వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చాయని మాటే కానీ, రాజకీయంగా తెలుగుదేశం పార్టీనే పైచేయి సాధిస్తూ వస్తుంది. ఇందుకు ప్రధాన కారణం, అనుభవం లేకపోవటం, తొందరపాటు, ఏదో చేసేయాలనే ఆతృత, అవినీతి ఆరోపణలు. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని వైసీపీ ఎంత ప్రయత్నం చేస్తున్నా అది బ్యాక్ ఫైర్ అవుతూనే ఉంది. టిడిపి నేతల పై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూసినా, సరైన ఆధారాలు లేకపోవటంతో అవి కోర్టు ముందు నిలవటం లేదు. అచ్చమనాయుడుని అంత టార్గెట్ చేసినా, రూపాయి కూడా నిరూపించలేకపోయారు. అలాగే అమరావతి భూములు విషయం, ఫైబర్ గ్రిడ్, ఇలా అనేక అంశాలు ఏమి చెప్పలేక పోయారు. కేంద్రం వద్ద సిబిఐ ఎంక్వయిరీ ప్రతిపాదన పెట్టినా, అది వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక మరో పక్క తెలుగుదేశం పార్టీ మాత్రం దూకుడు మీద ఉంది. ఉన్న కొద్ది మంది నాయకులతోనే, వైసీపీని ఫిక్స్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా కార్మిక శాఖా మంత్రి జయరాం పై ఆధారాలు చూపిస్తూ తెలుగుదేశం దాడి చేస్తుంది. అయితే మంత్రి అవన్నీ తన పై కావాలని చేస్తున్న ఆరోపణలు అని చెప్తున్నా, చూపిస్తున్న వివరాలతో, తెలుగుదేశం పార్టీ వాదనే ప్రజల్లోకి వెళ్తుంది. ముఖ్యంగా మంత్రి పై అనేక ఆరోపణలు రావటం కూడా, వైసీపీకి ఇబ్బందిగా మారింది.
మొదటగా మంత్రి గారికి తమ్ముడు వరుస అయ్యే వ్యక్తి పేకాట శిబిరం నడుపుతూ దొరికారు. ఇది పోలీసులే పట్టుకున్నారు. అయితే కేసు పై పురోగతి ఏమైందో తెలియదు. మంత్రి మాత్రం నాకు సంబంధం లేదని చెప్పారు. ఇక రెండోది బెంజ్ కారు ఆరోపణ. ఈఎస్ఐ కేసులో ఏ7గా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి, మంత్రి కుమారుడు బెంజ్ కారు తీసుకున్న ఫోటోలు, అలాగే ఆ కారు వాడుతూ ఉన్న ఫోటోలు, దాని పై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఫోటోలు విడుదల చేసి, అది మంత్రికి లంచంగా ఇచ్చారని, ఏ7 కార్తిక్ బినామీ అని టిడిపి ఆధారాలు చూపించింది. ఇవి అవాస్తవం అని, నా కొడుకు ఫాన్స్ ఎవరో చెప్తే, కారు తీసుకుని, కారు తోలాడని మంత్రి చెప్పారు. ఇక తాజాగా మంత్రి 203 ఎకరాలు వేరే కంపెనీని భూమిని తమ పై పేరు పై బదలాయించారు అంటూ తెలుగుదేశం ఆధారాలు చూపించి, క్షేత్రస్థాయి పర్యటన చేసింది. అయితే మంత్రి మాత్రం 100 ఎకరాలు కొన్నట్టు ఒప్పుకున్నారు. కానీ ఇందులో స్కాం ఉందని, పూర్తి ఆధారాలతో కోర్టుకు వెళ్తామని తెలుగుదేశం అంటుంది. ఇలా వరుస పెట్టి ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో జగన్ చర్యలు తీసుకుంటారా ? విచారణ చేపించి, నిజా నిజాలు తెలుస్తారా ? చూద్దాం ఏమి జరుగుతుందో.