అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్లాట్ల కోసం డ‌బ్బులు క‌ట్టి నానా పాట్లు ప‌డుతున్న య‌జ‌మానుల‌కు హ్యాపీ న్యూస్ ఇది. స‌ర్కారుకి అన్ని వ్య‌వ‌స్థ‌ల్లాగే రెరా కూడా షాకిచ్చింది. డ‌బ్బులు క‌ట్టిన వారికి ప్లాట్లు అప్పగించడంలో సీఆర్డీఏ విఫలమైనందుకు వడ్డీతో స‌హా మొత్తం చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ స్తిరాస్థి వ్యాపార నియంత్రణ సంస్థ (రెరా) కీలక తీర్పు ఇచ్చింది. హ్యాపీనెస్ట్‌ నిర్మాణంలో జాప్యంతో తాము చెల్లించిన సొమ్ముకు వడ్డీ చెల్లించాలని డ‌బ్బులు క‌ట్టిన వారంతా రెరాను ఆశ్రయించారు. దీనిపై వాదోప‌వాదాలు రెరా ముందు జ‌రిగాయి. హ్యాపీ నెస్ట్ ప్లాట్లు అప్పగించడంలో సీఆర్డీఏ విఫలమైందన్నారు పిటిష‌న‌ర్‌ లాయర్. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్‌ కాలాన్ని ఏపీ రెరా పొడిగించిందని సీఆర్డీఏ తరఫున ప్రభుత్వ ప్రత్యేక లాయర్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఆర్డీఏ కాంట్రాక్టర్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉందన్నారు. ఈ వాద‌న‌లు తోసిపుచ్చిన రెరా 2021 జూన్‌ 30 నుంచి ఫ్లాట్లను స్వాధీనపరిచేంత వరకు వడ్డీ సొమ్ము చెల్లించాలని.. పిటిషనర్లు చెల్లించిన డబ్బులపై 16.15శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరాతి ఏరియా నేలపాడులోని 14.46 ఎకరాల విస్తీర్ణంలో హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుని ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో అత్యాధునిక వసతులతో నిర్మించే ఈ ప్రాజెక్టులో ప్లాట్ల కోసం మంచి ఆదరణ లభించింది. ఈ ప్రాజెక్టులో జీ+18 విధానంలో మొత్తం 12టవర్లు నిర్మించాలని భావించింది. ఈ 12 టవర్లలో 1,200 ఫ్లాట్లు కాగా.. హ్యాపీనెస్ట్‌ వ్యయం రూ.788.53 కోట్లు. ఎన్నిక‌ల్లో టిడిపి ఓడిపోవ‌డంతో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ స‌ర్కారు అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నుల‌తోపాటు హ్యాపీ నెస్ట్ నిర్మాణాన్ని కూడా మూల‌న‌ప‌డేసింది. పొంత‌న లేని వివ‌ర‌ణ‌లు ఇస్తూ ప్ర‌భుత్వం కాలం గ‌డిపేస్తుండ‌డంతో కొనుగోలుదారులు రెరాని ఆశ్ర‌యించారు.

వైసీపీ శివ‌కుమార్ పెట్టిన పార్టీ. చేతులు మారి జ‌గ‌న్ కోస‌మే పుట్టిన పార్టీగా రూపాంత‌రం చెందింది. జ‌గ‌న్ కోసం, జ‌గ‌న్ చేత‌గా మారిపోయిన వైసీపీ పై కేంద్ర ఎన్నికల కమిషన్ న‌జ‌ర్ వేసింద‌ని స‌మాచారం. వైసీపీ ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించిందా అనే అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలిసింది. అదే జరిగితే వైసీపీ గుర్తింపు రద్దయ్యే ఛాన్స్ కూడా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై హిందూస్తాన్ టైమ్స్ సంచలనాత్మక కథనం ప్ర‌చురించింది. నిబంధ‌న‌లకి విరుద్ధంగా ఉన్న వైసీపీ పేరు, శాశ్వత అధ్యక్షుడి నియామకాన్ని సీఈసీ పరిశీలిస్తున్నట్టు క‌థ‌నంలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ పద్దతుల్ని వైసీపీ పాటిస్తోందా అనే అంశాన్ని సీఈసీ గ‌మ‌నిస్తోంద‌ని వివ‌రించారు. వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా జ‌గ‌న్ ని ఎన్న‌కుని నాయకుడికి అపరిమిత అధికారాలు కట్టబెట్టడం అప్రజాస్వామ్యమంటోంది సీఈసీ. రాజకీయ పార్టీలు చేసే అప్రజాస్వామిక సవరణలను గుర్తించేది లేదని ఈసీ తేల్చి చెప్పిన‌ట్టు క‌థ‌నంలో తెలిపారు. వాస్తవానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా రిజిస్టర్ అయిన వైసీపీని వైయస్సార్ కాంగ్రెస్‍గా పిలుస్తున్నారు. జగన్‍రెడ్డి శాశ్వత అధ్యక్షుడిగా ప్లీనరీలో తీర్మానం చేసిన దానిపై ఎన్నిక‌ల క‌మిష‌న్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీనికంటే ముందుగా వైసీపీ గుర్తింపుని ర‌ద్దు చేయాల‌ని ఏపీ నుంచి కూడా వివిధ సంఘాలు, నేత‌లు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కి ఫిర్యాదులు చేశారు.

యువ‌గ‌ళం టూరులో లోకేష్ జోరు పెంచారు. విమ‌ర్శ‌ల హోరు తీవ్రం చేశారు. దీంతో హాట్ హాట్‌గా మారింది టూరు. శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం పాద‌యాత్ర‌లో ప‌రామ‌ర్శ‌లు, ప‌ల‌క‌రింపులు, వివిధ వ‌ర్గాల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తూనే స్పెష‌ల్ ఫోక‌స్‌తో ముందుకెళుతున్నారు. క‌నిపించిన ప్ర‌తీ అంశాన్ని ఫోటో దిగి మ‌రీ స‌ర్కారుకి ప్ర‌శ్న రూపంలో సంధిస్తున్నారు.శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం, ఏర్పేడు మండలం ముసిలిపేడులో ఈ వైన్ షాపు ముందు లోకేష్ సెల్ఫీ దిగి త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఎన్నిక‌ల ముందు మ‌ద్య‌నిషేధం హామీ ఇచ్చిన జ‌గ‌న్ ప‌ద‌విలోకి వ‌చ్చిన వెంట‌నే తానే లిక్క‌ర్ కింగ్ అవ‌తారం ఎత్తార‌ని,ద‌శ‌ల‌వారీగా ప్ర‌మాద‌క‌రమైన మ‌ద్యం అమ్మ‌కాలు పెంచేస్తున్నార‌ని ఆరోపించారు. పేరుకి ఇది ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణం. ఇందులో అమ్మే స‌రుకు జ‌గ‌న్ ది. అమ్మేవాళ్లు వైసీపీ వాళ్లు. అమ్మిన సొమ్ము చేరేది తాడేప‌ల్లి ప్యాలెస్‌కే అంటూ ఇదేనా మీరు చేసిన మ‌ద్య‌నిషేధం అంటూ ప్ర‌శ్నించారు. ఏర్పేడు మండలం, మోదుగులపాలెం స్వర్ణముఖి నది లో లెవల్ కాజ్ వేని ఆయ‌న ప‌రిశీలించి అక్క‌డా కూడా ఓ సెల్ఫీ కొట్టిన లోకేష్ వైసీపీ ఇసుక మాఫియా సామాన్యుల‌కు ఇసుక దొర‌క‌కుండా చేసిన విధానంతో భ‌వ‌న‌నిర్మాణ రంగం ఆధార‌ప‌డిన కూలీలకు ప‌నిలేకుండా పోయింద‌ని, అనుబంధం రంగాల‌న్నీ సంక్షోభంలో ప‌డ్డాయ‌ని వివ‌రించారు.వికృతమాల వద్ద తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు తెచ్చిన టిసిఎల్ కంపెనీ ముందు సెల్ఫీ దిగిన లోకేష్ , టిసిఎల్ లో పనిచేస్తున్న యువతీ, యువకులతో మాట్లాడారు. ఈ కంపెనీని రాష్ట్రానికి తీసుకురావడానికి పడిన త‌న క‌ష్టాన్ని వివ‌రించారు. కంపెనీలు పక్క రాష్ట్రాల‌కి తరిమేసే జ‌గ‌న్ రెడ్డికి నిరుద్యోగుల స‌మ‌స్య‌, రాష్ట్ర అభివృద్ధి ప‌ట్ట‌వ‌ని విమ‌ర్శించారు. వైసీపీ గూండాలు 20 మంది దాడి చేయడానికి కత్తులు, రాళ్లతో సిద్ధంగా వున్నా.. కేసులు లేవు. లోకేశ్ మాత్రం స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసులు పెడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన లోకేష్ మీసం మెలేసి ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబునాయుడు ఒక చిటికేసి చెబితే చాల‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ని త‌రిమి త‌రిమి కొడ‌తామ‌న్నారు. ఈ రోజు టిడిపిపై దాడి చేస్తోన్న వారు ఎక్క‌డికి వెళ్లినా లాక్కొచ్చి డ్రాయ‌ర్లు విప్పి ఊరేగించి కొడ‌తామ‌ని హెచ్చ‌రించారు. ఎండ వేడి పెరిగిన‌ట్టే లోకేష్ విమ‌ర్శ‌ల వాడి పెరిగింది. ప్ర‌శాంతంగా సాగుతున్న పాద‌యాత్ర‌పై వైసీపీ దాడుల ప్ర‌య‌త్నాలు..పోలీసుల నిర్బంధంతో లోకేష్ కూడా త‌న స్పీడు పెంచి త‌గ్గేదేలే అంటున్నారు.

నారా లోకేష్ పాద‌యాత్ర‌లో రోజు రోజుకీ జ‌నాల‌కి మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నారు. స‌మ‌స్య‌లు అధ్య‌య‌నం చేస్తూనే, ప‌రిష్కారానికి మార్గం తెలుగుదేశం చూపుతుంద‌ని భ‌రోసా ఇస్తున్నారు. తిరుప‌తిలో నిర్వ‌హించిన హ‌లో లోకేష్ కార్య‌క్ర‌మంలో యువ‌నేత యువ‌త‌తో ఇంటరాక్ష‌న్ తో శెహ‌భాష్ లోకేష్ అనిపించుకున్నారు. యువ‌తీ యువకులు అడిగిన ప్రతిప్రశ్నకు లోకేష్ సూటిగా సమాధానాలిచ్చారు. యువత భవిష్యత్ కోసమే యువగళం పాదయాత్ర చేపట్టాన‌ని వివ‌రించారు. జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అరాచకపాలనలో అధఃపాతాళానికి చేరిన ఏపీని తిరిగి అగ్రగామిగా నిలబెట్టేందుకు పాలనలో సమూల మార్పులు తీసుకొస్తామ‌ని యువ‌త‌కి భ‌రోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి యువకుడికి ఉద్యోగం క‌ల్పించి జగన్‌కు రిటర్న్ గిఫ్టు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు.  విలాసవంతమైన జీవితాన్ని వ‌దులుకుని యువగళం ఎందుకు ప్రారంభించార‌ని వ్యాఖ్యాత ప్ర‌శ్నించ‌గా, జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో నాశ‌న‌మైన రాష్ట్రాన్ని బాగుచేసుకునేందుకు యువ‌త‌ని చైత‌న్య‌ప‌రిచే ఉద్దేశంతో ప్రారంభించాన‌న్నారు.  దేశంలోనే రాహుల్ గాంధీ త‌రువాత అతి ఎక్కువ‌గా ట్రోలింగ్‌కి గుర‌య్యింది తానేన‌ని చెబుతూనే, యువ‌త భ‌విత కోసం ఏమైనా భరిస్తాన‌న్నారు. తాను తెచ్చిన కంపెనీల వ‌ద్ద సెల్ఫీ తీసుకుని జ‌గ‌న్ రెడ్డికి ఛాలెంజ్ విస‌ర‌డం ద్వారా త‌న కాలిబ‌ర్ ని చాటిచెప్పిన‌ట్ట‌య్యింది. వేలాది మంది యువ‌త‌లో చైత‌న్యం క‌లిగించేలా హ‌లో లోకేష్ కార్య‌క్ర‌మం సాగింది. తాను మెగాస్టార్ అభిమానిని అని,  బాలయ్య నా ముద్దుల మామయ్య అంటూ లౌక్యంగా స‌మాధానాలు ఇచ్చారు. స్లిమ్, ఫిట్ నెస్ కు కారణం భార్య బ్రాహ్మణి కార‌ణ‌మ‌ని చెప్పుకొచ్చారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని రాజ‌కీయాల్లోకి స్వాగ‌తం ప‌లుకుతున్నాన‌ని క్లారిటీ ఇచ్చేశాడు. పింక్ డైమండ్ ఆరోప‌ణ‌ల‌పైనా సైటైరిక్ రియాక్ష‌న్ యూత్‌కి బాగా క‌నెక్ట‌య్యింది. మొత్తానికి హ‌లో లోకేష్ కార్య‌క్ర‌మంతో యువ‌త‌కి లోకేష్ బాగా ద‌గ్గ‌ర‌య్యార‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు విశ్లేషిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read