గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అమరావతి, పోలవరం రెండు కళ్ళుగా తీసుకుని ముందుకు వెళ్ళారు. దానికి కారణం, అమరావతి 13 జిల్లాలకు ఉపాధి, ఆర్ధిక కేంద్రం అవుతుందని. అలాగే పోలవరం ప్రాజెక్ట్, ప్రతి జిల్లాకు నీరు ఇస్తుందని. అందుకే ఈ రెండు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్లారు. అయితే కొత్తగా వచ్చిన అధికార పార్టీ అమరావతి పై కులం ముద్ర వేసి, దాన్ని నిర్వీర్యం చేసే పనిలో ఉంది. ఇక పోలవరం నిర్మాణం పై ఆశలు పెట్టుకున్న వారికి కూడా ఇప్పుడు షాక్ ఇచ్చే వార్తలు బయటకు వస్తున్నాయి. 22 ఎంపీ సీట్లతో, దేశంలోనే నాలుగో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ, కేంద్రం నుంచి పోలవరం నిధులు తేవటంలో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాదాపు 3 వేల కోట్లను, ఇప్పటికీ రాష్ట్రం తెచ్చుకోలేక పోయిందనే విమర్శలు వస్తున్న వేళ, అసలకే ఎసరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, పోలవరం అంచనాలు, రూ.57,940 కోట్లకు పెంచారు. 2013-14 రివైజడ్ కాస్ట్ ఎస్టిమేట్ ప్రకారం, రూ.57,940 కోట్లకు పెంచి డీపీఆర్-2ని కేంద్రానికి పంపించారు. దాదపుగా కొన్ని వేల పేజీలు , ఢిల్లీకి తీసుకువెళ్ళి, అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేసారు. ఈ ప్రయత్నాలు ఫలితమే, 2019 ఫిబ్రవరిలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ, సిడబ్ల్యుసి కూడా 55,548 కోట్లకు, ఆమోదం తెలిపింది. ఇక అప్పటికే ఎన్నికల సీజన్ మొదలు కావటంతో, ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.

ఇక కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదమే తరువాయి. కీలకమైన టెక్నికల్ కమిటీ ఆమోదం చెప్పటంతో, ఆర్ధిక శాఖ ఆమోదం లాంచానమే అవుతుందని అందరూ భావించారు. అందులో కొత్తగా వచ్చిన వైసీపీకి బలం ఉండటం, రాజ్యసభ సీట్లు బీజేపీకి అవసరం ఉండటంతో, వైసీపీ ఈ పని చాలా తేలికగా చేపిస్తుందని అందరూ భావించారు. అయితే 18 నెలలు అయినా, ఈ విషయం పై ఆతీ గతీ లేదు. కానీ నాలుగు రోజుల క్రిందట ఢిల్లీ నుంచి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. కేవలం 25 వేల కోట్లకే పోలవరం అంచనాలు ఇస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. గత నాలుగు రోజులుగా ఈ విషయం పై చర్చ కొనసాగిస్తూ ఉండగానే, ఈ రోజు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. విజయవాడకు చెందిన ఒక వ్యక్తి, పోలవరం ప్రాజెక్ట్ పై, సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరారు. దీని పై స్పష్టత ఇచ్చిన కేంద్రం, మేము కేవలం పోలవరం ప్రాజెక్ట్ డ్యాం నిర్మాణానికి మాత్రమే మేము డబ్బులు ఇస్తామని, పునరావాస, పరిహారంతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పటంతో, అందరూ అవాక్కయ్యారు. అయితే ఈ విషయం పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం పై తప్పు తోసివేసి, ఈ అంశం పై సేఫ్ అవ్వాలనే ఆలోచనలో ఉంది. అయితే ఇది పోలవరం ప్రాజెక్ట్.. ప్రతి ఒక్క వ్యక్తి లాభం చెందే ప్రాజెక్ట్. మరి, ఈ విషయం పై, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రాజ్యసభలో వైసీపీ బలం , బీజేపీకి అవసరం కాబట్టి, అక్కడ ఒత్తిడి తెస్తే, రాష్ట్రానికి లాభం అవుతుంది మరి ప్రభుత్వం, అంత పోరాటం చేస్తుందా ?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, ఈ రోజు కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయం కృష్ణా జిల్లా పర్యటన ముగించుకుని, పశ్చిమ గోదావరిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా,  ఆకివీడులో పర్యటిస్తున్న ఆయన, వరద నీటిలో మునిగిన వారి వద్దకు, వెళ్ళే దారి లేకపోవటంతో ట్రాక్టర్ పైనే బయలు దేరారు. లోకేష్ స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో, లోకేష్ నడపుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి, కొద్ది మేర ఉప్పుటేరు కాలువలోకి ఒరిగింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్వల్ప ప్రమాదం కావటంతో, వెంటనే అప్రమత్తం అయిన కార్యకర్తలు, సెక్యూరిటీ సిబ్బంది, లోకేష్ ని పక్కకు తీసుకోవచ్చారు. అదే ట్రాక్టర్ పై ఉండి ఎమ్మెల్యే రామరాజు కూడా ఉన్నారు. ఈ సంఘటన ఆకివీడు మండలం పెద్దాపురం వద్ద జరిగింది. ఇక్కడ ఇప్పటికీ గ్రమాలు అన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. రహదారుల పై ఇప్పటికీ వరద నీరు ప్రవహిస్తుంది. ఈ వరద నీటిలోనే, ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేసారు. అయితే, ఇదే క్రమంలో నీరు ఎక్కువగా ఉండటంతో, ట్రాక్టర్ అదుపు తప్పింది. అయితే స్లో గా వెళ్తూ ఉండటంతో, ఉప్పుటేరు పక్కన కాలువలోకి ఒరిగింది. ప్రస్తుతం లోకేష్ పర్యటన ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకి ఫోన్ మెసేజ్ ద్వారా బెదిరింవులు పాల్పడుతున్న సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గతంలో ఆ వ్యక్తి పలు వురు నేతలకు ఫోన్ కాల్స్ ద్వారా అలాగే మెసేజ్ ల ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందులో టిడిపి నాయకులతో పాటు తెలంగాణ రాష్ట్రాన్రికి చెందిన నాయకులను కూడా సదరు వ్యక్తి బెదిరించినట్లు తేలింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడడును, ఆ వ్యక్తి గుర్తు తెలియని నంబర్ నుంచి మెసేజ్ చేస్తూ బెదిరించడం జరి గింది. దీనిపై స్పందించిన అయ్యన్న పాత్రుడుతనను బెదిరించిన సదరు వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టగా బుచ్చయ్య పేట మండలం, కె.పి.అగ్రహారం కు చెందిన వియ్యపు తాతారావు అయ్యన్న పాత్రుడుని ఫోన్ ద్వారా బెదిరించడం జరిగిందని వెల్లడైంది. దీంతో తాతారావు ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిం చారు. వియ్యపు తాతారావు గతంలోనూ కూడా ఇలాంటి మెసేజ్లను అలాగే ఫోన్ కాల్స్ చేస్తూ పలువురు పార్టీ నాయ కులను బెదిరిస్తూ ఉండేవాడు. గతంలో కూడా కొందరు నాయకులు తమకు బెదిరిస్తూ మెసేజ్ లు వచ్చా యని మీడి యా ముందు వెల్లడించడం జరిగింది అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.

ఆంధ్రాలోనే ఎక్కు వగా టిడిపి నాయకులను టార్గెట్ చేస్తూ సదరు వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు.ఇందులో ఉత్తరాంధ్రకు చెందిన టిడిపి సీనియర్ నేతలే ఎక్కువగా ఉన్నారు. ఇది వరకు తెలంగాణలో కూడా అలాగే అక్కడి నేతలను బెదిరిస్తూ ఫోన్ కాల్స్, మెసేజ్ లు చేశాడు.అయితే తెలంగాణ పోలీసులు ఈ బెదిరింపులు కేసును సీరియస్ గా తీసుకుని అతన్ని కటకటాల పాలు చేశారు. ఆంధ్రాలో అయ్య న్న పాత్రుడుతో పాటు టిడిపి నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస రావు, యనమల రామకృష్ణ లకు ఫోన్ చేసి అలాగే మెసేజ్ చేసి బెదిరించినట్లు పోలీసు పేర్కొంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్రికి చెందిన టిఆర్ఎస్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి లను కూడా సదరు తాతారావు బెదిరించినట్లు తెలిపారు.రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గల మారెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వియ్యపు తాతారావు పై కేసు నమోదు చేసి ఇదివరకే అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు వెల్లడించారు.

నిన్న సాయంత్రం, ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో సంచలనం రేపే వార్త, ప్రసారం అయ్యింది. ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని, సియం పేషీ అధికారులు, సమీక్షా సమావేశానికి రావాలి అంటూ మెసేజ్ చేయటం, పెను సంచలనంగా మారింది. ఎన్నికల నిర్వహణ అనేది, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ బాధ్యత. వాళ్ళు ఫైనల్ నిర్ణయం తీసుకుని ప్రభుత్వ సహకారం కోరతారు. అయితే ఇక్కడ ఏకంగా గుర్తు పెట్టుకోవాల్సింది, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను పిలిపించుకుని చర్చించుకునే అధికారం ముఖ్యమంత్రికి కూడా ఉండదు. కేవలం గవర్నర్ మాత్రమే చేయగలరు. ముఖ్యమంత్రికే హక్కు లేదు అంటూ, ముఖ్యమంత్రి పేషీ అధికారులు మాత్రం అత్యుత్సాహం చూపారు. సియం ముఖ్య కార్యదర్శి ప్రావీణ్ ప్రకాష్, తాను 26వ తేదీన నిర్వహించే సమావేశానికి రావాలి అంటూ, నిమ్మగడ్డకు మెసేజ్ పంపించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీనియర్ అధికారులు అవాక్కయ్యారు. ఒక పక్క ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. అది పక్కన పెట్టినా, నిమ్మగడ్డ, ప్రవీణ్ ప్రకాష్ కంటే చాలా సీనియర్. రిటైర్డ్ అధికారి. అలాంటి అధికారిని, తన దగ్గరకు రివ్యూకి రమ్మని పిలవటం, కరెక్ట్ కాదని, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఇది ఇలా ఉంటే, ప్రవీణ్ ప్రకాష్ పంపించిన మెసేజ్ పై, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా స్పందించారని వార్తలు వచ్చాయి. ఎన్నికల కమిషన్ బాధ్యతలు, హక్కులు గుర్తు చేస్తూ, రాజ్యాంగా సంస్థ అని గుర్తు చేస్తూ, ఈ విషయం పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తామని, ఘాటుగా బదులు ఇచ్చారు.

అయితే ఈ వివాదం ఎటువంటి టర్న్ తీసుకుంటుందో అని అందరూ భావించిన టైంలో, అనూహ్యంగా ముఖ్యమంత్రి పేషీ అధికారులు దిగి వచ్చారు. సియం ముఖ్య కార్యదర్శి, నిమ్మగడ్డకు ఫోన్ చేసి, పొరపాటు జరిగిందని, ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ వాణీ మోహన్ కు పంపాల్సిన మెసేజ్ మీకు వచ్చింది అంటూ, పొరపాటు ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల కమీషనర్ మాత్రం, ఇది కావాలనే చేసిందనే అభిప్రాయంతో ఉన్నారు. ఒక వేళ తన సెక్రటరీకి ఈ మెసేజ్ పంపినా, తన అనుమతి లేకుండా వెళ్లరు కదా, అనేది ఆయన అభిప్రాయం. ఇప్పటికే ఈ ఎన్నికల విషయం కోర్టులో ఉన్నందున, ఈ విషయం పై కూడా కోర్టుకు ఫిర్యాదు చేసే యోచానలో ఉన్నారు. నిజానికి ఈ నెల 28న, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుని, స్థానిక సంస్థల ఎన్నికల పై, ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది. ఈ తరుణంలో, అంతకంటే ముందే, 26 వ తేదీన, సియం పేషీలో ఉండే ముఖ్య కార్యదర్శి, ఎన్నికల పై రివ్యూ చేయటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అసలు ముఖ్యమంత్రికే, ఎస్‌ఈసీ పై అధికారం లేనప్పుడు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది చేసిన పని పై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయతే అవతల వైపు నుంచి తప్పు ఒప్పుకున్నారు కాబట్టి, ఈ సమస్య సద్దుమణుగుతుందా, లేక మళ్ళీ కోర్టుల దాకా వెళ్తుందా అనేది చూడాలి.

Advertisements

Latest Articles

Most Read