టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ సారాంశం. అనంతపురం జిల్లాలో ఒక దళిత బిడ్డ స్నేహలత స-జీ-వ దహనం ఘటనతో ఈ నాగరిక సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం ఉంది. నిర్భయ, దిశ ఘటనల కంటే చాలా దారుణమైన దు-ర్ఘ-ట-న ఇది. తమ బిడ్డను వేధిస్తున్నారని స్నేహలత తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఈరోజు నేను వారితో మాట్లాడితే, జరిగిన దురాగతం వింటే చాలా బాధేసింది. ఈ ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం. ‘గన్’ వచ్చేలోగా జగన్ వస్తాడన్నారు. ఎక్కడ జగన్…? ఆడపిల్లలకు మేనమామగా ఉంటానన్న వ్యక్తి వారిపట్ల కంసుడిగా తయారయ్యాడు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. సజీవదహనాలు చేస్తున్నారు. “మనకూ అక్కాచెల్లెళ్లు, పిల్లలు ఉన్నారని” అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడాడు. మీకూ పిల్లలు ఉన్నారు కదా...? ఆడపిల్లల తండ్రి ముఖ్యమంత్రి జగన్ అని గొప్పగా చెప్పారు కదా. మరి ఇన్ని దారుణాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు...? రాజమండ్రిలో గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన వెంటనే నిందితులపై చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటివి మళ్లీ పునరావృతం అయ్యేవి కాదు. జగన్మోహన్ రెడ్డి జీవితమే ఒక ఫేక్. చట్టమే కాని ‘దిశ’ గురించి గొప్పలు చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్ అన్నారు. బాధితులు ఫోన్లు చేసినా పోలీసులు స్పందించడం లేదు. స్నేహలత తల్లి చెప్పింది కూడా అదే... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రలో 67 సంవత్సరాల్లో 18 మందికి పైగా ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ 19 నెలల్లో మహిళలపై జరిగిన అత్యాచారాలు, దాడులు, సజీవ దహనాలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇదే అనంతపురం జిల్లాలో 3 ఘటనలు జరిగాయి. కల్యాణ దుర్గంలో మైనారిటీ ఆడబిడ్డను అత్యాచారం చేసి చంపేశారు. బాలికపై లారీ డ్రైవర్ అత్యాచారం చేస్తే కనీసం అతనిపై చర్యలు తీసుకోలేదు.
పైగా వైసీపీ ఎంపీ నిందితుడికి రక్షణగా నిలిచాడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మాదిగ కులానికి చెందిన మహిళను అత్యాచారం చేస్తే చర్యల్లేవు. ఒంగోలులో వికలాంగురాలు సజీవ దహనమైంది. దోషులను శిక్షించకపోగా ఆత్మహత్యగా చిత్రీకరించారు. రాజమండ్రిలో 17 ఏళ్ల దళిత మైనర్ బాలికను 12 మంది రేప్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపోయారు. అన్యాయం జరిగిన బాలికను పోలీసులు మాటలతో వేధించారు. ఇన్ని జరుగుతుంటే తాడేపల్లిలో కూర్చుని నువ్వేం పీకుతున్నావ్...? గడ్డిపీకుతున్నావా...? తాడేపల్లిలో ఒకమ్మాయిని చంపేస్తే ఈ ముఖ్యమంత్రి న్యాయం చేయకపోగా తల్లిదండ్రులను ఇంటికి రాజీ కోసం పిలిచాడు. నీ తండ్రి చనిపోతే ప్రజా సానుభూతి కోసం నువ్వు నానా గడ్డి తిన్నావ్. అబ్దుల్ సత్తార్ కుటుంబం ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక సామూహిక ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే.. వారి కుటుంబసభ్యులను గెస్ట్ హౌస్ కు పిలిపించి మాట్లాడతారా...? కాకినాడలో వాలంటీర్ పై వైసీపీ కార్యకర్త దాడి చేస్తే దిక్కేలేదు. “ఓటేసి గెలిపించిన పాపానికి మా ఇంటికి దారి కూడా లేకుండా చేశారంటూ” అనపర్తిలో మహిళ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. 19 నెలల కాలంలో 400 పైగా అత్యాచారాలు, దాడులు: రాష్ట్రవ్యాప్తంగా 400 పైగా అత్యాచారాలు, దాడులు జరిగాయి. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు 13 శాతం, మద్యం కేసులు 72 శాతం, ఇసుక కేసులు 55 శాతం, పేకాట కేసులు 33 , మాదక ద్రవ్యాల కేసులు 9 శాతం పెరిగాయని స్వయంగా డీజీపీనే ఒప్పుకున్నారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో దీనినిబట్టే అర్దమవుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర ఆస్పత్రిలో పనిచేస్తున్న 24 ఏళ్లు సుమతిని పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితికి వచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో మరో మహిళను దారుణంగా హత్యచేశారు. ఇన్ని దురాగతాలు జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు...? ఆడపిల్లలు ముఖ్యమంత్రి కళ్లకు ఆటవస్తువుల్లా కనిపిస్తున్నారా? పోలీసు వ్యవస్త నిర్వీర్యమైపోయింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. రాజకీయ నాయకుల కొమ్ము కాస్తున్నారు పోలీసుల్లో కొందరు. మీ చర్యతో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ఘటనలను చూసి ముఖ్యమంత్రి సిగ్గుతో తలవంచుకోవాలి. ప్రజల ముందు నిలబడే హక్కు కూడా లేదు ఆయనకు. “దిశ అమల్లో ఉంది, ముగ్గురికి ఉరి శిక్ష వేశాం. 20 మందిని జైలుకు పంపామని” హోంమంత్రి చెప్పినవన్నీ అబద్ధాలే. నాడు అసెంబ్లీలో దిశ గురించి గొప్పుగా చెప్పి హ్యాట్సఫ్ కేసీఆర్ అన్నారు. మరి ఆచరణలో మహిళా రక్షణలో ఎందుకు విఫలమవుతున్నారు...? గురజాలలో దోమతోటి విక్రమ్ ను, చీరాలలో కిరణ్ ను, పుంగనూరులో ఓం ప్రతాప్ ను చంపేశారు. బీసీలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర సహా పలువురు నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ధర్మవరం, మంగళగిరి, మాచర్లలో తదితర ప్రాంతాలలో బీసీలను ఛిత్రహింసలు పెట్టారు. ముస్లిం మైనార్టీలపై అరాచకాలకు అంతేలేదు. నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబం సామూహిక ఆత్మహత్యలు, రాజమండ్రిలో అబ్దుల్ సత్తార్ కూతురుకు లైంగిక వేధింపులతో ఎస్పీ కార్యాలయం వద్దే ఆయన ఆత్మహత్యాయత్నం, గుంటూరు జిల్లా పోతుమర్రులో పంట కాపాడుకోవడానికి సలీమ్ అనే వ్యక్తి కత్తితో ఆత్మహత్య చేసుకునే పరిస్థి వచ్చిందంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా...?
మీ అరాచకానికి అడ్డు లేదా...? తాము ఏం చేసినా జరిగిపోతుంది, ఎవరూ ఏం చేయలేరని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఎక్కడో జరిగిన ఘటన రేపు మనకూ జరగొచ్చు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వైసీపీది రాక్షస ప్రభుత్వం. ఆడపిల్లల మానానికి, ప్రాణానికి రక్షణ లేదు. రాజమండ్రిలో మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేసినప్పుడు దిశ ను అమలు చేసి ఉంటే నేను ఈ పరిస్తితి వచ్చేది కాదు. తన కూతురికి అన్యాయం జరిగిందని స్నేహలత తల్లి రోదిస్తోంది. దోషులకు ఉరిశిక్ష వేయమని ఆమె కోరుతోంది. పులివెందులలో ఉన్న వ్యక్తికి(సీఎం జగన్ కు) అనంతపురంలో జరిగిన ఘటన కనబడలేదా...? మీ ప్రత్యేక విమానాలు ఏమయ్యాయి...? ఘటనాస్థలానికి వెళ్లేందుకు సమయం లేదా...? నేరాలు, ఘోరాలు చేయడంలో దిట్టలు కాబట్టి ఏం చేసినా ప్రజలు పడుంటారని భావిస్తున్నారా...? వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచించాలి. స్నేహలతను వెంటాడి చంపేసి కాల్చుతారా? ప్రభుత్వం అంటే భయం లేదు కాబట్టే నేరగాళ్లు ఇలా పేట్రేగిపోతున్నారు. మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలి: స్నేహలత హత్యపైనా సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి. ఘటన వెనుక ఉన్న దోషులను కఠినంగా శిక్షించాలి. పట్టించుకోని పోలీసులపైనా చర్యలు తీసుకోవాలి. స్నేహలతది ముమ్మాటికీ ప్రభుత్వహత్యే. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు రక్షణ కల్పించడానికే కానీ దోచుకోవడానికి కాదని గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా ఘటన జరిగినప్పుడు నిందితులపై ఉక్కుపాదం మోపాలి. ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తారా...?
రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా అని డీజీపీని అడుగుతున్నాను. సమాధానం చెప్పగలరా...? పై నుంచి వచ్చిన ఆదేశాలను డీజీపీ అమలు చేస్తున్నాడు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై మేధావులు మౌనంగా ఉండటం సరికాదు. మేథావుల మౌనం రాష్ట్రానికి శాపం. ప్రతి ఒక్క తల్లి ఆలోచించాలి. అవసరమైతే ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి. ప్రజల్లో చైతన్యం వస్తేనే రౌడీలు తోక ముడుస్తారు. ప్రజా సమస్యలపై పోరాడుతాం. బాధితులకు అండగా నిలుస్తాం. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తోంది. నేను మాట్లాడిన వెంటనే బూతుల మంత్రి వచ్చి తిట్లు అందుకుంటాడు. ఇష్యూను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. స్నేహలత తల్లిదండ్రులు క్షోభ ఎవరికీ జరక్కూడదు. మహిళలు రాణి రుధ్రమల్లా పోరాడితేనే న్యాయం జరుగుతుంది. మృతురాలు స్నేహలత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆ కుటుంబానికి (తండ్రి క్యాబ్ డ్రైవర్, తల్లి టైలర్) తక్షణ సాయం అందించడం జరుగుతుంది. పోగాలం దాపురించిన వాళ్లు ఈ విధంగానే ప్రవర్తిస్తారు. వెనుకబడ్డ వర్గాల నాయకుడు గౌతు లచ్ఛన్నపై ఎవరైనా మాట్లాడతారా..? ఆయన చరిత్ర కనీసం జగన్మోహన్ రెడ్డికి తెలుసా..? నేరస్తుల చరిత్ర తెలిసిన జగన్మోహన్ రెడ్డి.. దేశ భక్తుల చరిత్ర కూడా ఒకసారి చదువుకుంటే మంచిది. స్వాతంత్ర్య పోరాటంలో గౌతు లచ్ఛన్న ఎక్కడా రాజీపడలేదు. అందుకే ఆయన సర్దార్ గౌతు లచ్ఛన్న అయ్యారు. అటువంటి వ్యక్తితో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించింది. విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, మహా మనిషి. అటువంటి వ్యక్తి గూర్చి మాట్లాడే ధైర్యం వైకాపా నాయకులకు వచ్చిందా..? ఆయన విగ్రహాన్ని పడగొడతారా..? పడగొట్టండి చూద్దాం...? ఉన్మాదులుగా, వీధి రౌడీలుగా ప్రవర్తిస్తే.. ఊర్లలో ప్రజలు బట్టలూడదీసి కొడతారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో.. మీ ఎమ్మెల్యే ఆయన ఇంటిపై దాడికి వెళతాడా..? ఏమనుకుంటున్నారు మీ గూర్చి..? నేరస్తులను ఎమ్మెల్యేలుగా చేసి.. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నేరస్తులకు అడ్డాగా మార్చివేశారు. మిమ్ములను ఎక్కడ ఉంచాలో ప్రజలు త్వరలోనే నిర్ణయిస్తారు. అప్పుడు మీ డబ్బులు పనిచేయవు, పోలీసుల అరాచకాలు పనిచేయవు. పోలీసులు కూడా ఉద్యోగాల గూర్చి ఆలోచిస్తున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడుతూ బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీస్ వ్యవస్థ.. వైకాపా నాయకులు చేసే అరాచకాలకు వంతపాడటం దారుణం. ప్రజలలో చైతన్యం వస్తే తప్ప వ్యవస్థలో మార్పు రాదు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వంపైన, పోలీస్ వ్యవస్థపైన ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. స్నేహలతకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రజలంతా నినదించాల్సిన అవసరం ఉంది, పోరాడవలసిన అవసరం ఉంది. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు స్పందించారు. ఆ సమయంలో అనకాపల్లి పాదయాత్రలో ఉన్న నా దగ్గరకు వచ్చిన ఒక మహిళ.. మరో నిర్భయ ఘటన జరగకుండా ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలని కోరడం నన్ను కలిచివేసింది. హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటనపై కూడా దేశ పౌరులంతా స్పందించి నిరసనలు తెలియజేశారు. అటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. తెలుగుదేశం హయాంలో నేరస్తుల గుండెల్లో నిద్ర పోయాం. అందుకే ఐదేళ్లలో అటువంటి ఒక్క సంఘటన కూడా చోటుచేసుకోలేదు. రౌడీలందరినీ అణగదొక్కి.. పోలీసులు కాలర్ ఎగురవేసుకుని తిరిగేలా చేశాం. పోలీస్ వ్యవస్థలో బాధ్యత తీసుకొచ్చాం. పోలీసులు ఎప్పుడూ తమ కర్తవ్యాన్ని విస్మరించకూడదు. మీ ఇళ్లల్లోనూ ఆడపిల్లలు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. స్నేహలత దుర్ఘటనపై ప్రతిఒక్కరూ స్పందించాలని, ఆ కుటుంబానికి సంఘీభావంగా నిలబడాలని కోరుతున్నాను.