పుడు ఉండే పోలీసులు అంతా, తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టటం, తప్పుడు కేసులు బనాయించటం, ఏది జరగకుండానే, జరిగినట్టి చిత్రీకరించి ఇబ్బంది పెట్టటం చేస్తున్నారు. రాజకీయ నాయకులు చెప్పినట్టుగా పోలీసులు చేయటం మానేసి, సామాన్య ప్రజల భద్రత గురించి చూసుకుంటే, ఇలాంటి స్నేహాలతలు బ్రతికేవారు."

sriram 27122020 2

"తరువాత రోజే తాడిపత్రిలో, ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి, ఒక ఎమ్మెల్యే వెళ్లి హడావిడి చేసి వస్తే, ఇప్పటి వరకు కేసు కట్టే వాడు లేడు. వాళ్ళు పెట్టలేదు అని కాకుండా, రాష్ట్రం మొత్తం భయానక పరిస్థితి తెప్పించిన ఇలాంటి కేసులు పై పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయాలి. చాలా ఏళ్లుగా, సంవత్సరాలుగా, ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత నెలకొల్పటానికి చాలా ఏళ్ళు పట్టింది. కానీ ఈ రోజు అదే పధ్ధతులు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఈ రోజు ప్రభుత్వం ఉందని, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు, జేసీ ప్రభాకర్ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు పోయి ఉంటే, మీరు మీ మగతనాన్ని కరెక్ట్ గా ప్రూవ్ చేసుకునే వారు. వాళ్ళు లేనప్పుడు పోయి హడావిడి చేయటం కాదు. కానీ చేస్తున్నారు. ప్రతి సారి టైం మీదే ఉండదు. ప్రభుత్వం మారుతుంది. పరిణామాలు మారతాయి. దానికి మూల్యం కచ్చితంగా చెల్లించుకుంటారు. ముఖ్యంగా మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ కోరుకునేది, ప్రశాంతంగా ఉండాలని మేము కృషి చేస్తున్నాం. మీరు ఇలాగే రెచ్చగోడితే, మీరే ఇబ్బందులు పడతారు" అని శ్రీరాం అన్నారు.

కర్నూల్ జిల్లా శ్రీశైలం దేవస్థానం సన్నిధిలో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య, సవాల్ వార్ నడుస్తుంది. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పై విమర్శలు చేసారు, ఘోషామహల్ ఎమ్మల్యే రాజా సింగ్. శ్రీశైలం దేవస్థానం షాపుల్లో మొత్తం ముస్లింలను ఎమ్మెల్యే నింపేసారని విమర్శలు చేసారు. ఎమ్మెల్యే దౌర్జన్యాలు జగన్ మోహన్ రెడ్డి ఆపాలని, లేకపోతే తాము చలో శ్రీశైలం పిలుపు ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు రాజా సింగ్. శ్రీశైలం దేవస్థానం సర్వ నాశనం చేసే కుట్ర వైసీపీ నేతలు చేస్తున్నారని ఆరోపించారు. దాన్ని ఆపే బాధ్యత జగన్ మోహన్ రెడ్డి దే అని, మేము కలుగు చేసుకుని రంగంలోకి దిగితే వేరే రకంగా ఉంటుందని, జగన్ శ్రీశైలం దేవస్థానాన్ని కాపాడాలని అన్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యల పై , శిల్పా చక్రపాణి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లాగా, బీజేపీ మతాలను రెచ్చగొట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చెయ్యాలి అనుకుంటే కుదరదని అన్నారు. మేము ఇలాంటివి చూస్తూ కుర్చుమని అన్నారు. తన పై ఇలా లేని పోనీ ఆరోపణలు చేస్తాను అంటే కుదరదు అని అన్నారు. తన పై చేసిన ఆరోపణలు ఎమ్మెల్యే రాజాసింగ్ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే రాజాసింగ్ అతని పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

silpa 271220202

రాజా సింగ్ శ్రీశైలం ఎప్పుడు వస్తారో చెప్పాలని, పేదల సమక్షంలో కూర్చుని అన్నీ చర్చిద్దామని అన్నారు. ఏపిలో హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తాను అంటే కుదరదు అని అన్నారు. బీజేపీ ఇలాంటి ఆటలు ఆడితే చూస్తూ ఊరుకోం అని అన్నారు. శ్రీశైలం నుంచి ముస్లింలను వెళ్ళగొట్టటానికి తాము ఎవరం అని రాజాసింగ్ ను ప్రశ్నించారు. 40 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారని అన్నారు. వాళ్ళు సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారని అన్నారు. తన హిందుత్వం గురించి వీళ్ళకు ఏమి తెలుసని, తన పై హిందూ ద్రోహిగా ముద్ర వేయాలని చూస్తున్నారని అన్నారు. శ్రీశైలంలో హడావిడి చేస్తున్న బీజేపీ కార్యకర్తలు అంతా పైడ్ ఆర్టిస్ట్ లు అని అన్నారు. దీని పై స్పందించిన రాజా సింగ్, తమకు శ్రీశైలం కేవలం మూడు గంటలే అని, ఎప్పుడు రావాలో చెప్తే అప్పుడు వస్తాం అని అన్నారు. అంతే కాదు అక్కడ అన్యమతస్తులకు కేటాయించిన షాపుల వివరాలు మీడియాకు విడుదల చేసారు. అలాగే ఆలయ ప్రాంగణంలో, ఈవో కార్యాలయంలో అన్యమత ప్రచారం పై కూడా స్పందించారు. తమను వైసీపీ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని, తాము తలుచుకుంటే, దేశం మొత్తం శ్రీశైలం తీసుకుని వచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read