తెలుగుదేశం నేత అయ్యన్న పాత్రుడుగారు ఇదివరకు గుమ్మనూరువారి ఈఎస్ఐ స్కామ్ కు సంబంధించి బెంజ్ కారు ఆధారాలు చూపించారు. ఇప్పుడు గుమ్మనూరు భూస్కామ్ గురించి ఆధారాలు చూపించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో, ఇట్టిన ప్లాంటేషన్ అనే సంస్థకు చెందిన 203 ఎకరాలను, దొంగ సంతకాలతో మంత్రి జయరాం కైవసం చేసుకున్నారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. 2005లో కర్నూలు జిల్లాలో, ఇట్టిన కంపెనీ కోసం మహాబలేశ్వరప్ప, మంజునాథ్ అనే వ్యక్తులు, 450 ఎకరాలు కొన్నారని, మహాబలేశ్వరప్ప 2008లో మరణించటంతో ఆయన కొడుకులు కంపెనీ డైరెక్టర్లుగా చేరారరాణి, 2009 మార్చి 31న ఇట్టినా డైరెక్టర్ పదవి నుంచి మంజునాథ్ తప్పుకున్నారని, అయితే, 10 ఏళ్ళ తరువాత మంజునాథ్ ని ముందుకు తీసుకోవచ్చి, కంపెనీ భూములు అమ్మెందుకు పవర్ ఆఫ్ అటార్నీ ఉందని, ఫోర్జరీ పత్రాలతో, 203 ఎకరాలు మంత్రి జయరాం కొనుగోలు చేసారని తెలుగుదేశం పార్టీ ఆరోపణ. తన భార్య పేరిట 30.83 ఎకరాలు, తమ్ముడు భార్య పేరిట 30.53 ఎకరాలు, మరో తమ్ముడు పేరిట 31.58 ఎకరాలు, మరో నలుగురు బినామీ పేరున రాయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.
ఇట్టినా సంస్థ ఆ భూములను రైతుల నుంచి కొనేటప్పుడు స్థానిక యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ భూములన్నీ మంత్రి గుమ్మనూరు వారి సొంతమైపోయాయని, దీని పై కేసులు ఉన్నా పట్టించుకోలేదని, తెలుగుదేశం పార్టీ ఆరోపించింది క్షేత్రస్థాయిలో పర్యటన కూడా చేసి, ఇవి వాస్తవాలు అంటూ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. దీని పై పూర్తి ఆధారాలు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ లు, అన్నీ తీసుకుని, హైకోర్ట్ లో కేసు వెయ్యటానికి కూడా తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. అయితే సరిగ్గా ఇక్కడే ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. ఈ భూములు వ్యవహారం పై మంత్రి భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కంపెనీ ఎండీ మను, మాజీ డైరెక్టర్ మంజునాథ్ సహా, మరికొంత మంది పై కేసు పెట్టారు. మంజునాథ్ అనే వ్యక్తికి భూములు అమ్మే హక్కు ఇస్తూ కంపెనీ బోర్డ్ తీర్మానం చేసి, ఇప్పుడు కంపెనీ మాట మార్చింది అంటూ, మంత్రి గారి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.