జగన్ మోహన్ రెడ్డి మాట తప్పను, మడమ తిప్పను అంటూ, ఎన్నికల ప్రచారంలో కానీ, లేక వివిధ సందర్భాల్లో కానీ వాడే మాట ఇది. ప్రతిపక్షంలో ఉండగా, పెన్షన వెయ్యి రూపాయాలు వచ్చే సమయంలో, నేను అధికారంలోకి వస్తే రెండు వేలు చేస్తా అని ప్రకటించారు. అయితే అప్పటికే అప్పటి టిడిపి ప్రభుత్వం, పెన్షన్ రెండు వేలు చేసింది, దీంతో వెంటనే మూడు వేలు అంటూ చెప్పేసారు. ఇదేదో వేలంపాటలాగా ఉన్నా, ప్రజలకు మాత్రం ఇది నచ్చింది. మాట తప్పను, మడమ తిప్పను, ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా అని ఒక్క చాన్స్ ఇచ్చారు. అయితే ప్రమాణస్వీకారం రోజు, పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు అయిపోతుందని, అవ్వా తాతలు సంతోష పడ్డారు. అయితే అలా కుదరదు అంటూ జగన్ మోహన్ రెడ్డి జర్క్ ఇచ్చారు. రెండు వేలు నుంచి కేవలం 250 పెంచి, 2250 ఇచ్చారు. ప్రతి ఏడు 250 పెంచుకుంటూ పోతానని అన్నారు. నేను మూడు వేలు ఒకేసారి పెంచుతానని చెప్పలేదని, పెంచుకుంటూ పోతానని చెప్పారు. సరి అప్పటికే అధికారంలోకి వచ్చేసారు కాబట్టి, ఇంకా అవ్వా తాతలు చేసేది ఏముంది. ఎదో ఒకటి 250 పెరిగాయి కదా అని సంతోషించారు. వచ్చే ఏడాది మరో 250 పెరుగుతుంది కదా, 2500 అవుతుందని సంతోష పడ్డారు. అయితే ఏడాది దాడి పోయింది, అదిగో ఇదిగో అని పేపర్ లో లీక్ లు ఇస్తున్నారు. అలా మరో ఆరు నెలలు గడిచిపోయాయి.
ఏడాది దాటి ఆరు నెలలు అయినా, పెంచుతాను అన్న 250 పెంచలేదు. అదిగో ఈ నెల, ఇదిగో ఈ నెలా అంటూ తమ అనుకూల మీడియాలో లీకులు ఇచ్చి, అవ్వా తాతలను ఆశ పెడుతూ వచ్చారు. ఈ నవంబర్ నుంచి అయినా పెంచుతారని ఆశగా చూస్తే, ఈ సారి కూడా పెంచలేదు. ఇంతోటి దానికి హామీలు ఇవ్వాటం దేనికి, అంటూ కొంత మంది వాపోతున్నారు. అయితే ఇందులో వాలంటీర్లు నలిగిపోతున్నారు. ప్రతి నెల పెన్షన్ ఇవ్వటానికి వెళ్తుంటే, ఈ నెల అయినా పెంచారా అని అవ్వా తాతలు అడిగే ప్రశ్నలకు, ఈ వాలంటీర్ల దగ్గర సమాధానం లేదు. ఏదో తప్పించుకోవటానికి, వచ్చే నెల ఆ వచ్చే నెల అంటూ, సమాధానం చెప్పి వచ్చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తొందరగా పెంచితే, బాగుండు అని, వారికి సమాధానం చెప్పలేక పోతున్నాం అని, వారు ఆశగా అడుగుతుంటే బాధ వేస్తుందని వాపోతున్నారు. అయితే కొంత మంది స్థానికి వైసీపీ నేతలు, ఎప్పుడు పెంచినా, ఈ ఏడాది మొదటి నుంచి పెండింగ్ లో ఉన్న పెంపు, బకాయల రూపంలో వస్తుంది అంటూ, వారిని మభ్య పెడుతున్నారు. ఇప్పటికే ఈ క-రో-నా తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని, ప్రభుత్వం తొందరగా పెన్షన్ పెంచాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి, ఈ ఏడాది మొదటి నుంచి బకాయ పడ్డ పెన్షన్ కూడా, ఒకేసారి కలిపి ఇవ్వాలని కోరుతున్నారు.